(తెలుగులో బ్లాగింగ్ అనే పుస్తకం కోసం వ్రాస్తున్న వ్యాసం)
క్యారెక్టర్ ఆర్టిస్టులు: కథకి క్యారెక్టర్ వున్నవారు కూడా ముఖ్యం కదా. వీరు రాముడు మంచి బాలుడు లాంటివారు. బుద్ధిగా తమ పనేంటో చూసుకుంటూ, తమకు నచ్చినవి వ్రాసుకుంటారు. ఎక్కడా విమర్శలూ, ఎకసెక్కాలూ ఎదురవకుండా జాగ్రత్తగా అందరికీ నచ్చే ఆంశాలే వ్రాతల్లోకి ఎన్నుకుంటారు. ఉదాహరణకి షోలే సినిమా గురించి లేదా అమితాబ్ గురించి వ్రాస్తారు. ఆ సినిమా అన్నా, ఆ హీరో అన్నా అందరికీ ఇష్టమే వుంటుంది కనుక అందరూ వారితో ఏకీభవిస్తూ స్పందిస్తారు. అమ్మలక్కలయితే ఆ రోజు ఇంట్లో చేసిన ఇడ్లీ గురించో, దోశ గురించో నోరు ఊరిస్తూ టపా వేస్తారు. మనకందరికీ నోరూరిపొతుంది కదా. సహజంగానే స్పందిస్తాం. వీరికి సాధారణంగా మాంఛి విశ్లేషణా శక్తి వుంటుంది. అందరికీ నచ్చిన లేదా నచ్చే విషయాలపై సరళంగా అనలైజ్ చేసి ప్రజల ముందు వుంచుతారు. వీరి రచనలు ఆబాలగోపాలానికి నచ్చుతాయి కాబట్టి వీరి టపాలకి చాలా స్పందనలు వుంటాయి. అందరితో మంచి బ్లాగర్ అనిపించుకోవాలని వీరిలో వుంటుంది.
వీరిలో కొంతమంది గుమ్మడి టైప్ వారు అయివుంటారు. ఖళ్, ఖళ్ అని ఆయాసంతో రొప్పుతూ జూనియర్ బ్లాగర్లకి హితబోధలు చేస్తుంటారు. సాధారణంగా సీనియర్లు అయివుంటారు కనుక కాస్త చాదస్తం వుంటూ వుంటుంది. పాత తరమే గొప్పదనీ, పాత బ్లాగులే గొప్పవనీ భావిస్తుంటారు. కొన్నేళ్ళ క్రితం బ్లాగావరణం ఎంత బావుండేదో అని తరచుగా వాపోతుంటారు. మార్పుని స్వీకరించలేక, కొత్తని ప్రోత్సహించలేక వున్న వాతావరణాన్ని విశ్లేషిస్తూ కాలం వెళ్ళబుచ్చుతారు. అయితే వీరిలో ఎనలిటికల్ స్కిల్స్ బావుంటాయి కాబట్టి మనకు తెలిసిన విషయాలలోనే కొత్త కోణాలు చూపిస్తారు. వారి అనుభవం, పరిశీలన నుండి ఇతరులు ఎంతో నేర్చుకోవడానికి అవకాశం వుంటుంది.
వీరికి రిస్క్ తీసుకోవడం ఇష్టం వుండదు మరియు సాహస గుణం తక్కువ కాబట్టి వీరి రచనల్లో కొత్తవాటిని కానీ, కొత్తదనాన్ని గానీ ఆశించలేం. బ్లాగుల్లో అగ్నిగుండం రగిలిపోతున్నా సరే మనకెందుకులే ఆ ముళ్ళ కంప అని పక్కకి తొలగిపోతారు అంతే కానీ మానవత్వంతో స్పదించాల్సిన సందర్భాల్లో కూడా వీరి అలికిడి వినపడదు. వీళ్ళు ఏ గొడవల్లోనూ, వివాదాల్లోనూ తలదూర్చక బ్లాగుల్లో బుద్ధిగా గడిపేస్తుంటారు. సాధారణంగా గృహిణులూ, సీనియర్ సిటిజెన్స్ ఇలాంటి బ్లాగులు వ్రాస్తుంటారనేది నా అభిప్రాయం కానీ అది నా అపోహ కావచ్చును.
ఖాల్ నాయకులు(విలన్లు): మనకు ఈ విషయం నచ్చినా నచ్చకపోయినా బ్లాగుల్లో కూడా విలన్లు వుంటారనేది వాస్తవం. మీరు బ్లాగుల్లోకి వచ్చిన తొలినాళ్ళలో అంతా సుందరంగా అనిపిస్తుందేమో కానీ తొందర్లొనే వాస్తవాలు మీకు అవగతమవుతాయి. బయటి సమాజాన్నే బ్లాగులోకం కూడా ప్రతిబింబిస్తుంది కనుక ఇక్కడ మంచి బ్లాగర్లతో పాటుగా చెడ్డ బ్లాగర్లూ వుంటారు. ప్రశంసలతో పాటుగా, వేధింపులూ వుంటాయి. మీరు మరీ సున్నితమనస్కులయితే బెదిరిపోయి బ్లాగుల నుండి పారిపోయి ఏ బజ్జులో వ్రాసుకుందామా అనుకునే అవకాశమూ వుంది.
ఇక్కడ కుల కొట్లాటలు, మత వైషమ్యాలు, ఇజాల నిజాల పట్ల నిరసనలూ వుంటుంటాయి. కక్షలూ, కార్పణ్యాలూ, కుట్రలూ, కుతంత్రాలూ వుంటుంటాయి. కామెంట్లతో కొట్టి ఈ లోకం నుండి వెలివేస్తుంటారు. కొన్ని బ్లాగులని హత్యలూ చేస్తుంటారు. అల ఆని మీరు మరీ భయపడిపోనక్కరలేదు. కొద్దిగా మీకు ధృఢమయిన చర్మమూ, కాస్త వ్యక్తిత్వమూ వుంటే ఈ విలన్లు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. మీ మనస్సు మరీ సున్నితమయితే అందరికి నచ్చే లేదా మెజారిటీ మెచ్చే టపాలు వ్రాసుకుంటూ తల ఒంచుకొని బుద్ధిగా మెసలవచ్చును.
ఈ వర్గానికి చెందిన వారు అనామక బ్లాగులు తెరిచి తమకు నచ్చని బ్లాగర్లని వేధిస్తుంటారు. లేదా వ్యాఖ్యలు అజ్ఞాతంగా వేస్తూ విసిగిస్తుంటారు. తమకు నచ్చినట్లుగానే ఇతరులు బ్లాగులు వ్రాయాలనుకునే కొందరు ఇలాంటి దుందుడుకు చర్యలకు తోడ్పడుతుంటారు. వీరికి భావ స్వేఛ్ఛ పట్ల ఏమాత్రం గౌరవం వుండదు. తమకు నచ్చినట్లుగానే బ్లాగుల్లో ఇతరులు ప్రవర్తించాలని వీరికి వుంటుంది. ఎవరికి నచ్చింది వారు వ్రాసుకుంటారన్న కనీస స్పృహ వీరికి వుండదు. వీరి విశ్వాసాలని ఒప్పుకోని బ్లాగుల్లోకి వెళ్ళి రచ్చ రచ్చ చేసి వస్తుంటారు. వారికి బెదరకపోతే సైకోఫాన్సీ సృష్టిస్తుంటారు. వారి ఆగడాలకి బెదిరి ఎందరో బ్లాగర్లు తమ టపాలు తగ్గించుకోవడమో, అసలుకే బ్లాగులు మూసుకోవడమో చేసారు. కొందరు ఈ చికాకులన్నీ భరించలేక బజ్జుల్లో కాలక్షేపం చేస్తున్నారు.
ఆకు రౌడీలు: వీరికి స్వంతంగా బుర్ర అంటూ వుండదు. డాన్ ఎలా చెబితే, ఏం వ్రాయమని చెబితే అది వ్రాసేస్తుంటారు. తమ తమ డాన్ లని వేయి నోళ్ళా కీర్తిస్తూ అప్పుడప్పుడు టపాలూ వ్రాస్తుంటారు. కొందరు బ్లాగుల్లో సర్వైవ్ కావడానికి, భరోసా కోసం విలన్ బ్లాగర్ల చెంత చేరి వారికి డప్పు కొడుతూ పిల్ల బ్లాగర్లకు (అంటే అసలు వయస్సులో అని కాదు - బ్లాగు వయస్సులో) బుల్లీలుగా తయారవుతారు. కొన్ని సార్లు మేడంతోనో బాస్ తోనో గొడవలు వచ్చేస్తాయి. అప్పుడు ముఠా మారుస్తారు. కొత్త బాస్ దగ్గర చేరాక పాత బాస్ ని చెడుగుడు ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరు ఎక్కువగా ప్రమాదకరమయిన వ్యక్తులు కాదు గానీ బాగా చికాకు పెట్టేస్తుంటారు. ఇలాంటి విషయాల పట్ల, పలు రకాల బ్లాగర్ల పట్ల ముందే మీకు ఇలా అవగాహన వుంటే మీరు అన్నిటికీ సంసిద్ధంగా వుండేందుకు వీలవుతుంది. అంతేకానీ బ్లాగోస్ఫియర్ మరీ అంత అందమయిన లోకమని అమాయకంగా అనుకుంటూ అడుగుపెట్టేయకండి. అలా అని భయపడనక్కరలేదు కానీ కాస్తంత జాగ్రత్త అవసరం.
కొన్ని సార్లు వివిధ పేటల వీధి రౌడీలు నడి బ్లాగుల్లో పడి కొట్టుకుంటూవుంటారు. అలాంటప్పుడు నాలాంటి మెజారిటీ ప్రజలు ఉత్సుకతతోనో, నిర్లిప్తంగానో, నిస్పృహతోనో లేక కాలక్షేపం కోసమో ఆ బ్లాగు యుద్ధాలని తిలకిస్తూవుంటారు. ఎవరో కొద్ది మంది తప్ప మిగతావారంగా మౌనంగా ఈ కొట్లాటలు గమనిస్తూవుంటారు. కొద్దిమంది పెద్ద మనస్సున్న వారు మాత్రం వీటిల్లో జోక్యం చేసుకొని వివాదాలని పరిష్కరింపజేసేందుకు ప్రయత్నిస్తుంటారు.
(ఇంకా వుంది)
మరీ బయపెట్టేస్తున్నారండి.
ReplyDeleteKell Anna nuvvu
ReplyDeleteనవ్వి నవ్వి కల్లమ్మట నీల్లొస్తున్నాయి ఈ టపా కి . ఈ మధ్య బాగా వ్రాస్తున్నారన్న ఒక లేడీ బ్లాగర్ కు పోటీ గా వ్రాస్తున్నారు కదా ఈ పుస్తకము. (సరదాకి)
ReplyDeleteమెగా బ్లాగర్ అభిమానులని మీ వైపు తిప్పుకొనే ప్రయత్నము చేస్తున్నారా :)).
బాగా వ్రాశారు.
ReplyDeleteనేను భుజాలు తడుముకొన్నాను.
ఏ వర్గంలోకి వస్తానో తెలియక.
కొంచెం నా బ్లాగ్ చూసి, చెప్పకూడదూ?!..
నాగస్వరం.
http://www.nagaswaram.blogspot.com
@ ప్రబంధ్
ReplyDeleteఈ హెచ్చరికలన్నీ ఆ పుస్తకంలో ముందే వుండవు లెండి. వెనకెక్కడో వేస్తాను.
@ అజ్ఞాత
Kell అంటే?
@ మౌళి
అంతగా ఇందులో నవ్వొచ్చేదేముందబ్బా! ఎవరికి పోటీగా కాదండీ. నేను వ్రాసినవి చూసుకోవడానికే సమయం దొరకట్లేదు. ఇంకా వేరేవి చదివి మరీ పోటీగా వ్రాయడమా :)
@ కాయ
ఇంకా ఈ సిరీస్ వుంది కదా. మీ పాత్రా వుంటుంది చూడండి.
@ నాగస్వరం
ఇంకా ఈ సిరీస్ అయిపోలేదండీ. పూర్తి అయ్యాక చెబుతాను :)
super. waiting for the next parts.
ReplyDeleteహాయిగా నవ్వుకోనేలా ఉ౦ది ఈ చాప్టర్ :)
ReplyDeleteమీరు పుస్తకం వ్రాస్తున్నా అని చెప్పినపుడు ఆసక్తిగా అనిపి౦చలేదు.చాలా టపాలు వచ్చాయి బ్లాగులు-ఎలా -ఇలా. అని.. మీ పుస్తక౦ కూడా అలానే ఉ౦టు౦దేమొ అనుకున్నాను :)
పుస్తకం వచ్చినా రాకున్న, బ్లాగు భగవద్గీత లా అ౦దరూ ఈ టపాలు చూసుకోవచ్చు :)
@ సత్యాన్వేషి
ReplyDelete:)
@ మౌళి
:)
ఒక పుస్తకంగా వెలువరించాలనుకుంటున్నాను కాబట్టి బ్లాగుల గురించి వీలయినంత బ్యాలన్సుడుగా చాలా రాయాలనుకుంటున్నాను. చక్కని వ్యాఖ్యలూ ఆ పుస్తకంలో ప్రత్యక్షమవుతాయి. అయితే ఇందుకోసం వ్రాసే టపాలన్నీ ఒక క్రమ పద్దతిలో వుండకపోవచ్చు. ఏది వ్రాయాలనిపిస్తే అది వ్రాస్తుంటా. పుస్తకంలో మాత్రం క్రమపద్ధతిలో పేర్చుతాను.
Title "Telugu Blog prapancham" seems so to be more appropriate than "Blog vrayatam ila/thelika"
ReplyDeleteకేక!
ReplyDeleteనాదీ అమ్మలక్కల బ్లాగే కానీ నేనెప్పుడూ ఇడ్లీ చట్నీ గురించి రాయలేదు. నాకు వండటమే కష్టం మళ్ళీ వాటిగురించే రాయటం అంటే నావల్లకాదు. మీ విశ్లేషణ బావుంది
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteఒకటి రెండు టపాలు చూసి పుస్తకానికి ఆ పేరు బావుంటుందనుకోకండి. బ్లాగులు ఎలా వ్రాయాలి కూడా పుస్తకంలో వుంటుంది.
@ కొత్తపాళీ
:)
@ లలిత
ధన్యవాదాలండి :)
బాగున్నది
ReplyDelete