(తెలుగులో బ్లాగింగ్ అనే పుస్తకం కోసం వ్రాస్తున్న వ్యాసపరంపర ఇది)
ఏ సమాజాన్నయినా ఎన్నో విధాలుగా విభజించవచ్చు. అలాగే బ్లాగు సమాజాన్ని కూడా పలు విధాలుగా వర్గీకరించవచ్చు. సరదాగా ఈ సినిమా పాత్రల వర్గీకరణ ఎన్నుకున్నాను. తెలుగు బ్లాగావరణం ఒక తెలుగు సినిమా వంటిదనుకుంటే అందులో హీరోలు, హీరోయిన్లు, సహ హీరోలు, సహ హీరోయిన్లు, కమెడియన్లు, సహ కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులూ, విలన్లూ, ఆకు రౌడీలూ, వ్యాంప్ క్యారెక్టర్లూ వుంటారు. మరి మీరు తెలుగు బ్లాగుల్లో ఏ రకమయిన పాత్ర పోషించదలుచుకున్నారో నిర్ణయించుకోండి.
కథానాయకులు, నాయికలు (హీరోలు, హీరోయిన్లు): కథని ముఖ్యంగా నడిపించేవాడే కథానాయకుడు. అలాగే బ్లాగావరణాన్ని ఏదో ఒక విధంగా ముందుకు నడిపించేవారే హీరోల జాతికి చెందుతారు. అలాంటి వారు ఓ 20% వుంటారు. వీరు చురుకుగా వుంటారు, ఏదో ఒకటి సాధించాలని చూస్తుంటారు, తరచుగా వ్రాస్తుంటారు, తటపటాయింపులేకుండా తమ అభిప్రాయాలు చెబుతుంటారు, బ్లాగు లోకం ఉన్నతి కోసం ఏదయినా చెయ్యాలని తపన పడుతుంటారు, తోటి బ్లాగర్లను ప్రోత్సహిస్తుంటారు, వ్రాయడంలో సరికొత్త పోకడలు పోవాలని, తమ రచనల్లో వైవిధ్యం రంగరించాలనీ చూస్తుంటారు.
ఇందులో కొంతమంది తెలుగు బ్లాగుల సంకలినులు నడుపుతుంటారు. మరి కొంతమంది నెట్టులో తెలుగు అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటారు. కొంతమంది ఇతరులకు బ్లాగింగ్ ఎలా చెయ్యాలో నేర్పుతుంటారు, బ్లాగింగ్ చెయ్యడంలో మెళుకువలను చెబుతుంటారు, కొత్త బ్లాగర్లని ప్రోత్సహిస్తుంటారు. కొంతమంది బ్లాగుల్లో కొత్త పుంతలు తొక్కి వైవిధ్యమయిన రచనలు చేస్తూ పాఠకులకు నూతనత్వాన్ని ఇస్తూ, ఆసక్తి కలిగిస్తుంటారు. ఇలా ఏ రకంగా నయినా తెలుగు బ్లాగుల అభ్యున్నతికి, తెలుగు బ్లాగుల మీద ఆసక్తికి దోహద పడే బ్లాగర్లను హీరో బ్లాగర్లు అనుకోవచ్చు. వీరు అపజయాలకు వెరవకుండా, పట్టుదల కోల్పొకుండా, విమర్శలకు వెరవకుండా బ్లాగుల్లో దీటుగా, ధాటిగా తమ ప్రభావం చూపుతారు. వీరి రచనలు సాధారణంగా ఉత్తమ స్థాయిలో వుంటాయి. అయితే వీరి అందరి బ్లాగులూ బాగా ప్రజాదరణ పొందకపొవచ్చు కానీ వీరు ఆదరణ వుందా లేదా అనే నిమిత్తం లేకుండా తాము చెప్పాలనుకున్నదానిని చెప్పేస్తూవుంటారు.
మరికొందరు సమాజ సమస్యలను, వైరుధ్యాలను బ్లాగుల్లో ప్రస్థావిస్తూ సమాజాన్ని చైతన్యవంతం చెయ్యడానికి, సామాజిక స్పృహ పెంపొందించడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరు భారత దేశ ఔన్నత్యాన్ని, సంస్కృతినీ పరిరక్షించడానికి బ్లాగుల ద్వారా కృషి చేస్తుంటారు. మొత్తమ్మీద తమతమ ఆలోచనారీతులకు అనుగణంగా సమాజాన్నో, బ్లాగు సమాజాన్నొ ముందు పెరుగెత్తించడానికి ప్రయాసపడుతుంటారు. ఆ క్రమంలో కొంతమంది సమాజాన్ని వెనక్కికూడా లాగేస్తుంటారు.
సహ హీరోలూ, హీరోయిన్లు: వీరికి అంతగా స్వంత వ్యక్తిత్వం వుండదు. తమకు నచ్చిన హీరో బ్లాగర్ల చెంత చేరి ఒక గ్రూపుగా తయారయ్యి బ్లాగు హీరోల మంచి పనులకు ఇతోధికంగా సహాయపడుతుంటారు. అంటే హీరో తానా అంటే తందానా అనే టైప్ అన్నమాట. అందరూ అన్ని రంగాలలో, అన్ని విధాలుగా హీరోలు కాలేరు కాబట్టి ఇలా సహ హీరోలుగా మిగిలిపోవడంలో అంతగా పొరపాటేమీ లేదు.
హాస్యనటులు: తెలుగు మాస్ సినిమా అన్న తరువాత కామెడీ లేకపోతే ఎలా? అప్పుడప్పుడు హీరోల కంటే కమెడియన్లకే ప్రాధాన్యత ఎక్కువుంటుంది. వీరు హాస్య రచనలు, కామెడీ కామెంట్లూ వ్రాసేవారు అయ్యుంటారు. చక్కటి కాలక్షేపం కబుర్లు వ్రాసి జనాలను ఎంతో చక్కగా అలరిస్తారు. ఇంటా బయటా ఎన్నో సమస్యలతో సతమతమయ్యే పాఠక జనాలు వీరి రచనలను చదివి హాయిగా నవ్వుకొని తమ బాధలని మరచిపొతారు. తమకు ఎదురయిన అనుభవాలను కానీ, అనుభూతులని కానీ సరదాగా వ్యక్తపరుస్తూ ఇతరులను అలరిస్తారు.
వీరు సమాజాన్ని కానీ, బ్లాగావరణాన్ని కానీ ముందుకో, వెనక్కో తీసుకువెళ్ళే ప్రయత్నాలు ఏమీ అంతగా చెయ్యరు. ఎక్కడివారు అక్కడ వుండి కాలక్షేపం మాత్రం కలిగిస్తారు. బ్లాగులు కాలక్షేపం కోసం మాత్రమే చదవాలనుకునేవారికి వారి వ్రాతలు బాగా నచ్చుతాయి. ఇలా తెలుగు బ్లాగావరణంలో హాస్యంలో ఉద్దండులయిన బ్లాగర్లు కొంతమంది వున్నారు. వారికి చాలా బ్లాగు ప్రజాదరణ వుంది. మీరు హాస్యం, వ్యంగ్యం వ్రాయగలిగిన వారయితే, ఎలాంటి ఇబ్బందులు లేని రచనలు చెయ్యాలనుకుంటే ఇలాంటివి వ్రాసి చూడవచ్చు.
(ఇంకా వుంది)
కొన్ని బ్లాగ్లులు యే యే పాత్రలు పోషిస్తున్నాయో ఉదాహరణలు ఇవ్వవచ్చు కదా
ReplyDeleteఇది మీకో క్లిష్టమైన సమస్య అనుకుంట :) :)
నేను మాత్రం ఇప్పుడు దాక మీరు రాసిన యే పాత్రలో కి రాను.:)
ఎన్ని హాస్య రచనలు చేసానో, ఎన్ని కామెడీ కామెంట్లు పెట్టనో తెలియదు కానీ.. మీరు ఇచ్చిన మూడు కేటగరీలలో నేను మూడోజాతివాడ్ని అనికుంటున్నా.. :-)
ReplyDeleteకాకపోతే.. "మీ శైలి ఇతరులకు ఏమాత్రం నచ్చినా మీరు పాపులర్ బ్లాగర్ అయిపోవచ్చు.".. ఇంత సినిమా ఉన్నట్టులేదు.. :-)
Interesting. Looking forward to other parts..
ReplyDeleteమీరు అల్లరి నరేష్ టైపు
ReplyDelete@ వంశి
ReplyDeleteఇది వ్రాయడమే క్లిష్టంగా వుంది - ఇంకా బ్లాగర్లను ఉదహరించడమా :)) మీ పాత్ర వచ్చినప్పుడు చెప్పండి :)
@ రవి కిరణ్
మీ పేరూ, మీ బ్లాగూ నాకు కూడా గుర్తుకులేదు కాబట్టి మీరు చెప్పింది నిజమే :)) ఆ స్టేట్మెంట్ తొలగిస్తున్నా. అసలు ఆ లైన్ వ్రాసేటప్పుడే నా అంతరాత్మ ఎందుకుబే అలా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తావని గొణిగింది కానీ అదిమేసా.
@ క్రిష్ణప్రియ
మీ అభిప్రాయం చెబుతూ వుండండి
@ అజ్ఞాత
:) నేను కామెడీ హీరోని అంటారా? పాత్ర గురించి పక్కకు పెడితే సినిమారంగంలో ఒకరిలాంటి వ్యక్తిత్వం నాది అని అనుకుంటూవుంటాను. అలా ఇంతవరకు ఎవరూ నన్ను అనలేదు కానీ నేనయితే ఆ పోలిక తెచ్చుకుంటాను. అతనో ప్రముఖ దర్శకుడు.
నేను బ్లాగర్ ని కాదు..కామెంటేటర్ ని కదా... నాకేమైనా కోవ పెట్టొచ్చు కదా ..
ReplyDeletepls ignore my prev comment:
ReplyDeleteEVV?
@ కాయ
ReplyDeleteసిరీస్ ఇంకా అయిపోలేదు కదా. మీదీ వుంటుంది చూడండి.
@ మౌళి
వారు గొప్ప దర్శకులే కానీ పేర్కొనదగ్గ వ్యక్తిత్వం ఏముంది? నేననుకునే దర్శకుడు హిందీలో కూడా ప్రసిద్ధుడే :)
Naa IshTam??? :))
ReplyDelete@ మౌళి
ReplyDelete:)
అయ్యా! శరత్ గారూ ఏదో రాస్తున్నారంటగా
ReplyDeleteనన్నూ, అమ్మ సంకలనాన్ని మర్చిపోకండే!!!!!!!!!!
@ కనుమూరి
ReplyDeleteచాన్నాళ్ళ తరువాత నా బ్లాగులో దర్శనం ఇచ్చారు మీరు! నా కృషి మీ దృష్టికి వచ్చినందుకు సంతోషంగా వుంది.