(తెలుగులో బ్లాగింగు పుస్తకం కోసం)
ఓక్కే. మీరు బ్లాగు ప్రారంభించదలుచున్నారు. ఆ తరువాత? టెక్నికల్ ప్రాబ్లెంస్ పక్కన పెట్టేసి ఎమోషనల్ ప్రాబ్లెంస్ చూద్దాం. మీకు పెర్ఫార్మెన్స్ ఏంగ్జయిటీ మొదలవ్వచ్చు. ఎలా వ్రాస్తాను? ఎవడన్నా చదువుతాడా చదవడా? రోజుకి ఎన్ని కిలోల హిట్స్ వస్తాయి? సరే, మన బ్లాగు కాబట్టి మన వ్రాతల మీద మనకు నమ్మకం ఎలాగూ వుంటుంది కానీ మన బ్లాగులోకి వచ్చేదెవరు, చదివేదెవరు అనే సందేహం మిమ్మల్ని పీక్కు తింటుండవచ్చు.
ఆ ఆందోళన మీకు తీరాలంటే ముందు మీరొక విషయం తేల్చుకోవాలి. మీరు వ్రాసేది ప్రధానంగా మీకోసమా లేక ఇతరుల కోసమా? అంటే మీ ఆత్మసంతృప్తి కోసమా లేక ఇతరుల మెప్పుకోసమా? మీ కోసం అయితే భేషుగ్గా మొదలెట్టండి. ఇతరుల మెప్పు కోసం అనుకుంటే వేరే మాధ్యమం చూసుకోవడం మంచిది. ఈ బ్లాగులోకం చిత్రమయినది. ఆడదాని మనస్సెంత గాఢమయినదో బ్లాగర్ల మనస్సూ అంతే. ఏ టపా హిట్టవుతుందో, ఏ టపా ఫట్టవుతుందో అన్ని సార్లూ ఊహించలేం. ఎంతో గొప్పగా వచ్చిన టపా తుస్సుమంటుంది. ఆషామషీగా వ్రాసిన టపాలు కొన్ని మాత్రం అందలం ఎక్కుతాయి. ఎవరు పాపులర్ అవుతారో, ఎవరు కారో, ఎప్పుడు జనాదరణ పొందుతారో ఊహించడం కష్టం. మీకు వచ్చే హిట్లూ, కామెంట్లూ లెక్కట్టుకుంటూ గొంతుక్కూర్చోవాలనుకుంటే మాత్రం మీకు తొందర్లోనే నిరాశ ఎదురవ్వచ్చు.
అందుచేత ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ముందు మీ సంతృప్తి కోసం బ్లాగు మొదలుపెట్టండి. ప్రజాదరణ పొందిందా మంచిదే - అది బోనస్సు లాంటిది. బోనస్సు రాలేదా ఫర్వాలేదు - అసలు ఆదాయం - మీ సంతృప్తి - ఎక్కడికీ పోదు. కొన్నికొన్ని బ్లాగు జీవితాలు అంతే - ఎంత గొప్పగా వ్రాసినా గుర్తింపు లభించదు. బ్లాగుల్లో గుర్తింపు రావడానికి అర్హత చక్కగా వ్రాయడం ఒక్కటే కాదనీ, ఇంకొన్ని కళలుండాలనీ మీకు కొద్ది వారాల్లోనే అర్ధమవుతుంది లెండి. అవేంటో మరో భాగంలో చెప్పుకుందామేం. అసలు మంచి బ్లాగులు అంటూ వుండవనీ వుండేవి మంచి టపాలేనని కొంతమంది బ్లాగు పెద్దలు ప్రస్థావిస్తుంటారు - నేను ఏకీభవిస్తుంటాను.
అందుచేత మరీ ఎక్కువగా ఆలోచించెయ్యకుండా మీ బ్లాగులో చించెయ్యండంతే. మీలో విషయం వుంటే ఇవాళే కాకపోయినా రేపయినా జనాలు చదువుతారు. మీరు ఓ టపా వెయ్యగానే, ఎంట్రీ ఇచ్చెయ్యగానే జోష్ సినిమాలోలాగా అన్నయ్యొచ్చిండూ, మా అన్నయ్యొచ్చిండో అని పాటపాడుతూ అందరూ ఆహ్వానాలు పలుకుతారని అనుకోకండి. బ్లాగర్లు తక్కువగా వున్న కాలంలో అలాంటి స్వాగత సత్కారాలు విధిగా కొత్త బ్లాగర్లకి అందుతుండేవి కానీ ఇప్పుడు బ్లాగర్లు ఎక్కువయ్యారు కాబట్టి అంత దృశ్యం కనపడటం లేదు. అలా అని నిరాశ పడకండి. మీ బ్లాగు బ్లాగుంటే మీ దృశ్యం మీకు వస్తుంది. అప్పుడు చూపిద్దురు కానీ మీ బొమ్మ. మీ బ్లాగు ఏమాత్రం గొప్పగా వున్నా గుర్తించి, మెచ్చుకొని, చేయూత నిస్తూ సహాయ సహకారాలు అందించే సహృదయులు ఎంతో మంది వున్నారు. మీ వ్రాతలు కానీ, మీ బ్లాగు కానీ ఆసక్తి కరంగా లేకపోవడానికి ఎన్నో కారణాలు వుండవచ్చు. మీ బ్లాగుని కానీ, టపాలను కానీ ఆసక్తికరంగా ఎలా మలచవచ్చో మరో సారి చర్చిద్దాం.
మీకు ఇంకో సందేహం వస్తుండొచ్చు. ఏం వ్రాయాలా అని. ఏం వ్రాస్తే ఎవరి మనస్సుని నొప్పిస్తామో అని మీలో ఖంగారు మొదలవ్వచ్చు. ఇతరులు ఏమనుకుంటారో అన్నది ఎక్కువగా ఆలోచించకుండా ముందు మీరేమనుకుంటున్నారో అన్న దానికి ప్రాముఖ్యం ఇవ్వండి. జీవితాల్లో కానీ, బ్లాగుల్లో కానీ ఎవరికి నచ్చినట్టుగా వారుండకపోవడానికి, ఎవరికి నచ్చినట్లుగా వారు వ్రాయకపొవడానికి మన గురించి మనం ప్రాధాన్యం ఇచ్చుకోకుండా, ఇతరుల మనోభావాలకి ప్రాధాన్యం ఇస్తుండటం ప్రధాన కారణం.
బ్లాగుల్లో బుద్ధిమంతుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం అన్నీ ఆలోచించి వ్రాయడం అవసరం. ఎవడేమనుకుంటే నాకేంటి, డోంట్ కేర్ అనుకుంటే మీకు నచ్చినవన్నీ వ్రాసుకోవచ్చు. అందువల్ల కొన్ని రిస్కులు వుంటాయి. అవి ఎదుర్కొనే ధైర్యం వుండాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ విధానం పాటిస్తూ నెమ్మదినెమ్మదిగా బ్లాగు వ్రాస్తూ వస్తున్న స్పందనను బట్టి మీకు నచ్చిన విధంగా మీరు ముందడుగు వేస్తుండవచ్చు. ముందు మామూలుగా మొదలుపెట్టి ఆ తరువాత మీ విశ్వరూపం చూపించవచ్చు.
బయటి వృత్తుల్లో ఉదాహరణకి రచయితలు గానో, కవులుగానో లేక జర్నలిస్టులు గానో బాగా రాణించినంత మాత్రాన, అక్కడ తీస్‌మార్ ఖానులయినంత మాత్రాన ఇక్కడ కూడా అదే రేంజిలో విజయం సాధించగలమని భ్రమపడవద్దు. అక్కడ మనం వ్రాసేది ఎడిటరుకి నచ్చడం ముఖ్యం - ఇక్కడ అలా కాదు - చాలామందికి నచ్చాల్సి వుంటుంది. అందుకే ఒక్కొక్కప్పుడు తేడాలు వస్తాయి.
అన్ని విధాలుగా ఆలోచిస్తూపోతే ఎటూ ముందడుగు వెయ్యలేం. కూడలిలో అలా నిలబడిపోతాం. అందుకే కొద్దిగా ఆలోచించి ముందడుగు వెయ్యండి. ఈ రోజే ఓ టపా వ్రాసి పడెయ్యండి. ఎవరు చదవరో చూద్దాం. ఎందుకు చదవరో చూద్దాం. అలా అలా వ్రాస్తూ పోతూ మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. అన్నీ పక్కాగా ఆలోంచించి పూర్తి ప్రణాళికా బద్ధంగా వెళ్ళాలనుకుంటే మీరు పరెఫెక్షనిస్టులవుతారు కానీ ఏమీ ప్రారంభించలేరు. ఒక్క బ్లాగు కూడా మొదలెట్టలేరు. అలాక్కాదు కానీ మీరు మీ బ్లాగు మొదలెట్టేసెయ్యండంతే - ఓ టపా అయినా విదిలించెయ్యండంతే.
ఎహె పో.. పేపర్ పై రాసుడే కష్టం గా ఉంటే.. ఇంగ్లీషులో రాస్తూ, తెలుగులో సరిగా తర్జుమా అవుతుందాలేదా అని చూస్తూ, మళ్ళీ ఏం వ్రాయాలో ఆలోచించటం అంటే ...
ReplyDelete..కష్టమైన పనే... మీరు బ్లాగులు ఎలా వ్రాయాలో చెప్పేది ఇద్దరు పిల్లలు పుట్టి ఎక్కువ టైం ఖాలీగానో, కంప్యూటర్ ముందో కూచునే వాళ్ళకేగా ?
ఎందుకంటే నా లాంటివాళ్ళకైతే ముందు బ్లాగులు ఎందుకో కూడా(ఆవశ్యకత) తెలియాలి..
నా "ఎహె పో" కి మూలం..
ReplyDeletehttp://www.youtube.com/watch?v=Nf1ZBBbvtu4&feature=related
watch 6th second on wards
@ కాయ
ReplyDeleteఇవాళ కొద్దిగా తీరికలేక మీ వ్యాఖ్యకి స్పందన ఆలస్యం అయ్యింది. బ్లాగింగ్ వల్ల లాభాలేంటో మాత్రమే కాక నష్టాలేంటో కూడా సవివరంగా వ్రాస్తాను.
"ఎహెపో" ఆ సినిమాలోదా :)) ఆ కమెడియన్ చాలా ఫన్నీగా మాట్లాడుతాడు.
శరత్ గారు, మరేమీ అనుకోకండి, కేవలం తెలుసుకోవాలి అని మాత్రమే అడుగుతున్నాను.
ReplyDeleteఇన్ని ఇన్ని టపాలు రాస్తున్నారు, ఇవి ఆఫీసులో రాస్తారా లేదా ఇంటినుంచి రాస్తారా?
అఫీసు సమయం ఐతే మరి పని ఉండదా? మరి ఇంటి నుండి ఐతే అసలు ఎలా మానేజ్ చేస్తున్నారు?
ఎదో ఒకటి ఆఫీసు టైమో, ఫ్యామిలి టైమో వదులుకోవాల్సిందే కదా, అలా ఎలా ఉండగలుగుతున్నారు?
ఇంట్లో గొడవలు పట్టించుకోకుండా ఇదొక వ్యాపకం లాగా అనుకుంటున్నారా? లేదా సరదాగా మొదలు పెట్టింది ఒక ఎడిక్షన్ లాగా అయ్యిందా?
@Tara: మీరలా అడిగితే ఎలా ? పని వదిలేసి మనకోసం వ్రాస్తుంటే మీరలా అడిగితే గురువు గారు ఏమనుకుంటారు...ఆయన్ని మీరు పని దొంగ అంటున్నారని అనుకోరూ ? ... అంతే కాక పని పాటా లేక ఇలా వ్రాస్తున్నావేంటి అని కూడా అడిగినట్లు అనుకుంటారు... గురువు గారి పని నెట్వర్క్ స్క్రీన్ మానిటర్ చేయటం అనుకుంటా... అటు చూస్తూ ఇటు వ్రాస్తూ.. ఇంక వాళ్ళ ఆఫీస్ లో దేశీ లు లేరు కాబట్టి .. ఇలా వ్రాస్తూ చదువుతూ కాలం గడిపేస్తారు.. ఇది అప్పుడెప్పుడో అడిగితే నాకు చెప్పిన సమాధానం...అని గుర్తు..
ReplyDelete@ తార, కాయ
ReplyDeleteఅఫీసు సమయం సమర్ధవంతంగా నిర్వహించుకుంటూ, పనులు త్వరగా తెముల్చుకుంటూ టపాలు వ్రాయడానికి సమయం కూడగట్టుకుంటుంటాను. బ్లాగులకి కుటుంబ సమయం ఎప్పుడో ఒకప్పుడు తప్ప వాడను. అందుకే వారాంతాలు నానుండి టపాలు అరుదు. కుటుంబ సమయాన్ని త్యాగం చేసి మరీ బ్లాగులు ధారాళంగా వ్రాసేంత దృశ్యం బ్లాగులకి కానీ, నాకు గానీ ప్రస్థుతం అయితే లేదు. అఫీసు నుండి వీడియో బ్లాగింగ్ కుదరదు కనుక అప్పుడప్పుడు ఓ పది నిమిషాలు ఇంటి సమయమే వాటికోసం కెటాయిస్తుంటాను.
@శరత్ గారు
ReplyDelete:)
@కాయ
ఒక బ్లాగు అభిమానులు మీలా జవాబు ఇవ్వకూడదు, అజ్ఞాత ప్రొఫైల్లు పెట్టుకోని అడిగినవాడ్ని నానా తిట్లు తిట్టాలి :D
కానీ శరత్ గారి బ్లాగులో అలా జరగదు కనుకనే ఈ బ్లాగును తప్పకుండా చదువుతుంటా
@తార: (: (:| |:)
ReplyDelete