... ఈ మాటలు మా అమ్మలువి. అప్పుడప్పుడు అలా అంటూ వుంటుంది. ఆ మాటలు అబద్ధం అని నాకు తెలుసు. అందుకే అనునయంగా తన దగ్గర కూర్చొని తనని ఎప్పుడెప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళానో లిస్ట్ చదివేస్తుంటాను. ఎన్ని సార్లు ఎన్ని ఏక్టివిటీసుకి తీసుకెళ్ళినా మా పాప ఇలా అటుందేమిట్రా బాబూ అని అనుకుంటూవుంటాను. అలాంటప్పుడు ఇంకా ఎందుకు తిప్పడం అని కూడా అనిపిస్తుంటుంది. ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే అని ఓ కవి ఎప్పుడో అన్నాడు. ఆ మాటలే నిజమంటాడు Men Are from Mars Women Are from Venus పుస్తకం రచయిత జాన్ గ్రే. ఆడవారి మాటలను యథాతథంగా తీసుకోవద్దట. అందులోని అంతరార్ధం కనిపెట్టాలిట. "నువ్వు ఎంతో చక్కటి నాన్నవి. నన్ను ఎప్పుడూ అటో ఇటో తీసుకువెళ్ళి మంచి కాలక్షేపం కలిగిస్తుంటావు. ఇప్పుడు కూడా నాకు అలా నీతో వెళ్ళాలని వుంది. తొందరగా తీసుకెళ్లవూ" ఇదీ అమ్మలు యొక్క ఆ మాటలకు అర్ధం ట! బాప్ రే బాప్. ఈ ఆడవారు ఎంత గడుసువారూ!
స్త్రీలూ, పురుషులూ ఒకే పదాలు ఉపయోగించినా వాటి యొక్క తాత్పర్యం వేరు అని జాన్ వివరిస్తాడు. నిన్న సాయంత్రం ఇంట్లో ఒక చర్చ మొదలెట్టాలనుకున్నాను. మా ఇంట్లో ఒక వేడుక చెయ్యాలి. అనవసరంగా డబ్బు ఖర్చు ఎందుకు చిన్నగా చేద్దామని నేను, ఎప్పుడో ఒకప్పుడు వచ్చే వేడుక కాబట్టి పెద్దగా చెద్దామని మిగతా ముగ్గురూనూ. అలా అలా ఆ నిర్ణయం వాయిదా పడుతోంది. సరే, ఒక నిర్ణయం తీసుకుందామని నిన్న మా ఆవిడతో ప్రస్థావించాను. అంతే. "నువ్వెప్పుడూ ఇలాగే అంటావూ...ఏ వేడుకా చెయ్యవూ" అని మొదలయ్యింది వాదన. నిజంగా? నాలో నేను ఓ లిస్ట్ వేసుకున్నాను. ఆ మాటలు అబద్ధం. ఇదివరకయితే లిస్ట్ చదివేవాడిని. చర్చల వల్ల లాభం వుంటుంది కానీ, వాదనల వల్ల లాభం వుండదు కాబట్టి అది సరి అయిన సమయం కాదు అని మౌనం వహించి బెడ్రూములోకి తోకముడిచాను.
నిజానికి అయితే తన దగ్గర కూర్చొని ఓపిగ్గా తన వర్శన్ విని వుండాలి. నాలో ఇంకా అంత పరివర్తన రాలేదు కాబట్టి, కొంతే వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు అంతొద్దు - కొద్దిగా చాలు అనుకొని గొడవ మాత్రం పెట్టేసుకోకుండా మౌనం వహించాను కానీ ఆ మాటలకు అబ్బురపడ్డాను - నిజం చెప్పాలంటే నిస్పృహ చెందాను. ఎందుకంటే ఈ టపాలో పైన చెప్పిన విషయాలు ఆ పుస్తకంలో అప్పటికి ఇంకా చదవలేదు కాబట్టి ఆమె మాటలు యథాతథంగా తీసుకున్నాను. ఈ ఉదయం రైల్లో వస్తూ ఆడవారి మరియు మగవారి భాషలు అన్న అధ్యాయం కొంత చదివాను. అప్పుడు నా కళ్ళు అలాగే ఆమె మాటలు అర్ధాలు తెరచుకున్నాయి. మా ఆవిడ ఆ మాటల తాత్పర్యం ఇలా అయ్యుంటుంది "ఇదివరకు ఎన్నో వేడుకలు చేసాం, అందరం ఎంతో ఆనందించాం. ఆ ఆనందం మళ్ళీ కావాలి. అందరం కలవాలి. చక్కటి సమయం గడపాలి..." అలా అలా అన్నమాట. ఓసోస్, అలా చెబితే ఎంత బావుండునూ. అలా తేరగా చెబితే ఆడాళ్ళు ఎందుకవుతారూ. మగాళ్ళ బుర్రలకి కాస్త పని పెట్టాలి కదా. ముల్లులని తొలగించుకొని ఎలాగయితే గులాబి పువ్వు అందుకుంటామో అలాగే వారి మాట్లల్లోని ౠణాత్మక భావాన్ని తొలగించి అసలయిన అర్ధాన్ని వెతుక్కోవాలి. అలా ఏ అర్ధాలు వెతుక్కోవాలో చిన్నపాటి డిక్షనరీనే ఇచ్చాడు ఆ రచయిత.
అలాగే మగవారి మౌనాన్నీ యథాతథంగా తీసుకోకూడదని మహిళలకు చెబుతాడు ఆ రచయిత. ఆడవారు మాట్లాడుతూ ఆలోచిస్తుంటారు. మగవాడు ఆలోచించాక మాట్లాడుతాడు. ఏదయినా ఆలోచించాలనుకున్నప్పుడు మగవాడు మౌనం వహిస్తాడు - నిన్న నేను చేసినట్లుగా. మనస్సులో ఆలోచనలు ప్రాసెస్ చేసి అప్పుడు మాట్లాడుతాడు. అయితే ఆడవారు అలా చెయ్యరు కాబట్టి మగవాడి మౌనాన్ని అపార్ధం చేసుకుంటారు. అలాంటి మగ మౌనాన్ని గురించి మరోసారి మాట్లాడుకుందాం.
అన్నట్లు నిన్న 'మీ పార్ట్‌నర్ని మోటివేట్ చెయ్యడం ఎలా' అన్న అధ్యాయం పూర్తి చేసాను కానీ అది నాకు ఎక్కలేదు. అది మరోసారి చదివి చూడాలి. అందుకే ఆ ఆధ్యాయం గురించి ప్రస్థుతం వ్రాయడం లేదు.
@ కొత్తవకాయ
ReplyDelete:)
మీరు కామెంట్లెయ్యకండి బాబోయ్. మీ ప్రొఫయిల్ పేరూ, ఫోటో చూస్తుంటే నోరు ఊరిపోతోంది మరీ.
:( ఇదిగో, మొన్న జ్యోతి గారూ ఇల్లాగే అన్నారు. ఇలా అయితే మీ టపా బాగున్నా, బాగోకపోయినా వచ్చి నవ్వేస్తానంతే. :X
ReplyDelete:)))
ReplyDeleteee book ma ayana chetha elagina chaviddamani plan vesi mari luggage lo pedithe enduku ee book ante nike ,ni kosame ani cheppa katham aa book thisesadu :(
ReplyDeleteonline lo vetukunna kani em labam manam gattiga chadivi vinpinchalsinde thappa thanaki books chadive alavatu ledu :(