ఊర్లో ఒక గ్రామ సింహం అదేనండి కుక్క వుందనుకోండి. పాపం మంచి కుక్కనే కానీ మీరు పిచ్చి కుక్క అన్నారనుకోండీ. అది విని ఊరుకుంటుంది. ఇంకో ముగ్గురూ దాన్ని అదేమాట అన్నారనుకోండి దానికి అనుమానం వస్తుంది. ఇంకో నలుగురూ అదేమాట అంటే ఆ అనుమానం పెనుభూతమవుతుంది. ఓ పదిమందీ దాన్ని అదేమాట అంటే ఆ అనుమానం నమ్మకమయిపోతుంది. ఆ తరువాత నువ్వు పిచ్చిదానివి కాదూ, మంచిదానివే అన్నా కూడా అది నమ్మను గాక నమ్మదు. పైగా తన బిలీఫ్ సిస్టమ్ని కాపాడుకునేందుకై మిమ్మల్ని కరచి తీరుతుంది. దాంతో అది పిచ్చి కుక్కే అని మీకూ నమ్మకం ఏర్పడుతుంది. అలా అది శాశ్వతంగా పిచ్చిది అయిపోతుంది.
ఇతరులు అలా సూచనల ద్వారా మనలోని విశ్వాస వ్యవస్థలని ప్రభావితం చేస్తుంటారు. అవి ధనాత్మక సూచనలు(పాజిటివ్ సజెషన్స్) అయితే బాగానే వుంటుంది. మీరు ఆహార నియంత్రణ చేస్తున్నారనుకోండి. భలే బక్కపడుతున్నారుగా అని ఎవరయినా అంటే మనకు ఉత్సాహం వస్తుంది. వారి మాటలు మనకు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. అదేమాట ఇంకా కొద్దిమందీ అంటే మనం చక్కగా డైటింగ్ చేస్తున్నామని విశ్వాసం పెరుగుతుంది. అలా ఇతరుల అంచనాలు అందుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అలా అది మనలో పాతుకొనిపోతుంది. అలాంటప్పుడు ఏదో ఓ రెండు రోజులు మీరు తిని కొద్దిగా బరువెక్కగానే ఓ ముగ్గురు నలుగురు ఏం పొట్ట పెంచేసావే అన్నారనుకోండి. మనమీద మనకు సెల్ఫ్ డవుట్ వస్తుంది. అలాంటప్పుడు కొందరు పట్టుదలగా మళ్ళీ ఆహారనియంత్రణ చెస్తారు. బలహీన మనస్కులు అయితే ఎదుటివారి ఋణాత్మక సూచనలకు ప్రభావితం అయిపోయి ఆహారం మీద నియంత్రణ వదిలేసి ఇక డైటింగ్ తమవల్ల కాదనే నమ్మకాన్ని పాదుకొలుపుకుంటారు.
అందుచేత ఇంట్లో మన పిల్లలకి మనం ఎప్పుడూ పాజిటివ్ సజెషన్స్ ఇస్తూ వారిలో పాజిటివ్ బిలీఫ్ సిస్టం నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండాలి. ఇతరులు మన పిల్లల మీదికి విసిరే నెగెటివ్ సజెషన్స్ బారినుండి వారిని కాపాడుతూవుండాలి. అయితే ఒక్క మన పిల్లల విషయంలో అనే కాకుండా మనకు తారసపడె ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ సజెషన్ ఇవ్వడమే బావుంటుంది - మన శత్రువులకి తప్ప :)
మా ఆవిడా నేనూ ఇదివరలో గొడవ పెట్టుకునేప్పుడు పురాణ సినిమా యుద్ధాలలోని బాణాల లాగా ఒహటే రుణాత్మక సూచనలు విసిరేసుకునేవారం. ఆమె నామీదకి విసిరేసే నెగెటివ్ సజెషన్స్ నా మనస్సులోకి సింక్ కాకుండా బహూళ ప్రయత్నాలు చేస్తుండేవాడిని. ఎవరికయినా అలా నెగెటివ్ సజెషన్స్ ఇవ్వకూడదని నాకు తెలుసు కానీ గొడవలప్పుడు లాజికలుగా ఆలోచించలేముకదా. అవి ఎంతో కొంత ఆమె బిలీఫ్ సిస్టంలో చేరివుంటాయి. మన మిత్రులయినా, బంధువులయినా మనలో విష బీజాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నట్లయితే వారికి దూరంగా వుండటం మంచిది. కొందరు శ్రెయోభిలషుల రూపేణా మనలో రుణాత్మక భావాలను, పిరికి భావాలను నూరిపోస్తుంటారు. అలాంటివారికీ దూరంగా వుండటమో లేదా వారి మాటలని పట్టించుకోకుండా వుండటమో చెయ్యాలి.
మనలో వున్న నెగెటివ్ బిలీఫ్ సిస్టంస్ ను గుర్తించి వాటిని కూకటివేళ్ళతో పెకలించివెయ్యాలి. నాలోనూ కొన్ని వున్నాయి. కొన్నింటిమీద శ్రద్ధ పెట్టి సవరించుకున్నాను. ఇంకొన్నింటిమీద ఫోకస్ చెయ్యాల్సివుంది. అలాగే పాజిటివ్ బిలీఫ్ సిస్టంస్ నెలకొల్పుకోవాలి. అలా నేను కొన్నిట్లో నెలకొల్పుకున్నాను. అలా నెలకొల్పుకునే విషయాల్లో బ్లాగుల్లో కూడా వ్రాస్తుంటాను. నాకు వచ్చే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ పాజిటివ్ సజెషన్స్ గా ఉపయోగపడి నాలో ధనాత్మక విశ్వాస వ్యవస్థని నెలకొల్పుతూవుంటుంది. ఉదాహరణకి నేను చక్కగా ఆహార నియంత్రణ చెయ్యగలను అనేటువంటి నమ్మకాన్ని నేను నెలకొలుపుకున్నాను. ఆథ్లెటిక్ బాడీ మెయింటెయిన్ చెయ్యగలను అన్న విశ్వాసం కోసం కృషి చేస్తున్నాను. అలాగే నా భార్య చెప్పినట్లే నేను వినాలనే విశ్వాసాన్ని నెలకొల్పుకోవడానికి నేనెంత కృషి చేస్తున్నానో మీకు తెలుసు.
మీరూ మీలోని రుణాత్మక విశ్వాసాలని గుర్తించండి. ధనాత్మకం అయినా వాటిని నాటెయ్యండి. అన్నట్లు నాకప్పుడప్పుడు పాజిటివ్ సజెషన్స్ వదులుతూ వుండండేం.
ఈ పోస్ట్ నిన్నటి నా కామెంట్ గురించేనా ....అయినా ఈ ఎఫ్.ఎల్.ఆర్. మీ వల్ల కాదు ఇంకో ఆర్నెల్లు మాక్షిముమ్..తర్వాత వదిలేస్తారు, ఎఫ్. ఎల్. ఆర్. లేదు తొక్కా లేదు తోట కూర లేదు అని
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteమీ కామెంట్ గురించి ఈ పోస్టా - అదేమీ లేదండీ. నేను దేనికయినా సరే గ్యారంటీ ఎలా ఇవ్వగలను? ప్రయత్నలోపం లేకుండా కృషి చెయ్యడం వరకే మన వంతు. సో ఫార్ సో గుడ్. అంతవరకే నేను చెప్పగలిగేది. మరీ పదేపదే ఒకే ఆంశం మీద వ్రాస్తే చదివేవారికి చిరాగ్గా వుంటుందని ఆ టపా తీసివేసాను. కొద్దిరోజులయ్యాక మళ్ళీ ప్రచురిస్తాను.
శరత్ గారు,
ReplyDeleteమీతొ ఒక గొప్ప చిక్కు అది యెమిటి అంటె మీరు శ్రంగార సంభందవ్యాసాలు చాల బాగ సరళముగా చక్కగా ఆరటిపండు తీసి నట్ట్లు చెపుతారు.
జీవన మాధుర్యం అనుభవించటానికి మీరు మీ జీవన భాగస్వామి కలసి చెసిన ప్రయొగాలు దాదాపు ఈమధ్య కాలం లొ తెలుగు లొ లిటరరి గా వున్నవారు లెరు.మీకు ఆ క్రెడిట్ ఇవ్వవచ్చు .
కాకపొతె హింస తొ కూడిన బి.డి.యస్.య్మ్ విధానాలు తెలుపునప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించగలరు .ఇక ఈ మధ్య మీరు ప్రారంభించిన భార్య విధెయత బాగనె వున్నది .తరువాత కామెంట్ చెద్దాము .
మీ మీద ఆసూయ కూడ వున్నది సార్ .
@ రమేశ్
ReplyDelete:)
FLR అనగానే చాలామంది (ముఖ్యంగా పాశ్చాత్య దేశస్తులు) S/m (శాడిజం/మసోచిజం) అనుకుంటారు. అలా ప్రయత్నించి విఫలం చెందుతారు. అది కూడా వుండవచ్చు కానీ అదే ప్రధానం కాదు. D/s డామినెంట్/సబ్మిసివ్ విధానం ప్రధానమయినది. దీనిని ఎరోటిక్ ప్లేలా కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ లైఫ్ స్టయిల్ గా ప్రయత్నించినప్పుడే శాశ్వత ఫలితాలు వుంటాయి. మేము చేస్తున్నది అదే కాబట్టి మా అనిత నన్ను (పోకిరి సినిమాలో లాగా) తోలు బూట్లు వేసుకొని కొరడా తీసుకొని కొడుతుందని అనుకోకండి :) మీ సలహాకి ధన్యవాదాలు. నేనే డామినెంట్ అయివుంటే అలాంటివి అంతా కాకపోయినా ఎంతో కొంత ప్రయత్నించివుండేవాడినే కానీ మనకంత దృశ్యం రాలేదు, ఇక రాబోదేమో. సో, కంగారేమీ లేదు.
పూర్తి స్థాయి FLR అనేది బి డి ఎస్ ఎం క్రిందికే వస్తుంది కానీ అందులో D/s ఎక్కువగా S/m తక్కువగా వుంటేనే ఆ రకమయిన బంధం ఎక్కువ కాలం నిలబడుతుంది. లేకపోతే తొందర్లోనే తేలిపోతుంది. ఆమెకి మీద D/s ఆసక్తే తప్ప S/m మీద అవగాహన కానీ ఆసక్తి కానీ లేదు కాబట్టి నాకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు ;)