మా ఊరి జ్ఞాపకాలు: అబ్బమ్మ

అబ్బమ్మ అనగానే ఏ అచ్చమ్మ లాంటి కథో అనుకునేరు.  అస్సలు కాదు. . ఈమె నాకు తల్లి లాంటిది. మా ఇంటి చాకలి ఈమె. ఎన్నాళ్ళ నుండి పనిచేస్తున్నదో మా ఇంట్లో ఈమె గానీ నేను పుట్టినప్పటి నుండీ కనపడుతూనే వుండేది. నన్ను ఎంతో శ్రద్ధగా, ప్రేమగా చూసుకునేది. అలా అని ఆమె మెతక మనిషి అనుకున్నారా? కానే కాదు. నేను స్నానం చెయ్యను మొర్రో - అది ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎంత లబలబలాడుతున్నా బరబరా నన్ను లాక్కెళ్ళి వీర లెవల్లో వీపు రుద్దేసి నన్ను ఉతికేసి, కడిగేసి ఆరేసేది :(     అలా మా అమ్మకు భయపడకున్నా ఆమెకు భయపడేవాడిని.

ఆమె అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం వుండేది. పనులు శ్రద్ధగా, నమ్మకంగా చేసేది. ఆప్యాయంగా, ఆత్మీయంగా ప్రవర్తించేది.  ఆమె కొడుకులు కూడా మాకు జీతగాళ్ళుగా పనిచేసారు. మా తాతయ్య, అమ్మమ్మలతో ఎన్నో ముచ్చట్లు చెబుతూ వారికి కాలక్షేపం కలిగిస్తుండేది. మేము ఆ ఊరినుండి వెళ్ళొచ్చినా మా అమ్మమ్మా, తాతయ్యలు ఆ ఇంట్లోనే వుండేవారు కనుక ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా ఆమె కలుస్తూనే వుండేది. మా అమ్మమ్మా, తాతయ్యలు మరణించాక ఊరు వెళ్ళడం తక్కువయ్యింది. ఈ దేశాలకి వచ్చాక మరీ తక్కువయ్యింది. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కనపడేది. ఆమె సంతోషం కోసం నేను సంతోషంగా ఎన్నో కొన్ని డబ్బులు ఇచ్చేవాడిని. నా పెళ్ళికి కూడా ఆమె ఊరునుండి వచ్చింది. ఆమెతో మాట్లాడుతూ ఆమె గుర్తు కోసం దానిని ప్రత్యేకంగా వీడియో తీయించాను.

ఆమె బాగా వృద్ధురాలయిపోయింది కాబట్టి ఇప్పటికి ఆమె మరణించివుండవచ్చు. మా అమ్మగారిని కనుక్కోవాలి. ఆమెకు ఒకసారి బట్టలు పెడదామని అనుకునేవాడిని కానీ అప్పుడు కుదరలేదు. ఆమె ఇంకా బ్రతికి వుంటే కనుక ఈసారి వెళ్ళినప్పుడయినా ఇంటికి వెళ్ళి బట్టలు పెట్టి వస్తాను. ఆమె వున్నా లేకున్నా ఆమె చూపించిన ప్రేమా, ఆదరణా మా కుంటుంబం మనస్సుల్లో నిలిచేవుంటాయి.

4 comments:

  1. ఏదో రాతల్లో మంచి వాడు శరత్ అనిపించుకోవాలి కాబట్టి.. వాళ్ళని ఈ సారి ఇండియా వెళ్ళినపుడు కలిసొస్తాను... వీళ్ళకి బట్టలు పెట్టొస్తాను... ఇంకొకలకి ఏదొ చేస్తాను ... ఇలాంటివి చేస్తున్నారనిపిస్తోంది.. లేక పోతే మీరు ఏదైనా కాలెండర్ లొ నోట్ చేస్కుంటున్నారా ?... ఇంత చేయాలని ఉంటే... మొన్ననే ఇండియా పొయారు కదా.. అప్పుడెందుకు చేయలేదు... ఇప్పుడొచ్చి దిల్ రాజు సినిమా లా ఎందుకీ టార్చర్ ?

    ReplyDelete
  2. శరతన్నాయ్, ఈ బూట్లు చెప్పులూ నాకడం అనేది BDSM లో ఉంటుందా? ఇక్కడొకడు ఏదో వంకతో బ్లాగర్ల బూట్లె నాకేత్తానని ఓ.. గోలెట్టత్తన్నాడు. వీలైతే ఆడికి ఇవరాలు చెప్పి సాయం చెయ్యన్నాయ్ ప్లీజ్. మా చెప్పుల్నీ, బూట్లనీ ఆణ్ణించి రచ్చించు.

    ReplyDelete
  3. @ కాయ
    :)
    ఇండియాకి వెళ్ళినప్పుడు చెయ్యాల్సిన పనులు లిస్టులో ఎన్నో వుంటాయి. మళ్ళీ వాటికి ప్రాధాన్యతలు కూడా వుంటయ్ కదా. ఓ నాలుగేళ్ళ తరువాత గత ఏడాది వెళ్ళి వారం మాత్రమే వున్నాను. ఊపిరి సలుపని పనులు. కొన్ని పనులు కుదిరాయి. కొన్ని కుదర్లేదు. కుదరని వాటిలో ఇవి కూడా వున్నాయి. ఈసారి వెళ్ళినప్పుడయినా ప్రయత్నించాలి.

    @ బడ్డీ
    కాదేదీ కవిత కనర్హం లాగా అందులోకి రానిదంటూ ఏవీ వుండదు. ఇంతకూ ఎవరు, ఎక్కడ, ఎందుకు బూట్లు నాకుతానంటున్నారో చెప్పారు కాదు. సంకలినులల్లో కామెంట్లు చూడక, చాలా ఇతర బ్లాగులు చూడక కొంత కాలం అవుతోంది. అందుకే అన్ని విషయాలూ, పూర్తి విషయాలూ తెలియడం లేదు.

    ReplyDelete
  4. బడ్డీ గారూ, శరత్ గారూ,

    >>"ఇంతకూ ఎవరు, ఎక్కడ, ఎందుకు బూట్లు నాకుతానంటున్నారో చెప్పారు కాదు."

    మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మాటర్ చెప్పండి బాబూ, మాకు ఇక్కడ క్యూరియాసిటీ పెరిగిపోతుంది :D

    Where? Who?

    ReplyDelete