ఇది విమాన విహారం - అది ఎర్రబస్సు ప్రయాణం

ఈ దేశాల్లోకి వచ్చేక కాలం చాలా వేగంగా పయనిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటారూ? చూస్తుండగానే వారాంతం వచ్చేస్తుంది. అంతలోకే పని వారం వస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే సైకిల్. వేగంగా తరుముకుంటూ వారాలకు వారాలు అలా దొర్లిపోతూనే వుంటయ్. వెనక్కి తిరిగి చూస్తే ఇన్నాళ్ళల్లో మనం సాధించినదేమీ పెద్దగా కనపడదు - మనం పోగుట్టుకున్న వయసు తప్ప. మంచి ఉద్యోగం వుంటే చాలు మిగతా పనులు పెద్దగా ఇబ్బంది కలిగించవు. రోజువారి పనులన్నీ యాంత్రికంగా దాదాపుగా ఠంచనుగా సాగిపోతుంటాయి. అందుకే ఈ దేశాలలోని జీవితం విమాన ప్రయాణం లాంటిది అంటాను. విమానం ఎక్కాక ఇహ మనం చెయ్యడానికి పెద్దగా ఏమీ వుండదు - తినడం, పడుకోవడం తప్పించి. బయటి అందాలన్నీ అద్దాల్లోంచి చూడాల్సిందే కానీ అద్దం ఎత్తలేము, బయటి వాతావరణాన్ని ఆహ్లాదించలేము (ఆహ్లాదం కలిగించలేదు అని అర్ధం). ఎసి గట్రా వుంటాయి కాబట్టి మనకు చలి, వేడి పుట్టడం తక్కువే. చూస్తుండగానే మన సుదూర గమ్యాలని సులభంగా, వేగంగా చేరుతాము. చేరాల్సిన గమ్యం వచ్చేసిందని దిగిపోతాము. ప్రయాణంలో గుర్తుంచుకోవడనికి అంటూ పెద్దగేమీ వుండదు - తొలి ప్రయాణాలు చేసిన వారికి తప్ప.

ఈ దేశాల్లో జీవితమూ అంతే. ఎసి గట్రాలు వుంటాయి కాబట్టి కిటికీలు తెరవము. వాన పడుతున్నా, గాలి జోరుగా వీస్తున్న అద్దాల లోనుండి చూస్తూ వుంటాం కానీ అనుభూతి చెందము. బయట ప్రకృతికి పరవశించలేము కానీ ఇంట్లో వీడియో పెత్టుకొని సినిమాలోని ప్రకృతి దృశ్యాలను అభినందిస్తుంటాం. అలా అలా రోజులు యాంత్రికంగా దొర్లుతూనే వుంటాయి. వారాలూ, వారాంతాలూ అలా అలా గడిపేస్తూ వుంటాము. అలా ఎలా ఎన్నడో ఒకనాడు మనం మన జీవిత గమ్యం చేరుకుంటాము - వేగంగా, సులభంగా. వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా వైవిధ్యం ఏమీ వుండదు - కూడబెట్టిన డబ్బులు తప్ప.    

ఇండియాలో ఇప్పటి జీవితాలు ఎలా వుంటున్నాయో తెలియదు కానీ మా అప్పుడు అయితే ఎర్రబస్సు ప్రయాణాల్లాగా వుండేవి. సమస్యలూ వుండేవి, సంతోషాలూ వుండేవి. ఏదీ అనుకున్న విధంగా, సరి అయిన సమయానికి జరగవు కాబట్టి వైవిధ్యం వుండేది. ఏ రోడ్డు మీదనన్నా ప్రయాణించినా గతుకులు, గతుకులు గా వుండి థ్రిల్లింగుగా వుండేది. ఇక్కడ అన్నీ మంచి రోడ్లే కాబట్టి గతుకుల రోడ్డు పొరపాటున కనపడిందంటే ఆ గతుకుల మీద నుండే కారు పోనివ్వమని పిల్లలు సబరపడుతూ కోరుతుంటారు. అలాంటి చిన్న చిన్న సంతోషాలకూ స్థానం లేకుండా పోయిందిక్కడ.  ఎండాకాలం వస్తే ఎంచక్కా  మిద్దె మీద అందరం కబుర్లు చెప్పుకుంటూ, నక్షత్రాలనూ అవలోకిస్తూ చందమామతో ఊసులాడేవారం. ఇక్కడ ఇళ్ళకి ఎసిలు తప్ప డాబాలే వుండవాయే. నగరపు ధూళి మధ్య మరుగున పడి మిణుక్కు మిణుక్కు మంటున్న నక్షత్రాలను చూసేంత ఓపిక, తీరిక మనకెక్కడిది - అవతల మొగిలిరేకులకు సమయం అవడం లేదూ?     

ఇండియాలో జీవితం ఎర్రబస్సు ప్రయాణం లాగా మనకు ఇష్టం వచ్చినప్పుడు బస్సు కిటికీలు తెరచి ఝామ్మున కొడుతున్న వర్షపు నీటిని తాకేలా వుంటుంది. బస్సు పక్కగా వీస్తూ వెళుతున్న పిల్ల తెమ్మెరలకు ఎంచక్కా హాయ్ చెబుతూ వెళ్ళొచ్చు. చలి పెట్టినప్పుడు ముణగదీసుకొని పడుకోవచ్చు, ఎండవేడికి అపసోపాలు పడొచ్చు. సమయానికి బసు రాకపోవచ్చు, వచ్చిన బస్సు ఎప్పుడు గమ్యాన్ని చేరుతుందో మనకు తెలియకపోవచ్చు కానీ అందులో జీవిస్తూ వెళ్ళవచ్చు. ఎర్రబస్సుల్లో ( ఎసి బస్సుల్లో అని కాదు) మనం వెళతాము, ఎసి బస్సులూ, విమానాలూ మనల్ని తీసుకువెళతాయి. ఎలాంటి జీవితం మనకి కావాలేంటి? ఎసి బస్సులో కూర్చొన్నాక ఓ సినిమా వేస్తే మనకు ఇంకా ఇలాంటి మీమాంసలు కూడా కలుగుతాయా? గమ్యం వచ్చాక చూసుకుంటే చూసిన సినిమా గుర్తుకువుంటుంది కానీ చేసిన ప్రయాణం గుర్తుకు వుండేదేమయినా వుందా?    

విషయం ఏమిటంటే ఇండియా కూడా ఈమధ్య బాగా అభివృద్ధి సాధిస్తోంది. అక్కడి జీవితం కూడా విమాన ప్రయాణం లాగే అయ్యేలా వుంది.  ఈ పరిణామ క్రమంలో మనం మిస్సయ్యేది మన జీవితాలని - పొందేది మాత్రం యాంత్రిక జీవనాలని. అందరి జీవితాలూ అవే అయినప్పుడు ఇహ ఎవరయినా కోల్పోయేదేముంది అన్న విషయమే మనకు సాంత్వన కలిగిస్తుంది. ఇండియా - నీకిదే నా ఆహ్వానం.     

58 comments:

  1. Brilliant!
    One of your best. I hope you write more stuff like this.

    ReplyDelete
  2. తాజాకలం: మరోసారి టపా తీరిగ్గా చదివిన తరవాత, ఈ టపాలో మీ గొంతులో - అప్పుడప్పుడూ ఎన్నారై గొంతుల్లో ధ్వనించే సన్నటి నాస్టాల్జియా ధ్వనించిందేమో ననిపించింది. నాస్టాల్జియాతో గొదవేంటంటే జ్ఞాపకాలకి గులాబీ అత్తరు పులుముతుంది. భారత్‌లో ప్రస్తుత జీవన పరిస్థితులు మీ టపాలో చెప్పినట్టుగా ఉన్నాయా అనేది నాస్టాల్జియాకి అతీతంగా బేరీజు వేసుకోవాలి.

    ReplyDelete
  3. This is so true. Life is mechanical here. Wait for weekends on weekdays, wait for weekdays on weekends. Nothing more than it.

    ReplyDelete
  4. @ కొత్తపాళీ
    బహుళ ధన్యవాదాలు. ఇండియాలో కూడా పరిస్థితులు యాంత్రికంగా మారుతున్నాయన్న నిరాశను చివరి పేరలో తెలియజేసాను.

    @కికెట్ లవర్
    మీరు నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు సంతోషం.

    విమానం ఎక్కని వారు విమానం ఎక్కడం ఎంత గొప్ప అనుభూతో అనుకుంటారు. అది నిజమే, మొదటి కొన్ని సార్లు అది చక్కటి అనుభవాన్ని కలగజేస్తుంది. కానీ ఆ ప్రయాణమే మన జీవనం అయినప్పుడు? మసాలా లేని మాసం కూరను ప్రతి రోజూ తిన్నట్టుగా వుంటుంది.

    ReplyDelete
  5. I am a silent reader of your blog. Excellent article from you.

    ReplyDelete
  6. this is one of your best post...
    i am think same way i impressed lot how you compare with fight and bus.

    keep it up..

    ReplyDelete
  7. so true, there nothing to cherish here.

    atleast in india we are bound to attend some functions, so travelling to new areas, meeting new people, getting thru different circumstances; sometimes exciting, sometimes irritating and mostly fun but will have something to cherish.

    here all we share is walmart has this offer and staples has that offer.

    ReplyDelete
  8. మరి సామాన్ ఎప్పుడు సర్దుతున్నారు గురువు గారు... ఇక్కడైతే ఉన్నదానికీ లేని దానికీ టపాలు వేస్తుంటారు.. అక్కడైతే హాయిగా అనుభవించటానికే టైం సరిపోదేమో..

    ReplyDelete
  9. @ అజ్ఞాతలు
    మీ అందరికీ ఈ టపా ంచాడం నాకు సంతోషాన్ని కలగజెసింది.

    @ రాజ్
    మీరన్నవన్నీ నిజమేనండి. ఎక్కువ ఉదాహరణలు నేను ఇవ్వలేకపోయానే అనుకున్నాను కానీ ఆ కొరత మీరు తీర్చేసారు.

    @ కాయ
    మా ఇంట్లో నేను మైనారిటీ బాబూ. మా పిల్లలు ఇక్కడె (పుట్టి) పెరిగారు కాబట్టి వారికి ఇక్కడే ఇష్టం. వారి బాల్య స్మృతులు ఇక్కడివే కాబట్టి వారు ఇక్కడ వుండటాన్నే ఇష్టపడుతున్నారు. వారికి ఇండియా దర్శించడం వరకు వోకె కానీ అక్కడే వుండటం అసౌకర్యంగానే వుంటుందంటారు.

    ఇహ మా ఆవిడకి ఇక్కడే ఇష్టం. అలా ఎందుకో మా ఆవిడ దృక్కోణంలో నుండి ఓ టపా వ్రాస్తా ఎప్పుడయినా. మా ఆవిడ కోసం కాకపోయినా పిల్లల కోసం ఇక్కడ చిక్కుబడిపొయా. ఇండియాలో వుండటానికి వెళ్ళినా సరే మా అవిడ నన్ను పల్లెటూర్లలో వుండనివ్వదు. సాఫ్టువేరు జాబులేమో సిటీల్లోనే వుంటాయాయె. అక్కడ సిటీల్లో వుండటం కన్నా ఇక్కడ వుండటమే బెటర్. రిటైర్మెంటులో కెనడా పెన్షన్లు గట్రా ఎక్కడ వున్నా వచ్చేస్తాయి గనుక ఇండియాలో ఓ నది పక్కన ఎక్కడయినా ఆశ్రమంలాంటిది కట్టుకొని బోధలు చేస్తూ ప్రశాంతంగా బ్రతకాలని వుంది.

    ReplyDelete
  10. One of your best posts. Keep it up. I agree wirh Raj Potluri.

    ReplyDelete
  11. ఇండియా ఇంకా చాలా వరకు అలానే ఉంది అండి, మేము ఈ మధ్యనే ఇండియా కు move అయ్యాము. అక్కడ ఉన్నప్పుడు జీవితం ఎంత బోరింగ్ గ ఉండేదో ఇక్కడికి వచ్చాక
    తెలుస్తుంది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న కష్టాలు పనులు జరిగే విషయం లో ఉన్నాయి , అందువల్ల జీవితం ఎప్పుడు సందడి గానే ఉంటుంది :-).
    ఇక్కడ పెళ్ళిళ్ళు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళడం అక్కడ పట్టుచీరెలు, పెళ్లి పందిర్లు , పెళ్లి భోజనాలు, మన బంధుజనం తో ముచ్చట్లు అక్కడ ఎన్ని డాలర్స్ పెట్టి కొనగలరు అండి.
    ఎప్పుడు కావాలంటే అప్పుడు మన వాళ్ళను కలవొచ్చు. ఏదో మనకోసం ఎప్పుడు ఎవరో ఒకరు ఉన్నారని భరోసా.
    ఇండియా లో ఎన్ని మంచి సందర్శన స్థలాలు ఉన్నాయి .. అమెరికా లో కూడా ఉన్నాయి కానీ నాకు అమెరికా లో ఏ మూలకు వెళ్ళినా ఒకటే లాగే ఉండేది. పైగా ఇంక లాంగ్ ట్రిప్స్ కేల్లమా ఇంకా ఫుడ్ సంగతి అంతే , ఆ burgers , పిజ్జాస్ తినలేక చావాలి. అదే ఇండియా లో ఏ మూలకు వెళ్ళిన ఇంకా ఫుడ్ కొత్త కొత్త రుచులు ఉంటాయి గాని మనకు విసుగు రాదు.
    ఇప్పుడు అసలే summer స్టార్ట్ అవుతుంది మల్లె వాసనలు , మామిడి పండ్ల రుచులు , తాటి ముంజెలు ,చింత చిగురు , ఎండలో తిరిగి వచ్చి ఇంటికి రాగానే సేద తీరి చల్లగా మంచి నీళ్ళు తాగడం లో ఉన్న సుఖం అక్కడ దొరుకుతుంది అంటారా ..
    ఇంకొక advantage ఇక్కడ ఎంచక్కా పని మనిషి , వంట మనిషిని పెట్టుకొనే luxury ఉంది.

    ReplyDelete
  12. అసలు ఇండియా లో మనకు, మనకన్నా పది ఏళ్ల చిన్నవయసు వారికే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది అప్పట్లో..., వేసవి సెలవలు అంటే మనకు పొలాల(చేల) గట్ల మీద, మామిడి తోటల్లో, చెట్ల మీద పుట్ల మీద గంతులెయ్యడం... వగైరాలు. పి.వి., మన్మోహన్ ల సరళీకరణ ఆర్ధికవిధానాలు, కంప్యూటర్ కోర్సులు వగైరాలు మనపై కూడా ప్రభావం చూపినా, అప్పటికే మన బాల్యం ఆ రకం గా గడచిపోయింది. ఇప్పటి తరం సంగతి తరువాత..., మన కన్నా జస్ట్ పది ఏళ్ల చిన్నవారు కూడా ఆ విధమైన బాల్యం కు దూరమయ్యారు.

    కానీ మీరు చెప్పిన లైఫ్ స్టైల్ లో బతికేవాళ్ళు ఇండియా లో కూడా ఉన్నారు. కానీ ఒక విధంగా, గోదావరి జిల్లా లో చిన్న పట్టణాలకు దగ్గరలో, పెద్ద గ్రామాలలో ఉండే మాలాంటి వాళ్ళు, సిటీ కు వచ్చి మీ లైఫ్ స్టైల్ రుచీ... చూస్తాం, ఇప్పటికీ ఎర్ర బస్సూ, రేడియో కూడా ఎరుగని ఏజన్సీ పల్లెలకూ వెళ్తాం. మా పిల్లలకూ ఈ రెండు లైఫ్ స్టైల్సూ చూపిస్తాం. ఆ విధం గా వారికి జీవన వైవిధ్యం పై అవగాహన కలిగేలా చేస్తాం. సరే, శరత్ గారూ, మమ్మల్ని చూసి అసూయ పడకండే...,

    ReplyDelete
  13. @ సాహితి
    మీరు చెప్పినవన్నీ కరెక్టేనండీ - ఊరించేస్తున్నారు. అయినా సరే మా ఆవిడకి మాత్రం ఇక్కడే ఇష్టం. ఆమె కోణం త్వరలో వ్రాస్తా. మొత్తానికి ఇండియా వెళ్ళివుంటున్నారన్నమాట. సంతోషం.

    పనిమనుషుల లగ్జరీ. నేనెలా మరచిపొగల్ను లెండి.

    అనగనగా ఓ బ్లాగు - మీ బ్లాగు పేరు భలే బావుంది - మీ పేరుకి మల్లే.

    ReplyDelete
  14. @ మిర్చిబజ్జీ
    మీరలా నన్ను ఉడికించేస్తే ఈసారి ఇండియా వచ్చినప్పుడు మా పిల్లల్ని వెంటేసుకొని మీ ఊరికి/ఇంటికి వచ్చి తిష్ఠ వెయ్యగలం జాగ్రత్త. మనం ఏ మారుమూల ఊర్లో వున్నా ఈ ఇడియట్ బాక్సులు వున్నాయి చూడండీ - అవి గనుక వుంటే అవే సగం జీవితాన్ని నిర్వీర్యం చేస్తుంటాయి.

    మా ఆవిడ పిల్లలతో ఇండియా వెళ్ళినప్పుడల్లా కనీసం ఓ మూడు రోజులయినా మా అత్తగారి ఊర్లో గడిపి పిల్లలని ఆ పల్లెటూరి వాతావరణంలో గడపనివ్వమని మరీ మరీ చెబుతుంటాను. నా మాట మరీ తీసివేయలేక ఓ పూట మాత్రం వెళ్ళివస్తుంటుంది.

    ReplyDelete
  15. very good analogy of Airbus&errabus to compare US&India.
    You have drafted most of the fellow Indians thoughts.
    What you said is so true.

    Surabhi

    ReplyDelete
  16. ur posts are really soothing for those who are missing the different life like u.. :)

    ReplyDelete
  17. @ సురభి
    మీ ప్రశంసకి ధన్యవాదాలు.

    @ వేణు...
    మనతో పాటు మన పక్కోడూ పొగొట్టుకున్నాడంటే కలిగే సాంత్వన లాంటిదే అదీ :) మనకొక్కళ్లకే లాస్ అయితే బాధగా వుంటుంది కానీ అందరికీ అదే బాధ అయితే ఇహ మనకు బాధేముంటుంది కదా.

    ReplyDelete
  18. మన మిగులు ధనం శాతం ని చూస్తే. ఇండియా లో మనం జీతంలో ఎక్కువ శాతం మిగల్చవచ్చు. అలా ఆలోచించే వాళ్ళు వ్యాపారులు. ఎంత శాతం లాభం వచ్చింది అని చూస్తారు కాని, ఎంత ధనం మొత్తం వచ్చింది అని చూడరు.

    కాని మనకు ఆ 50 రూపాయలు ఒక డాలరు అన్న లెక్క బుర్రలో ఉన్నంత వరకు మనం ఎప్పుడు, విమానాలలో, రాకెట్ లలో వయసును తగలేస్తూనే ఉంటాము. ఎర్ర బస్సులో నెమ్మదిగా వయసుని ఖర్చు పెట్టటం మనకు తెలిదు.

    ఎవడో పల్లెటూరి మిత్రుడిని కెలికితే, మనమేదో తెగ పోదిచేస్తున్నాం జీవితాన్ని, వాడు ఆ కుగ్రామం లో జీవతం వేస్ట్ చేస్తున్న అని చెపుతాడు. వాడికి తెలిస్తీ కదా మన సంగతి.

    ReplyDelete
  19. మంచి పోస్ట్ అండి...మీ మాటల్లో,నా ఆలోచనలు కూడా కొన్ని కనిపించాయ్. మాస్టర్స్ కి నార్వే వచ్చాను,అయిపాయింది, ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నాను..ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నా అండి..నాది కాని దేశం లో...నా అనే వాళ్లకు దూరంగా, ఏంచేసినా ఏం ప్రయోజనం అనిపిస్తుంది...మళ్ళా అప్పుడే అలా ఏం కాదులే..కాస్త సంపాదించుకొని వెళ్దాం అనిపిస్తుంది..ఏంటో కాస్త సందిగ్ధావస్తలో కొట్టుమిట్టాడుతున్నా..

    ReplyDelete
  20. మీ "ఇది విమాన విహారం - అది ఎర్రబస్సు ప్రయాణం" పోస్ట్‌పై పతోడు క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

    Post బాగుంది.

    [Edited]

    ReplyDelete
  21. @ సాధారణ పౌరుడు
    నిజమే. పల్లెటూరి వారు అలా అనుకోవచ్చు. అయితే చాలా కాలం పల్లెలో బ్రతికి కొన్నేళ్ళ నుండి పట్నవాసం చేస్తున్న ఓ బావని అడిగాను - ఎక్కడ బావుందని? పల్లెల్లో కక్షలూ, కార్పణ్యాలూ, కంపేరిజన్లూ ఎక్కువనీ అదే పట్నంలో అయితే ఒకడిని మరొకడు పట్టించుకోడనీ, అందుకే సిటీలోనే హాయిగా వుందని మరో కోణం చెప్పుకువచ్చారు.

    @ ప్రబంధ్
    ఇప్పుడే బాగా ఆలోచించుకోండి మరి :) మీకు పెళ్ళయాక మీరు ఇహ ఆలోచించుకోవడానికి ఏమీ వుండదు - అంతా ఆచరించడమే అప్పుడిక. మీకే కాకుండా మీ పిల్లలకి ఎక్కడ సౌకర్యవంతంగా వుంటుందో కూడా ఆలోచించండి. నా పిల్లలని ఇక్కడ పెంచడానికే ఇష్టపడతాను ఎందుకంటే జీవన ప్రమాణాలు ఇక్కడ బావుంటాయి. ఇండియాలోని సిటీల్లో మన వాళ్ళని పెంచడం కంటే ఇక్కడే బెటర్. అదే కాకుండా మరి కొన్ని కారణాలు కూడా వున్నాయి. అలాగే పిల్లలని ఇండియాలోనే పెంచితేనే బెటర్ అనేవారూ వుంటారు కాని నేను ఏకీభవించను.

    ReplyDelete
  22. @ పతోడు
    ధన్యవాదాలు. టపాకి సంబంధించని వ్యాఖ్యలు ఈమధ్య ప్రచురించడం లేదు.

    ReplyDelete
  23. పతోడుంApril 13, 2011 at 2:59 PM

    భలే ఉంది అన్నా యవ్వారం. అక్కడెవడో పౌరుడు అంటే ప్రచురిస్తావు, పతోడు అంటే ప్రచురించవు.
    లంగోటా ఉన్నచోత డాయర్‌ ఉండదా?
    మలం ఉన్నచోట ఒంటేలుండదా?
    పౌరుడున్నప్పుడు పతోడుండడా?

    ఖండిత్తన్నా అదెచ్చా

    ReplyDelete
  24. @ పతోడు
    హ హ. పౌరుడు అయినా పతోడు అయినా, ఎవరయినా సరే టపాకి సంబంధించి వ్రాసినవే ప్రచురించదలచుకున్నాను. అసలు నేను ఇతర బ్లాగుల కామెంట్లు చూసి కూడా చాలా రోజులు అవుతోంది - కొన్ని నాకు ఇష్టమయిన బ్లాగుల్లో తప్ప. అసలు అగ్రిగేటర్లలో కామెంట్ల సెక్షనే చూడటం మానివేసా. ప్రాణానికి హాయిగా వుందిప్పుడు.

    ReplyDelete
  25. అంత కష్టం ఏమొచ్చిపడింది శరత్‌ గారూ మీకు? అంత మనస్థాపం ఎందుకొచ్చిందో తెలియజెప్తారా కొంచెం?

    ReplyDelete
  26. ఇప్పటికైనా ఒక విషయం గమనించ ప్రార్ధన
    కొంత మంది మెప్పు కోసం జట్టుకట్టి అవసరంలేని వాళ్ళని విమర్శిస్తే, మీ అవసరం తీరిపోయాక వాళ్ళని మెప్పించడానికి మిమ్మల్ని తిట్టే కొత్తమొఖాలు తయారౌతాయ్‌. మీరు జట్టు కట్టిన సభ్యులందరూ మీ మీదే దాడి చేస్తారు

    ReplyDelete
  27. @ అజ్ఞాత
    నాకు వచ్చింది మనస్థాపం కాదండీ - మార్పు! ఈ మార్పుకి పెద్దగా కారణాలు ఏవీ లేవు. చాలా వరకు ఇతరుల వ్యాఖ్యలు కానీ, టపాలు కానీ పాడిందే పాటరా పాసుపళ్ళ దాసరీ అన్నట్లుగా కొత్తదనం లేకుండా కామన్ గా వుంటున్నాయి. అందుకే లైట్ తీసుకుంటున్నాను.

    @ అజ్ఞాత
    ఎవరో తిట్టారు అని కాదండీ. తిట్లు మనకు కొత్తా ఎంటీ? లైట్. అప్పుడలా వుండాలనిపించింది - వున్నాను. ఇప్పుడిలా వుండాలనిపిస్తోంది - వుంటున్నాను. రేపు? ఎవరికి తెలుసూ?

    ReplyDelete
  28. బాగా చెప్పారు శరత్‌ గారూ :) మీ సమాధానం నాకు నచ్చింది. ఈ పోస్ట్‌ కూడా చాలా బాగుంది, ఇంచుమించుగా సిటిల్లో ఉండే ఇండియన్ల పరిస్తితి కూడా ఇంతే ఉందనుకోండి.

    ReplyDelete
  29. @ అజ్ఞాత
    :)

    పల్లెటూర్లలో పుట్టి పట్నానికి వచ్చి బ్రతికేవారు కొంత బెటర్. వారికి రెండూ తెలుసు కాబట్టి రాజీ అయినా పడతారు లేదా తాము కోల్పోతున్న వాటిని ఎలాగోలా పూరించుకునే ప్రయత్నాలు చేస్తారు. సిటీల్లోని అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో పుట్టి పెరిగీ అదే ప్రపంచమనీ లేకపోతే అమెరికానే ప్రపంచమనీ వేరే ప్రపంచం వుందని తెలియని, తెలుసుకోని, తెలుసుకోలేని అభాగ్యులుంటారు. వాళ్ళ మీదే నాకు జాలి.

    ReplyDelete
  30. india lo life same america lagane undi. akada kuda weeks chala tondaraga ayipotayi. akada dust untadi, ikada dust undadu. konchem facillities ekkuva anuko kani akkadi life, ikkadi life antha vimanam type , antha mechanical life. peddaga emi difference ledu. chinnappati rojullo unna india ipudu ledu, antha foreign culture india lo kuda. idavariki life kavali ante ika manam chinnapati rojulaki vellipovalsinde

    ReplyDelete
  31. USA లో నేను డిపెండెంట్ గా ఉండటం వల్ల,ఉద్యోగం టెన్షనూ వగైరాలు లేకపోవడం వల్లనేమో నేను ప్రకృతిని హాయిగా ఇక్కడికంటే (ఇక్కడ సిటీలో ప్రకృతి ఎక్కడుంటుందసలు) ఎంజాయ్ చేశాను. నైబర్ హుడ్ లో చెట్ల మధ్య, నడుస్తూ,లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినపుడు ఎక్కడ కావాలంటే అక్కడాగి ఫొటోలు తీసుకుంటూ బతికేశా హాయిగా!

    ఇక పోతే ఇప్పుడు ఇండియా కూడా పెద్ద తేడాగా ఏమీ లేదు. చూస్తుండగానే వారాంతం వస్తుంది. హమ్మయ్య అనుకునే లోపుగానే పని వారం! అక్కడ ఇక్కడ అనే కాదు, అన్ని చోట్లా ఇలాగే ఉంది. కాస్త పల్లెల్లో ఏమైనా తేడా ఉందేమో గానీ!ఈ స్థితి ప్రదేశాన్ని బట్టి కాక జీవితంలో మన ప్రాధాన్యాలను బట్టి కూడా ఏరప్డుతుందేమో! పైగా దూరపు కొండలు నునుపు కూడా కదా!


    ఇదివరలో మెడికల్ సర్వీసుల విషయంలో నేను ఇండియా బెస్ట్ అనుకునే దాన్ని! ప్రాణం మీదికొచ్చినా అపాయింట్ మెంట్ లేకుండా వెళ్ళలేకపోవడం, ఎమర్జెన్సీకి వెళితే జీవితంలో కోలుకోలేనంతగా ఆర్థికంగా దెబ్బ తినడం ఇలాంటివి అక్కడ చూసి! కానీ పరిస్థ్తి ఇక్కడ కూడా అదేవిధంగా ఉంది దాదాపుగా! అనవసరమని తెలిసినా డాక్టర్ చెప్పాడు కాబట్టి జ్వరానికి కూడా బోన్ మారో,సీటీ స్కాన్ టెస్టులు చేయించుకోవలసి రావడం....ఎమర్జెన్సీకి వెళితే జేబులు గంటలో ఖాళీ కావడం.....దీన్నేమంటారో మరి....గ్లోబలైజేషనా?


    జీవితం ఎటు లాక్కుపోతే అటు చచ్చిన శవం (?)లాగా దాని వెనక పడి పోకుండా, జీవితాన్ని "బతకడం"కాకుండా "జీవించాలి" అనుకున్న వాళ్ళకు మొగలిరేకుల కంటే నక్షత్రాలే ముఖ్యం! లేదంటారా, వీక్ డేస్ మొగలి రేకులూ, వీకెండ్స్ SVM స్పోర్ట్స్ క్లబ్బూ, లేదా ఇనార్బిట్ మాలూ!

    ఇంకా మీ దేశంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే మన జీవితాల్లో ఇంకోడి జ్యోక్యం ప్రమేయం లేకపోవడం! ఇక్కడ అలా కాదు, చుట్టాలందరికీ మన ఇళ్ళలో ఏమి జరుగుతుందో, మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత వెనకేశాం, ఎంత బంగారం కొన్నాం....ఇలా ఆడిటర్ల స్థాయిలో మాట్లాడుకునే దరిద్రపు గొట్టు స్వేచ్ఛ ఉండటం, మనకు దాన్ని ఖండించే స్వేచ్ఛ లేకపోవడం!

    ఐనా నాకు ఇక్కడే ఇష్టం! :-)

    ReplyDelete
  32. ఎర్ర బస్సు , air bus ప్రయాణాలతో తేడా లేకుండా నోస్టాల్జియా అన్ని చోట్లా పెరుగుతూనే ఉంది....
    అసలిపుడు ఇండియాలో....ముఖ్యంగా....ఆంధ్రా లో ఎర్ర బస్సులు ఎవరెక్కుతున్నారు...అన్ని చోట్లా
    షేరింగ్ ఆటోలే....
    పోస్ట్ బావుంది....
    - మల్లీశ్వరి.

    ReplyDelete
  33. well,my cousin who has landed in US simply echoes same view or review.
    even the business opportunities in US are not exciting,as he says.
    India's GDP growth rate reflects raising middle class.

    ReplyDelete
  34. ఇప్పుడు ఇండియా లోనూ ఐర్ బస్ ప్రయాణాలే. పల్లెల్లోనూ మంచురియా లూ, నూడుల్స్ తినిపించటమే గొప్ప అనుకుంటున్నారు(రకరకాల ఇంటి వంటలు చూసీ చూసీ)తప్ప వెన్న ఆవకాయ తినిపించే రోజులు పోయాయండీ. సిటీస్ లో ఉద్యోగాలకి వెళ్ళాలి కనుక త్వరగా లేవాలి. పల్లెల్లో ఆ టెన్షన్ లేదు కనుక రాత్రి పొద్దు పోయెవరకూ సీరియల్స్ చూసీ పొద్దున్నే లేట్ గా లేవడం, ఇంకా వేకువనే చెయాల్సిన వాకింగ్ 8.30 కి నైటీ ల తో. ఇవి నేను చూసి చెప్తున్న సంగతులే. సరే కాలానుగుణం గా ఎన్నో మార్పులొస్తాయి తప్పదు కదా.

    ఇంతకీ శరత్బోధానంద గారు ఆశ్రమం ఎప్పుడు పెడుతున్నారు?

    శ్రీరాగ

    ReplyDelete
  35. :-) మనసులోతుల్లోంచి రాసిన టపా అనుకుంటా.. టచ్ చేసింది.

    ReplyDelete
  36. @ స్వప్న
    ఇండియా అభివృద్ధితో వచ్చే సైడ్ ఎఫెక్టులు అవన్నీ కానీ ఆ ఎఫెక్టులని పట్టించుకొని పరిష్కరించుకునే ఆసక్తి ఎవరికి వుందిలెండి. ఏదో మనలాంటివారం వాపోవడం తప్ప.

    @ సుజాత
    యుఎస్ లో ఎన్నాళ్ళున్నారు? కొంతకాలం వున్నా, కొంతకాలమే వుంటున్నామనుకున్నా బాగానే వుంటుంది లెండి. విమాన ప్రయణాలు కూడా అలాగే కదా. మొదట్లోనూ, అప్పుడప్పుడూనూ బాగానే వుంటాయి.

    చివరి పేరాలో మీరు చూపిన కోణమే మా ఆవిడది కూడానూ. అందుకే ఇక్కడే హాయిగా వుంటుందంటుంది. మా మేనల్లుడేమో ఇక్కడ (అలాంటి) ప్రశాంతత మరీ ఎక్కువయ్యి బోరుగా వుందనీ ఇండియా వెళతా అంటాడు :)

    ReplyDelete
  37. @ జాజిమల్లి
    నా బ్లాగులో మీరు వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి అనుకుంటా. ఆహ్వానం. షేరింగ్ ఆటోలలో ప్రయాణం కూడా నాకు బాగా నచ్చుతుంది.

    @ ప్రశాంత్
    మధ్యతరగతి పుంజుకోవడంతో పాటుగా వాళ్ళు/మనమూ మధ్యలో ఎన్నో వదిలేస్తున్నాంగా. ప్చ్.

    @ సిరి
    అవునండీ. టివిలు వచ్చేక (ఇప్పుడు ఇంటర్నెట్టూ గట్రానూ) మన బ్రతుకు మన బ్రతుకు కాకుండా పోయింది. మితంగా గా చూస్తే ఈ వైపరీత్యాలు వుండవేమో కానీ ఆ లిమిట్ ఎవరు నిర్వహిస్తారు/నిర్వచిస్తారూ?

    ముందు సినిమా హీరొయిన్లని శిష్యురాళ్ళుగా పక్కాగా చేసుకున్నాక మాత్రమే నా ఆశ్రమం మొదలవుతుంది :)

    ReplyDelete
  38. @ రమణి
    :)

    జీవితాలు ఇలా వుంటున్నాయని, వుంటాయని ఊహించే ఇలాంటి జీవిత చక్రాల క్రింద నలిగిపోకుండా నాదైన జీవితాన్ని ఎప్పుడో అవిష్కరించుకొని అందుకు అనుగుణంగా కొన్ని మెట్లు కూడా ఎక్కాను కానీ... మా మరదలు ఒకరు వచ్చి ప్రేమ రొంపిలోకి తద్వారా మిగతా అన్ని రొంపిల్లోకి దింపింది. నేను ఏం అనుకున్నాను, ఎలాంటి జీవితం జీవించాలనుకున్ననూ, ఎలా విఫలం చెందానూ, ఎలా గానుగెద్దు జీవితం లాగిస్తున్నానూ ఒక టపాగా త్వరలోనే తెలియజేస్తాను.

    మా పిల్లలు కూడా ఇలాంటి గానుగెద్దు జీవితం, కృత్రిమ జీవితం రొటీనుగా లాగించాల్సిందేనా, మరో మార్గం లేదా అన్న మీమాంస అప్పుడప్పుడూ కలుగుతూవుంటుంది. నా ఇంటరులో మా నాన్నని ఇదే ప్రశ్న వేసి నా మార్గం తెలియజేసినప్పుడు డిగ్రీ చేసాక నీ ఇష్టం అన్నారు. అలా డిగ్రీ చేసానో లేదో ఇలా మా మరదలు నన్ను తన ప్రేమతో పట్టేసింది, కట్టేసింది. ఇంకేం శరతూ, ఇదో ఇలా కంప్యూటరు ముందు కూర్చొని టిక్కుం టిక్కుం అంటూ కీబోర్డు కొట్టుకుంటూ గడిపేస్తున్నాడంతే - విశ్రాంత దినాల కోసం అవిశ్రాంతంగా ఎదురుచూస్తూ!

    ReplyDelete
  39. అప్పటికీ ఇప్పటి కీ తేడా మీరు మారిన ప్రదేశాల్లో అస్సలు లేదు. మీలో ఉ౦ది. మీరు అ౦టే మీ ఒక్కరు కాదు, ఇలా భావి౦చే వారిలొ.

    మీ లెక్క ప్రకార౦ అయితే ఈ దేశాల్లో ప్రజలు అ౦దరూ ఎప్పటి ను౦డో యా౦త్రిక౦గా బ్రతుకుతూ ఉ౦డి ఉ౦డాలి. కాని అది మీ భ్రమ. బ్రతకడ౦ తెలిసిన వానికి ని౦గి, నేల తేడా ఉ౦టు౦దా?

    ReplyDelete
  40. @ మౌళి
    ఇక్కడివారు గత తరంలోనే తమది మెకానికల్ లైఫ్ అనీ తమకు వున్నది మెకానికల్ వైఫ్ అనీ ఎప్పుడో మరచిపోయారులెండి. ఇప్పుడు వారికి అదే సహజత్వం అయిపోయింది. ఇలాంటి శుష్క జీవన విధానాల వల్లే వారిలో ఊబకాయం విపరీతంగా పెరుగుతోంది. మూడింట ఒకవంతులు మినిమం వుంది. నాకు ఆ లెక్కలు సరిగ్గా తెలీయదు కానీ దాదాపుగా మూడింట రెండు వంతులు వుండేవుంటుంది. వివేకం కలిగిన కొందరు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని చురుకయిన జీవన విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇండియా ఈ విధంగా కూడా అభివృద్ధి చెందుతోంది.

    జీవిత విధానంలో పొరపాటు ఏంటో తెలిస్తే సవరించుకోవచ్చు. తెలియకపోతే? తెలిసే అవకాశమే లేక అందరూ గొర్రె మందల్లాగా అదే జీవన విధానం అనుకుంటే? దాదాపుగా అదే పరిస్థితి ఇది. ఉదాహరణకు ఇప్పుడు నాకు తెలుసు. కానీ ఏం ప్రయోజనం? వరదలో పడి కొట్టుకుపోకుండా ఈ స్థితిలో ఎదురు ఈదగలనా? కాకపోతే అప్పుడప్పుడు ఏ చెట్టునో, గట్టునో పట్టుకొని సేద దీరగలగడం తప్ప.

    ReplyDelete
  41. మీకి కోసం ఇది పాట
    http://www.youtube.com/watch?v=kHeS330F7D8&feature=related

    ReplyDelete
  42. అబ్బే, నాకు మొదటి విమాన ప్రయాణం నుంచి ఇప్పటివరకూ చేసిన ఏ విమాన ప్రయాణమూ నచ్చలేదులెండి!

    I hate flight journeys. సమయం ఆదా తప్ప ఇంకే ప్లెజరూ కనపళ్ళేదు. కానీ మా ఆయనకి ఉద్యోగ రీత్యా సమయం చాలా ముఖ్యం! అందువల్ల విశాఖపట్నం వెళ్లాలన్నా గంటలో వెళ్ళొచ్చని ఫ్లైట్ కే బుక్కైపోతుంటాము! నాకేమో హాయిగా గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కి కబుర్లు చెప్పుకుంటూ రైలు ప్రయాణం ఎంజాయ్ చేయాలని ఉంటుంది.

    మీరన్నది కరెక్టే కావొచ్చు! USA లో మేము మూడేళ్ళు మాత్రమే ఉన్నాం! పైగా అప్పట్లో పిల్లా జెల్లా బాధ్యతలేవీ కూడా లేవు.

    కానీ నాకైతే అక్కడికీ ఇక్కడికీ పెద్ద తేడా ఏమీ అనిపించట్లేదండీ! రెండు చోట్లా గానుగెద్దు లైఫే! ముఖ్యంగా సిటీల్లో ! ఈ ఒరవడిలో పడకుండా ఉండటానికి మనం ప్రత్యేకమా జీవితాల్ని డిజైన్ చేసుకోవలసి వస్తోంది

    ReplyDelete
  43. మళ్ళీ మళ్ళీ అదే సైకిల్. ....
    ------
    పోస్ట్ మాత్రం సూపర్ బాస్.బావుంది మీ అవేదన. మాకు ఇక్కడ అలానెవుంది లెండి

    నేను దీన్ని ఖండిస్తున్నాను. సైకిల్ ఏంటి కావలం సైకల్ అను లేదా అచ్చ తెనుగులొ జీవన చక్రం అను. దీన్ని నీ ఆ పల్లి ఈ పల్లి కి చెప్పి నీకు బొత్తిగా తెలుజ్ణానం లెదని పోస్టెట్టిస్తా..

    ReplyDelete
  44. మీ పోలిక సరి కాదు. అలా అయితె మన ము౦దు తరానికి మనకు ఎన్నో తేడాలు.అది ప్రతి దెశ౦ లో ఉ౦డేదే.

    మార్పు మీలోనే ఉ౦ది. దానికి ఉదాహరణ, మీరు చెప్పిన పరిస్థితులు మన దేశ౦లో కూడా పట్టణాలే కాదు, పల్లెల్లో కూడా ఉన్నాయి.

    'ఆన౦ద౦గా గడపడానికీ కావాలొక టీ వీ ' మహిమ.

    ReplyDelete
  45. chaalaa baagaa chepparu sarath gaaru,bahusaa ekkadunna mana manasu chinni chiinni aanandaalaku spandinchatam alavaatuchesukunte edi ekkinaa edo okati andamaina anubhavame avuthundemo?

    ReplyDelete
  46. చాలా బాగా రాశారు శరత్..

    ReplyDelete
  47. @ శ్రీకాంత్
    చక్కని పాటనిచ్చారు. సంతోషం. ఆ సినిమా చూడలేదు. చూడాలయితే.

    @ సుజాత
    నాకయితే అప్పుడప్పుడు చేసే విమాన ప్రయాణాలు అంటే ఇష్టమే.

    @ శీను
    :)

    సైకిల్ అనకూడదా! మోటు అయిపోయిందా అదీ!

    ReplyDelete
  48. @ అజ్ఞాత
    మనకు నచ్చిన కూరని తినలేకపోయినా మనకు నచ్చిన మసాలా అయినా చల్లుకొని గడిపివేయాలంటారు. ఇష్టం వున్న వారు కష్టమయినా ప్రయత్నిస్తూనేవుంటారు లెండి. ఇలాంటి ఇష్టాలూ వున్నాయని, వుంటాయని తెలియని వారికి ఆ కష్టాలేవీ వుండవనుకుంటా :) కదూ.

    @ వేణు శ్రీకాంత్
    ధన్యవాదాలు. మీరింకా స్వయం ప్రకటిత బ్లాగు మారిటొరియం నుండి బయటకి వచ్చినట్లు లేరు?

    ReplyDelete
  49. సూపర్!! నాకు అమెరికా అలానే అనిపించేది. వచ్చిన కొత్తల్లో రెండు-మూడు టూర్లు వేశా. తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా, అవే రోడ్లు- అవే సిగ్నళ్ళు - అంతా ఒకేలా అనిపించి బోరు కొట్టేది.

    ఇపుడు ఇండియా వెనక్కి వచ్చేశాను. నా జీవితం నాకు తిరిగొచ్చేసింది.

    ReplyDelete
  50. @ జేబీ
    ఇండియాలో పుట్టిపెరిగి ఇక్కడికి వచ్చిన వారం పాత వాసనలను అంత సులభంగా వదలలేక సాధారణంగా ఇండియానే ఇష్టపడతాము. నా మటుకు నాకు ఇండియా జీవితం ఇష్టమే అయినా నా పిల్లలని మాత్రం ఇక్కడే పెంచడానికి ఇష్టపడుతాను. జీవన ప్రమాణాలు, రక్షణ ఇక్కడే బావుంటాయి. ఇండియాలో రక్షణ, సిటీలల్లో ప్రమాణాలు ఎంత ఘోరంగా వుంటాయో అందరికీ తెలిసిందే. ఉదాహరణకు సిటీలో ఓ బ్యుజీ రోడ్డు దాటడం అన్నది ఓ సాహసోపేత కృత్యం. ఆ లైఫ్ మా పిల్లలకు వద్దు బాబోయ్.

    ReplyDelete
  51. ఎ౦త ఆర్ద్ర౦గా చెప్పారా౦డీ మీ ఆలోచనలను. ఇప్పటివరకు అ౦దరి పోస్టులను చదవడమే
    కానీ ఎప్పుడూ కామె౦ట్ చెయ్యలేదు. ఈ రోజు ఇప్పటికిప్పుడు కొత్త ఖాతా తెరిచి మిమ్మల్ని
    అభిన౦దిస్తున్నాను. మీ లో ఇ౦టికి (ఇ౦డియా) కి దూరమయిన భావ౦ తెలుస్తో౦ది.
    ఇక్కడిప్పుడు రె౦డు రకాల అనుభవాలను పొ౦దొచ్చు. ఎక్స్ ప్రెస్ వే లున్నాయి, గ౦టకు ఐదు
    కి.మీ ల వాయువేగ౦ తో వెళ్ళగలిగే గతుకుల రోడ్లున్నాయి. విమానాలున్నాయి, ఆకుపచ్చగా
    మారిన ఎర్రబస్సులున్నాయి. సె౦ట్రలైజ్డ్ ఎ.సి భవనాలున్నయి, సూర్య చ౦ద్రులు కాపుర౦
    చేసే పాకలున్నాయి, పిజ్జాలు, బర్గర్లు, కె ఎఫ్ సి లున్నాయి. ఇడ్లీ సా౦బారు కేఫ్ లున్నాయి.
    ప్రస్తుతము ఎలావు౦ద౦టే మనము ఒక రాష్ట్ర౦ వేరే రాష్ట్రానికి వెళ్తు౦టే తెలుగు మాత్రమే మాట్లాడే వాళ్ళు,
    తర్వాత రె౦డు భాషలు కలిపి మాట్లాడే వాళ్ళు తర్వాత వేరే భాష మాత్రమే మాట్లాడ గలిగే
    వాళ్ళు వున్నట్టే బోర్డర్ లో వున్నా౦. త్వరలోనే మీ పిల్లలు కూడా వు౦డగలిగే...... ప్చ్.. రాష్ట్ర౦ వచ్చేస్తో౦ది.

    ReplyDelete
  52. మంచి టపా. ఆలోచింపజేసేదిగా ఉంది (ఎప్పట్లాగే):)

    >>ఎర్రబస్సుల్లో ( ఎసి బస్సుల్లో అని కాదు) మనం వెళతాము, ఎసి బస్సులూ, విమానాలూ మనల్ని తీసుకువెళతాయి. ఎలాంటి జీవితం మనకి కావాలేంటి?

    హ్మ్..ఎర్ర బస్సయినా, ఏసీ బస్సయినా.. అవి మనల్ని తీసికెళ్తున్నాయా మనం వాటిలో వెళ్తున్నామా అనేది ఆ బస్సులో ఉండదు. మనలోనూ మన ఆలోచనల్లోనూ ఉంటుందండీ.

    ఎలాంటి జీవితం మనకి కావాలి అనేదానితోపాటు మన జీవితాన్ని ఎలా జీవిస్తున్నాము అనేది ఆలోచిస్తే అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఏమంటారు?

    ReplyDelete
  53. Weekend Politiatian గారు కూడా

    నేను చెప్పినదే చెప్పారు :)

    ఎర్ర బస్సయినా, ఏసీ బస్సయినా.. అవి మనల్ని తీసికెళ్తున్నాయా మనం వాటిలో వెళ్తున్నామా అనేది ఆ బస్సులో ఉండదు. మనలోనూ మన ఆలోచనల్లోనూ ఉంటుందండీ.


    :))

    ReplyDelete
  54. @ మహాప్రసాదం
    :)
    అవునండీ ఇండియాలో వైవిధ్యం వుంది. ఆర్ధిక ఎదుగుదలతో పాటూ ప్రమాణాలూ మెరుగుపడితే ఇంకా సంకోచం ఏముంటుంది.

    @ వీకెండ్, మౌళి
    :)

    ఊహు. నేను మీ అంత ఊహాత్మకమయిన, ఆలోచనాత్మకమయిన మనిషిని కాదు. కళ్ళు తెరచి నేను ఎక్కడున్నదీ గమనిస్తుంటాను. పాజిటివ్ థింకింగ్తో పాటుగా ప్రాక్టికాలిటీ కోసం కూడా చూస్తుంటా.

    ReplyDelete
  55. శరత్,

    నేను మీటపాలో ఉన్న సందేశాన్ని అభినందిస్తూనే, ఆలోచనల్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళే వ్యాఖ్య రాశాననుకుంటున్నాను. Looks like I didn't do a good job of it :( in stead of facilitating thought my comment seemed to have inspired both you and Mouli to see what you want to see in that :))

    Btw, మనుషులు ఊహల్లోనూ, ఆలోచనల్లోనూ మాత్రమే జీవించొచ్చు అనే అపోహ నాకైతే లేదండీ.. :D

    ReplyDelete
  56. @అంత ఊహాత్మకమయిన

    నిజానికి ఊహాత్మకమయిన కాదు, మీ రియాలిటీ ని మీరే మార్చుకొ౦టూ వచ్చారు. అప్పుడు మీరు వదిలేస్తున్న వాటి విలువ, అవసర౦ గుర్తి౦చలేదు. ఇప్పుడు గుర్తిస్తున్నారు కాని, వెనక్కి వెళ్ళాలని లేదు.

    కాని అ౦దరూ ఇలా ఉ౦డట౦లేదు. అ౦దుబాటులో ఉ౦టున్నారు.కాబట్టి వారికి కావల్సినవి కూడా అ౦దుతున్నాయి.

    ReplyDelete