పైరేట్లు - అమెరికా విధానం - రష్యా విధానం

ఓ అయిదుగురు సోమాలియా సముద్ర దొంగలకి US లో ఈ రోజు నేర నిర్ధారణ చేసారు. వారిని యుఎస్ కి తీసుకువచ్చి జైల్లో వుంచి తీరిగ్గా విచారించి శిక్షించారు. మరి శిక్ష ఎంతకాలం వేస్తారో ఇంకా తెలియదు గానీ చాలాకాలం అయితే జైల్లో పెట్టి మేపుతారు.
http://news.blogs.cnn.com/2010/11/24/virginia-jury-convicts-somali-men-of-piracy/?hpt=T2

కొంతకాలం క్రితం కొంతమంది సోమాలియా పైరేట్లు రష్యా నావికా దళానికి దొరికారు. కానీ తమదేశ చట్టాల ప్రకారం వారిని శిక్షించలేమని వదిలిపెట్టి చేతులు దులుపుకున్నారు.
.
.
.
వాళ్ళు విడుదలై వెళుతుండగా ఎవరో ఆ పైరేట్లని కాల్చి చంపారు! ఖేల్ ఖతం.
http://www.thefirstpost.co.uk/63244,news-comment,news-politics,russian-navy-sent-somali-pirates-to-their-death-from-the-moscow-university
అలా కాల్చిచంపబడ్డ పైరేట్ల హక్కుల ఆత్మశాంతికి ప్రార్ధించాలనుకునే పౌరహక్కుల బ్లాగర్లు ఎవరయినా వుంటే నిక్షేపంగా ప్రార్ధించండి.

కొత్త ముఖ్యమంత్రిగా ఎవరయితే బావుంటుంది?

ఎవరవుతారు అన్నది మన 'చేతి'లోని విషయం కాదు కాబట్టి ఎవరయితే బావుంటుంది అనేది చూద్దాం. త్వరలోనే ఒక పోల్ పెడుతున్నాను. అందులో లేని పేర్లు తెలియజేయాలనుకుంటే వ్యాఖ్య ద్వారా చెప్పండి.

ఓ మతిస్థిమితం లేని మనిషి మీకెదురయితే...?

మీరు వీధిలో నడుస్తున్నారు. ఓ వ్యక్తి వచ్చి మీ తల మీద టెంకిజెల్ల ఇచ్చి వెళతాడు. ఏం చేస్తారేంటి మీరు? ముందు ఆగ్రహం వస్తుంది. వాడిని పట్టుకొని ఒక్కటి పీకాలనుకుంటారు. కానీ అతడు స్థిమితం లేని మనిషి అని అర్ధం అవుతుంది. ఏం చేస్తారప్పుడు? అప్పుడు కూడా అతడి నెత్తి మీద ఒఖ్ఖటి పీకుతారా? లేక అయ్యో పాపం అని జాలి పడివదిలేస్తారా?

యుద్ధమయినా, శత్రుత్వమయినా సమస్థాయివాడితో చేస్తేనే భ్యావ్యంగా వుంటుంది. ఎదుటివారికి స్థిమితం లేదేమోనన్న సందేహం వున్నప్పుడు బెనెఫిట్ ఆఫ్ డవుటుతో జాలిపడి వదిలేయడం ఉత్తమం అనిపించుకుంటుందనుకుంటాను. అలాంటి అనుమానం రానప్పుడు, ఎదుటి వ్యక్తి గురించి అయోమయపడ్డప్పుడు ఆ వ్యక్తి మీద పొరపాటుగా మనం తిరిగి దాడిచేసివుండవచ్చు. కానీ పదే పదే అవతలవ్యక్తి తన అస్థిమితాన్ని ప్రదర్శించినప్పుడు అవతలివారి మతి స్థితి మనకు తేలిగ్గా అర్ధం అవుతూనేవుంటుంది. అలాంటివారిమీద చేసే యుద్ధం అభాసుపాలు కావచ్చు.

నా చిన్నప్పుడు మా ఊరిలో ముస్తఫా అని బాగా చదువుకున్న, తెలివయిన(?) పిచ్చివాడు వుండేవాడు. మా నాన్నగారితో ఆవేశంగా ఏవేవో చర్చిస్తుండేవాడు. అతని సంగతి నాన్నగారికి బాగా తెలుసు కాబట్టి అతని వాదనలన్నీ ఓపికగా విని పంపించేస్తుండేవారు. అతను వెళ్ళాక అతని గురించి మాట్లాడుకుంటూ అందరం బాగా జాలిపడేవారం. అతను మా ఊరి బస్సు స్టాండు వద్ద పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే అందరూ ఆటపట్టిస్తుండేవారు. గేలిచేస్తుండేవారు. కొందరు రాళ్ళు తీసుకొని విసురుతుండేవారు. నాకు జాలిగా అనిపిస్తుండేది.

పర్ర్‌ఫెక్ట్ బ్లాగర్లు



















మన బ్లాగర్లలో దాదాపు అందరూ మిస్టర్ పర్‌ఫెక్టులే. ఎందుకంటే అందరికీ ఎదుటివాడిలోని, ఎదుటి వ్యవస్థలోని, ఎదుటి నాయకుడిలోని, ఎదుటి మేధావిలోని, ఎదుటి బ్లాగర్లోని లోపాలు మాత్రమే కనపడతాయి. తమలోని లోపాలు మాత్రం కనిపించవు, వినిపించవు, మాట్లాడవు. మూడు కోతుల వ్యవహారం అన్నమాట.

దేశం సర్వనాశనమయిపోతోందండీ, దానిని కాపాడాలి - మార్చాలి. కానీ మనం మాత్రం మారం.

రాజకీయనాయకులు వట్ఠి వెధవలండీ - మంచి వారు రావాలి. మనం మాత్రం మంచివారు అవ్వాల్సిన అవసరం లేదు.
ఫలానా రచయిత వెధవ్వండీ. మనం మాత్రం వెధవలం కాము, కాబోము.

కీ సీ ఆర్ లాంటి రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పాలి. మనకు మాత్రం బుద్ధి అక్కరలేదు. ఎందుకంటే మనం మిస్టర్ పర్ఫెక్ట్లం కాబట్టి.

పేపర్లు చెత్తగా వ్రాస్తున్నాయి - వాటిల్లో మార్పు రావాలి. మార్పు మనకక్కరలేదు. మనం మిస్టర్ క్లీన్.
ఫలానా వాడు తప్పుగా మాట్లాడాడు. మంచి భాష మాట్లాడాలి. మనం అన్నిటా ఒప్పే. మనం అన్నిటా పరిశుద్ధులం కాబట్టి.
సమాజం భ్రష్టు పట్టిందండీ. మార్పు రావాలి. కొత్త సమాజం రావాలి. ఆ మార్పు మనలో అక్కరలేదు. మనం మార్పుకి అతీతం.

సినిమాల్లో ఎక్కడ చూసినా బూతేనండీ. మార్పు రావాలి. మార్పు మనకక్కర లేదు. మనం మారం.

అమ్రికా వోడు విధానాలు మార్చుకోవాలండీ. బరాకుకు బుద్ధి లేదండీ. ఎకానమీ విధానాల్లో మార్పు రావాలి. మనకు మాత్రం మార్పు అనవసరం. మనం మారలేదు. మార్పు రాదు. మారబోము.

అందరిలో మార్పు రావాలి. సమాజం మెరుగవ్వాలి. అందరూ అన్నాతమ్ముల్లా కలిసిమెలసి వుండాలి. మనం మాత్రం బండరాయిలా వుండాలి.

ప్రతీవారూ ఎదుటి దాంట్లో మార్పును ఆశించడం, మంచితనాన్ని ఆశించడం, మెరుగుదలని వాంఛించడమే కానీ తమ దగ్గరికి వచ్చేసరికి మార్పు చెందితే, మంచిగా మారితే, మెరుగయితే... అహం దెబ్బతింటుంది. ఠాఠ్ మనలో మాత్రం మార్పు కుదరదంతే.

ఫలానా వాడికి కులగజ్జి వుంది. వాడు మారాలి. మనం మాత్రం మారం. ఏం పీకు తావో పీక్కో.

ఒక్కరనేం వుంది లెండి. అందరి అహం అంతే, అందరం అంతే. బ్లాగులు వ్రాసే ప్రతీ వాడూ మేధావే. మేధావి మారితే ఎలా? ఆ అందరిలో నేనూ వున్నా. కొన్ని నేనూ మారను, మారలేను, మారబోను. అదంతే.

మీ అందరికీ కాపీ & పేస్టు దీపావళి శుభాకాంక్షలు!

ఏదయినా పండగో, పబ్బమో, జాతీయ వేడుకో వచ్చినప్పుడు సంకలినులని చూస్తున్నప్పుడు చిరాకుగా అనిపిస్తుంది. అన్నీ శుభాకాంక్షల టపాలు, అన్నీ శుభాకాంక్షల వ్యాఖ్యలు. ఇలాంటి రొటీన్ గ్రీటింగ్స్ ఎవరిని ఆనందపరుస్తాయో నాకయితే అర్ధం కాదు. వీటిల్లో చాలావరకు కాపీ & పేస్టు గ్రీటింగులే వుంటాయి. వాటిల్లో ఓ వ్యక్తిగత అనుబంధమో, ఆప్యాయతానొ వుండవు. ఎంతమందికి గ్రీటింగ్స్ పేస్టు చేస్తే అంత ఆనందం కొందరికి లభిస్తుంది. ఇంత ఆనందం అవసరమా అని నాకనిపిస్తుంది.

తమకు నచ్చిన వారికో, మెచ్చిన వారికో ఈమెయిల్ ఇస్తే సరిపోయేదానికి బ్లాగుల్లో అందరూ ఇంతగా హడావిడి చెయ్యడం అవసరం అనుకోను. ఈ వేడుకల విశేషాలో, స్మృతులో, ముచ్చట్లో పంచుకోవడం బావుంటుంది కానీ ఇలాంటి పడికట్టు పదాల శుభాకాంక్షలు ఏం ప్రయోజనం కలిగిస్తున్నాయో ఒకసారి తరచి చూసుకుందామా?

ఏమయినప్పటికీ మీరూ మీ కుటుంబం ఎంచక్కా దీపావళి గడుపుకోవాలని, గడుపుకుంటున్నారనీ ఆశిస్తూ ఈ కాపీ, పేస్టు శుభాకాంక్షలని ముగిస్తాను మరి.

నేను స్త్రీవాదిని. ఆడవారికి అది లేదు కాబట్టి మొగవారికి అది కోసెయ్యాలీ!

సాధారణంగా స్త్రీ వాదులు స్త్రీల అభ్యున్నతికీ, ఆత్మాభిమానానికీ కృషిచేస్తుంటారు. వారిపట్ల, వారి కృషిపట్ల నాకు ఎనలేని గౌరవం వుంది. అయితే అప్పుడప్పుడు ఆ స్త్రీ పైత్యం ముదిరి విచిత్రమయిన, పనికిమాలిన వాదనలు తలకు ఎత్తుకొని ఇతరులకు, ముఖ్యంగా చాలామంది మగవారికి చిరాకు తెప్పిస్తుంటారు. అలాంటి వాదాలతో తమ శ్రమనూ, ఫోకసునూ వృధా చేస్తుంటారు. స్త్రీల సంక్షేమం కోసం మగవారి తోడ్పాటూ తీసుకునేబదులు కొండొకచొ మొగవారిని పలు రకాలుగా, పలు విధాలుగా ద్వేషిస్తూవుంటారు.

సుప్రీం కోర్టు జడ్జిలు కీప్ అన్న పదం ఔపయోగించారని స్త్రీవాదులు కొంతమంది గొడవ చేస్తున్నారు కదా. వారియొక్క ముఖ్యమయిన వాదన ఏంటంటే మొగవాళ్ళకి అలాంటి పేరు లేదు కదా, మరి ఆడవారికి ఆ పేరు ఎందుకట. పురుషులకు అలాంటి పేర్లు లేకపోతే సృష్టిద్దాం. కావాలంటే ఆ కృషికి నేనూ బోల్డు సహకరిస్తాను. అంతే గానీ మగపదాలు, ఆడపదాలు అని విడదీసి అవి రెండు లింగాల్లోనూ లెవ్వు కాబట్టి వాటిని బోడిలింగం చేసెయ్యాలనే వాదన ఎందుకో నాకు కొద్దిగా చిత్రంగా అనిపిస్తోంది. మరి మీకో?

అయ్బాబోయ్ ఈ స్త్రీవాద పైత్యం ముదిరితే ఇంకేమన్నా వుందా. మాకు లేదు కాబట్టి మీకు కోసెయ్యాలని కత్తిలాంటి వారినీ, కత్తులనూ పట్టుకొని మన పురుషుల వెంటబడరూ. వీరి దృష్టిలో ఆడ, మగ తేడాలుండకూడదు. దానికి ఒకటే సంపూర్ణ పరిష్కారం. శిశువు పుట్టగానే ఆ ప్రాతాన్ని పూడ్చేసో, కోసేసో ఆయా ప్రాంతాలని సమతలం చేస్తే ఓ పని అయిపోతుంది. అప్పుడు వేధింపులూ, రేపులూ గట్రా వుండవు. వుండేది ఏకలింగం, అదీ బోడ/బోడి లింగం కాబట్టి ఇహ స్త్రీ వాద సంఘాలు అప్పుడు తమ దుకాణాలని ఎత్తేసుకొని తృప్తిగా, ప్రశాంతంగా జీవించొచ్చు.

అంచేత నేను అనుకునేదేమంటే ఎంత స్త్రీవాదులయినా సరే సృష్టిలో జెండర్ తేడాలున్నాయి కాబట్టి వాస్తవిక దృక్పధంతో మెలగుతూ స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటే అందరి మన్ననా వుంటుంది. ఒంటెద్దుపోకడతో పోతే అభ్యున్నతి ఏమోగానీ అవహేళనలు గ్యారంటీ. దట్స్ ఆల్ యువరానర్.

బ్లాగోఛ్ఛాటన

ఈమధ్య ఇంటా బయటా నాకు పడనివాళ్ళు ఎక్కువయ్యారు. బయట బ్లా'గులో'ళ్ళ సంగతి చూద్దాం. ఈమధ్య శానా మంది టపాలు టపాటపా రాలుస్తున్నారు. వాళ్ళకు పోటీగా నేను మూడు నాలుగు టపాలు వేసినా నా టపాలు టార్చ్ లైటు వేసి వెతికితే తప్ప కనపడటం లేదు. అందుకే హారం, కూడలిలల్లో పిండి చల్లదలుచుకున్నాను. దానితో ఎక్కడ టపాలు అక్కడ పరార్. మాలికలో కూడా ఆ ఉఛ్ఛాటనా పిండి చల్లాలని వుంది కానీ వాళ్ళు చాలా సహజంగానే విదేశీ కుట్ర అనుకుంటారని ఆ వ్యూహం విరమించుకున్నాను. మన ప్రవీణ్ అగ్రిగేటర్లో చల్లుదామంటే ఇది పిండి నా లేక ఏదయినా బూతు పదార్ధమా అని ఆ పిండి యొక్క ప్రాశస్త్యాన్ని అనుమానిస్తాడేమోనని నా అనుమానమూనూ.

ప్రతి ఒక్క బ్లాగరూ తనొక ఏనుగు అనీ, మిగతా వారిలో కొందరయినా ఊరకుక్కలనీ అనుకుని (అల్ప)సంతోషపడుతుంటారు. అదే సంతోషం నాక్కూడానూ. ఈమధ్య ఊరకుక్కలెక్కువయ్యాయి. అందుకే వాటిమీద ఉఛ్ఛాటనా క్రియ ప్రయోగిస్తే అవన్నీ భౌ భౌ మని పారిపోయి ఏ అప్పి కాలునో, బొప్పి కాలునో పీకకపోతాయా అని నా చిన్ని చిన్ని ఆశ.

ఇహ బ్లాగుల్లో కెలుకుడు ఎక్కువయ్యైందని గోలపెట్టడం ఫ్యాషనయిపోయిందని గోలపెట్టడం ఫ్యాషనయిపోయింది కదా. అందుకే ఆ ఉఛ్ఛాటనా తంత్రం ప్రయోగించి బ్లాగులోకంలోని కెలుకుడంతా రూపు మాపి బ్లాగోస్ఫియరుకి మూలశంక పురుషుడిగానే కాకుండా మూలపురుషుడిగా అవతరించదలుచుకున్నాను. ఎలా వుందీ నా ప్లానూ?

ఇప్పుడు ఆ తంత్రాలు, మంత్రాలు అన్నీ అంత కఠొర దీక్షేలు చేసి నేర్చుకునేంత దృశ్యం నాకు లేదు కాబట్టి ఎవరయినా ఆ ఉఛ్ఛాటనా పిండి ఇండియా నుండి టన్నులకు టనూలకొద్దీ ఎక్స్పోర్ట్ చేస్తే కొద్దిగా బ్లాగుల్లో చల్లి మిగతాదంతా ఒబామాకమ్మేస్తా. అప్పుడు ఒబామా దానిని కొద్దిగా వైటు హౌజులో చల్లి మిగతాది తీసుకెళ్ళి  లాడెన్ను కుమ్మేస్తాడు. అప్పుడు గానీ నాయొక్క ఈ దేశ సేవలకు మెచ్చి నా మెడలో ఓ ప్రెసిడెన్షియల్ మెడల్ వేలాడేస్తారు. అన్నట్టు ఆ పిండి రాగానే మా ఊర్లో వున్న మొగాళ్ళందరి మీద ప్రయోగిస్తా. అప్పుడిక మనమే ఊరికొక్కడు.

అంచేతా ఎవరయినా ఇండియాలో ఆ పిండి ప్రొడ్యూసు చేసే కుటీరపరిశ్రమ మొదలుపెడితే బావుంటుందని నా సలహా. ఆలస్యం ఉఛ్ఛాటనా విషం. త్వరపడండి మరి. మీదే ఆలస్యం. మంచి తరుణం మించిన దొరకదు. శుభం భూయాత్.

తెలుగుబాట నుండి మరిన్ని జ్ఞాపకాలు

తెలుగు బాటలో 'భూమిక' సత్యవతిని గారిని కూడా కలిసాను. వారి ఫోటోలు చూసి వుండటం వల్ల తేలిగ్గానే గుర్తించాను. ఇద్దరం ఒక్క నిమిషం తప్ప ఎక్కువగా మాట్లాడుకునే తీరిక దొరకలేదు. సమయమే వుంటే పలు విషయాల మీద వారి స్త్రీవాద అభిప్రాయాలు తెలుసుకొనివుండేవాడిని.

Sujata గారిని కూడా కలిసాను. నేను వారిని చూసి వారు అనుకోలేదు. కొందరి రచనలు చదివినప్పుడు వారిమీద ఒకలాంటి  ఊహాదృశ్యం  ఏర్పడుతుంది.  Sujata గారి  రచనలు  చదివినప్పుడు  వారి  రచనలు  చాలా  సరళంగా అనిపించి గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించి వారు కూడా అలాగే ఊదితే గాలికి ఎగిరిపోయేలా బక్క పలుచగా వుంటారేమో అనిపించింది. కానీ వారు అందుకు వ్యతిరేకంగా వున్నారు.  మేము ఒక మూడు నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడుకోలేకపోయాము. నేను  మా  కుటుంబ  వేడుకకి  పిలిస్తే  వారు కనీసం రిప్లయ్ కూడా ఇవ్వలేదేమిటా వారి మీద కొంత నిరసన వుండింది కానీ వారు అందుకు గాను సారీ చెప్పారు.  

వేదాంత, భక్తి టపాలు వ్రాసే కదిరి సురేశ్ గారికి హలో మాత్రం చెప్పగలిగాను. సమయం వుంటే కాస్సేపు మాట్లాడివుండేవాడిని. ఇనగంటి రవిచంద్ర వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నారు. వారితో కూడా ఎక్కువగా మాట్లాడలేకపోయాను.

ఇంకొక బ్లాగర్ని కలిసాను కానీ వారి పేరు మొన్నటిదాకా గుర్తుకువుంది కానీ ఇప్పుడు మరచిపోయాను. అప్పుడొకసారి వారు హైదరాబాద్ ఆడవారు బీర్లు తాగిన వీడియో పోస్టు చేస్తే వారితో నాకు బ్లాగ్యుద్ధం జరిగింది. వారు ఈ బాటలో తారసపడతారని ఏమాత్రం అనుకోలేదు. నేను వచ్చానని తెలిసి సంతోషంగా హలో చెబుతూ దగ్గరికి వచ్చారు.  మనం శత్రువులం కదా ఇలా హలోలిచ్చుకుంటే బావుండదేమో అని సరదాగా అంటూ హలో ఇచ్చాను. దానిదేముందండీ, బ్లాగ్గొడవలు బ్లాగుల్లోనే అనగా వారి స్పోర్టివ్‌నెస్ చూసి నాకు ముచ్చటేసింది. అక్కడానూ మరియు పివి జ్ఞానభూమి వద్దానూ నాతో కలిసి ప్రత్యేకంగా ఫోటో దిగారు.

ఇంకా ఈ బాటలో చక్రవర్తి దంపతులను కూడా కలిసాను. వారి గురించి టపా త్వరలో వ్రాస్తాను. ఇంకా AP మీడియా  రాముగారు  కూడా కలిసారు. నిజానికి  వారు  అంతకుముందే  వారిని  జర్నలిజం  కాలేజిలో కలుసుకున్నాను. ఆ విశేషాలతో టపా ఎప్పుడో మొదలెట్టాను కానీ ఇంకా పూర్తిచెయ్యలేదు.   వీరే కాకుండా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక బ్లాగర్ నన్ను ఇండియా వచ్చినప్పటినుండీ కలవడానికి శతవిధాలా ప్రయత్నీంచి చివరికి నేను ఇండియా నుండి తిరిగివచ్చే రోజున ఓ మూడు నిమిషాలు మాత్రం కలవగలిగారు. వారి గురించి ఒక పోస్టులో వ్రాస్తాను. ఇలా వీరినీ కవర్ చేస్తే ఇండియాలో కలిసిన బ్లాగర్ల విశేషాలు అయిపోతాయి. 

ఇంకా  ఎవరితోనయినా  ప్రత్యేకంగా  మాట్లాడివున్నా, పరిచయం  అయినా  మరిచిపోయినందుకు మన్నించగలరు.    నాగను కూడా కలిసాను కానీ వారిని ఆల్రెడీ మరొక టపాలో కవర్ చేసాను.