పర్ర్‌ఫెక్ట్ బ్లాగర్లు



















మన బ్లాగర్లలో దాదాపు అందరూ మిస్టర్ పర్‌ఫెక్టులే. ఎందుకంటే అందరికీ ఎదుటివాడిలోని, ఎదుటి వ్యవస్థలోని, ఎదుటి నాయకుడిలోని, ఎదుటి మేధావిలోని, ఎదుటి బ్లాగర్లోని లోపాలు మాత్రమే కనపడతాయి. తమలోని లోపాలు మాత్రం కనిపించవు, వినిపించవు, మాట్లాడవు. మూడు కోతుల వ్యవహారం అన్నమాట.

దేశం సర్వనాశనమయిపోతోందండీ, దానిని కాపాడాలి - మార్చాలి. కానీ మనం మాత్రం మారం.

రాజకీయనాయకులు వట్ఠి వెధవలండీ - మంచి వారు రావాలి. మనం మాత్రం మంచివారు అవ్వాల్సిన అవసరం లేదు.
ఫలానా రచయిత వెధవ్వండీ. మనం మాత్రం వెధవలం కాము, కాబోము.

కీ సీ ఆర్ లాంటి రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పాలి. మనకు మాత్రం బుద్ధి అక్కరలేదు. ఎందుకంటే మనం మిస్టర్ పర్ఫెక్ట్లం కాబట్టి.

పేపర్లు చెత్తగా వ్రాస్తున్నాయి - వాటిల్లో మార్పు రావాలి. మార్పు మనకక్కరలేదు. మనం మిస్టర్ క్లీన్.
ఫలానా వాడు తప్పుగా మాట్లాడాడు. మంచి భాష మాట్లాడాలి. మనం అన్నిటా ఒప్పే. మనం అన్నిటా పరిశుద్ధులం కాబట్టి.
సమాజం భ్రష్టు పట్టిందండీ. మార్పు రావాలి. కొత్త సమాజం రావాలి. ఆ మార్పు మనలో అక్కరలేదు. మనం మార్పుకి అతీతం.

సినిమాల్లో ఎక్కడ చూసినా బూతేనండీ. మార్పు రావాలి. మార్పు మనకక్కర లేదు. మనం మారం.

అమ్రికా వోడు విధానాలు మార్చుకోవాలండీ. బరాకుకు బుద్ధి లేదండీ. ఎకానమీ విధానాల్లో మార్పు రావాలి. మనకు మాత్రం మార్పు అనవసరం. మనం మారలేదు. మార్పు రాదు. మారబోము.

అందరిలో మార్పు రావాలి. సమాజం మెరుగవ్వాలి. అందరూ అన్నాతమ్ముల్లా కలిసిమెలసి వుండాలి. మనం మాత్రం బండరాయిలా వుండాలి.

ప్రతీవారూ ఎదుటి దాంట్లో మార్పును ఆశించడం, మంచితనాన్ని ఆశించడం, మెరుగుదలని వాంఛించడమే కానీ తమ దగ్గరికి వచ్చేసరికి మార్పు చెందితే, మంచిగా మారితే, మెరుగయితే... అహం దెబ్బతింటుంది. ఠాఠ్ మనలో మాత్రం మార్పు కుదరదంతే.

ఫలానా వాడికి కులగజ్జి వుంది. వాడు మారాలి. మనం మాత్రం మారం. ఏం పీకు తావో పీక్కో.

ఒక్కరనేం వుంది లెండి. అందరి అహం అంతే, అందరం అంతే. బ్లాగులు వ్రాసే ప్రతీ వాడూ మేధావే. మేధావి మారితే ఎలా? ఆ అందరిలో నేనూ వున్నా. కొన్ని నేనూ మారను, మారలేను, మారబోను. అదంతే.

36 comments:

  1. అవినీతికి వ్యతిరేకం గా తొలి అడుగు వేద్దాం,
    మార్పు మన నుంచే మొదలు పెడదాం అన్న నా పైత్యపు రచనలు చదివారా శరత్తన్నా ?

    పుటో బాగుంది
    సెటైర్ బాగుంది
    ఈ పోస్ట్ చదివి మొదట ఎవడికి వాడు నిజమే అని తనని తాను తిట్టుకుంటాడు , తర్వాత నిన్నే :)

    ReplyDelete
  2. ఎం చేస్తాం శరత్ గారు చిన్నప్పటి నుంచి ఏదుటి వాళ్ళు చెప్పేది - చేసెది, విని -చూసి చేస్తున్నాం ... మీరు చెప్పేవి కూడా ముందు ఏదుటి వాళ్ళ చేస్తే మేము ఫాలో అవుద్దాం అనుకుంటున్నాం ...:)))))

    ReplyDelete
  3. you hit the target perfectly

    ReplyDelete
  4. ఒక్కరనేం వుంది లెండి. అందరి అహం అంతే, అందరం అంతే. బ్లాగులు వ్రాసే ప్రతీ వాడూ మేధావే

    ----------------------------------

    ఇక్కడ మీరు అందరు అంటున్నారు .. ఎవరా అందరు పేపచంలో అందరా ... లేక బ్లాగులు రాసే అందరా ... ఎవురా అందరు

    ReplyDelete
  5. పవన్ జీ
    నేను, నా భుజాలు తడిమేసుకున్నా :)

    ReplyDelete
  6. @మనకు మాత్రం మార్పు అనవసరం. మనం మారలేదు. మార్పు రాదు. మారబోము

    మీరు ఉదహరించిన అన్ని అంశాల్లొ మార్పు రావాలి, నే మాత్రం మారను అనుకునేవాడు నిజముగానే "మేధావి"! సెప్పుదెబ్బలాయన దగ్గర ఓ దండ తీసుకొచ్చి వేయాలి.

    కాపోతే కొందరికి కొన్ని అంశాలు నచ్చి వాటిని పాటిస్తూ మిగిలినవాల్లకి చెబుతారు అని నా 2 పెన్ భావన:). అలాకాకుండా ఉత్త ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చేవారి రంగు హెప్పుడో హప్పుడు వెలిసిపోక తప్పదు.

    @బ్లాగులు వ్రాసే ప్రతీ వాడూ మేధావే...
    హ్మ్.. మరి కామెంట్లు రాసేవారు?.. ఊ.. చెప్పండి(కొద్దిగా మంచిగా)?

    ReplyDelete
  7. అల్లో
    అప్పు నీ కొసం తుప్ప పట్టిన సైకిల్ ఏసుకొని
    గబ్బు గబ్బు గల్లిలను చెప్పు లేసుకోకుండా తిరుగుతున్నా

    ReplyDelete
  8. ఇంకోటి కలుపుకోండి. సంకలునులు మారాలి. వాటిని నడుపుతున్న వ్యక్తులు నాలా "విశా...లంగా" ఆలోచించాలి. మారాలి, మార్పు రావాలి!

    ReplyDelete
  9. పవన్ జి
    నేను ఇప్పుడు బజ్ లో ఉండటం లేదు
    రోజుకో 40 -50 కామెంట్స్ రాసుకుంటున్నా
    మొత్తం అజ్నాతల కామెంట్స్ తర్వాత నా కామెంట్స్ ఎక్కువ ఉంటున్నాయ్ :)
    శరత్ అన్నయ్ కి రోజుకి నాలుగైదు ఇస్తునా రోజుకి... కామెంట్స్
    ఫుల్లు బిజీ - మస్తు టైం పాస్

    ReplyDelete
  10. @ అప్పూ
    :)
    @ పవన్
    ఏంటీ ఈమధ్య బ్లాగుల్లో బొత్తిగా నల్లపూస అయిపోయారూ?
    నేను కూడా నేను చెప్పేవి చేసేవారికోసమే చూస్తున్నా :)
    మనమందరమూనూ.
    @ డ్రీంస్
    :)

    ReplyDelete
  11. @ రాజేశ్జి
    హ్మ్. మీలాంటి బ్లాగుల్లేని పేద వ్యాఖ్యాతలను ఏమనాలో ఆలోచించాల్సిందే :)

    @ RK
    మంచి విషయం అందించారు. ధన్యవాదాలు.

    ...లంగా సంకలునులు మారాలి. వాటిని నడుపుతున్న వ్యక్తులు నాలా "విశా...లంగా" ఆలోచించాలి. మారాలి, మార్పు రావాలి!

    ReplyDelete
  12. Well, my friend - such is life! You can't have things your way all the time. Bringing down the whole of humanity to your level is a gigantic and exciting task. Such a world will be quite amusing to live - a life full of spineless pimps :)

    ReplyDelete
  13. కొన్ని కారణాల వల్ల ఎక్కువ గా అన్ లైన్ లోకి రావడం లేదు .. మీ పోస్ట్ లు మాత్రం వదలకుండా చదువుతున్నానండోయ్ ... :))))))

    ఇక నెల పాటు పెద్ద పని పాటా లేదు లెండి ఇక అన్ లైన్ లో ఉంటాను ... మీరు మాత్రం మాంచి ఫాం లో ఉన్నారు ... పాత గొడవలను తవ్వి మరీ బయటకు తిస్తున్నారు .... మన అప్పరావు పండగ చేసుకుంటున్నాడు బాగుంది చాలా బాగుంది :)))

    ReplyDelete
  14. ఇదో అప్పోరావు నీ బ్లాగు(లు) లింక్ లు కొట్టు బాబు అసలే పనికిమాలిన బ్లాగులు చాలా ఉన్నాయి అందులో నీ బ్లాగు ఎదో కనుక్కోవడం కష్టం గా ఉంది

    ReplyDelete
  15. శరత్ అన్నయ్ కి రోజుకి నాలుగైదు ఇస్తునా రోజుకి

    అప్పోయ్ ఎంటా మాటలు .... నువ్వు ఈమద్య మరీ ఎక్కువైపోతున్నావు అబ్బాయ్

    ReplyDelete
  16. @ పవన్

    అప్పూ భాయ్ బ్లాగ్:

    http://appi-boppi.blogspot.com/

    ReplyDelete
  17. @ పవన్

    మర్రదే మండుద్ది. పాత గౌరవాలు వెలికితీస్తుంటే మీలాంటి వారేమో పాత గొడవలు తవ్వి తీస్తున్నా అంటారు :))

    ReplyDelete
  18. శరత్ గారు ఎంటి ఇది మన అప్పోరావు బ్లాగే .... బాగుంది సానా బాగుంది :)

    మన అప్పోరావు గోరు మరీ ఇంత ఫ్రీ ( నో పనీస్) గా ఉన్నాడు :)))

    ReplyDelete
  19. అయ్యో సోరి శరత్ గారు అలా ఉడుకోకండి ఎదో స్లిప్ అయ్యాను .... ఎన్ని సార్లు వాటినే .... తవ్వుతారండి కోంచెం కొత్తగా try చేయవచ్చు కదా ...

    ReplyDelete
  20. @ RK
    వైరుధ్యాలు వుండకపోతే బావుండదంటారు! మరయితే మీరెందుకు ఒకరిలో మార్పు కోసం/ఒకరు తగ్గడం కోసం తెగ కృషి చేస్తున్నారు? అది కృషి కాదు అని మీరంటారు - నాకు తెలుసు కానీ ఏదో ఒకటి - పర్పజ్ అదే కదా.

    నాకు (నిజంగానే), నా బ్లాగుకీ ఇంగ్లీషు అంతగా రాదు. మీరు తెగ తెలుగాభిమానులని లోగిలి నుండీ తెలుసు. మా పాపక్కూడా తెలుగు వాడకం మీద లోగిలిలో లెక్చర్లు ఇచ్చారని తెలుసు :) ఇందులో తెలుగులోనే వ్రాయండి - నాక్కాస్త బాగర్ధమవుతుంది.

    ReplyDelete
  21. >>>మన అప్పోరావు గోరు మరీ ఇంత ఫ్రీ ( నో పనీస్) గా ఉన్నాడు :)))

    పవనా, ఈ మద్య మన బ్లాగర్ లే పని లేకుండా ఉన్నారు, ఇప్పుడు కామెంట్ పెట్టి పొతే ఎప్పుడ వచ్చుద్ది రిప్లై.
    online లో చెస్ ఆడితే ఎట్లా పిచ్చి లేచిద్ది అట్లా నే ఉంది నాకు. ఒక్కరికీ కామెంట్స్ ఆట ఆడటం రావడం లేదు ..
    మా దురద బలాగు సతికి సెప్పు కూతంత

    ReplyDelete
  22. అప్పోరావు :))))))))))))))))

    ReplyDelete
  23. ఇక్కడ ఆంగ్లంలో ఒకసారి వ్యాఖ్యానించడానికీ, లోగిలిలో మీకుపన్యాసాలు దంచడానికీ మధ్య మీకు మాత్రమే కనిపించిన సంబంధమేమిటి?

    నిజం చెప్పాలంటే, నేను ఫక్తు అవకాశవాదిని. మీకు లాగా. నాకు తెలుగు అభిమానిగా నటిస్తే, ఉపన్యాసాలిస్తే ఎక్కడయినా కాస్త గుర్తింపూ, రెండు హిట్లూ వచ్చాయనుపిస్తే చాలు, అలా ఉపన్యాసాలు దంచేస్తాను, సందర్భానుసారం అలా సైడ్లు మార్చేస్తుంటాను. :)

    సరే మీకెటూ ఆంగ్లం రాదంతున్నారు గనక, మీకోసం మళ్ళీ ఇంతకుముందు వ్యాఖ్యను తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. "అంతే మిత్రమా, ఈ లోకపు తీరటువంటిది! సర్వకాల సర్వావస్థలునూ మన ఇచ్ఛకనుగుణంగా నడువదు కదా! ఏమాటకామాటే చెప్పుకోవాలి మిత్రమా - మానవజాతిని సమస్థమూ మీ స్థాయికి లాగడానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నము బృహుత్కార్యమునూ ఇంకా సుమీ! లాగబడినట్టి ఆ స్వప్నజగత్తు మిక్కిలి సంభ్రమము గల్గించెడిదిగానుండును - వెన్నెముక జాడళేని తార్పుడుగాళ్లతో నిండి" :)

    ఇక పోతే మార్పుకోసం కృషి గురించి - ఎవడి మార్పు, ఏమా కథ. మార్పులూ చేర్పులూ - తగ్గడాలూ పెరగడాలతో నేను పెద్దగా సమయం వృధా చేసుకోను. మా కాలేజీరోజుల వాడుక భాషలో చెప్పాలంటే - అయన్నీ టైంవేస్ట్ అన్నా. పగలగొట్టడమే!

    ReplyDelete
  24. @ RK

    ఇప్పుడు మీ వ్రాతలు నచ్చాయి - చూడముచ్చటగా - తాడేపల్లి గారిలా. ఇలాగే వ్రాస్తుండండి - బావుంటుంది.

    ReplyDelete
  25. @మీలాంటి బ్లాగుల్లేని పేద వ్యాఖ్యాతలను..
    హన్నా..హెంత మాటన్నారు..ఉప్చ్..

    ReplyDelete
  26. బాబూ, బ్లాగులేని పేదవనీ దిగులు చెందకూ...ఆ...ఆ... (ఆ తర్వాత పాట రాదు, మీకొస్తే మీరే పాడేస్కోండి)

    ReplyDelete
  27. సెత్
    ఎంత మాట ?
    రాజేసా ఎంతకాలం కామెంట్స్ రాత్తావ్?
    తెలుగు బలాగు ఎట్టుకో
    లేకపోతె గోకుదువుగాని ఈడకు రా

    ReplyDelete
  28. ఇదో అప్పోరావు కెలకడం అంటె చర్మం ఉడి సెతులోకి వచ్చేలా కాదు ....కేలుకు తప్పు లేదు ... గాని కాస్తా మినింగ్ "పుల్లు"గా (మందు కాదు )కెలుకు .. అంతెందుకు మన శరత్ గారినే చూడు పరమ బుతులు రాస్తారు కాని అవి మనకు బుతులా కనపడవు :)

    ఇక పోతె అడోళ్ళను బుతులు తిట్టోద్దు - ప్రవీణ్ గాడిలా పిచ్చి పిచ్చి కామెంట్లు వద్దు ... ఓ తండ్రికి
    పుట్టిన పిల్లకాయల్లా ఉండాలి ... ఇక ajnaata లు అవసరమే అందులో డబుల్ బర్త గాళ్ళుంటారు వాళ్ళ కామెంట్లు allow చెయవ్వద్దు ...
    కోంచెం ఎక్కువ చెప్తున్నాను గాందా తప్పదమ్మ ..

    ReplyDelete
  29. పవనా
    నేను అసలు ఆడోల్ల బలాగులు సతకను, ఇంకేటి ఆళ్ళని కేలికేది
    ఇట్టా అన్నానని "సరత్తన్న" అని అనమాక

    ReplyDelete
  30. హుమ్ ..... అదీ కాదు ఈ మధ్య కొందరు పిల్లకాయలు ప్రవీణ్ గాడి హక్కును అడ్దుకుంటున్నారు ఇది స్వతంత్ర దేశం ఏవడు ఎం రాసినా తప్పు లేదు .. ప్రవీణ్ ను కేలకకుడదు ... అని రాసుంటె ఆ ajnaata నువ్వే అనుకున్నా.. నువ్వు కాదన్న మాట వాకే ..

    ReplyDelete
  31. పవనా
    యెడఉన్నావ్ నేను అజ్ఞాత గా రాయడమేమిటి ?
    ఆడ్ని కేలకనీకి మా బొప్పిగాడు ఉన్నాడు

    ReplyDelete
  32. యధా రీడర్లు తధా బ్లాగర్లు

    ReplyDelete
  33. "మార్పు సహజం ..అది మనకి సంభందిన్చిన్దియితే మాత్రం అంగీకరించడం బహు కష్టం"అన్నాడు బ్రెక్ట్- ఒక నాటకంలో.ఏడాదికోసారి మంచి పోస్ట్ రాస్త్తున్నందుకు సంతోషం.

    ReplyDelete
  34. అందరూ ఆలోచించదగ్గది. మంచి పోస్ట్..థాంక్స్...

    ReplyDelete
  35. @జగ్గంపేట
    యెప్
    @ ఆస్ట్రో
    అంటే ఏడాదికి ఒక్క టపా మాత్రమే చెత్తగా వ్రాస్తానన్నమాట.
    @ కెక్యూబ్
    ఈ టపా మీకు నచ్చినందుకు సంతోషంగా వుంది.

    ReplyDelete
  36. శరత్ గారు మీరనుకుంటున్నట్లు నేనెప్పుడూ మేధావిగా ఫీల్ కాలేదు. మీ అందరికంటే తక్కువ చదువుకున్నవాడిని, జ్నాన శూన్యుడినే..

    ReplyDelete