బ్లాగోఛ్ఛాటన

ఈమధ్య ఇంటా బయటా నాకు పడనివాళ్ళు ఎక్కువయ్యారు. బయట బ్లా'గులో'ళ్ళ సంగతి చూద్దాం. ఈమధ్య శానా మంది టపాలు టపాటపా రాలుస్తున్నారు. వాళ్ళకు పోటీగా నేను మూడు నాలుగు టపాలు వేసినా నా టపాలు టార్చ్ లైటు వేసి వెతికితే తప్ప కనపడటం లేదు. అందుకే హారం, కూడలిలల్లో పిండి చల్లదలుచుకున్నాను. దానితో ఎక్కడ టపాలు అక్కడ పరార్. మాలికలో కూడా ఆ ఉఛ్ఛాటనా పిండి చల్లాలని వుంది కానీ వాళ్ళు చాలా సహజంగానే విదేశీ కుట్ర అనుకుంటారని ఆ వ్యూహం విరమించుకున్నాను. మన ప్రవీణ్ అగ్రిగేటర్లో చల్లుదామంటే ఇది పిండి నా లేక ఏదయినా బూతు పదార్ధమా అని ఆ పిండి యొక్క ప్రాశస్త్యాన్ని అనుమానిస్తాడేమోనని నా అనుమానమూనూ.

ప్రతి ఒక్క బ్లాగరూ తనొక ఏనుగు అనీ, మిగతా వారిలో కొందరయినా ఊరకుక్కలనీ అనుకుని (అల్ప)సంతోషపడుతుంటారు. అదే సంతోషం నాక్కూడానూ. ఈమధ్య ఊరకుక్కలెక్కువయ్యాయి. అందుకే వాటిమీద ఉఛ్ఛాటనా క్రియ ప్రయోగిస్తే అవన్నీ భౌ భౌ మని పారిపోయి ఏ అప్పి కాలునో, బొప్పి కాలునో పీకకపోతాయా అని నా చిన్ని చిన్ని ఆశ.

ఇహ బ్లాగుల్లో కెలుకుడు ఎక్కువయ్యైందని గోలపెట్టడం ఫ్యాషనయిపోయిందని గోలపెట్టడం ఫ్యాషనయిపోయింది కదా. అందుకే ఆ ఉఛ్ఛాటనా తంత్రం ప్రయోగించి బ్లాగులోకంలోని కెలుకుడంతా రూపు మాపి బ్లాగోస్ఫియరుకి మూలశంక పురుషుడిగానే కాకుండా మూలపురుషుడిగా అవతరించదలుచుకున్నాను. ఎలా వుందీ నా ప్లానూ?

ఇప్పుడు ఆ తంత్రాలు, మంత్రాలు అన్నీ అంత కఠొర దీక్షేలు చేసి నేర్చుకునేంత దృశ్యం నాకు లేదు కాబట్టి ఎవరయినా ఆ ఉఛ్ఛాటనా పిండి ఇండియా నుండి టన్నులకు టనూలకొద్దీ ఎక్స్పోర్ట్ చేస్తే కొద్దిగా బ్లాగుల్లో చల్లి మిగతాదంతా ఒబామాకమ్మేస్తా. అప్పుడు ఒబామా దానిని కొద్దిగా వైటు హౌజులో చల్లి మిగతాది తీసుకెళ్ళి  లాడెన్ను కుమ్మేస్తాడు. అప్పుడు గానీ నాయొక్క ఈ దేశ సేవలకు మెచ్చి నా మెడలో ఓ ప్రెసిడెన్షియల్ మెడల్ వేలాడేస్తారు. అన్నట్టు ఆ పిండి రాగానే మా ఊర్లో వున్న మొగాళ్ళందరి మీద ప్రయోగిస్తా. అప్పుడిక మనమే ఊరికొక్కడు.

అంచేతా ఎవరయినా ఇండియాలో ఆ పిండి ప్రొడ్యూసు చేసే కుటీరపరిశ్రమ మొదలుపెడితే బావుంటుందని నా సలహా. ఆలస్యం ఉఛ్ఛాటనా విషం. త్వరపడండి మరి. మీదే ఆలస్యం. మంచి తరుణం మించిన దొరకదు. శుభం భూయాత్.

7 comments:

  1. శుభం భూతాత్.
    టన్ను ఒక్కింటికీ $1450.00 చొప్పున నా నైజీరియా బాంక్ అక్కౌంట్ లో వేసినచో, మీరు కోరిన పిండి వెంటనే పంపగలవారము.

    రెటర్నులు, మరియు ఎక్స్చేంజులు వుండవు.

    ReplyDelete
  2. హమ్మో ఒబామాకంటే పెద్ద ఎజెండాతోనే బరిలోకి దిగారే?
    పిండి సంగతేమో గాని మీరు పెట్టినబొమ్మలో సీసాలో ఉన్నది భారత్‌లో బట్టలు ఉతకడానికుపయోగించే సర్ఫ్ పొడిలాగా ఉంది. పోనీ ఇక్కడ దొరికే దేశవాళీ ఉతుకు-పొడులేవన్నా పనికొస్తాయేమో చూడండి - యెలాగా మీరు తలపెడుతున్నది కూడా - ఒకరేంజిలో చూస్తే - ప్రక్షాళనే కదా! టైడ్ గనక ఉపయోగిస్తే నా స్టాకు పోర్టుఫోలియోలో ప్రోకటర్ గేంబుల్ స్టాకు విలువ పెరుగుతంది, మీకో పదిపైసల వాటా ఇస్తా!
    బ్లాగు+ఉఛ్ఛాటన = మీ భాషలో సువర్ణదీర్ఘసంధి కావాలే, గుణసంధి ఎలాగయిందబ్బా? దవున్టవున్ షికాగోలో ఎక్కడన్నా గుణసుందరి గాలిగానీ సోకిందేవిటి మీకు?

    ReplyDelete
  3. @ పండు
    మరీ అంత కాస్టే. దానికంటే మా ఇంట్లోనే నేనో కుటీర పౌడర్ పరిశ్రమ పెట్టుకునేది మేలనుకుంటా.

    @ కొత్తపాళీ

    ఆకాడికీ విచ్చూ, పౌదరూ అనే వెతికానండీ, విచ్చు పౌడర్ అని ఆ సీసా చూపించింది గూగుల్ ఇమేజమ్మ. అంతే అడ్జస్టయిపోయా.

    నాకు సక్రమ సంబంధాలన్నా, సక్రమ సంధులన్నా గౌరవం లేదండీ. ఏ పదాలయినా సరే అవసరమనుకుంటే అక్రమ సంబంధం/సంధీ కలిపేస్తా. ఆ తరువాత అది ఏ సంధీ, సంబంధం అనేది మీలాంటి విజ్ఞులే తేల్చాలి. అయినా సంధి సంబంధం ముఖ్యం కానీ పేరు ముఖ్యమా చెప్పండి.

    ఎలాగూ ఒబామా ఇండియా వెళుతున్నాడు కాబట్టి ఆ పౌడరేదో అక్కడే మన భారతీయ వారసత్వ సంపద శాంపిలుగా అందజేస్తే వచ్చేప్పుడు ఎయిర్ఫోర్సు వన్నులో చల్లుకుంటాడని నాకు ఇప్పుడే వెలిగిన లైటు.

    ReplyDelete
  4. అన్నాయ్, నీ బలాగులో మజా తగ్గిపోయి నాలాంటి మీ అభిమానులు ఇలాంటి కొత్త బలాగులు ఎతుక్కొంటున్నము ;(

    http://blossomera.blogspot.com/2010/11/blog-post_03.html

    ReplyDelete
  5. కొంచం ఇన్వెస్టుమెంట్ ప్రాబ్లెం. అడ్వాన్స్ పంపిస్తే ఇండియాలో కుటీర పరిశ్రమ మొదలుపెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తా. కావాలంటే మీకు తప్ప ఇంక ఎవరికీ అమ్మనని ఒక డీల్ కూడా సైన్ చేస్తా.

    డీల్ నచ్చితే ఒక పాతిక లక్షలు ముందు పంపండి. మిగిలిన లెక్కలేవైనా వుంటే మనం 2020 లో చూసుకుందాం.

    ReplyDelete
  6. @ ఎనానిమస్సూ
    ఆ బలాగు బానే వుంది కానీ ఫుటోలు కూడా పెట్టేస్తే బావుండేది, వివరంగా ఆ పద్ధతులు చూపిస్తూ.
    @ నరేశ్
    అందరికంటే అది ఇప్పుడు ఒబామాకి అవసరం. రిపబ్లికన్ల మీద చల్లాలి కదా. వైటు హవుజుతో మాట్లాడి చెబుతా ఆగండి.

    ReplyDelete
  7. వైటు హవుజు వాళ్ల ఇన్వెస్టుమెంటయితే పాతిక లక్షల దాలర్లు కావాలని చెప్పండి. సగం సగం పంచుకుని దునియాని దున్నేద్దాం.

    ReplyDelete