సహజమార్గం: మా అమ్మగారు చాలా ఏళ్ళనుండీ సహజమార్గం పాటిస్తున్నారు. మా నాన్నగారు (వారిది నాస్తిక మార్గం లెండి) జరిగిపోయి తొమ్మిదేళ్ళు కావస్తుండటంతో ఆ తరువాత సహజమార్గం కార్యక్రమాలకి ఎక్కడికయినా వెళ్ళడానికి బాగా వీలు కలిగింది. చాలా వివరాలు, విశేషాలు చెబుతూవుంటుంది కానీ నాకు ఆయా విషయాలపై ఆసక్తి లేనందువల్ల పెద్దగా గుర్తుండవు. సత్కోల్ తదితర ప్రదేశాలకు, హిమాలయాలలో వున్న కేంద్రానికీ వెళ్ళివస్తుంటుంది. మా నాన్నగారు స్వాతంత్ర్య సమర యోధులు కాబట్టి అందువల్ల వచ్చిన రైల్వే పాస్ అమ్మగారి ప్రయాణాలకు చాలా సౌకర్యంగా వుంది.
యథాశక్తి మా అమ్మగారు నన్ను అందులోకి మార్చాలనుకుంటుంది కానీ నాది వేరే మార్గం కాబట్టి తప్పించుకుంటూవుంటున్నాను.
అచల మార్గం: ఇక మా (పిల్ల నిచ్చిన) మామగారిది అచల మార్గం. వారు దానికి రాష్ట్రాధ్యక్షులు. పెళ్ళయిన మరునాడే నన్ను పట్టుకొని ఒక మూడు గంటలు బోధ చేసారు. ఆ తరువాత ఎలాగో తప్పించుకున్నాను. వారిది అచలం మార్గం అయితే నాది చలం మార్గం అని ఎలా చెప్పేది? చెబితే బావుండదని అప్పుడు చెప్పలేదు కానీ మరో సారి చెప్పి ఎందుకయినా మంచిదని ఆ టాపిక్ పెద్దగా పెరగకుండా కట్ చేసాను.
ఈమధ్యే మా మామగారు మా దగ్గరికి (యు ఎస్ కి) వచ్చారు. వారికి మా ఇంటి ప్రక్కనే వుంటున్న ఒక అంకుల్ పరిచయం అయ్యారు. వారిది సహజ మార్గం. ఇద్దరూ రోజూ కలుసుకొని పాదయాత్రలు చేస్తూ అద్ధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటారు. ఒకరి మార్గంలోకి మరొకరిని మార్చాలని ప్రయత్నిస్తూవుంటారు. చూద్దాం ఎవరు గెలుస్తారో! ఆ అంకుల్ కూడా నన్ను ఆ మార్గంలోకో ఈ మార్గంలోకో మారమని ఉద్బోధ చేస్తుంటారు. నాకు కూడా చలం మార్గం గురించి వారికి ఉపదేశం చేయాలని వుంటుంది కానీ ఇప్పుడు వారికి అది అంత అవసరమా అని వారి మాటలు వింటూ వుంటాను.
ఈ రోజే తెలిసింది - కొంత మంది బ్లాగర్లు సహజమార్గీకులని. సంతోషం అనిపించింది - ఎందుకంటే మా అమ్మగారి మార్గం కూడా అదే కాబట్టి. మీలో అచల మార్గీకులెవరయినా వుంటే నాకు తెలియజేయండి. మా మామగారిని పరిచయం చేస్తాను - లేదా మా మామగారు మీకు ఇప్పటికే తెలిసివుండవచ్చు.
Update: సహజ్ మార్గ్ దేశదేశాలలో బాగా విస్తరిస్తోంది. దాని గురించి రామరాజు గారు ఒక లింక్ అందించారు. చూడండి.
అచల మార్గం పెద్దగా వ్యాప్తిలో లేదు. వారికి సంబంధించిన వెబ్ సైట్లు కూడా పెద్దగా లేవు. ప్రస్తుతానికి ఒకే ఒక వెబ్ సైట్ వుంది.
http://brahmanirvan.org/docs/index.htm
సహజ మార్గం, అచల మార్గం మాటలు ఎప్పుడూ వినలేదు. వాటి గురించి మీకు తెలిసిన నాలుగు ముక్కలో, లేకపోతే ఎమయినా లింక్లో ఇస్తే బాగుంటుంది కదా!!
ReplyDeleteఇద్దరికీ బ్లాగు దురద అంటించకపోయారా? అన్ని మార్గాలు మరచి పోతారు... హి హి హి .. :)
ReplyDeleteసహజమార్గం అంటే ఏమిటండి?
ReplyDeleteచలమార్గం, అచల మార్గం ఏమిటి? తెలియక అడుగుతున్నా...
ఈ సహజ మార్గం అచల మార్గం అంటే ఏంటి?
ReplyDelete"సహజమార్గం ,అచలమార్గం"???????????????????
ReplyDeleteఅలాగా? మీది బ్లాసు మార్గం అని నేననుకున్నానే?
ReplyDelete(బ్లాసు - బ్లాగులో సుత్తి) ;-)
ఇంతకీ మీ ఆవిడ నెత్తిమీద అక్షింతలు వేసిందా? (మొదటి ప్రేమలేఖ).ఏవైంది?
నాకూ అర్ధం కాలేదు. కానీ మీ నాన్న గారిది దేశ భక్తి మార్గం (ఫ్రీడం ఫైటు) అని అర్ధం అయింది. అంత కన్నా మంచి మార్గం ఏముంది ?
ReplyDeleteఅన్నా!!
ReplyDeleteనాది మధ్యేమార్గం అని చెప్ప కదా!! :):)
సహజ మార్గ్ -
శ్రీ రామ చంద్రజీ మిషన్
ఇంట్లో తెలియనివ్వకండి మీది చల(మ్) మార్గమని. అప్పుడు అన్ని మార్గాలు మూసుకుపోతాయి :)
ReplyDeleteHello sir-
ReplyDeleteI do not know whether its coincident or accident you have blogged about sahajmargam on the eve of the master of sahajmarg shri P Rajagopalachari's 83rd birth celebrations!
raja
మనది "అసహజ" మార్గం ... "నరులెవరూ నడవనిది ఆ రూట్లోనే నడీచెదరో" .. "నరులెవరూ కెలకని వాడు, ఆ ఇన్నయ్య నే కెలికెదరో" :))
ReplyDeleteకెలుకుడు మార్గమే మిన్న
@ అజ్ఞాత
ReplyDeleteమీ సూచన బావుంది. రమాకాంత్ సహజ్ మార్గ్ లింక్ ఇచ్చారు. అచల మార్గం లింక్ త్వరలో ఇస్తాను.
@ ఏకలింగం
మా మామయ్య గారు వచ్చిన కొద్దిరోజులకే హడావిడిగా అచల మార్గం కోసం ఒక ఈమెయిల్ ఐడి, బ్లాగూ తయారు చేసి ఇచ్చాను. వారికి పెద్దగా కంప్యూటర్ ప్రాక్టీసు లేకపోవడంతో లేఖినితో కొద్ది రోజులు తంటాలు పడి వదిలివేసారు. ఎక్కువగా గుర్తుకుచేస్తే నన్ను ఎక్కడ టపాలు వ్రాయమంటారో అని సైలెంటయ్యా.
@ కాలనేమి , అశోక్ చౌదరి, రాధిక
సహజ మీద రమాకాంత్ లింక్ ఇచ్చారు, అచల మీద లింక్ తరువాత ఇస్తాను. చలం మార్గం అంటే చలం భావాలు లెండి.
@ అశోక్ చౌదరి
మీరు వుండేది బ్లూమింగ్టన్ అన్నారు కదా. అక్కడ వుండే బ్లాగర్ నాగన్న మీకు తెలుసా?
నాకు ఈమెయిల్ చేయగలరా? మా మామగారికి స్ప్రింగ్ఫీల్డులో లింకన్ వున్న ఇల్లు చూపించాలనుంది. వీలయితే దారిలో మిమ్మల్ని కలుస్తాం (మీకు నన్ను కలవాలనే ఆసక్తి వుంటేనే)
@ అజ్ఞాత
నాది బ్లాసు అయితే ఇంకా నావి ఎందుకు చదువుతున్నారండీ? పైగా కామెంటూనూ!
లేదండీ. ఏమీ జరుగలేదు కానీ నెత్తిమీద మొట్టికాయలు ఎప్పుడయినా పడవచ్చని విశ్వసనీయవర్గాల ద్వారా భోగట్టా. ఎంత ఆనందమో మీకు - కదా.
@Sujata
అవునండీ. మా నాన్నగారు రజాకార్ల ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా నాయకత్వం కూడా వహించారు. చిన్నప్పుడు వారి సాహసగాథలు వింటూ పులకించిపోయేవాళ్ళం. వారి రచనలన్నింటినీ ఒక బ్లాగులో పెట్టాలని ఆలోచన.
@ రమాకాంత్
మీ కామెంట్ రిప్లయ్ చూడకముందే ఈ టపా రాసేసా.
@ రామిరెడ్డి
ఇంట్లో పెళ్ళికి ముందే అన్నీ నిజాయితీగా చెప్పానండీ. పెళ్లయిన తరువాత ఏమయ్యిందో అస్సలు అడక్కండి :(
@ రాజ
ఆ సందర్భంగానే రమాకాంత్, ఉష గార్లు చేసిన వ్యాఖ్యలు చూసి ఈ టపా వ్రాసా. మా అమ్మగారు కూడా ఆ సెలబ్రేషన్స్ కే వెళ్ళినట్లున్నారు.
@ రౌడీ
హ్మ్మ్. మళ్ళీ రాస్తా. ఇప్పుడు సమయం లేదు.
ఒకే ఒక ప్రశ్న - "ఈ రోజే తెలిసింది - బ్లాగర్లు రామరాజు, ఉష గార్లు సహజమార్గీకులని. సంతోషం అనిపించింది - ఎందుకంటే మా అమ్మగారి మార్గం కూడా అదే కాబట్టి." అని తెలపటం వలన సమకూరినదేమిటి? సహజమార్గీయులు నాకు తెలిసి ఎవరినీ మార్చే ప్రయత్నం చేయరు, ఎవరి అత్మావలోకనమే వారిని శోధనకి గురిచేసి గురు సమక్షానికి చేరుస్తుందని సహజమార్గం విశ్వసిస్తుంది. మీ స్వానుభవం వేరుగా వుండివుండవచ్చు.
ReplyDelete@ ఉష
ReplyDelete- సంతోషం సమకూరింది.
- మీ పేర్లు ప్రస్థావించడం మీకెందుకో నచ్చనట్లుంది - తీసివేసాను.
సహజ మార్గం, అచల మార్గం లింకులతో టపాను మోడిఫై చేసాను. ఆసక్తి వున్నవారు ఆయా సైట్లకు వెళ్ళి చూడగలరు.
ReplyDeleteనా అసలు ప్రశ్న వేరండి. మీ అమ్మగారంత పెద్దవారి విశ్వాసం కన్నా నావంటి అభ్యాసి గురించి ప్రస్తావించటం ఎందుకు అని? పైగా
ReplyDelete"యథాశక్తి మా అమ్మగారు నన్ను అందులోకి మార్చాలనుకుంటుంది కానీ నాది వేరే మార్గం కాబట్టి తప్పించుకుంటూవుంటున్నాను" బట్టి
ఇన్నేళ్ళుగా గమనించిన మిమ్మల్నే ప్రభావితం చేయలేని మార్గం
""ఈ రోజే తెలిసింది - బ్లాగర్లు రామరాజు, ఉష గార్లు సహజమార్గీకులని. సంతోషం అనిపించింది"
ఈ ప్రస్తావన వలన ఏ ప్రయోజనాన్ని మీకు అందించిందా అని సాలోచన అంతే.
ఈ మార్గాల సంగతి తరువాత గాని...దీని ముందు పోస్ట్ ని ఏమి చేశారు? :-P
ReplyDeleteమా ఊరికి వస్తే, మార్గాలను మరచే ఉపాయం చెబుతాను..
ReplyDeleteఇటు వైపు వస్తే, ఇంటికి తప్పకుండా రండి. స్వాగతం.
ReplyDelete@ ఉష,
ReplyDeleteఅలా అంటారా. క్యాజువల్గా రాసినప్పుడు పెద్దగా ఆలోచన/ప్రయోజనం కోసం చూడనండీ. మా అమ్మగారి భావాలకంటే నాన్నగారి భావాలకే ఎక్కువ ప్రభావితం చెందాను. సహజమార్గం వల్ల మా అమ్మగారి వ్యక్తిత్వంలో మంచి మార్పులు వచ్చాయి కాబట్టి నేను ఆ మార్గంలో చేరకపోయినా అది అంటే గౌరవభావం వుంది.
@ పానీపూరి
ముందు పోస్టు కాస్త ఎక్కువయినట్లు అనిపించింది పైగా ప్రజలు అపార్ధం చేసుకునేవిధంగా వుందని తీసేసాను. తీసివేసినా కొన్ని చోట్ల పూర్తి టపా కనపడుతుందని తెలుసు.
@ నాగన్న
:) అర్ధమయ్యింది.
మీ ఇంటికి రావాలని ఆలోచిస్తూనేవున్నాం. కొద్దిరోజుల్లో మిమ్మలని కాంటాక్ట్ చేస్తాను. మీకూ మా మామగారికి మధ్య చర్చలు ఎలా జరుగగలవో మొన్ననే ఇంట్లో దృశ్యం వేసుకున్నాం.
సహజ మార్గం = ?
ReplyDeleteఅచల మార్గం = ?
చలం మార్గం = ?
ఇప్పుడే మీరిచిన లింక్స్ చూసాను... అయినా పెద్దగా అర్థం కాలేదు :P
ReplyDeleteఅర్థం చేసుకోవాలన్న ఆసక్తి కలగలేదు :|
మరి చలం మార్గం సంగతి ఏంటి?
@చైతన్య
ReplyDeleteచలం మార్గం అంటూ ప్రత్యేకంగా ఎమీ లేదండీ - నేనే కల్పించాను. రచయిత చలం భావాలనే మార్గంగా నేను భావిస్తుంటాను. నా భావాలకి ఆ భావాలకి దగ్గర తనం వుందటంతో ఆ పేరు చెబుతూవుంటాను.
preema ga undatame naa margam
ReplyDelete