డెంటల్ ఫ్లాసింగ్ - మెంటల్ ఫ్లాసింగ్


రోజూ శుభ్రంగా పళ్ళు తోముకుంటే 50 %, రోజూ ఫ్లాస్ చేస్తే 70 %, ఏడాదికి రెండు సార్లు డెంటిస్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు శుభ్రం చేయించుకుంటే పళ్లల్లో ప్లేక్ చాలా వరకు తొలగిపోయి 90% మన పళ్ళు ఆరోగ్యంగా వుంటాయిట. ఓ సన్నటి దారం లాంటి దానితో పళ్ళ చిగుళ్ళకూ, పళ్ళకూ మధ్య వుండే ప్లేక్ (పాచి) ని తొలగించడాన్ని ఫ్లాసింగ్ అంటారు.

ఈ డెంటల్ ఫ్లాసింగ్ గురించి ఇండియాలో వున్నప్పుడు తెలియదు కానీ నార్త్ అమెరికాకు వచ్చిన దగ్గరినుండీ ఒహటే డెంటిస్టుల నస. ఎప్పుడు పళ్ళ పరీక్షకి వెళ్ళినా హైజినిస్టులూ, డెంటిస్టులూ సుతిమెత్తగా నన్ను మందలిస్తుంటారు. మనది దున్నపోతు మనస్తత్వం - వింటే కదా. చాలా సార్లు ప్రయత్నించాను కానీ అది ఒక అలవాటుగా చేస్కోవడం మాత్రం నావల్ల ఒక పది ఏళ్ళుగా అవలేదు. ఈ డెంటిస్టుల మృదువైన హెచ్చరికలూ, మందలింపులూ తినకా తప్పడం లేదు.

ఈ మధ్య ఒక క్రొత్త డెంటిస్ట్ దగ్గర చేరాను. అక్కడ ఒక దేశీ హైజినిస్ట్ నాకు సేవలు చేస్తుంటుంది. అంత అందగత్తె కాదు గానీ బాగా మాట్లాడుతుంది. గుజరాతీ. నేను డెంటల్ ఫ్లాసింగ్ చేయకపోతే ఎదురయ్యే పరిణామాలు ఐమాక్స్ సినిమా లెవెల్లో దృశ్యం చూపించింది. హడలిపోయి ఫ్లాసింగ్ అనేది అలవాటుగా చేసుకోవడానికి ఈమధ్య బాగానే కష్టపడుతున్నాను. ఆగస్ట్ 20 న మళ్ళీ పళ్ళ పరీక్ష వున్నప్పుడు రిజల్ట్ చూస్తానంది ఆమె.

రోజూ డెంటల్ ఫ్లాసింగ్ చేస్తూవుంటే పళ్లకి ఎలా అయితే మంచిదో అలాగే రోజూ మెంటల్ ఫ్లాసింగ్ చేస్తే మనస్సుకి మంచిదంటారు. అయితే అది ఎలా చేయాలి? సింపుల్. రోజూ నా బ్లాగు పారాయణం చేయండి.

7 comments:

  1. డెంటల్ ఫ్లాసింగ్ ఎలా చేస్తున్నారో వివరించి వుంటే బాగుండేది.

    ReplyDelete
  2. pravaledu noti durvasana unde variki kodnarikina

    ReplyDelete
  3. peeki paakaaana(pakkana?) pette varaku... dentists alaaagenandii...

    modata surgery to modaletti.. chivaraku scaling.. cleaning lato beram kudurchukuntaaru mari...!!

    NOM.

    ReplyDelete
  4. "అలాగే రోజూ మెంటల్ ఫ్లాసింగ్ చేస్తే మనస్సుకి మంచిదంటారు. అయితే అది ఎలా చేయాలి? సింపుల్. రోజూ నా బ్లాగు పారాయణం చేయండి."

    జోకా ? సీరియస్సా ?

    ReplyDelete
  5. మూర్ఖు లల్లో వీర మూర్ఖులు నాస్తిక
    అక్కు పక్షి చీక ఆకు పక్షి
    కిథలు జెప్ప నరులు కిలకిల మనినవ్వె
    విశ్వదాభిరామ వినుర మూర్ఖ

    ReplyDelete
  6. @ సి బి రావ్
    ఆసక్తి వున్నవారు గూగుల్ చేసి తెలుసుకుంటారు లెండి. ఏ సమాచారం అయినా నెట్టులో దొరుకుతుంది కాబట్టి నాకు టపాల్లో అంతగా సమాచారం ఇవ్వాలనిపించదు.

    @ అజ్ఞాత
    మీ వ్యాఖ్య అర్ధం కాలేదు.

    @ కేసరి
    అవునండీ. పళ్ళూ, డబ్బులూ రెండూ పీకేసేవరకు డెంటిస్టులు వదలరు!

    @ అజ్ఞాత.
    సీరియస్ జోక్.

    @రామిరెడ్డి
    ఎక్కడో వేయాల్సిన కామెంటు ఇక్కడ వేసేరా?

    ReplyDelete
  7. అబ్బే.. ఎక్కడో కాదు, కావాలనే ఇక్కడ వేసాను. ఎంతైనా మీ "బాయ్యా" కదా :)

    ReplyDelete