మంగళవారం 30 నవంబర్ 2010

Top Traffic Sources

  నిన్నటి రోజు గణాంకాలు
శరత్ కాలం బ్లాగ్

  Sources      Visits       % visits


koodali.org       90       29.90%

maalika.org       71       23.59%

haaram.com      51      16.94%

google              24         7.97%

(direct)             23         7.64%


స్వప్న రాగలీన బ్లాగ్

Sources                                     Visits         % visits


koodali.org                                   108           43.03%

maalika.org                                    38           15.14%

haaram.com                                   35           13.94%

jalleda.com                                    28            11.16%

sarath-kaalam.blogspot.com          20              7.97%

పుస్తకాలు పంచుకుందామా?

సుజాత గారి అనైతికం అనే టపా వ్యాఖ్యల్లో యండమూరి పుస్తకాల గురించి కల్పనా రెంటాల గారు ఆసక్తి కనపరచినప్పుడు తన దగ్గర వున్న యండమూరి పుస్తకాలు వారికి పంపించడానికి KumarN సిద్ధపడ్డారు. అప్పుడు నాకు కల్పన గారి మీద అసూయగా అనిపించింది. నాక్కూడా అలా ఎవరయినా పుస్తకాలు ఆఫర్ చేస్తే తెప్పించుకొని కమ్మగా చదివేసుకునివుండేవాడిని కదా అనుకున్నాను. నాకు ఆ పుస్తకాలు KumarN ఆఫర్ చెయ్యనందుకు నా మనస్సులో కుళ్ళుకున్నాను.

కొన్నినెలల క్రితం ఇండియా వెళ్ళబోయేముందు ఇండియాలో ఏం పుస్తకాలు కొనుక్కొచ్చుకుంటే బావుంటుందేంటి అని ఓ టపా వేసాను. సహృదయులు కొంతమంది చక్కటి పుస్తకాలు కొన్ని సూచించారు. ఇండియానుండి తిరిగివచ్చాక మళ్ళీ నేను ఆ పుస్తకాల ఊసే ఎత్తలేదు. ఎందుకంటే వారందరూ నన్ను తిట్టేస్తారనీ. ఎందుకంటే అంత బ్యుల్డప్పు ఇచ్చి అక్కడ క్షణం తీరిక లేక ఒక్క పుస్తకం కూడా కొనుక్కురాలేదని తెలిస్తే పుస్తక ప్రియులు థూ అని తిడతారేమోనని భయమేసింది.   

ఇక్కడ నుండి తెలుగుపుస్తకాలు కొందామంటేనేమో అదేదేదో వెబ్ సైటు నుండి తెప్పించుకోవాలంటే బాగానే ఖర్చు అవుతుంది. అలాక్కాకుండా మనం చదివి 'వదిలేసిన' పుస్తకాలూ, మనం ఆబ్సొలేట్ అనుకున్న పుస్తకాలపై ఇతరులకు ఆసక్తీ, అవసరం వుండవచ్చు. అందువల్ల అలాంటి పుస్తకాలు మనలో మనం షేర్ చేసుకుంటే పోలా? ప్రతి ఏడాదీ ఇంట్లో ఎక్కువ స్థలం లేక ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు కొన్నయినా చెత్తకుప్పలో పడేస్తుంటాను. అలా కొన్ని చలం పుస్తకాలు కూడా అవతల పారేసాను. ఏవో కొన్ని వారు వ్రాసిన నాటకాలు నాకు అంతగా నచ్చలేదు. బోర్ అనిపించాయి మరి.    అలా కాకుండా ఆ పుస్తకాల లిస్టు నా బ్లాగు ద్వారా తెలిపి ఎవరికయినా ఆ పుస్తకాల పట్ల ఆసక్తి వుందంటే పోస్ట్ చేస్తాను. ఆ లిస్టు ఒకటి రెండు రోజుల్లో పెడతాను.

అలాగే మీదగ్గర అలా పంచుకోదగ్గ పుస్తకాలు ఏమన్నా వున్న నాకుగానీ, ఇక్కడగానీ తెలియజేస్తే నాకు ఆసక్తివున్నవి పంపించమని కోరుతాను. అలాగే ఇతరులు కూడా కోరవచ్చును. ఫస్ట్ ప్రెఫరెన్స్ మాత్రం నాకే. ఆ. నేను US లో వుంటున్నందువలన యు ఎస్, కెనడాలలో వుంటున్నవారికి మాత్రమే నేను పంపించగలను అలాగే ఇక్కడ వుంటున్న వారి నుండి మాత్రమే నేను కోరగలను. ఇదేవిధంగా ఇండియాలోనూ, AP లోనూ, వివిధ జిల్లాలు, నగరాల్లోనూ మీరు కోరితే ఆయా ప్రాంతాలలో వుండేవారు స్పదించడం వల్ల మీరందరూ పరస్పరం ఎంచక్కా పుస్తకాల మార్పిడి చేసుకోవచ్చును. ప్రాంతీయవాదులయితే ఆయా ప్రాంతాల వారినుండి మాత్రమే ఇచ్చిపుచ్చుకోవచ్చును. ఏమంటారు? 


ఆదివారం 28 నవంబర్ 2010

నవతరంగంలో జోశ్యుల సూర్యప్రకాశ్ (ప్రతి)వ్యాఖ్యలు ....

నవతరంగంలో వచ్చే చాలా కామెంట్లకి జోశ్యుల రిప్లయ్ ఇస్తున్నట్టున్నారు కదా. వారి రిప్లయ్ లు చూస్తే మీకేం అనిపిస్తుందేంటీ? అహ మీకేమనిస్తుందో జస్ట్ తెలుసుకుందామని అంతే...  

శుక్రవారం 26 నవంబర్ 2010

సూర్యాపేట నాస్తికకేంద్రం కార్యకలాపాలు

తెలంగాణా నాస్తికోద్యమ చరిత్ర పుస్తకంలో సూర్యాపేట నాస్తికకేంద్రం కార్యకలాపాలు, అది క్రమంగా విఫలమయిన తీరుతెన్నులూ వివరించారు.


http://maanaanna.blogspot.com/2010/11/blog-post_8196.html

అప్పటి ఎన్నికల్లో నాస్తికులు

http://maanaanna.blogspot.com/2010/11/blog-post_26.html

గురువారం 25 నవంబర్ 2010

రేపాల పోరాటకెంద్రంలో కానాగారి నాస్తికపాఠాలు

తెలంగాణా నాస్తికోద్యమ చరిత్ర - పార్ట్ 1 - రేపాల పోరాట కెంద్రంలో కానాగారి నాస్తిక పాఠాలు

http://www.youtube.com/watch?v=CC_bIcs10tE

బుధవారం 24 నవంబర్ 2010

వీడియో: తెలంగాణా నాస్తిక చరిత్ర - ప్రస్థావన

మా నాన్న నాగం గారు రచించిన తెలంగాణా నాస్తికోద్యమ చరిత్ర అన్న చిన్న పుస్తకానికి వారు వ్రాసిన ప్రస్థావన ఇది. రచనాకాలం నవంబర్ 1992.

http://www.youtube.com/watch?v=8s4AUIl-ms4

పైరేట్లు - అమెరికా విధానం - రష్యా విధానం

ఓ అయిదుగురు సోమాలియా సముద్ర దొంగలకి US లో ఈ రోజు నేర నిర్ధారణ చేసారు. వారిని యుఎస్ కి తీసుకువచ్చి జైల్లో వుంచి తీరిగ్గా విచారించి శిక్షించారు. మరి శిక్ష ఎంతకాలం వేస్తారో ఇంకా తెలియదు గానీ చాలాకాలం అయితే జైల్లో పెట్టి మేపుతారు.
http://news.blogs.cnn.com/2010/11/24/virginia-jury-convicts-somali-men-of-piracy/?hpt=T2

కొంతకాలం క్రితం కొంతమంది సోమాలియా పైరేట్లు రష్యా నావికా దళానికి దొరికారు. కానీ తమదేశ చట్టాల ప్రకారం వారిని శిక్షించలేమని వదిలిపెట్టి చేతులు దులుపుకున్నారు.
.
.
.
వాళ్ళు విడుదలై వెళుతుండగా ఎవరో ఆ పైరేట్లని కాల్చి చంపారు! ఖేల్ ఖతం.
http://www.thefirstpost.co.uk/63244,news-comment,news-politics,russian-navy-sent-somali-pirates-to-their-death-from-the-moscow-university
అలా కాల్చిచంపబడ్డ పైరేట్ల హక్కుల ఆత్మశాంతికి ప్రార్ధించాలనుకునే పౌరహక్కుల బ్లాగర్లు ఎవరయినా వుంటే నిక్షేపంగా ప్రార్ధించండి.

కొత్త ముఖ్యమంత్రిగా ఎవరయితే బావుంటుంది?

ఎవరవుతారు అన్నది మన 'చేతి'లోని విషయం కాదు కాబట్టి ఎవరయితే బావుంటుంది అనేది చూద్దాం. త్వరలోనే ఒక పోల్ పెడుతున్నాను. అందులో లేని పేర్లు తెలియజేయాలనుకుంటే వ్యాఖ్య ద్వారా చెప్పండి.

మంగళవారం 23 నవంబర్ 2010

నల్లగొండ జిల్లాకి రాహుల్ కొడుకు పేరు పెట్టాలి!

ఈమధ్య ఏదో జిల్లాకి రాజీవ్ పేరు పెట్టాలని రోశయ్య గారు ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి కదా. నాక్కూడా కాంగ్రెస్సంటే కొంచెం అభిమానం. అందుకే మన దేశ యువరాజు మరియు భావి భారత ప్రధాని అయిన రాహుల్ గాంధీకి పుట్టబోయే కొడుకు పేరు మా నల్లగొండ జిల్లాకి పెట్టాలని డిమాండ్ చేస్తూ నా కాంగ్రెస్సు పార్టీ భక్తి ప్రపత్తులు అందరికంటే మిన్నగా చాటుకుంటున్నాను. వీర కాంగ్రెస్సు వాదులందరూ నా అవుడియాను మెచ్చుకుని సంతసించి నాకు అభినందనమందారమాలలు వెయ్యాల్సిందిగా సవినయంగా మనవి చేసేస్కుంటున్నాను.

మరి రాహుల్ గాంధీకి పెళ్ళేకాలేదు కదా, కొడుకు పుట్టనేలేదు కదా, పేరెట్టలేదు కదా అని కుశంకలు మానండి. మీకు గణిత శాస్త్రం తెలుసుకదా. అందులో ఏదయినా తెలవకపోతే X అనుకుంటాము కదా. అలాగే అందాకా ఎక్స్ అనో సోమలింగమనో పెట్టేద్దాం. ఆ కొడుకులుంగార్లు ఉద్భవించాక మరో జిఓ పాస్ చేసి పేరు మార్చేద్దాం. సింపులూ. 

సోమవారం 22 నవంబర్ 2010

ఓ మతిస్థిమితం లేని మనిషి మీకెదురయితే...?

మీరు వీధిలో నడుస్తున్నారు. ఓ వ్యక్తి వచ్చి మీ తల మీద టెంకిజెల్ల ఇచ్చి వెళతాడు. ఏం చేస్తారేంటి మీరు? ముందు ఆగ్రహం వస్తుంది. వాడిని పట్టుకొని ఒక్కటి పీకాలనుకుంటారు. కానీ అతడు స్థిమితం లేని మనిషి అని అర్ధం అవుతుంది. ఏం చేస్తారప్పుడు? అప్పుడు కూడా అతడి నెత్తి మీద ఒఖ్ఖటి పీకుతారా? లేక అయ్యో పాపం అని జాలి పడివదిలేస్తారా?

యుద్ధమయినా, శత్రుత్వమయినా సమస్థాయివాడితో చేస్తేనే భ్యావ్యంగా వుంటుంది. ఎదుటివారికి స్థిమితం లేదేమోనన్న సందేహం వున్నప్పుడు బెనెఫిట్ ఆఫ్ డవుటుతో జాలిపడి వదిలేయడం ఉత్తమం అనిపించుకుంటుందనుకుంటాను. అలాంటి అనుమానం రానప్పుడు, ఎదుటి వ్యక్తి గురించి అయోమయపడ్డప్పుడు ఆ వ్యక్తి మీద పొరపాటుగా మనం తిరిగి దాడిచేసివుండవచ్చు. కానీ పదే పదే అవతలవ్యక్తి తన అస్థిమితాన్ని ప్రదర్శించినప్పుడు అవతలివారి మతి స్థితి మనకు తేలిగ్గా అర్ధం అవుతూనేవుంటుంది. అలాంటివారిమీద చేసే యుద్ధం అభాసుపాలు కావచ్చు.

నా చిన్నప్పుడు మా ఊరిలో ముస్తఫా అని బాగా చదువుకున్న, తెలివయిన(?) పిచ్చివాడు వుండేవాడు. మా నాన్నగారితో ఆవేశంగా ఏవేవో చర్చిస్తుండేవాడు. అతని సంగతి నాన్నగారికి బాగా తెలుసు కాబట్టి అతని వాదనలన్నీ ఓపికగా విని పంపించేస్తుండేవారు. అతను వెళ్ళాక అతని గురించి మాట్లాడుకుంటూ అందరం బాగా జాలిపడేవారం. అతను మా ఊరి బస్సు స్టాండు వద్ద పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే అందరూ ఆటపట్టిస్తుండేవారు. గేలిచేస్తుండేవారు. కొందరు రాళ్ళు తీసుకొని విసురుతుండేవారు. నాకు జాలిగా అనిపిస్తుండేది.

ఆదివారం 21 నవంబర్ 2010

తెలంగాణా నాస్తికోద్యమ చరిత్ర పుస్తకానికి శ్రీ లవణం గారి ఉపోద్ఘాతం

మా నాన్న గారు రచించిన తెలంగాణా నాస్తికోద్యమ చరిత్ర అన్న చిన్న పుస్తకానికి విజయవాడ నాస్తిక కేంద్రం నిర్వాహకులు శ్రీ లవణం గారి ఉపోద్ఘాతం. రచనా కాలం: 23-09-1994.



http://www.youtube.com/watch?v=DI5h4GHqL4U

శనివారం 20 నవంబర్ 2010

నా వీడియో: తెలంగాణా నాస్తికోద్యమ చరిత్ర - శ్రీ సురమౌళిగారి ముందుమాట

మా నాన్న నాగం గారు రచించిన తెలంగాణా నాస్తికోద్యమ చరిత్ర అనే పుస్తకానికి శ్రీ సురమౌళిగారి ముందుమాట.
రచనా కాలం 14-09-1994.

http://www.youtube.com/watch?v=tQlpopdfyy4

శుక్రవారం 19 నవంబర్ 2010

రెడ్‌హ్యాండెడ్ కథల్: ఆమె ఎక్కడ?

ఇది జరిగిందీ మా సూర్యాపేట ఇంట్లోనే. మా ఇల్లు సన్నగా, పొడుగ్గా మెయిన్ రోడ్డు నుండి వెనుక వీధి దాకా వుంటుంది. వెనుక ఇంట్లో మేము వుండేవారం. ముందు ఇల్లు కిరాయికి ఇచ్చేవారం. మధ్యలో ఖాళీ స్థలం. ఆ స్థలం లోనే చిన్న గది నాకోసం ప్రత్యేకంగా వుండేది. అదీ నా కార్యస్థలి, నాలోకం, నా ప్రపంచం.

ఒకరోజు రాత్రి 2 గంటల స్మయంలో మా అమ్మ నా గది తలుపు కొడుతుంటే తలుపు తీసాను. "బాల వుందా ఈ గదిలో?" అని అనుమానంగా చూస్తూ అడిగింది. నేను కళ్ళునులుపుకుంటూ "నాగదిలో బాల ఎందుకుంటుంది!" అని హాశ్చర్యంగా అడిగాను.  నా గది పరికించి చూసి ఎవరూ కనపడకపోవడంతో ఇంటిముందు భాగం వెతకడానికై వెళ్ళింది.

అమ్మ అటువెళ్ళగానే నా మంచం క్రింద దకున్న మా పనిఅమ్మయి బాలను పైకి రమ్మని చెప్పి నిశ్శబ్దంగా తను పడుకునే చోటికి వెళ్ళి పడుకొమ్మని చెప్పాను. ఆమె మా అమ్మ మంచం పక్కనే క్రింద పక్క వేసుకొని పడుకుంటూవుంటుంది. మా అమ్మ ఇంటి ముందు భాగం వెతికి ఆమె కనపడకపోవడంతో తిరిగి మా వెనకింటికి వెళ్ళడం నా గది కిటికీలోనుండి గమనించాను. అమ్మ ఎక్కడికివెళ్ళావింతసేపు అని అడిగితే బాత్‌రూముకి వెళ్ళానని చెప్పమని ఆ ఆమ్మాయికి చెప్పాను. అమ్మ ఇంటిలోకి వెళ్ళాక, బాలని చూసాక ఏమయినా అరుపులు, కేకలు వినపడతాయేమోనని చూసాను కానీ అలాంటి దాఖలాలేమీ లేకపోవడంతో ఇక హాయిగా నిద్దురోయాను.

మరునాడు బాల ఏకాంతంగా దొరికితే రాత్రి ఏమయ్యింది అని అడిగాను. అమ్మ అడిగితే నేను చెప్పమన్నట్లే చెప్పిందటకానీ ఆమె నా గదినుండి పిల్లిలా బయటకి వచ్చి ఇంట్లోకి వెళుతుంటే మా అమ్మ చూసేసిందిట. బాప్ రే బాప్. నన్ను   మా అమ్మ పట్టుకొని ఎప్పుడయినా తిడుతుందేమో అని చూసాను కానీ విస్మయకరంగా కొన్నిరోజులయినా సరే ఏమీ తిట్టలేదు. దాంతో ఇలాంటి విషయానికి మా అమ్మ నన్ను తిట్టకపోవడం ఏంటా అని తెగ హాశ్చర్యపడిపోసాగాను. 

ఓ శుభదినాన మెదక్కులో వుంటున్న మా నాన్నగారి నుండి నాకు ఉత్తరం వచ్చింది. అందులో మళ్ళీ నీతిబోధలూనూ, నీతి చంద్రికలూనూ. ఆ అమ్మాయికి కడుపు, గట్రా వస్తే పేద్ద సమస్యయిపోద్దేమో అందుకని ఆ అమ్మాయిని వదిలెయ్యి అని కూడా అంటాడు మా నాన్న. ఛ. హంత హమాయకుడినా ఏంటి నేనూ? అంతకూ మరీ సమస్యొస్తే భేషుగ్గా ఆ అమ్మాయిని పెళ్ళే చేసుకుంటాను అనుకున్నాను. ఎలాగూ మనకి కులమతాలు లేదు - దీనజనాద్ధోరణ, పని అమ్మాయిల ఉద్ధరణే మన జీవితాశయం కదా - ఓ పని అయిపోద్ది అనుకున్నాను. నిజంగానే నాకింతవరకూ అలాంటి చక్కని మనస్థత్వం వున్నవారు కనపడలేదు. ఆ అమ్మాయీ ఎక్కువగా కలర్ లేకపోయినా చక్కగా వుండేది.  మా నాన్న వ్రాసిన ఉత్తరాన్ని నలిపివేసి చెత్తలోకి విసిరేసాను.   

మళ్ళీ మన పనులు మనకు మామూలే. ఇలా లాభం లేదని బాలని ఉద్యోగంలోనుండి ఫైర్ చేసింది మా అమ్మ. అలా అని ఊరుకుంటానేంటీ. వారి తండాకు వెళ్ళి మరీ గడిపివచ్చేవాడిని. అక్కడ నన్ను ఆమె తల్లితండ్రులు కొత్త అల్లుడిలా చూసుకునేవారు. వారికి చేలు కూడా వుండేది. అప్పుడప్పుడు వారి చేలల్లోకి మేము వెళ్ళి పగలే హాయిగా, ఏకాంతంగా ఆ చేల మధ్య ప్రకృతిలో సృష్టికార్యం నిర్వర్తిస్తుండేవారం. ఆ అమ్మాయితో పాటుగా అప్పుడప్పుడు ఒక బోనస్ కూడా దొరుకుతుండేది.
ఇంతటితో ఈ రెడ్‌హ్యాండెడ్ సిరీస్ ముగిస్తున్నాను. మరికొన్ని సార్లు దొరికిపోయినప్పటికీ మరీ రెడ్ హ్యాండేడుగా దొరకలేదు కాబట్టి అవి మరోసారి చెప్పుకుందామేం.


వచ్చేవారం "శరత్ - ఓ గొప్ప డైరెట్రు!" అనే సిరీసులో నేను వెలగబెట్టిన నిర్మాణదరకత్వ అనుభవాల గురించి వెళ్ళడిస్తా. ఏవో కొన్ని డివిడి సినిమాలు తియ్యాలని అప్పట్లో ప్రయత్నించాలెండి.

గురువారం 18 నవంబర్ 2010

పతివ్రతలెంతమంది?

సాధారణంగా నిజమయినా కాకున్నా ప్రతి స్త్రీ తానో గొప్ప పతివ్రతననే, కన్యననే ఫోజు కొడుతుంది. ఇతరులకూ హితోపదేశాలు చేస్తుంది. అయితే నాకో డవుట్ స్త్రీలల్లో నిజంగా పతివ్రతతల శాతం ఎంతమంది వుండవచ్చు అని. అయితే పాతివ్రత్యాన్ని ముందు డిఫైన్ చెయ్యమని మీలో కొదరయినా అడుగుతారని తెలుసు. అంతటి ధర్మసూక్ష్మాలను గురించి చెప్పడానికి నేనంత పండితుడిని కాదుగానీ సరదాగా కొన్ని అనుకోళ్ళు అనుకుందామేం.

మానసిక వ్యభిచారాన్ని మనం పసిగట్టలేము కాబట్టి మనస్సును పరిగణలోకి తీసుకోకుండా కేవల శారీరక పాతివ్రత్యాన్నే దృష్టిలో ఉంచుకుందాం. పాతివ్రత్యం పోగొట్టుకోవడం అంటే ఒక్క రతి చెయ్యడం కాదు ఉపరతుల్లో పాల్గొన్నా, లేదా ముద్దు ముచ్చట్లలో (అంటే ముచ్చట్లు అని నా భావం కాదు - ముద్దులతో కూడిన ముచ్చట్లు అని నా భావం) పాల్గొన్న వారి పాతివ్రత్యం క్యాన్సిల్ అయినట్లే. హమ్మా, లేకపొతే కన్యాత్వం పోగొట్టుకోకుంటే చాలు పాతివ్రత్యాన్ని నిలబెట్టుకున్నట్లే అని చాలమంది యువతులు సమర్ధించుకుంటారు. అలా ఎంతమందిని చూడలేదు మనం?  

అయితే ఇప్పుడు ఒక ధర్మసందేహం వస్తుంది. ఆ అమ్మాయికి ఇష్టం లేకున్నా, పొరపాటుగానో, గ్రహపాటుగానో ఎవడయినా బలాత్కారం చేసినా లేకపోతే అదో ఇదో ప్రయత్నించి చూసినా అప్పుడు ఆ అమ్మాయిని ఏ క్యాటగిరీ క్రింద లెక్కగట్టాలి? వారిని పత్రివ్రతల లిస్టులో వేద్దామంటే మిగతా అడోళ్లు చాలా మంది అన్నీ మాకిష్టం లేకుండానే జరిగినవే అని సమర్ధించుకుంటారు.  సరే, అలా సమర్ధించుకునే శాతాన్ని వదిలేసి నిజంగా వారికి అలాంటి ఉద్దేశ్యం లేకుండానే వారికి ఏమయినా అనుభవాలు జరిగినట్లయితే వారిని పతివ్రతలు, కన్యల జాబితాలో వేద్దాం. ఏమంటారు?

ఈ విషయంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఒక పోల్ పెడతాను. ఇది పతివ్రతలను కించపరచడానికో లేక ప్రోత్సహించడానికో కాదు. ఒక సున్నితమయిన విషయం మీద అందరి అభిప్రాయం ఎలావుందో తెలుసుకోవడమే ఈ పోల్ ఉద్దేశ్యం. నా ఉద్దేశ్యం, అంచనా ప్రకారమయితే పైన నిర్వచించినట్టటువంటి పతివ్రతలు కానీ, కన్యలు కానీ 20% మించి వుండరు!  కాపీలూ, టిపినీలూ లెక్కలోంచి తీసివేస్తే మాత్రం 66% పైగా కన్యలూ, పతివ్రతలూ వుండవచ్చు అనేది నా అంచనానూ, అభిప్రాయమూనూ. ఎక్కువమంది యువతులు ఆ 20 శాతానికీ 66 శాతానికీ మధ్యన ఇరుక్కుపోతారు అన్నది నా స్వానుభవాలతో కూడిన అంచనా. మీరేమంటారు?    

రెడ్‌హ్యాండెడ్ కథల్: తాళంచెవి

ఇదీ సూర్యాపేటలోనే జరిగింది. మా ఇల్లు కొత్త బస్‌స్టాండుకి చాలా దగ్గర అవడంతో మా అన్నయ్య స్నేహితుడు చారి తన డొక్కు సైకిలును మా ఇంట్లో పార్క్ చేసి బస్సుల్లో ఇతర ప్రదేశాలకి వెళుతుండేవాడు. అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా బస్సు దిగి సరాసరి మా ఇంటికి వచ్చి మమ్మల్ని లేపి తన సైకిలు తీసుకువెళుతుండేవాడు. మాకు అది అసహనంగా అనిపించినా అతను మంచివాడు, హాస్యస్ఫూర్తి కలవాడు అవడంతో ఆ చికాకు భరిస్తుండేవాళ్ళం. చాలా చక్కగా నవ్వించేవాడు లెండి.

ఆ రోజు రాత్రి రోజూలాగానే ఇంటి సందుకి వున్న తలుపుకి తాళం వేసాను. అమ్మానాన్నలు ఆ రోజు ఎక్కడికో వెళ్ళారు. నేనూ మరియు ఓ చుట్టం అమ్మాయి మాత్రమే వున్నాము. రాత్రి పడుకోవడానికి మిద్దె మీదికి వెళ్ళాము. ఇద్దరమే వున్నాము కాబట్టి స్వేఛ్ఛగా వున్నాము. ఒంటిగంట ప్రాంతంలో మా పనిలో మేము లీనమై వుండగా శరత్ అని వినిపించింది. మా ఇంట్లొ కిరాయికి వుండే అబ్బాయి మెట్ల మీద వుండి పిలుస్తున్నాడు. మా వ్యవహారం మసకచీకట్లో అతను గమనించాడు.

"ఏంటి" అని అడిగాను చిరాగ్గా. "చారి గారు తలుపు కొడుతున్నారు. తన సైకిలు తీసుకెవెళ్ళాలంట, తాళం చెవి కావాలి" అని ఇబ్బందిగా అన్నాడు. నాకు చారిగారి మీద బాగా మండుకొచ్చింది. చిరాగ్గా క్రిందికి వెళ్ళి తలుపు తీసాను. "హి హీ, మధ్య రాత్రి వచ్చాను కదా, నిద్ర డిస్ట్రబ్ అయ్యిందా" అని అడిగాడు చారిగారు. ఇదివరకు అయితే ఫర్వాలేదండీ అని మొహమాటంతో అంటుండేవాడిని. "అవునండీ, ఇబ్బందిగానే వుంది, మీ సైకిలు మరెక్కడయినా పెట్టుకుంటే బావుంటుంది" అని అప్పుడు  ఖండితంగా చెప్పాను. మనవాడు నానుండి ఆ మాటలు ఊహించకపోవడంతో ముఖం వెంటనే మాడ్చేసుకుని సైకిలు తీసుకొనివెళ్ళాడు.  ఆ తరువాత మళ్ళెప్పుడూ మా ఇంట్లో సైకిలు పెట్టలేదతను.

అతను వెళ్ళాక మళ్ళీ మేడ మీదికి వచ్చి నా పనిని రెజ్యూం చేసాను. ఆ రాత్రి నన్ను నిద్రలేపిన అబ్బాయికీ నాకూ మధ్య ఈ టాపిక్ ఎప్పుడూ రాలేదు. ఇద్దరం గుంభనంగానే వుండిపోయాము. 

బుధవారం 17 నవంబర్ 2010

రెడ్‌హ్యాండెడ్ కథల్: బాలతో సహా బుక్కయ్యా

బాల అనే (పని) అమ్మాయితో నా సాన్నిహిత్యం గురించి నా వీడియో పోస్టులో వివరించాను కదా. ఆ రోజుల్లోనే ఇది జరిగింది. మా సూర్యాపేట ఇంటి పక్కనే మా పెద్దక్కయ్య వాళ్ళ ఇల్లు కూడా వుండేది. వాళ్ళింటికీ మా ఇంటికీ మధ్య ఒక గడప కూడా వుండేది.

ఒక శుభసమయాన మా అమ్మ లేనిది చూసి ఆదమరచి బాలతో చనువుగా వున్నాను. ఆ సమయాన తన ఇంటినుండి  మా అక్కయ్య వచ్చి మమ్మల్ని దూరం నుండి చూసెయ్యడమూ, చూసి గిరుక్కున వెనుదిరగడమూనూ నేను చూసాను.  హతోస్మి అనుకున్నా కానీ ఆగబుద్ధి కాలేదు. ఆ అమ్మాయితో నేను గడిపేసిన కొంతసేపటికి ఆమెని మా అక్కయ్య వాళ్లింటికి పిలిచింది. ఏమన్నా తిడితే లైట్ తీస్కో అని ఆమెకి చెప్పాను. కొద్ది సేపట్లోనే ఆమె వెనక్కు వచ్చింది. తిట్టిందా అక్కయ్య అని అడిగాను. తిట్టలేదు అని చెప్పి ఒక కాగితం చేతికిచ్చింది. అది మా అక్కయ్య నాకు వ్రాసింది. ఆ లేఖలో నాకు అన్నీ హొతోపదేశాలు, నీతికథలు వున్నాయి. ఓ సారి చదివి ఆ లేఖని చెత్తబుట్టలోకి గిరవాటేసి బాల చూస్తుండగా భుజాలెగరేసాను.   

ఇలా అమ్మలక్కలని పట్టించుకుంటే మన పనులెన్నటికి కావాలీ? అప్పటినుండీ అలాంటి సమయాల్లో అక్కయ్య వాళ్ళింటికీ, మా ఇంటికీ వున్న తలుపు గడియ పెట్టడం మరచిపోలేదు.

సోమవారం 15 నవంబర్ 2010

రెడ్ హ్యాండెడ్ కథలు - నీలి చిత్రాలు

మేడ మీది ముచ్చట్లు సిరీస్ ప్రస్థుతం ఆపివేస్తాను. ఏదో అటువంటి అనుభవాలు 4 లేదా 5 వుంటాయేమో అని అది మొదలుపెడితే నా జ్ఞాపకాల శిధిలాల పొరలను దులుపుతుంటే ఎన్నో మధురానుభూతులూ, తియ్యటి అనుభవాలూ గుర్తొస్తున్నాయి. అవన్నీ వ్రాస్తూ పొతే ఓ గ్రంధమయ్యేట్టుగా వుండి సరసులకు బోర్ కొట్టొచ్చని ఈ వారం టాపిక్ మార్చేస్తున్నా. ఇహ నన్ను రెడ్ హ్యాండెడుగా పట్టుకోండిక.

ఇప్పుడంటే నీలి చిత్రాలు సాధారణం అయిపోయాయి గానీ మా యవ్వనకాలంలో అవి చూడటమంటే ఓ సాహసం, సరదానూ. వాటిని చూడటం కోసం ఎన్నెనో సెక్స్‌వెంచర్స్ చేసేవారం. అలాంటి క్రమంలోనే నేనూ మా మిత్రులూ  మా డాబా మీద చలిలో చూడసాగాము. చలిపెడుతుంటే దుప్పట్లు కప్పుకొని మా దేహాలు వేడివేడి పొగలు విరజిమ్ముతుండగా ఆ చిత్రరాజాలని తిలకించి ఎంతోకొంత పుణ్యం కట్టుకునేవారం.  మరి మా డాబా మీదికి అనుకోకుండా ఎవరయినా వస్తే ఎలా? ఎవరన్నా వస్తే ఆ క్యాసెట్లు మార్చివేయడం కోసం సాధారణ చిత్రాలు బ్యాకపుగా పెట్టుకునేవారం.

మా అమ్మ సినిమాలు తానూ  చూద్దామని ఎక్కడ మేడమీదికి వస్తుందో అని భయ్యం. కుక్క కాపలాగా మెట్ల దగ్గర నేను కూర్చొని ఆ చిత్రరాజములను దూరం నుండి అయిన ఓపికగా తిలకిస్తూండేవాడిని. ఒకటి రెండు రోజులు సాధారణంగా  గడచిపోయినా తరువాతి రోజు మేడ మీదికి రాసాగింది.  అది చూసి గుండే దదదడలాడగా కోడ్ వర్డ్ పలికాను. అంతే మావాళ్ళు సినిమా మార్చి పెట్టారు. మా అమ్మ వచ్చి కూర్చొని ఆ సినిమాను తిలకించింది. కొద్దిసేపటికి మా అందరి అసహనం అర్ధమయ్యిందేమో వెళ్ళిపోయింది. ఇంకేముంది మళ్ళీ సిత్రం మార్చేసి చూసేసాం.

ఆ తరువాత రోజు కూడా మా అమ్మ మేడ మీదకు వచ్చినా సరే అదే అసహనం అందరిలో కనిపించడంతో తల పంకించుకుంటూ క్రిందికి వెళ్ళిపోయింది. కొంపదీసి మా సినీమా సిత్రాలు అర్ధం అయిపోలేదు కదా అని గుండె చిక్కబట్టుకొని ఆ సినిమాలు చూసాను. మర్నాడు ఉదయం నేను మేడ దిగాక సుప్రభాతం వినపడుతుందేమోనని బిక్కుబిక్కుమంటూ దిగాను. అయితే సుప్రభాతం ఏమీ వినిపించలేదు! మా అమ్మ కనపడ్డా, మాట్లాడినా ఆ టాపిక్  మామధ్య రాలేదు. అయితే మా అమ్మకి విషయం అర్ధం కాలేదులే అనుకొని  మామూలుగా ఆ రోజు కాలేజీకి వెళ్ళాను.  

సాయంత్రం ఇంటికి రాగానే మా ఇంట్లో కిరాయికి వుండే మా ఊరి మిత్రులు నన్ను మా డాబా మీదికి తీసుకువెళ్ళారు. ఓరి వీరి అసాధ్యం కూలా పగలే నీతి సిత్రాలు మొదలెట్టేసేరా అని నేనూ ఆదరాబాదరా పైకి వెళ్ళాను.  మా అమ్మ మధ్యాహ్నం వాళ్ళని తిట్టేసిందిట - నన్ను కూర్చోబెట్టి  గుసగుసగా చెప్పారు. నన్ను ఈ విషయంలో సరాసరి తిట్టలేక వారిని మా అమ్మ తిట్టిందన్నమాట.  విషయం అర్ధమయ్యింది. మళ్ళీ మా అమ్మ ఇంట్లో వున్నప్పుడు ఎప్పుడూ నీలి చిత్రాలు అలా వేసుకొని చూడలేదు. మా అమ్మని ఎటన్నా తీర్ధయాత్రలకి పంపించి మేము ఇంట్లో సిత్రాలు వేసుకునేవారం. అప్పట్లో మా నాన్న వేరే టవునులో ఉద్యోగం చేస్తుండేవారు కాబట్టి నాన్నతో సమస్యేమీ లేదు. 

శుక్రవారం 12 నవంబర్ 2010

మేడమీది ముచ్చట్లు: వద్దే వద్దు


ఈ సారి సీను మళ్ళీ సూర్యాపేటలో మా ఇంటి డాబా పైన. ఓ వేసవి రాత్రి మిగతా కొందరితో కలిసి మా బంధువులతో ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకున్నాను. నా పక్కనే ఓ బంధువుల అమ్మాయి పడుకుంది. ఆమెకూ నా గురించి, నా వ్యవహారాల గురించీ తెలుసు. ఇలాంటి విషయాల్లో నన్ను చాలా ప్రోత్సహిస్తుంది కానీ తను మాత్రం నా వలలో పడదు. ఎప్పుడడిగినా ఇప్పుడొద్దు మరెప్పుడన్నా అని తిరస్కరిస్తూవుంటుంది. ఆడవారికీమాత్రం మొహమాటం సాధారణమే అని ఎడ్వాన్స్ అవబోయినా అస్సలు పడనిచ్చేది కాదు. మరీ మనది రేపులు గట్రా చేసే మనస్సు కాదు కాబట్టి ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించి వదిలివేస్తుంటాను.

ఆడవారు ఒకసారి వద్దంటే జీవితాంతం అలాగే అని భ్రమపడవద్దు. సాధన, శోధన అచేస్తూనే వుండాలి. ఎప్పుడో ఒకప్పుడు దేశకాలమాన పరిస్థితులు మారి మీకు యెస్సనవచ్చు. ప్రయత్నిస్తూవుంటే మనకు పోయేదేమీలేదు కదా. కొందరు మొత్తనికీ ఒకేసారి ఒప్పుకోకపోయినా నెమ్మది నెమ్మదిగా పదోన్నతులు ఇస్తుంటారు. కాఫీ, స్ట్రాంగ్ కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, హెవీ బ్రేక్‌ఫాస్ట్, ప్లేట్ మీల్స్, లైట్స్ మీల్స్, హెవీ మీల్స్, స్పెషల్ మీల్స్ ఇంకా చెప్పాలంటే దస్తరి మీల్స్ ఇస్తూపోతుండవచ్చు. దస్తరి భోజనం అంటే మరి ఆ పేరు కరెక్టేనో కాదో నాకు సరిగ్గా గుర్తుకులేదు కానీ ముస్లిములు తమ పండుగలప్పుడు భోజనం అంతా ఒకే పాత్రలో పెట్టెసుకొని గ్రూపుగా భోజనం చుట్టూ కూర్చొని తింటారు కదా, అదన్నమాట. ఏం లేదండీ గ్రూప్ మీల్స్ అనే అర్ధంలో వాడానంతే.

మనం అసలు విషయం వదిలిపెట్టి సైడుపక్కకి వెళుతున్నట్లున్నాం? సరే, ఆ అమ్మాయి దగ్గరికే వద్దాం. నా గురించి అంతా తెలిసీ నా పక్కన అంత ధైర్యంగా పడుకుందంటే?! నాకు ఆహ్వానం? ప్రయత్నిస్తే మనకు పోయేదేమీలేదు కదా. ఆమె నో అని చెప్పేలోగా మనకు కాఫీలయినా దొరకవచ్చు కదా. ప్రొసీడ్ అయ్యాను. కదలికలేదు. మరింత ముందుకి వెళ్ళాను. ఊహు స్పందన లేదు. టు డు ఆర్ నాట్ టు డు? తెలిసే కదలట్లేదా లేక నా వెధవ్వేశాలు నిద్రలో తెలియదా? ఆడవారు ఇలాంటి విషయాలలో సాధారణంగా ఇంతగా ఆదమరచి వుంటారనుకోను. లైట్ టిపినీలు నడుస్తున్నా కూడా తెలియదా? ఇప్పుడు ఆగాలా వద్దా? ధర్మ సందేహం. నీతికీ తాపానికీ మధ్య సంఘర్షణ. నేను సాధారణ మగవాడిని - మునినేమీ కాదు. ప్రొసీడ్ అయ్యాను.

ఆమెకు మెలకువ వచ్చే వుంటుందని, ఇలాంటి స్థితిలొ ఇంకా ఆమెకు మెలకువ రాకుండా వుండటం అసాధ్యమని, ఆమె నాకు సహకరిస్తోందని సమర్ధించుకుని హెవీ బ్రేక్‌ఫాస్ట్ లోకి దిగాను. అప్పొడొచ్చింది ఆమెలో స్పందన. చెయ్యి విసిరికొట్టింది.
ఏయ్ ఏంచేస్తున్నావ్? అని విస్మయంతో అడింది.
తెలుస్తూనే వుంది కదా నీకు. ఎదవ నవ్వొకటి పులుముకొని నవ్వాను.
ఆమెకు అర్ధమయ్యింది. ఆమె కూడా నవ్వింది.
హమ్మయ్య.
నాకు మెలకువ వచ్చి చూద్దును కదా నామీద నీ వేషాలు నడుస్తున్నాయి అంది.
హి హీ అని మరో వెకిలి నవ్వు నవ్వాను.
నో. నాకు ఇష్టం లేదు. టచ్ చెయ్యకు! అని నవ్వుతూ తిరస్కరించింది.
ప్లీజ్...
వద్దేవద్దు! అంటూ ఆమె మరోకరి పక్కన పడుకుంది.
మా మాటలన్నీ గుసగుసగానే మాట్లాడుకున్నాం లెండి. ఇంకేం చేస్తాం. ఏమి సేతురా లింగా అనుకుంటూ తల పట్టుకొని పడుకునిపోయాను.

మరో సారి ఇలాగే మరి కొన్ని నెలలు/కొన్నేళ్ళు తరువాత మళ్ళీ మరొక ఇంటి డాబా మీద ప్రయత్నించాను. సాధన, శోధన అనేవి నా జన్మతహా వచ్చిన జీన్సు కదా. తప్పుద్దా మరి? అప్పుడూ మెలకువ వచ్చి నవ్వుతూ తిరస్కరిస్తూ పక్కకు వెళ్ళి పడుకుంది. ఆ అమ్మాయి గురించి ఇంకా కబుర్లు వున్నాయి కానీ అవి మేడ మీది ముచ్చట్లు కావు కాబట్టి ప్రస్తుతానికయితే వదిలేద్దామేం?

ఇలా నాకు గుర్తుకు వచ్చిన మేడ ముచ్చట్లు అన్నీ వ్రాసేసాక ఈ సిరీసు ఒక గొప్ప అనుభవంతో ముగిస్తాను. ఇప్పటిదాకా చెబుతున్నవి సాధారణంగా జరిగేవే కానీ ఆ సన్నివేశం మాత్రం అసాధారణం. స్టే ట్యూన్‌డ్. ఈ సిరీసులో మేడమీది మగ ముచ్చట్లు వ్రాయట్లేదు. అవీ వ్రాయమంటారా? పారిపోతాం అంటున్నారా :)

గురువారం 11 నవంబర్ 2010

పర్ర్‌ఫెక్ట్ బ్లాగర్లు



















మన బ్లాగర్లలో దాదాపు అందరూ మిస్టర్ పర్‌ఫెక్టులే. ఎందుకంటే అందరికీ ఎదుటివాడిలోని, ఎదుటి వ్యవస్థలోని, ఎదుటి నాయకుడిలోని, ఎదుటి మేధావిలోని, ఎదుటి బ్లాగర్లోని లోపాలు మాత్రమే కనపడతాయి. తమలోని లోపాలు మాత్రం కనిపించవు, వినిపించవు, మాట్లాడవు. మూడు కోతుల వ్యవహారం అన్నమాట.

దేశం సర్వనాశనమయిపోతోందండీ, దానిని కాపాడాలి - మార్చాలి. కానీ మనం మాత్రం మారం.

రాజకీయనాయకులు వట్ఠి వెధవలండీ - మంచి వారు రావాలి. మనం మాత్రం మంచివారు అవ్వాల్సిన అవసరం లేదు.
ఫలానా రచయిత వెధవ్వండీ. మనం మాత్రం వెధవలం కాము, కాబోము.

కీ సీ ఆర్ లాంటి రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పాలి. మనకు మాత్రం బుద్ధి అక్కరలేదు. ఎందుకంటే మనం మిస్టర్ పర్ఫెక్ట్లం కాబట్టి.

పేపర్లు చెత్తగా వ్రాస్తున్నాయి - వాటిల్లో మార్పు రావాలి. మార్పు మనకక్కరలేదు. మనం మిస్టర్ క్లీన్.
ఫలానా వాడు తప్పుగా మాట్లాడాడు. మంచి భాష మాట్లాడాలి. మనం అన్నిటా ఒప్పే. మనం అన్నిటా పరిశుద్ధులం కాబట్టి.
సమాజం భ్రష్టు పట్టిందండీ. మార్పు రావాలి. కొత్త సమాజం రావాలి. ఆ మార్పు మనలో అక్కరలేదు. మనం మార్పుకి అతీతం.

సినిమాల్లో ఎక్కడ చూసినా బూతేనండీ. మార్పు రావాలి. మార్పు మనకక్కర లేదు. మనం మారం.

అమ్రికా వోడు విధానాలు మార్చుకోవాలండీ. బరాకుకు బుద్ధి లేదండీ. ఎకానమీ విధానాల్లో మార్పు రావాలి. మనకు మాత్రం మార్పు అనవసరం. మనం మారలేదు. మార్పు రాదు. మారబోము.

అందరిలో మార్పు రావాలి. సమాజం మెరుగవ్వాలి. అందరూ అన్నాతమ్ముల్లా కలిసిమెలసి వుండాలి. మనం మాత్రం బండరాయిలా వుండాలి.

ప్రతీవారూ ఎదుటి దాంట్లో మార్పును ఆశించడం, మంచితనాన్ని ఆశించడం, మెరుగుదలని వాంఛించడమే కానీ తమ దగ్గరికి వచ్చేసరికి మార్పు చెందితే, మంచిగా మారితే, మెరుగయితే... అహం దెబ్బతింటుంది. ఠాఠ్ మనలో మాత్రం మార్పు కుదరదంతే.

ఫలానా వాడికి కులగజ్జి వుంది. వాడు మారాలి. మనం మాత్రం మారం. ఏం పీకు తావో పీక్కో.

ఒక్కరనేం వుంది లెండి. అందరి అహం అంతే, అందరం అంతే. బ్లాగులు వ్రాసే ప్రతీ వాడూ మేధావే. మేధావి మారితే ఎలా? ఆ అందరిలో నేనూ వున్నా. కొన్ని నేనూ మారను, మారలేను, మారబోను. అదంతే.

మేడమీది ముచ్చట్లు - పాప ఏడ్చింది













ఈ సారి ఇది మా ఇంటిపైన కాదులెండి. మా బంధువుల ఇంటిపైన కానీ కొంత క్రితం సంఘటణ లాంటిదే. నాతో పాటు కొంతమందికి పడుకున్నాం. నా పక్కన ఒక ఏడెనిమిదేళ్ళ అమ్మాయి పడుకుంది. ఆమె పక్కన ఈ అమ్మాయి పడుకుంది. ఆ అమ్మాయితో విజువల్ సిగ్నల్స్ కొంత వర్క్ అవడంతో ధైర్యం చేసి మధ్యలో వున్న పాపను చేతితో దాటేసి ఆమెతో కెలికింగ్ మొదలెట్టాను. ఆ అమ్మాయి కూడా అనుకూలంగా స్పందిస్తుండటంతో ఉపాహారాలు నడుస్తున్నాయి.

ఇంతలోకే ఏమయ్యిందో ఏంటో మధ్యలో వున్న పాప ఘొల్లున ఏడ్చుకుంటూ నిద్ర లేచింది. ఎందుకో అర్ధం కాక నాకు మూడ్ జారిపోయింది. మా వ్యవహారం ఏమయినా గమనించిందా లేక అలికిడి వల్ల నిద్రా భంగమయ్యిందా అనేది నాకు అర్ధం కాలేదు. ఏడ్చుకుంటూ పరుగుపరుగున ఆ పాప క్రిందికి వెళ్ళిపోయింది. పాపం - నేను బిక్కచచ్చిపోయాను. అసలా పాప అలా ఏడ్చుకుంటూ క్రిందికి ఎందుకువెళ్ళిందో తెలియక ఎవరయినా పైకి వచ్చి మమ్మల్ని తిడతారేమో అని ఎదురుచూస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపాను.

ఎంతసేపయినా ఎవరూ పైకి రాలేదు. ఎవరూ ఎందుకు రాలేదూ అన్నది ఇపుడు ప్రశ్న. పొద్దునే లేచాక మాకు సుప్రభాతం వినిపిస్తారా లేక ఇంకా చర్చించుకొని కొద్దిసేపయ్యాక వస్తారా? అన్నీ సందేహాలే. ఈ ఆందోళనలతో, ఎప్పుడు ఎవరు పైకి వస్తారో తెలియక మళ్ళీ ఆ అమ్మాయితో సాహసించలేదు. నేనేమయినా మళ్ళీ ఎడ్వాన్స్ అవుతానేమో అన్నట్లుగా ఓ సారి నాకేసి చూసింది కానీ ఆమె చూపులు నేను లైట్ తీసుకోవడంతో ఆమె కూడా ఇక పడుకునేసింది. మనమనుకుంటాము కానీ నిజానికి ఇలాంటి విషయాల్లో ఆడది గనుక తెగిస్తే వాళ్ళే మగవారికన్నా ధైర్యంగా ప్రవర్తిస్తారు. అప్పుడు నేనే పిరికిగా ఊరుకుండిపోయాను.

పొద్దునే లేచి బిక్కుబిక్కుమంటూ క్రిందికి వెళ్ళాను. ఎవరూ నాకు సుప్రభాతం పాడలేదు. హమ్మయ్య అని అనుకున్నాను. మధ్యాహ్నం మేమందరం ప్లే కార్డ్స్ ఆడుతున్నప్పుడు ఆమెతో విజువలుగా ఆడుకున్నాను. ఇంకా సానుకూలంగానేవుంది. మధ్యలో వీలు కుదిరినప్పుడు మా మధ్యలో పడుకున్న పాపని అడిగాను - ఎందుకు ఏడ్చుకుంటూ క్రిందికి వెళ్ళావని? మమ్మీ గుర్తుకువచ్చింది అని చెప్పింది. ఆమె ఏడుపువల్ల బంగారం లాంటి ఛాన్స్ మిస్సయినందుకు నా మనస్సులో నెత్తీ నోరూ కొట్టుకున్నాను. నా ఫేస్ ఫీలింగ్స్ కిసుక్కున నవ్వింది ఆ అమ్మాయి.
ఆ అమ్మయితో దగ్గరగా గడిపేందుకు అవకాశం వుంటుందని ఫస్ట్ షో సినిమా ప్లాన్ చేసాను. అయితే ఆమె పక్కన కూర్చొనే అవకాశం నాకు రాలేదు. ఆ అవకాశాన్ని ఆమె బావ దక్కించుకున్నాడు. కుట్ర చేసి వాడిని పక్కకు పంపించి ఆమె పక్కన నేను కూర్చొని సినిమా చూస్తున్నంత సేపూ ఆమెతో కాపీలు, టిపినీలు చేసాను. సినిమా అయిపోయాక ఇంటికి వస్తున్నప్పుడు దారిలో ఆ అమ్మాయి బావ నన్ను పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడాడు. ఏంటి గురూ గారూ, ఆమె పక్కన నన్ను కూర్చోనివ్వకుండా చేసి మంచి ఛాన్స్ నాకు మిస్ చేసారు అని లబలబలాడాడు. ఏంట్రా, నీకూ, నీ మరదలికీ అండర్‌స్టాండింగు వుందేంట్రా అని అడిగాను ధాటిగా. సిగ్గుపడ్డాడు మనోడు. మరి నాకూ వుంది - అలాంటప్పుడు నిన్నెలా కూర్చోబెడతా అనుకున్నావ్ అని అడిగాను. మీకూ వుందా అని తెల్లబోయాడు. ఆహా ఎంచక్కా అని నేను అనేసి మీ విషయం ముందే చెబితే సినిమా హాల్లో ఆ అమ్మాయికి చెరోపక్కా మనిద్దరం కూర్చునేవారం కదా అన్నాను. మరి మీ విషయం మాత్రం నాకేం తెలుసు మహాప్రభో అని అని ఆ అబ్బాయి ఘొల్లుమన్నాడు. మళ్ళీ, మళ్ళీ మాంఛి ఛాన్సులు వస్తుంటాయిలే కానీ ఏడవకు అని వాడిని సముదాయించాను.

ఆ తరువాత ఆమెతో ఇంకేమీ నాకు కుదరలేదు. కొన్నిసార్లు మా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ప్రయత్నించాను కానీ సిగ్గో లేక భయమో లేక సిగ్గుతో కూడిన భయమో తెలియదు కానీ నా ఆటలు ఎంతమాత్రమూ సాగనివ్వలేదు. మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆమె ఇంటికి వెళ్ళాల్సొచ్చింది. ఇద్దరు పిల్లలు. ఆమెతో మాట్లాడుతూ ఆమెతో అప్పట్లో తిన్న చిరుతిళ్ళు గుర్తుకుతెచ్చుకుంటుంటే మనస్సు జివ్వుమన్నది. మిగతా బంధువులు వుండటంతో ఆమెతో ప్రైవేటుగా మాట్లాడటానికి కుదరలేదు.

అప్పట్లో వాళ్ళ బావ తరువాత ఆమెతో కొన్నిసార్లు పూర్తిగా అడ్వాన్స్ అయ్యాడని, విందు భోజనాలు లాగించాడని నాకు గుర్తుంది. ఆ అబ్బాయే నాకు చెప్పాడు లెండి. ఆ కుర్రాడి పెళ్ళాం మాత్రం ఇతగాడు ఇదివరకు ఎవరినోట్లో వేలుపెట్టని బుద్ధిమంతుడు అనుకొని గర్విస్తూవుంటుంది.

బుధవారం 10 నవంబర్ 2010

మేడమీది ముచ్చట్లు

సూర్యాపేటలో వుంటున్న రోజులవి. ఒక వేసవిలో బంధువులు/మిత్రురాళ్ళు అయిన ఓ ఇద్దరమ్మాయిలూ, నేనూ మా ఇంటి డాబా/మేడ మీద పడుకున్నాం. కొద్దిగా చల్లగాలి వీస్తుండటంతో దుప్పట్లు కప్పుకున్నాం. అందులో ఒకరితో నాకు అవగాహన వుంది - దాంతో వ్యవహారం నడిచిపోయింది. తరువాత ఆమె బాతురూముకని క్రిందికి వెళ్ళింది. అలసిపోయాను కదా నాకు అంతలోకే నిద్రపట్టింది.

కొంతసేపయ్యింతరువాత నిద్రలోనే మళ్ళీ ఆ అమ్మాయి మీద చెయ్యివేసాను. అంతే - చెయ్యి విసిరికొట్టి విసవిసానడుచుకుంటూ ఆ అమ్మాయి క్రిందికి వెళ్ళిపోయింది! నాకు నిద్రమత్తు వదిలిపోయింది. నాకేం అర్ధం కాలేదు. అప్పటిదాకా బాగానే వున్న అమ్మాయి అలా ఎందుకు చిరాకుపడి వెళ్ళిపోయిందో అర్ధం కాక బుర్ర గోక్కోసాగాను.   

అప్పుడు ఆ పక్కనే వున్న మరో అమ్మాయి కిసుక్కున నవ్వడం వినిపించి ఆమెకేసి చూసి వార్నీ అనుకున్నాను. ఎందుకంటే ఆమే నేను ఇంతకుముందు గడిపిన అమ్మాయి. మరి నేను చెయ్యివేసింది మరో అమ్మాయి మీద. ఈవిడ గారు బాతురూముకి వెళ్ళి వచ్చి మరో అమ్మాయికి పక్కగా పడుకుంది. నాకు ఆ విషయం తెలియక ఎంచక్కా ఆ మరో అమ్మాయిమీద చెయ్యివేసాను. 

హయ్యబాబోయ్, ఇప్పుడు ఆ అమ్మాయి క్రిందికి వెళ్ళి నేను చెయ్యేసి దగ్గరికి లాక్కున్న విషయం ఎవరికయినా చెబుతుందా అని కాస్సేపు మనసులో లబలబలాడేలోగానే నాకు మరో విషయం అర్జంటుగా గుర్తుకువచ్చింది. అలా క్రిందికి వెళ్ళిపోయిన అమ్మాయితో కూడా ఇదివరకు కొన్నేళ్ళ క్రితం దాకా అవగాహన వుండేది. అందువల్ల ఇప్పుడు ఆమెకు కొత్తగా పోయిందేమీలేదు కాబట్టి ఎవరికేమీ ఫిర్యాదు చెయ్యదులే అని సర్దుకున్నాను.      

గమనిక: ఇవన్నీ వ్రాస్తున్నానని నేనేమీ అభినవ కాసనోవానేమీ కాదు. ఇలాంటి వ్యవహారాలు చాలామందికి వుండేవే కానీ బయటకి చెప్పుకోకుండా బుద్ధిమంతుల్లా నటిస్తుంటారంతే.  

మంగళవారం 9 నవంబర్ 2010

మరి 'కాలం' క్రెడిబిలిటీ?



హి హి హీ. అస్సలుంటేకదా పెరగడానికీ, తగ్గడానికీ!

సోమవారం 8 నవంబర్ 2010

కత్తికీ, కూడలికీ పెరుగుతున్న క్రెడిబిలిటీ

పూర్వం ఒక వృద్ధ దొంగ వుండేవాడు. అతను చనిపోతున్న రోజుల్లో తాను జీవిత కాలం చేసిన గొంగతనాలకు ఆవేదన చెంది తన మృత్యు ఘడియల్లో తన కుమారరత్నాన్ని ఒక కోరిక కోరుతాడు. కుమారా, బ్రతికి వున్నన్ని రోజులూ నేను మంచిపేరు తెచ్చుకోలేకపోయాను, నా తదనంతరం నువ్వయినా నీకు తండ్రిగా నాకు మంచిపేరు తెచ్చిపెట్టు నాయనా అని కోరుతాడు. అలాగే తండ్రిగారూ అని ఆ పుత్ర రత్నం హామీ ఇస్తాడు. ఆ దొంగ తండ్రి సంతృప్తిగా జీవితం చాలిస్తాడు. తన తండ్రికి ఎలాగయినా మంచిపేరు తేవాలని చెప్పి ఆ కుమార రత్నం ఒక పెద్ద బందిపోటుగా మారి అందరినీ భీకరకంగా దోచుకోవడం మొదలుపెడతాడు. అప్పుడు ప్రజలందరూ "ఓరి వీడి అసాధ్యం కూలా, వీనికన్నా వీడితండ్రే మంచివాడుగా వుండేవాడు, అతను చిన్న చితకా దొంగతనాలు మాత్రం చేసి పొట్టగడుపుకునేవాడు. కొడుకు మాత్రం మహా దుర్మార్గుడయ్యాడు" అని శాపనార్ధాలు పెట్టసాగారు. వారి మాటలు తెలుసుకున్న ఆ పుత్ర రత్నం తన తండ్రికి తాను మంచిపేరు తెచ్చినందుకు తెగ సంతోషించేడు.

అలావుంది ప్రస్తుతం బ్లాగుల్లోని ఒక పరిస్థితి. పాత వ్యవస్థ బావోలేదని కొత్త వ్యవస్థ వచ్చింది. అది చిన్న గీతకంటే పెద్దగీత అయ్యింది.  ఈ టపా నా అభిప్రాయం మాత్రమే అయినా కూడా కొంతమంది అయినా ఏకీభవిస్తారనే అనుకుంటున్నాను.  ఇదివరలో కత్తిది ఒంటెద్దు పోకడ అనీ, అతిశయం అనీ, అభిజాత్యం అనీ నాకు నిరసన వుండేది. వారి పద్ధతులను, ధోరణిని వ్యతిరేకిస్తున్నవారిలోనే అంతకుమించిన ధోరణులు చూస్తూవుండటంతో మరియూ కత్తిగారు కూడా కొంతయినా తగ్గి, కాస్తయినా హేతుబద్ధంగా వున్నట్లు అనిపిస్తుండటంతో నా దృష్టిలో అయితే వారికి విశ్వసనీయత పెరిగింది. అలా అని వారితో గ్రూపు కట్టానేమోనన్న రొటీను కుట్రలు ఫీలవక్కరలేదు. వారితో బ్లాగు పరిచయం తప్ప ఎలాంటి పరిచయమూ లేదు నాకు.


ఇక కూడలికి మళ్ళీ పెరుగుతున్న విశ్వసనీయత గురించి నేను వ్రాయదలుచుకోలేదు. కాంట్రాస్ట్ తేలుస్తూ కంపేర్ చెయ్యాలంటే ఇతర సంకలినులను చర్చలోకి లాగాల్సివుంటుంది.

శుక్రవారం 5 నవంబర్ 2010

మీ అందరికీ కాపీ & పేస్టు దీపావళి శుభాకాంక్షలు!

ఏదయినా పండగో, పబ్బమో, జాతీయ వేడుకో వచ్చినప్పుడు సంకలినులని చూస్తున్నప్పుడు చిరాకుగా అనిపిస్తుంది. అన్నీ శుభాకాంక్షల టపాలు, అన్నీ శుభాకాంక్షల వ్యాఖ్యలు. ఇలాంటి రొటీన్ గ్రీటింగ్స్ ఎవరిని ఆనందపరుస్తాయో నాకయితే అర్ధం కాదు. వీటిల్లో చాలావరకు కాపీ & పేస్టు గ్రీటింగులే వుంటాయి. వాటిల్లో ఓ వ్యక్తిగత అనుబంధమో, ఆప్యాయతానొ వుండవు. ఎంతమందికి గ్రీటింగ్స్ పేస్టు చేస్తే అంత ఆనందం కొందరికి లభిస్తుంది. ఇంత ఆనందం అవసరమా అని నాకనిపిస్తుంది.

తమకు నచ్చిన వారికో, మెచ్చిన వారికో ఈమెయిల్ ఇస్తే సరిపోయేదానికి బ్లాగుల్లో అందరూ ఇంతగా హడావిడి చెయ్యడం అవసరం అనుకోను. ఈ వేడుకల విశేషాలో, స్మృతులో, ముచ్చట్లో పంచుకోవడం బావుంటుంది కానీ ఇలాంటి పడికట్టు పదాల శుభాకాంక్షలు ఏం ప్రయోజనం కలిగిస్తున్నాయో ఒకసారి తరచి చూసుకుందామా?

ఏమయినప్పటికీ మీరూ మీ కుటుంబం ఎంచక్కా దీపావళి గడుపుకోవాలని, గడుపుకుంటున్నారనీ ఆశిస్తూ ఈ కాపీ, పేస్టు శుభాకాంక్షలని ముగిస్తాను మరి.

గురువారం 4 నవంబర్ 2010

మైనర్ పిల్లలు నగ్న చిత్రాలు చూడొద్దట కానీ...

మైనర్ పిల్లలని సజీవంగా తగలెయ్యొచ్చట, మంటల్లోకి విసిరెయ్యొచ్చంట, పిల్లల ముఖాలని పచ్చడి చెయ్యొచ్చట. ఆటల్లోనే అనుకోండి కానీ మైనర్ పిల్లలు కూడా అలాంటి వీడియో ఆటలు ఆడొచ్చంట. అలాంటి హింసాత్మక ఆటలను మీరు ఆమోదిస్తారా? మీరు ఒప్పుకోకపోతే తమ భావ స్వేఛ్ఛకు అడ్డు అని మీ పిల్లలూ, ఆ వీడియో గేమ్స్ అమ్మేవారూ వాదించారనుకోండి. మీరేం అంటారు?

ఇదే సమస్య US సుప్రీం కోర్టు ముందు వుంది. హింసాత్మక వీడియో ఆటలు అమ్మడాన్ని, కొనడాన్ని నిషేధించడం ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషనుకు విరుద్ధం అని కొందరు వాదిస్తున్నారు. నగ్న చిత్రాలను చూడటంపై నిషేధం వున్నప్పుడు ఇంతటి హింసాత్మక ఆటల పట్ల మాత్రం ఎందుకు నిషేధం వుండకూడదు అని మరి కొన్ని వర్గాలూ వాదిస్తున్నాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తులూ రెండు వర్గాలు అయిపోయారు. స్కేలియా అనే న్యాయమూర్తి భావస్వేఛ్ఛని సమర్ధిస్తుండగా ఇతర న్యాయాధీషుల్లో కొంతమంది అలాంటి హింసాత్మక వీడియో ఆటల పట్ల నిషేధం వుంటేనే బావుంటుందంటున్నారు. ఇలా నిషేధించాల్సివస్తే హింసాత్మక సంగీతాన్ని కూడా నిషేధించాలా అని కొంతమంది జడ్జులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఒక రకం పాటలల్లో మంటల్లో వేసి తగలెట్టండి అని ఉద్భోధిస్తూ చరణాలు వుంటాయిట మరి.

ఏ ఆటలు కొనాలో, ఏ ఆటలు పిల్లలతో ఆడిపించాలో తల్లితండ్రుల ఇష్టానికే వదిలెయ్యాలని కూడా కొన్ని వర్గాలు వాదిస్తుండవచ్చు. పాశ్చాత్యదేశాలలో అయితే వీడియొ గేముల వ్యామోహం పిచ్చపిచ్చగా వుంది. ఇండియాలోకూడా ఇంతగా వ్యామోహం మొదలయ్యిందో లేదో  నాకు తెలియదు. ఈ ఆంశం పై మీరు ఎటువైపు వుంటారు? భావ స్వేఛ్ఛ వైపా లేక నిషేధం వైపా? హింస కూడా స్వేఛ్ఛ క్రిందికి వస్తుందా? రాదంటే మరి మన రక్త చరిత్రల్లాంటి సినిమాలు ఏం కావాలి? నేను ఎటూ తేల్చుకోలేకనే మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. 

బుధవారం 3 నవంబర్ 2010

నేను స్త్రీవాదిని. ఆడవారికి అది లేదు కాబట్టి మొగవారికి అది కోసెయ్యాలీ!

సాధారణంగా స్త్రీ వాదులు స్త్రీల అభ్యున్నతికీ, ఆత్మాభిమానానికీ కృషిచేస్తుంటారు. వారిపట్ల, వారి కృషిపట్ల నాకు ఎనలేని గౌరవం వుంది. అయితే అప్పుడప్పుడు ఆ స్త్రీ పైత్యం ముదిరి విచిత్రమయిన, పనికిమాలిన వాదనలు తలకు ఎత్తుకొని ఇతరులకు, ముఖ్యంగా చాలామంది మగవారికి చిరాకు తెప్పిస్తుంటారు. అలాంటి వాదాలతో తమ శ్రమనూ, ఫోకసునూ వృధా చేస్తుంటారు. స్త్రీల సంక్షేమం కోసం మగవారి తోడ్పాటూ తీసుకునేబదులు కొండొకచొ మొగవారిని పలు రకాలుగా, పలు విధాలుగా ద్వేషిస్తూవుంటారు.

సుప్రీం కోర్టు జడ్జిలు కీప్ అన్న పదం ఔపయోగించారని స్త్రీవాదులు కొంతమంది గొడవ చేస్తున్నారు కదా. వారియొక్క ముఖ్యమయిన వాదన ఏంటంటే మొగవాళ్ళకి అలాంటి పేరు లేదు కదా, మరి ఆడవారికి ఆ పేరు ఎందుకట. పురుషులకు అలాంటి పేర్లు లేకపోతే సృష్టిద్దాం. కావాలంటే ఆ కృషికి నేనూ బోల్డు సహకరిస్తాను. అంతే గానీ మగపదాలు, ఆడపదాలు అని విడదీసి అవి రెండు లింగాల్లోనూ లెవ్వు కాబట్టి వాటిని బోడిలింగం చేసెయ్యాలనే వాదన ఎందుకో నాకు కొద్దిగా చిత్రంగా అనిపిస్తోంది. మరి మీకో?

అయ్బాబోయ్ ఈ స్త్రీవాద పైత్యం ముదిరితే ఇంకేమన్నా వుందా. మాకు లేదు కాబట్టి మీకు కోసెయ్యాలని కత్తిలాంటి వారినీ, కత్తులనూ పట్టుకొని మన పురుషుల వెంటబడరూ. వీరి దృష్టిలో ఆడ, మగ తేడాలుండకూడదు. దానికి ఒకటే సంపూర్ణ పరిష్కారం. శిశువు పుట్టగానే ఆ ప్రాతాన్ని పూడ్చేసో, కోసేసో ఆయా ప్రాంతాలని సమతలం చేస్తే ఓ పని అయిపోతుంది. అప్పుడు వేధింపులూ, రేపులూ గట్రా వుండవు. వుండేది ఏకలింగం, అదీ బోడ/బోడి లింగం కాబట్టి ఇహ స్త్రీ వాద సంఘాలు అప్పుడు తమ దుకాణాలని ఎత్తేసుకొని తృప్తిగా, ప్రశాంతంగా జీవించొచ్చు.

అంచేత నేను అనుకునేదేమంటే ఎంత స్త్రీవాదులయినా సరే సృష్టిలో జెండర్ తేడాలున్నాయి కాబట్టి వాస్తవిక దృక్పధంతో మెలగుతూ స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటే అందరి మన్ననా వుంటుంది. ఒంటెద్దుపోకడతో పోతే అభ్యున్నతి ఏమోగానీ అవహేళనలు గ్యారంటీ. దట్స్ ఆల్ యువరానర్.

మంగళవారం 2 నవంబర్ 2010

ఉంచుకోబడినవారే ఉత్తములు

ఆడదాన్ని మగవాడే ఉంచుకోనీయండి లేదా మగవాడిని ఆడదే ఉంచుకోనీయండి కానీ చాలావరకు అసలు జతగాళ్ళ కన్నా ఇలా వుంచుకున్నవారే ఉత్తములు. ఎలాగంటారా...

1. ఏ మగవాడయినా సాధారణంగా ఒక వైపు పెళ్ళాం వుండగానే ఉత్తినే మరో ఆడదానిని ఉంచుకోడుకదా. పెళ్ళాం బోర్ కొట్టి, పెళ్ళాం మీద విరక్తి చెంది, పెళ్ళాం మీద రకరకాల కారణాల వల్ల విముఖత్వం చెంది మరొకరి చెంత చేరుతాడు. అలాంటప్పుడు విడాకులు తీసుకోని ఆమెనే పెళ్ళాడొచ్చుకదా అనకండి. విడాకులు అంత వీజీ కాదు, ఇండియాలాంటి దేశాల్లో అస్సలు వీజీ కాదు. అందుకని ఇలాంటి సర్దుబాట్లకి తెగబడుతాడు మగవాడు.

2. ఎలాగూ పెళ్ళి చేసుకున్నా కదా ఇక మొగుడు పీకేదేముందని కొంతమంది పెళ్ళాలు మొగుళ్ళని నిర్లక్ష్యం చేస్తారు. అదే కీప్ అయితే కనీసం ప్రేమ నటించనన్నా నటిస్తుంది. వెనకాల ఎలా వున్నా కనీసం ముందయినా అతని పట్ల మోహంతో వుంటుంది. అలాంటి పెళ్ళాలకు మొగుడి మీద ప్రేమ ముందు వుండదూ, వెనక వుండదూ.

3. అతగాడిచ్చే డబ్బు, నగలు, బహుమతుల కోసమయినా వుంచుకున్నవారు ప్రేమగా వుంటారు లేదా కనీసం ప్రేమ నటిస్తారు. అదే పెళ్ళాలయితే నువ్వు గనుక ఇచ్చావులే, నువ్వు గనుక సంపాదించావులే అని ఈసడిస్తారు.

4. పిల్లలు పుట్టగానే చాలామంది పెళ్ళాలు పడకగది సంసారం మీద అంత శ్రద్ధపెట్టరు. మగవాడి అవసరాలు గమనించరు. అదే వుంచుకున్నది అయితే మగవాడి అభిరుచుల మేరకు వుంటుంది.

ఇలా ఆలోచిస్తే వుంచుకున్నవారితో పెళ్ళాల కన్నా మిన్నగా ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అందుకే ఎవరయినా ఎవరినయినా వుంచుకున్నాడంటే అతని అసలు భార్య కన్నా వుంచుకున్నామనే నేను ఎక్కువగా గౌరవిస్తాను. అందరు వుంచుకున్న భర్తల భార్యలు అలాంటివారే అని కాదు గానీ చాలావరకు నేను ఉదహరించినవారే అయివుంటారు.

నీరు పల్లమరుగు - మగాడు ప్రేమనెరుగు. ఇది ఆడవారికయినా వర్తిస్తుంది. పెళ్ళిచేసుకోగానే ఓ భార్యాభర్తలు తెగ సంతోషంగా కలకాలం పచ్చగా జీవిస్తారని భావించే అమాయకులకే వుంచుకున్నవారి ప్రాధాన్యత అర్ధం కాదు. పెళ్ళి కాదు ముఖ్యం - ఇద్దరి మధ్య ప్రేమ, అన్యోన్యత ముఖ్యం. అది వుంచుకున్నవారితోనే వుందంటే రైఠో. అంతగ్గావాలంటే పెళ్ళాంతో విడాకులు తీసుకోవచ్చు కదా అంటే అంత నొప్పిగా వుంటే ఆవిడే తీసుకోవచ్చు కదా. ఈ సమాజంలో మొగుడు, మగాడు విడాకులు తీసుకోవడం కంటే భార్య విడాకులు తీసుకోవడమే సులభం.

గమనిక: కొంతమందికి ఈ వుంచుకున్నవారు అనే పదం అభ్యంతరంగా వున్నట్లుంది. వుంచుకున్నవారిని వుంచుకున్నవారు అనకుండా ఏ పదంతో గౌరవిస్తే బావుంటుందో తెలియజేస్తే ఆ పదానికి మారుస్తాను. 

బ్లాగోఛ్ఛాటన

ఈమధ్య ఇంటా బయటా నాకు పడనివాళ్ళు ఎక్కువయ్యారు. బయట బ్లా'గులో'ళ్ళ సంగతి చూద్దాం. ఈమధ్య శానా మంది టపాలు టపాటపా రాలుస్తున్నారు. వాళ్ళకు పోటీగా నేను మూడు నాలుగు టపాలు వేసినా నా టపాలు టార్చ్ లైటు వేసి వెతికితే తప్ప కనపడటం లేదు. అందుకే హారం, కూడలిలల్లో పిండి చల్లదలుచుకున్నాను. దానితో ఎక్కడ టపాలు అక్కడ పరార్. మాలికలో కూడా ఆ ఉఛ్ఛాటనా పిండి చల్లాలని వుంది కానీ వాళ్ళు చాలా సహజంగానే విదేశీ కుట్ర అనుకుంటారని ఆ వ్యూహం విరమించుకున్నాను. మన ప్రవీణ్ అగ్రిగేటర్లో చల్లుదామంటే ఇది పిండి నా లేక ఏదయినా బూతు పదార్ధమా అని ఆ పిండి యొక్క ప్రాశస్త్యాన్ని అనుమానిస్తాడేమోనని నా అనుమానమూనూ.

ప్రతి ఒక్క బ్లాగరూ తనొక ఏనుగు అనీ, మిగతా వారిలో కొందరయినా ఊరకుక్కలనీ అనుకుని (అల్ప)సంతోషపడుతుంటారు. అదే సంతోషం నాక్కూడానూ. ఈమధ్య ఊరకుక్కలెక్కువయ్యాయి. అందుకే వాటిమీద ఉఛ్ఛాటనా క్రియ ప్రయోగిస్తే అవన్నీ భౌ భౌ మని పారిపోయి ఏ అప్పి కాలునో, బొప్పి కాలునో పీకకపోతాయా అని నా చిన్ని చిన్ని ఆశ.

ఇహ బ్లాగుల్లో కెలుకుడు ఎక్కువయ్యైందని గోలపెట్టడం ఫ్యాషనయిపోయిందని గోలపెట్టడం ఫ్యాషనయిపోయింది కదా. అందుకే ఆ ఉఛ్ఛాటనా తంత్రం ప్రయోగించి బ్లాగులోకంలోని కెలుకుడంతా రూపు మాపి బ్లాగోస్ఫియరుకి మూలశంక పురుషుడిగానే కాకుండా మూలపురుషుడిగా అవతరించదలుచుకున్నాను. ఎలా వుందీ నా ప్లానూ?

ఇప్పుడు ఆ తంత్రాలు, మంత్రాలు అన్నీ అంత కఠొర దీక్షేలు చేసి నేర్చుకునేంత దృశ్యం నాకు లేదు కాబట్టి ఎవరయినా ఆ ఉఛ్ఛాటనా పిండి ఇండియా నుండి టన్నులకు టనూలకొద్దీ ఎక్స్పోర్ట్ చేస్తే కొద్దిగా బ్లాగుల్లో చల్లి మిగతాదంతా ఒబామాకమ్మేస్తా. అప్పుడు ఒబామా దానిని కొద్దిగా వైటు హౌజులో చల్లి మిగతాది తీసుకెళ్ళి  లాడెన్ను కుమ్మేస్తాడు. అప్పుడు గానీ నాయొక్క ఈ దేశ సేవలకు మెచ్చి నా మెడలో ఓ ప్రెసిడెన్షియల్ మెడల్ వేలాడేస్తారు. అన్నట్టు ఆ పిండి రాగానే మా ఊర్లో వున్న మొగాళ్ళందరి మీద ప్రయోగిస్తా. అప్పుడిక మనమే ఊరికొక్కడు.

అంచేతా ఎవరయినా ఇండియాలో ఆ పిండి ప్రొడ్యూసు చేసే కుటీరపరిశ్రమ మొదలుపెడితే బావుంటుందని నా సలహా. ఆలస్యం ఉఛ్ఛాటనా విషం. త్వరపడండి మరి. మీదే ఆలస్యం. మంచి తరుణం మించిన దొరకదు. శుభం భూయాత్.

సోమవారం 1 నవంబర్ 2010

తెలుగుబాట నుండి మరిన్ని జ్ఞాపకాలు

తెలుగు బాటలో 'భూమిక' సత్యవతిని గారిని కూడా కలిసాను. వారి ఫోటోలు చూసి వుండటం వల్ల తేలిగ్గానే గుర్తించాను. ఇద్దరం ఒక్క నిమిషం తప్ప ఎక్కువగా మాట్లాడుకునే తీరిక దొరకలేదు. సమయమే వుంటే పలు విషయాల మీద వారి స్త్రీవాద అభిప్రాయాలు తెలుసుకొనివుండేవాడిని.

Sujata గారిని కూడా కలిసాను. నేను వారిని చూసి వారు అనుకోలేదు. కొందరి రచనలు చదివినప్పుడు వారిమీద ఒకలాంటి  ఊహాదృశ్యం  ఏర్పడుతుంది.  Sujata గారి  రచనలు  చదివినప్పుడు  వారి  రచనలు  చాలా  సరళంగా అనిపించి గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించి వారు కూడా అలాగే ఊదితే గాలికి ఎగిరిపోయేలా బక్క పలుచగా వుంటారేమో అనిపించింది. కానీ వారు అందుకు వ్యతిరేకంగా వున్నారు.  మేము ఒక మూడు నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడుకోలేకపోయాము. నేను  మా  కుటుంబ  వేడుకకి  పిలిస్తే  వారు కనీసం రిప్లయ్ కూడా ఇవ్వలేదేమిటా వారి మీద కొంత నిరసన వుండింది కానీ వారు అందుకు గాను సారీ చెప్పారు.  

వేదాంత, భక్తి టపాలు వ్రాసే కదిరి సురేశ్ గారికి హలో మాత్రం చెప్పగలిగాను. సమయం వుంటే కాస్సేపు మాట్లాడివుండేవాడిని. ఇనగంటి రవిచంద్ర వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నారు. వారితో కూడా ఎక్కువగా మాట్లాడలేకపోయాను.

ఇంకొక బ్లాగర్ని కలిసాను కానీ వారి పేరు మొన్నటిదాకా గుర్తుకువుంది కానీ ఇప్పుడు మరచిపోయాను. అప్పుడొకసారి వారు హైదరాబాద్ ఆడవారు బీర్లు తాగిన వీడియో పోస్టు చేస్తే వారితో నాకు బ్లాగ్యుద్ధం జరిగింది. వారు ఈ బాటలో తారసపడతారని ఏమాత్రం అనుకోలేదు. నేను వచ్చానని తెలిసి సంతోషంగా హలో చెబుతూ దగ్గరికి వచ్చారు.  మనం శత్రువులం కదా ఇలా హలోలిచ్చుకుంటే బావుండదేమో అని సరదాగా అంటూ హలో ఇచ్చాను. దానిదేముందండీ, బ్లాగ్గొడవలు బ్లాగుల్లోనే అనగా వారి స్పోర్టివ్‌నెస్ చూసి నాకు ముచ్చటేసింది. అక్కడానూ మరియు పివి జ్ఞానభూమి వద్దానూ నాతో కలిసి ప్రత్యేకంగా ఫోటో దిగారు.

ఇంకా ఈ బాటలో చక్రవర్తి దంపతులను కూడా కలిసాను. వారి గురించి టపా త్వరలో వ్రాస్తాను. ఇంకా AP మీడియా  రాముగారు  కూడా కలిసారు. నిజానికి  వారు  అంతకుముందే  వారిని  జర్నలిజం  కాలేజిలో కలుసుకున్నాను. ఆ విశేషాలతో టపా ఎప్పుడో మొదలెట్టాను కానీ ఇంకా పూర్తిచెయ్యలేదు.   వీరే కాకుండా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక బ్లాగర్ నన్ను ఇండియా వచ్చినప్పటినుండీ కలవడానికి శతవిధాలా ప్రయత్నీంచి చివరికి నేను ఇండియా నుండి తిరిగివచ్చే రోజున ఓ మూడు నిమిషాలు మాత్రం కలవగలిగారు. వారి గురించి ఒక పోస్టులో వ్రాస్తాను. ఇలా వీరినీ కవర్ చేస్తే ఇండియాలో కలిసిన బ్లాగర్ల విశేషాలు అయిపోతాయి. 

ఇంకా  ఎవరితోనయినా  ప్రత్యేకంగా  మాట్లాడివున్నా, పరిచయం  అయినా  మరిచిపోయినందుకు మన్నించగలరు.    నాగను కూడా కలిసాను కానీ వారిని ఆల్రెడీ మరొక టపాలో కవర్ చేసాను.      

బ్లాగులోక ముళ్ళకంపాయణం!

కొంత కాలం క్రితం తెలుగు బ్లాగులోకంలో కత్తి లాంటి ముల్లు దిగిందనీ ఆ ముల్లుని ముల్లుతోనే తియ్యాలని పతోడూ (ప్రతీ వాడూ) ముల్లు పట్టుకొని బయలుదేరి బ్లాగులోక పాదాన్ని కెలికేసారు. ఒక్కరొ ఇద్దరో ఆ ముల్లును కెలికితే బాగానే వుండేది కానీ ఓ శానామంది కెలికేసరికి ముల్లు కత్తి కన్నా వీరి కెలుకుండు ఎక్కువయ్యింది. కాలుకి వాచిపోయింది. సరే అని ఆ ముల్లు బాధ కాస్త శాంతించిందని ఆగాలా - లేదు - బ్లాగులోకానికే ము(మ)ల్లు వీరులమని బ్లాగులనే పాదాన్నే కాకుండా కాలుని కూడా అడ్డూ  అదుపూ లేకుండా తమ ముల్లులతో కెలికెయ్యడం ప్రారంభించారు.

బ్లాగుల్లో ఓ ముళ్ళకం(ప)పు లాంటే వ్యవస్థే వుందనీ, తాము దానిని కూకటి వేళ్ళతో పెకిలించాలనీ ఆ కాలు మీద వీరంగాలు వేసారు. దాంతో ఆ ముళ్ళకంపకేమో గానీ ఆ కాలుకే ఎసరు వచ్చింది.  ఇలాగయితే బ్లాగావరణానికి ఆయువు పట్టు అయిన మోకాలు కూడా వాచిపోతుందనీ, ఈ కాలివాపును చూసి బలుపు అనుకుంటున్న వారిని ఎలాగయినా నిగ్రహించాలనీ కొంతమంది  బ్లాగోద్ధారకులు తయారయ్యేరు.  

ఈ బ్లాగులోకపు సరికొత్త ముళ్ళకం(ప)పును పీకెయ్యాలంటే మరో ముళ్ళకంప(పు) కావాల్సిందేనని, ముళ్ళకంపని మరో ముళ్ళకంపతోనే పీకివెయ్యగలమని తెచ్చి పాతేసారు. మరి ఇప్పుడు ముళ్ళు అన్నీ ఇలాంటి పోటాపోటీ ముళ్ళాటలతో మోకాలు అంతటా గుచ్చుకొని ఇన్‌ఫెక్షన్ తెస్తాయో లేక బలుపు అనుకునే ఈ మోకాలి వాపు తగ్గుతుందో ఇహ తెరపైనే చూడాలి మనం. అందాక ముల్లుని ముల్లుతో తీస్తుంటే ఎంత సమ్మగా వుంటుందో తెలుసు  కదా - ఆ  సమ్మదనమే  హాయి అనుకుంటూ  మనమంతా  ఈ  ముళ్ళకంపర్వాన్ని  మనం అనుభవించగలగాలి. సర్వేజనా మోకాలు శుభినోభవంతు.   

గమనిక: అయ్యా, ఇది సరదాగా వ్రాసింది - సరదాగానే తీసుకోండి. ఫలానా అగ్రిగేటరు మీద అక్కసుతోనో, మరేదో అని నా మోకాలుకీ, మరో అరగుండుకీ లెంకెయ్యకండీ. ఎదవన్నర గోల.