గురువారం 27 మే 2010

టెక్సస్ కి వెళ్ళొస్తా కానీ మీకు అందాక సెలవు మాత్రం కాదు!




ఇవాళ సాయంత్రం ఒక మినీ వ్యానులో ఇంకో ఫ్యామిలీతో కలిసి మొత్తం ఎనిమిది మందిమి వెళుతున్నాం. ఎనిమిది సీట్ల వ్యాను కొసం ప్రయత్నిస్తే దొరకలేదు. ఆప్షనులుగా ఇంకో సీటు వుంటుందో వుండదో కానీ ఏడు సీట్లలో అంతదూరం ఎనిమిది మందిమి అడ్జస్టు చేసుకోవాలి. పిల్లలకు బెల్టు వున్న సీట్లు వుండాలి కాబట్టి నలుగురు పిల్లలకూ నాలుగు సీట్లు కెటాయించాము. మా చుట్టాలావిడకి ఈ మధ్యనే సర్జెరీ జరిగింది కాబట్టి ఆమెకు ఒక సీటు కావాలి. మా ఆవిడ మహారాణి కాబట్టి ఆమెకు ఓ సీటు కావాలి. మా చుట్టం పొడుగు కాబట్టి తను ఎక్కువసేపు డ్రైవర్ సీట్లోనే సర్దుకుంటానన్నాడు. ఇక మిగిలింది నేను. నేనే త్యాగరాజుని. మనది పిట్టలాంటి శరీరం కాబట్టి ఎక్కడోచోట సెటిలవుతానని హామీ ఇచ్చాను. హాయిగా సీట్ల మధ్య పడుకొని సినిమాలు చూస్తూ, బజ్జుంటూ, గుర్రు కొడుతూ ఈ ప్రయాణ జీవితాన్ని లాగించేస్తా.  కొండొకచో కాస్సేపు డ్రైవింగ్ కూడా చేస్తా. మా దగ్గరి నుండి 15 - 16 గంటల ప్రయాణం.   డ్రైవింగ్ చేసేవారం ఇద్దరం వున్నాం కాబట్టి ఫర్వాలేదు.      

డల్లాస్ చుట్టుపక్కల్లో ఇద్దరు, ముగ్గురు బ్లాగర్లు/రీడర్లూ    నన్ను కలవడానికి ఆసక్తి చూపించారు. వారు కాంటాక్ట్ నంబర్లు ఈమెయిల్ ఇస్తే కాంటాక్ట్ చేస్తాను. ఆదివారం ఎప్పుడన్నది ఇప్పుడే తెలియదు కానీ ఆ రోజు మనం కలవడానికి వీలవ్వచ్చు. 

కెనడా, యు ఎస్ కి వచ్చినప్పటినుండీ టెక్సాస్ చూడాలని అనుకుంటున్నా ఇన్నేళ్ళుగా వీలయ్యింది కాదు.  ఎందుకో టెక్సాస్ అంటే నాకు ప్రత్యేకమయిన ఆసక్తి. టెక్సాస్ గుర్తుకువస్తే సినిమాల్లోని కౌబాయిలే గుర్తుకువస్తారు. ఎక్కువరోజులు అక్కడ గడపలేకపోతున్నందువల్ల ఆస్టిన్ వెళ్లలేకపోతున్నాను. వెళ్ళగలిగివుంటే కల్పనా రెంటాల, అఫ్సర్, భరద్వాజ లకు తీరికవుంటే తప్పక కలిసివుండేవాడిని. అదొక అసంతృప్తి నాకు ఈ ట్రిప్పులో. 

ఇహ యు ఎస్, కెనడా వెస్ట్ సైడు ఇంతవరకు వెళ్ళలేకపోయాను. కాలిఫోర్నియా అలాగే కెనడాలో చక్కని నగరం వాంకూవర్ మొదలయినవి చూడాలని ఎప్పటినుండి వున్నా వీలయ్యింది కాదు. ఒకసారి ప్లాన్ చేయాలి. వీలయితే అక్కడి బ్లాగర్లనీ కలవాలి. ప్రస్తుతం అయితే సి బి రావు గారు కూడా కాలిఫోర్నియాలోనే వున్నారు. 

మీరందరూ కూడా ఎప్పుడయినా షికాగో వస్తున్నట్లయితే తెలియజేయండి. వీలయినంతవరకు కలవడానికి ప్రయత్నిస్తాను.       

నా గే/బై పుస్తక ప్రచురణకి ఊహించని ఆటంకం వచ్చింది!!

మా ప్రింటర్ నుండి ఈ రోజే ఈమెయిల్ వచ్చింది. అందులో ఇలా వుంది! 

శరత్ గారూ,
మేము మీ పుస్తకాన్ని చెయ్యలేకపోతున్నాము. మా దగ్గర డిటిపి చేసేది అంతా ఆడపిల్లలు. వాళ్ళు ఎవ్వరూ ఈ పుస్తకం చెయ్యమని అంటున్నారు. అన్యధా భావించవద్దు. 

బుధవారం 26 మే 2010

110/66

నా బ్లడ్ ప్రెషర్ అది. ఇప్పుడే మా ఆఫీసులో చెక్ చేసి చెప్పారు. ఫార్మసీకి వెళ్ళినప్పుడల్లా అక్కడ వుండే బ్లడ్ ప్రెషర్ మానిటర్లతో కొలుచుకుంటూనేవుంటాను. నా బి పి ఎప్పుడూ కాస్త అటూ ఇటుగా టైటిల్లో పేర్కొన్నట్లుగానే వుంటుంది.  మరి మీ బి పి ఎంతేంటి?

నా బి పి కొలిచినావిడ నన్ను బాగా మెచ్చుకుంది. మీరు మిడిల్ ఈస్టర్న్ ఫుడ్డు ఎక్కువగా తింటారు కదా. అందుకే మీకు బాగా ఫ్యాట్ కంట్రోల్లో వుంటుంది.  మీ నుండి ఫుడ్డు విషయంలో మేము బాగా నేర్చుకోవాలి అంది. ఇండియన్ ఫుడ్డు అనక మిడిల్ ఈస్ట్ ఫుడ్డు ఎందుకందో అర్ధం కాలేదు. ఏమో మన ఫుడ్డు ఏమయినా అప్పట్లో అక్కడినుండి నేర్చుకున్నామేమో, అస్సలే మనం చరిత్ర విషయంలో వీకు అని గమ్మునుండిపోయాను. లేదా అలా పొరపాటున నేను మిడిల్ ఈస్టర్న్ అనుకొని చెప్పిందేమో. ఫ్యాట్ గురించి ఆమె చెప్పిన మాటలకి మనస్సులో ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, నా ట్రైగ్లిసరాయిడ్స్ కవుంట్ ఆమెకు చెప్పాలనే కోరికను బలవంతంగా నొక్కేసుకొని బయటకి వచ్చాను.   

 బి పి ఎలా కంట్రోలులో ఉంచుకోవాలనే విషయమై ఒక చిన్న పేపర్ ఇచ్చారు.
అందులో ఇలా వుంది:
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
- ఉప్పు తగ్గించాలి. రోజుకి ఒక చెంచాడు కంటే ఎక్కువ తినొద్దంట.
- పొగ తాగడం మానివేయాలి
- డైటెరీ కొలెస్ట్రాల్ మరియు సాచురేటెడ్ కొవ్వు తగ్గించాలి
- క్రమం తప్పకుండా బి పి చూసుకుంటూవుండాలి 

ఈ సినిమా బాగా నచ్చినా కొందరు 1/5, 2/5 రేటింగ్ ఇచ్చారు. ఎందుకంటే....

ఎందుకంటే ఆ చిత్రంలోని వాస్తవికతను భరించలేకపోయారు కనుక. ఎందుకో ఒకరి మాటల్లోనే చదవండి:
Everyone I know loves Fargo. To the point where I am almost ashamed that I hated it. There seems to be this attitude surrounding this movie that if you like it, then you are a true intellectual who can appreciate a dark comedy, but if you don't like it, then you must be a cretin. So then, I must be a cretin, because I really didn't like this movie, and I'll tell you why. It is disturbingly real. The characters, the violence, the domestic relationships... it is all entirely believable. So as a piece of the film making, this film is a true success. But it is so real and some of the characters so genuinely pathetic, that the movie left me feeling completely depressed after wards. So let's just say that this movie is not for everyone. It is like the black jelly bean of film-making. You will either love it or you will hate it. If you were looking to pack a couple more dark, emotional hours into your life anyway, then this is probably the movie for you. But if you were just looking for a simple piece of escapist entertainment (which makes you a cretin like me ;) ) then search elsewhere.

ఒక కారు డీలరు తన భార్యను తానే ఓ ఇద్దరితో అపహరింపజేసి తన మామ దగ్గర డబ్బులు కొట్టేద్దామని ప్లాన్ వేస్తాడు. ఆ ఇద్దరు వ్యక్తులు అతని భార్యని కిడ్నాప్ చేసి తీసుకువెళుతున్నప్పుడు ఒక పోలీసు ఆఫీసరు వాళ్ళ కారుని ఆపుతాడు. అప్పటి నుండి వారి యొక్క (డార్క్) కామెడీ కష్టాలు మొదలవుతాయి. అప్పుడో హత్య జరుగుతుందక్కడ. ఒక్క షాటుతోనే మరణం సంభవించే, గగుర్పాటు కలిగించే సన్నివేశాన్ని ఇంకా మన తెలుగు సినిమా వాళ్ళు ఎందుకు కాపీ చేయలేదా అనుకున్నాను. ఒక వేళ కాపీ చేసివున్నా ఆ సినిమా ఇంకా నేను చూడలేదేమో.   

ఈ సినిమాలో పోలీసు ఆఫీసరుగా నటించిన హీరోయినుకి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. మొదట్లో ఆమెను చూసి అస్సలు హీరోయిన్ అని అనుకోలేదు. అందంగా కూడా ఏమీ లేదు. కానీ నెమ్మదిగా ఆమె నటన చూస్తున్న కొద్దీ అమె నచ్చడం ప్రారంభించింది. నాకయితే హీరోయిన్ నటన కంటే కూడా కారు డీలరుగా నటించిన విలియం మేసీ నటన బాగా నచ్చింది. అతను ఆస్కార్ అవార్డుకి నామినేట్ చేయబడ్డాడు కానీ ఎందుకనో అవార్డ్ రాలేదు.  ఈ చిత్రం చూసాక నేను మేసీ అభిమనినయిపోయాను. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేకి గాను కోయెన్ సోదరులకు కూడా ఆకాడెమీ అవార్డ్ వచ్చింది. 

మీకు కనుక డార్క్ కామెడీ ఇష్టముంటే ఈ సినిమా మీరు తప్పక చూడాల్సిందే. మంచు, చలి ప్రదేశాలలోనే తీసిన ఈ సినిమా అలాంటి వాతావరణంలో ప్రస్ఫుటించే నీరవత్వాన్ని చక్కగా ప్రదర్శించింది. ఈ చిత్రం చివర్లో వుడ్ చిప్పర్ (చెక్క పొట్టు) యంత్రం తో ఒక సన్నివేశం వుంటుంది.   ఈ సినిమా చూసాక ఆ యంత్రం చూసినప్పుడల్లా మీకు గగుర్పాటు కలుగకమానదు. ఓ చక్కటి క్రైం డ్రామా, ఆస్కార్ స్థాయి నటన, క్రూరమయిన హాస్యం కోసం, వాస్తవికంగా అనిపించే సన్నివేశాల కోసం ఈ సినిమా తప్పకుండా మీరు చూడొచ్చు. దీని 5 స్టార్ రేటింగ్ నేను ఇవ్వబోయి హారోయిన్ అంత అందంగా లేదని 4 స్టార్ రేటింగుతో సరిపుచ్చాను :) 

Fargo

1996   R    98 minutes
Frances McDormand won an Oscar for her turn as pregnant police chief Marge Gunderson -- a serious sleuth who's sharper than her folksy accent suggests -- in this Coen brothers black comedy that also earned the siblings a nod for Best Screenplay. William H. Macy co-stars as a car dealer who conspires with hotheaded kidnappers (Steve Buscemi and Peter Stormare) to kidnap his wife (Kristin Rudrüd) so he can pocket part of the hefty ransom.
Cast:
Frances McDormand, Steve Buscemi, William H. Macy, Peter Stormare, Harve Presnell, Steve Park, John Carroll Lynch, Kristin Rudrud, José Feliciano
Director:
Joel Coen
Genres:
Drama, Crime Dramas, Dark Humor & Black Comedies, Indie Dramas, Blu-ray
This movie is:
Witty, Quirky, Cerebral, Violent
 

Movie details

Ratings
R Strong violence, language and sexuality.
15 Common Sense rating Iffy for 15+
Awards
AFI®
  • Top 100 Laughs
  • Top 100 Movies nominee
1997 Academy Award®
  • Best Actress: Frances McDormand
  • Best Writing Original Screenplay
  • Best Film Editing nominee
  • Best Supporting Actor nominee: William H. Macy
  • Best Picture nominee
  • Best Director nominee: Joel Coen
  • Best Cinematography nominee
1997 Independent Spirit Awards®
1997 BAFTA®
1997 Golden Globe Awards
  • Best Director (Motion Picture) nominee
  • Best Motion Picture (Musical or Comedy) nominee
  • Best Actress in a Motion Picture (Musical or Comedy) nominee 
 
 (Credits: www.netflix.com)

సోమవారం 24 మే 2010

విఘ్నేశ్వరుడు గే/బై ఉద్యమానికి ఆటంకాలు తొలగిస్తాడా?

సమావేశమే కాదు పేరేడ్ కూడా వుంటుందని మొన్న ఉదయం మా ఆవిడకి చెప్పాను. బట్టలిప్పుకొని తిరిగే పేరేడా అని నవ్వుతూ అడిగింది. ఎలా ఊహించిందబ్బా అని నేను గతుక్కుమన్నాను. మేము టొరొంటోలో వున్నప్పుడు మా ఇంటి పక్కనుండే గే పేరేడులు వెళుతుండేవి. అందుకని పెరేడులంటే తనకి అవి మాత్రమే గుర్తుకువస్తాయని సమాధానపడ్డాను.

మిచిగన్ అవెన్యూలో మా బై కో ఆర్డినేటర్ నోయెల్ ను కలుసుకున్నాను. హార్వీ మిల్క్ డే ర్యాలీ కోసం అప్పటికి అక్కడికి ఓ వందమంది దకా వచ్చారు. మా బై గ్రూపునుండి మాత్రం నాతో సహా ముగ్గురమే. వారాంతం వాతావరణం బావుండటంతో ఎక్కువమంది రాలేదనుకుంటా. ఇంపాక్ట్ మరియు LGBTQ గ్రూపులనుండి బాగానే వచ్చారు.   మరి కొంతమంది వచ్చి చేరారు. దాదాపుగా 150 మందికి మించి అయినట్లున్నారు. మా బై గ్రూపు లోని  ఇంకొకతను బరదర్ మైకేల్. అతను ఉత్సాహంగా, సరదాగా వున్నాడు. తను పెద్ద బై ఝండా పట్టుకొని నిలుచున్నాడు.  

అంతలో ఇంపాక్ట్ గ్రూపు నిర్వాహకుడు మా దగ్గరికి వచ్చి కలుసుకొని చక్కగా మాట్లాడాడు. నోయెల్ చేతి వేలికి వున్న వుంగరం లాంటిది చూసి అదేమిటని అడిగాడు. గణేశ్ అని చెప్పాడు నోయెల్. నాకు ఆశ్చర్యం వేసింది. అది మాదేశానిదే, మా హిందూ మతానిదే అని నవ్వుతూ చెప్పాను. అవును అన్నాడు. నేను హిందూ కాదనుకోండి - నేను నాస్తికుడిని అని సవరించాను.  మత భావనతో కాకుండా ఆటంకాలు తొలగించే శక్తిగా తాను గణేశుడికి ఇష్టపడుతాను అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది.    విఘ్నేశ్వరుడు గే/బై ఉద్యమానికి కూడా ఆటంకాలు తొలగిస్తాడా అని మనస్సులో అచ్చెరువొందాను.

వచ్చిన వారిలో కొంతమంది బావున్నారు. అమ్మాయిల్లా వుండే అబ్బాయిలు అంటే నాకు ఇష్టం. ఒకరిద్దరు అలా వున్నారు. కొంతమంది అమ్మాయిలూ బావున్నారు. వారు లెస్బియన్స్ కదా అని మనస్సు మధురం అయ్యింది. కాస్సేపయ్యాక కొంతమంది మెగాఫోన్లు పట్టుకొని ఉపన్యాసాలు ఇచ్చారు. ఏవేవో నినదించారు. గాలి హోరులో అవన్నీ అర్ధం అయినా కాకున్నా నేనూ వారితో పాటుగా నినదించాను. ఆ తరువాత మా పేరేడ్ మొదలయ్యింది. మేము అలా మా ఝండాలూ, పోస్టర్లూ, బ్యానర్లూ పట్టుకొని వెళుతూ స్లోగన్స్ ఇస్తూ వుంటే మిచిగన్ అవెన్యూ దారి పొడుగునా వున్నవారు, టూరిస్టులు అచ్చెరువొందుతూ మమ్మల్ని చూస్తూవుంటే, మమ్మల్ని వింత జంతువుల్లా ఫోటోలూ, వీడియోలూ తీసుకుంటూవుంటే నాకు సగర్వంగా, సంతృప్తిగా అనిపించింది. చిన్న పిల్లలు ప్రశ్నార్ధకం ఫేసులతో మమ్మల్ని చూస్తూవుంటే నాకు నవ్వొచ్చింది.        

మా సమావేశానికీ, పేరేడుకి మంచి భద్రత కల్పించారు. మా పేరేడ్ దాటేంత వరకు ఆయా వీధుల్లో ట్రాఫిక్ ఆపివేసారు. టివి కవరేజ్ లేకపోవడం అసంతృప్తిగా అనిపించింది. పేరేడ్ ఓక్ స్ట్రీట్ దగ్గర్లో వున్న ఒక పార్కులో ముగిసింది. అక్కడా మళ్లీ కొన్ని ఉపన్యాసాలు, స్లొగన్స్.  అలా మా ర్యాలీ, పేరేడ్ ముగిసింది. మరో టపాలో దీనికి సంబంధించిన సైడ్ లైట్స్, అపశృతులు వివరిస్తాను.  ఫోటోలు, వీడియోలు అందాక అవి కూడా అందిస్తాను. 

శుక్రవారం 21 మే 2010

రేపు షికాగోలో గే (హార్వీ మిల్క్ ) డే ర్యాలీ మరియు పేరేడ్ కి వెళుతున్నాను

మే 22 వ తారీఖును హార్వీ మిల్క్ డే గా కాలిఫోర్నియా రాష్ట్రం గుర్తించింది. అతను బ్రతికి వుంటే రేపు 80 వ పుట్టిన రోజు అయివుండేది.  ఇతడు స్వలింగ సంపర్కుల ఉద్యమకారి. అతనిని 1978లో హత్య చేసారు. అతని పేరు మీద మిల్క్ అనే సినిమా కూడా వచ్చింది. అతని పాత్ర ధరించిన సీన్ పెన్ కు ఉత్తమ నటుడిగా ఆస్కార అవార్డ్ కూడా వచ్చింది. 
 
అతని పుట్టిన రోజు సందర్భంగా షికాగో డవున్ టవునులో ర్యాలీ, పేరేడ్ జరుగబోతోంది. మా బై సెక్సువల్ గూపు కూడా అందులో పాల్గొంటోంది. అందుకే వీలయినంతవరకు దానికి వెళ్ళాలని చూస్తున్నాను. జాతీయ స్థాయిలో LGBTQ సమానత్వ హక్కుల కోసం పోరాటంలో భాగంగా ఈ ర్యాలీ జరుగుతోంది.  
 
“I have tasted freedom. I will not give up that which I have tasted. I have a lot more to drink.” – Harvey Milk

మార్లిన్ మాన్రో సినిమా తొలిసారి చూసాను

ప్యాంట్లు వేసుకున్నదగ్గరి నుండీ, మాన్రో ఫోటో చూసిన దగ్గరి నుండీ, ఆమె గురించి తెలిసిన దగ్గరి నుండీ ఆమె అభిమానిని నేను. కానీ ఇప్పటివరకూ ఆమె సినిమా చూడటం వీలయ్యింది కాదు. నిన్న Don't Bother to Knock సినిమా మొదలెట్టాను. ఇది ఆమె నటనా జీవితంలో తొలిరోజుల్లో తీసిన లో బడ్జెట్ సినిమా అంట. అప్పటికింకా ఆమెకు స్టార్‌డం రాలేదు.  ఇంకా సినిమా మొత్తం చూడలేదనుకోండి కానీ అందులో మాన్రో తెగనచ్చేసింది. లేత లేతగా, దొర దోర అందాలతో భలే బావుంది. ఇంకో హీరోయిన్ కూడా బావుంది. ఇది నలుపు  తెలుపు సినిమా.   ఇది భయానక మరియు సస్పెన్స్ సినిమా అట. ఈ సినిమా కొంతవరకే చూసాను కాబట్టి ఎలా వుందో అప్పుడే చెప్పలేను కానీ మీకు మాన్రో ఇష్టమయితే కనుక ఆమె నట జీవితంలోని తొలిరోజుల్లో ఎలా వుండేదో చూడలనుకుంటే ఎంచక్కా ఈ సినిమా చూసెయ్యొచ్చు.  

రంగుల సినిమాలు అయినా కాకున్నా పాతకాలం సినిమాలు చూస్తుంటే ఒక రకమయిన హాయి కలుగుతుంది. ప్రశాంతంగా సాగుతుంటాయవి. హడావిడి వుండదు. కొద్దిసేపటికే ఏంగిల్స్, షాట్లు మార్చకుండా కాసేపయినా తాపీగా ఆ దృశ్యాలను ఆస్వాదించొచ్చు. అందుకే ఇకనుండీ నలుపు తెలుపు సినిమాలు కూడా చూసెయ్యాలనుకుంటున్నాను. ఎలిజబెత్ టేలర్ సినిమాలు కూడా ఎప్పటినుండో చూడాలనుకుంటున్నా ఇంకా కుదరలేదు. ఆమెకు వీరాభిమానిని ఏమీ కాదు గానీ ఆమె సినిమా ఒక్కటయినా చూస్తే అవుతానేమో.   

మార్లిన్ మాన్రో సినిమాలు ఏవి బాగుంటాయేంటి? మీలో కూడా ఎవరయినా మాన్రో అభిమానులు వున్నారా?నాకు స్త్రీలల్లో పాదాలు బాగా నచ్చుతాయి. వారిలో అందంతో పాటుగా పాదాలు కూడా బావుంటే ఇంకా నాకు ఆనందం వేస్తుంది. మాన్రో పాదాలు కూడా బావుంటాయి. 

Don't Bother to Knock

1952    PG     76 minutes
A real acting tour de force for Marilyn Monroe (just starting out as an actress) as a disturbed babysitter who must take care of a young child in a hotel room for one evening. Marilyn proved with this movie -- and a clutch of others, most notably Bus Stop -- that she was more than just a pretty face with a lot of curves.
Cast:
Marilyn Monroe, Anne Bancroft, Richard Widmark, Jim Backus, Don Beddoe, Willis Bouchey, Jeanne Cagney, Elisha Cook Jr., Donna Corcoran, Verna Felton
Director:
Roy Ward Baker
Genres:
Classics, Classic Dramas, Classic Thrillers, Fox Home Entertainment
This movie is:
Scary, Suspenseful

గురువారం 20 మే 2010

తెలంగాణా నాస్తికోద్యమ చరిత్ర - శ్రీ సురమౌళి గారి ముందుమాట - 2

 (పుస్తక రచయిత: మా నాన్న నాగం గారు      రచనా కాలం: 14-09-1994 )

నా అలవాట్లలో ప్రవర్తనలో, వైఖరిలో, నాస్తిక జీవన విధానాన్ని అనువర్తింప చేసుకున్నందుకు వచ్చిన మార్పులు నిజంగా గణనీయమైనవి - గర్వించదగ్గవనే భావిస్తున్నాను. ఒకటి రెండింటిని ఇక్కడ ప్రస్థావిస్తాను:

1. దారిలో నడుస్తున్నప్పుడు పసుపు కుంకుమలు పెట్టిన ఏ రాయి కనపడినా, పొడుగాటి గడ్డాలూ, కాషాయ వస్త్రాలూ ధరించిన వారెవరయినా తారసపడినా అప్రయత్నంగా నమస్కరించడానికి నా చేతులు లేవవు.

2. కొత్తవారయినా పాత వారైనా, నాకు అతి సన్నిహిత మిత్రులైనా, కొత్తగా నా మైత్రి కోరి ఎవరన్నా వచ్చినా, వారి కుల మతాలను గురించి ప్రశ్నించడం నాకు అలవాటులేదు.  

3. మహోపన్యాసాలు విని, చప్పట్లు కొట్టి ఆ మహోపన్యాసం ఛేసిన ప్రముఖులను గురించి వెంటనే గౌరవం నా మనస్సులో ఏర్పడదు. అతడు చెప్పిన వాటిని అతని ఆచరణతో బేరీజు వేసి ఆచరణ గీటురాయి మీద ఈతని ప్రవర్తన రుజువైనప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పట్ల నాకు గౌరవం ఏర్పడుతుంది. ఇతరత్రా ఆ వ్యక్తి ఎంత ప్రముఖుడయినా సరే, ప్రఖ్యాతుడయినా సరే.  

4. సమాజంలో నాటుకున్న గౌరవ ప్రతిష్టా భావనలకు భిన్నమైనటువంటి వాస్తవాలయినా సరే, దాచి పెట్టే అలవాటు నాకు లేదు.

ఇటువంటి అలవాట్లవల్ల నా పట్ల కొంతమందికి గౌరవం, మరి కొంతమందికి అసహ్యం ఏర్పడ్డాయి.

ఈ పుస్తకానికి ముందుమాట వ్రాస్తూ నా గురించి మరీ మరీ చెప్పుకోవడం సరికాదు. కాని నాస్తిక జీవన విధానపు ప్రభావం ఉద్యమం ప్రబలంగా ఉన్నా లేక పోయినా, కార్యక్రమాలన్నీ మూలన పడిపోయినా జీవిత వైఖరిలో చెరగని ముద్ర ఎలా వేసిందో వివరించడానికి మాత్రమే ఈ రెండు మూడు మాటలు వ్రాసాను.  

ఈ పుస్తకాన్ని వ్రాసిన నాగం గారు, తన కందిన ఒక లేఖను ఇందులో ప్రచురించాలని భావించారు. పుస్తక ప్రచురణ సమయంలో నేనే దాన్ని తొలగించాను. ఎదగని మనుషులు చేసే ఇటువంటి ప్రేలాపనలను పట్టించుకొనక పోవడమే విజ్ఞతగా భావించి ఇలా చేసాను. నాగం గారు ఇందుకు నొచ్చుకోరన్న నమ్మకం నాకున్నది. 

ఇదో సోది సినిమా - ప్రస్థానం పై మా ఆవిడ ఒక్క ముక్క సమీక్ష :))

మొత్తమ్మీద నిన్న ప్రస్థానం సినిమా చూసే మాహాద్భాగ్యం కలిగింది. డివిడి తెచ్చుకొని కొన్నిరోజులయినా ఈ సినిమా చూడటానికి వీలయ్యింది కాదు. దానికి కారణం మా ఆవిడ వీటో. వరుడు అయినా చూస్తాను కానీ ఇది చూడనని వరుడు చూపించింది. చూసిన పది నిమిషాలకే చిరాకేసి ఆ సినిమా నేను చూడటం ఆపేసాను. అంతా అతి, కృత్రిమత్వం ఆ సినిమాలో.   ప్రస్థానం నేను బావుటుందన్న సినిమా కాబట్టి మా ఆవిడ ఆ సినిమా బావుటుందని అస్సలు నమ్మలేకపోయింది.  చాలా పెద్ద పెద్ద సినీ మేధావులు ఈ సినిమా బావుంటుందంటున్నారని చెబితే మరింత డవుట్ పడింది. మొత్తమ్మీద ధైర్యం చేసి నిన్న ఆ సినిమా పెట్టింది. నామీది నమ్మకం మరోసారి వమ్ము అయ్యింది. వా... :((    

ఈ క్రిందిది నా అభిప్రాయం - మా ఆవిడది కాదు. మా ఆవిడ ఒక్క ముక్కలోనే తేల్చేసిందిని చెప్పాకదా. 
సినిమా బావుంది కానీ మరీ అంత గొప్ప చిత్రంగా, కళాఖండంగా అనిపించలేదు. శర్వానంద్, సాయికుమార్ నటన, కథలో కొంత వైవిధ్యం తప్ప ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఒకసారి చూడొచ్చు. మళ్ళీ మళ్ళీ చూసేంత గొప్ప సినిమా ఏమీ కాదు. ఈ సినిమా నిర్మాణపు విలువలూ సో సో. ఒక్క పాట కూడా బావోలేదు.   హీరోయిన్లు ఏడ్చినట్టే వున్నారు.  కమర్షియల్ సినిమానే కానీ కాస్త నేలమీద వుండి తీసేసరికి మన సినీ మేధావులు  ఓ తల్లక్రిందులయిపోయారు. మన పైత్య మేధావులు ఈ B గ్రేడ్ మూవీకి ఎందుకు ఇంత హైప్ ఇచ్చారా అన్నది నాకు ఎంత బుర్ర గీక్కున్నా అర్ధం కాలేదు. 

మొత్తమ్మీద పైత్యతరంగం నిర్వాహకులు ఈ ప్రస్థానం సినిమాని ఓ కల్ట్ సినిమాగా మార్చేసారు. వాళ్ళే ఓ కల్ట్ అయినప్పుడు అందులో విచిత్రం ఏముంది లెండి.  మళ్ళీ వాళ్ళు ఏ తెలుగు సినిమాని ప్రమోట్ చేస్తారో, ఏ తెగులు చిత్ర రాజాన్ని కల్ట్ సినిమాగా మార్చేస్తారో అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా వాళ్ళు చెప్పినట్లుగా గొప్పగా అనిపించివుంటే తప్పకుండా అదే అభిప్రాయాన్ని వెల్లడించేవాడిని. మొత్తమ్మెద నాకు వాళ్ళ అభిప్రాయం మీద వున్న సంశయాన్ని, సంకోచాన్ని నిలబెట్టారు. మరోసారి వీరి హైప్ ని చూసి ఓ ఆ సినిమా తెగ చూసెయ్యాలని ఉబలాటపడక్కరలేదు అని జ్ఞానోదయం అయ్యింది. వీళ్ళ వల్ల ఈ సినిమాకి మా ఆవిడ దగ్గర హైప్ ఇచ్చి మరోసారి ఆమె దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. అది నాకు కామనే, క్యాజువలే కాబట్టి ఎక్కువగా దాని గురించి వర్రీ కాకండి.  ఇంకానయ్యం - సినిమా హాలుకి తీసుకువెళ్ళి చూపించలేదు. వచ్చేప్పుడు దారిపొడుగునా మొట్టికాయలు పడేవి :( 

బుధవారం 19 మే 2010

ఇక్కడ తొడలు కొట్టబడును!

మన తెలుగు సినిమాలలో అందరూ తొడగొట్టడం చూసి నాకు ఆ ఉబలాటం ఎక్కువయ్యింది. కానీ ఒక చిన్న సందేహంతో ఆగిపోతున్నాను. నా సందేహం ఏంటో మీరు గెస్ చేసేస్తున్నారనుకుంటా. వాచిపోతుందని నా డవుట్ అనుకుంటున్నారు. అంతేనా? అది కాదండీ. అలాంటి చిన్న చిన్న డవుట్లు వస్తే వీడు శరత్ బాబు ఎందుకవుతాడు? మరేంటో చెప్పుకోండి.

సరే నేనే చెప్పేస్తున్నా. ఒకవేళ మన ఖర్మ కాలి ఆ తొడ కొట్టుకోవడం గురి తప్పి తగలరాని దగ్గర తగిలితే నా గతేం కాను? నా బాక్స్ బద్దలవుతుంది :(  అస్సలే తొడకొట్టుకోవడం మనకు కొత్త. ఎక్కడ కొడితే ఎక్కడ తగులుతుందో ఎవడికి తెలుసు? అందుకే ఎందుకయినా మంచిదని నా తొడలు నేను కొట్టుకోకూడదని డిసైడ్ అయ్యా. అందుకే ఇతరుల తొడలు మాత్రమే కొట్టాలని మరీ డిసైడ్ అయ్యా.   అప్పుడెక్కడ తగిలినా మనకు వచ్చిన నష్టమేమీ లేదు కదా. అందుకే.

అలా పక్కనున్న వాళ్ల తొడలు కొట్టడం అస్తమానూ కుదిరి చావదు కనుక యథాశక్తి తొడలు కొట్టుకొమ్మని ఇతరులని ప్రోత్సహిస్తుంటాను. ముఖ్యంగా రౌడీగారిని ప్రోత్సహిస్తుంటాను. ఎప్పుడో ఒకప్పుడు గురితప్పకపోతుందా, నా చిరకాల కోరిక తీరకపోతుందా అని నా బుల్లి ఆశ. నేను రౌడీని ప్రోత్సహిస్తుంటే ఆ ఆనందం పట్టలేక పవన్ కూడా (తొడలు) కొట్టుకుంటున్నాడనీ, వాచిపోయి ఝండూబాం కూడా రాసుకుంటున్నాడనీ తెలియవచ్చింది. నా కోరిక తీరివుండొచ్చంటారా?    

బ్లాగుబద్ధమయిన హెచ్చరిక: నా తొడలు కొట్టాలని ఎవరూ చూడకండి!   కనీసం ఆ ఆలోచన కూడా మనస్సులోనికి రానివ్వకండి.  

సోమవారం 17 మే 2010

లాంగ్ వీకెండ్ టెక్సాస్ కి వెళుతున్నాం


ఒక దగ్గరి మిత్రుడి గృహప్రవేశం కోసం వస్తున్నాం. ఈనెల 29 నుండి ఒక మూడు రోజులు డల్లాస్ దగ్గరలోని Lewisville 75056 లో వుంటాము. అక్కడకి దగ్గర్లో బ్లాగర్లెవరయినా వుండి నన్ను కలుసుకోవాలనే ఆసక్తివుంటే వీలయినంతవరకు వారిని కలవడానికి ప్రయత్నిస్తాను.  కలుద్దాం అనుకునేవారు నాకు తెలియజేయండి.   

గోరా గారితో నా పరిచయం

గోరా (గోపరాజు రామచంద్రరావు) గారి గురించి చాలామందికి తెలిసేవుండవచ్చు. వారు నాస్తికోద్యమ నాయకులు. అలా మీకు తెలియకపోయినా ఇంకో విషయం చెబితే మీకు ఈజీగా తెలుస్తుంది. డాక్టర్ సమరం నాన్నగారు.  నేను అయిదవ తరగతి చదువుతున్నప్పుడు మా ఊరి దగ్గరలో వున్న పెదనెమిల గ్రామానికి వారు వచ్చారు. వారి ముఖ్య అనుచరులు మరియు తెలంగాణాలో ముఖ్యమయిన నాస్తిక కార్యకర్తలలో ఒకరయిన మా నాన్నగారు నన్ను కూడా పెదనెమిల గ్రామానికి తీసుకువెళ్ళారు.   అకడే తొలిసారి గోరాగారిని చూడటం. వారు నాతో ఏమయినా మాట్లాడారా లేదా అన్నది నాకు గుర్తుకులేదు. వారితో పాటుగా మిగతా వారితో పాటుగా కలిసి ఆ పల్లెలో తిరిగాను. హరిజనవాడలో ఒక ఇంటి దగ్గర ఆగి మంచి నీళ్ళు అడిగారు.    శుభ్రమయిన ఆ గ్లాసుని చూసి అంత శుభ్రంగా చాలామంది అగ్రవర్ణాల కుటుంబీకులు కూడా వుండరని మెచ్చుకోవడం గుర్తుకువుంది.  

ఆ తరువాత ఆగ్రామంలో నాస్తికశిక్షణా శిబిరం జరిగింది. గోరా గారితో పాటుగా మా నాన్నగారు కూడా ఉపన్యసించారు. ఇంకా కొంతమంది ప్రసంగించారు. నా చిన్నప్పటి సంగతులు కాబట్టి ఎక్కువ సంగతులు గుర్తుకులేవు. మన ఊరికి ఎప్పుడు గోరాగారు వస్తారని ఉత్సాహంగా మా నాన్నగారిని అడిగాను. ఒకసారి వచ్చారని, మా ఇంటికి కూడా వచ్చారని నాన్న చెప్పారు. మా ఇంటిలో మా నాన్నగారి పెద్ద గ్రంధాలయం చూసి గోరాగారు ముచ్చటపడ్డారని కూడా గుర్తుకుచేసుకున్నారు. 

ఆ తరువాత కొన్ని నెలలకే ఓ సాయంత్రం రేడియో న్యూస్ విని గోరాగారు ఒక సభలో ఉపన్యసిస్తూ అలాగే ఒరిగిపోయి మరణించారని నాన్నగారు విచారంగా చెప్పారు.  మిగతా నాస్తికులతో కలిసి గోరాగారిని చివరిసారిగా చూడటానికై నాన్నగారు హడావిడిగా విజయవాడకి ప్రయాణం అయి వెళ్ళారు.  

అలా గోరాగారిని పెదనెమిలలో చూడటమే మొదటిసారి, చివరిసారి అయ్యింది నాకు. నిరాడంబరమయిన, నిజాయితీపరమయిన, నిష్కల్మషమయిన వారి యొక్క వ్యక్తిత్వం నాకు ఎప్పుడూ స్ఫూర్తి నిస్తూనేవుంటుంది.   

గోరా గారి గురించి, వారి యొక్క నాస్తిక కేంద్రం, ఇతర వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది లింకులని క్లిక్ చేయండి.     

శుక్రవారం 14 మే 2010

తెలంగాణా నాస్తికోద్యమ చరిత్ర - శ్రీ సురమౌళి గారి ముందుమాట - 1

(రచనా కాలం 14-09-1994 )

తెలంగాణా నాస్తికోద్యమ చరిత్ర పేర శ్రీ నాగం రచించిన ఈ చిన్న పుస్తకానికి ముందుమాట రాయవలసిందిగా మిత్రులు శ్రీ మెరుగు, శ్రీ ఎల్లారెడ్డి నన్ను ఆదేశించినప్పుడు, అందుకు నేను అర్హుడిని కానేమోనని సందేహించాను. ఈ ఉభయ మిత్రులు నన్ను పట్టుబట్టడంతో కాదనలేక సాహసిస్తిస్తున్నాను.

వరంగల్లులో ఏర్పడిన నాస్తిక సంఘం నియమావళి రచనకూ, నియమావళికీ ముందు ఆశయ ప్రకటన పేరుతో సూత్రబద్ధంగా అతి సంక్షిప్తంగా నాస్తికత్వ సిద్ధాంతాలను రూపొందించడంలోనూ నేనే ప్రధాన పాత్ర వహించినందున, ఈ ముందుమాట రాసే అర్హతలేకపోలేదని, నన్ను సంభాళించుకొని ఇందుకు ఉపక్రమిస్తున్నాను.
మరీ చిన్నతనంలో బహుశా 7 వ తరగతి పాసై, ఎనిమిదవ తరగతిలో ప్రవేశిస్తున్న కాలంలోనే నాస్తికత్వ ప్రభావం నా మీద పడింది. ఇంత చిన్న వయస్సులో నా పైన నాస్తిక జీవన విధానపు ప్రభావం పడినందు వలన నా అరవయ్యేళ్ళ జీవన గమనంలో నా వైఖరిలో వచ్చిన మార్పుల వల్ల నేను ప్రయోజనం ఏమేరకు పొందానో ఏ మేరకు నష్టపోయానో ఆలోచించుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ వుంటే తృప్తి కొంతమేరకూ, మరి కొంతమేరకు అసంతృప్తి కూడా కలుగుతుంటాయి.

చిన్న వయస్సులోనే నాస్తిక వైఖరిని పుణికి పుచ్చుకున్నందు వలన నేను కోల్పోయానని భావించే ఒక్క అంశాన్ని ఇక్కడ పేర్కొనక తప్పదు. అది - మన ప్రాచీన భారతీయ సాహిత్యంలోని విజ్ఞాన విషయాలను - దాట వేసినందుకు - రామాయణ, భారత, భాగవతాది కావ్యాలను అవకాశం వుండీ అశ్రద్ధ చేసినందుకు అప్పుడప్పుడు కాస్త అసంతృప్తి పొడసూపుతూ వుంటుంది. అయితే డాక్తర్ లోహియాతో పరిచయం అయిన తరువాత, ఆయన సహచర్యం వల్ల వాటి అధ్యయనాసక్తి పెంచుకోగలిగాను. అయితే ఇప్పుడు ఈ మీరిన వయస్సులో, ఎంత మేర దాన్ని అధ్యయనం చేయగలనో అనుమానమే.

సినిమా: ఒక గ్రామంలో ఎన్నో దశాబ్దాలుగా జనాభా 436 మాత్రమే. అదెలా?


నిన్న రాత్రి Population 436 సినిమా చూసాము. మా అమ్మలునీ, ఆవిడనీ, నన్నూ ఈ సినిమా కట్టిపడేసింది. నాకు తెలిసిన నటులు ఎవ్వరూ లేరు. ప్రతిక్షణం ఉద్విగ్నంగా కథ నడుస్తూవుంటుంది. ఒక గ్రామంలోకి జనగణన అధికారి వచ్చి ఎన్నో శతాబ్దాలుగా ఆ ఊరి జనాభా నిలకడగా 436 మాత్రమే వుంటోందని తెలుసుకొని ఆస్చర్యపడుతాడు. నెమ్మది నెమ్మదిగా అది ఎలా సాధ్యమయ్యిందో అతనికి అర్ధమవుతూ వుంటుంది. అది పూర్తిగా అర్ధమయ్యేలోగా తన జీవితానికే అర్ధం లేకుండాపోయే పరిస్థితులు ఎదురుపడుతాయి.

హీరోయిన్ బావుంది. మిగతా నటీనటులంతా పాత్రలకు తగ్గట్టుగా నటించారు. కొన్ని సన్నివేశాలలో కొద్దిగా భయం కలిగిస్తుంది కానీ హార్రర్ సినిమా కాదు ఇది. ముగింపు ఊహకి అందకుండా వుండి కాస్సేపు మీ బుర్ర గోక్కునేలా చేస్తుంది. సినిమా ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడే ముగియడం చిత్రంగా ఒక వృత్తంగా అనిపించి మనల్ని అప్రతిభులని చేస్తుంది. థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టం వున్నవారు చూడదగ్గ సినిమా ఇది. చిన్నపిల్లలు కూడా ఆసక్తికరంగా చూడగలిగే సినిమా ఇది. ఒక్క సీనులో మాత్రం నగ్న దృశ్యాలు వుంటాయి.      

Population 436

2006   R     92 minutes
For a century, Rockwell Falls has had the same number of residents: 436. A census taker (Jeremy Sisto) is sent there to figure out how the town managed to accomplish such a dubious feat in this disturbing drama. Once he arrives, he quickly senses all's not well and is subsequently stripped of his freedom. If he doesn't fall in line with the village's oppressive rules, he may end up lost forever. David Ames and Fred Durst co-star.
Cast:
Jeremy Sisto, Fred Durst, Charlotte Sullivan, David Ames, Cory Cassidy, James Blicq, Martin Trudel, Reva Timbers, Rick Skene, Peter Outerbridge, Dana Horrox, Gavin Polone
Director:
Michelle Maxwell MacLaren
Genres:
Thrillers, Indie Suspense & Thriller, Psychological Thrillers, Sony Pictures Home Entertainment
This movie is:
Scary, Mind-bending
   

Iron Man 2

నిన్న ఈ సినిమాకు మా కుటుంబంతో సహా వెళ్ళాను ( పెద్దమ్మాయి రాలేదు). ఈ సినిమా మాకు ఉచితమని చెప్పాను కదా. ఒక్కొక్కరికీ 10$ ల కన్సెషన్ కార్డులూ ఇచ్చారు. వాటితో స్నాక్స్, డ్రింక్స్ కొనుక్కున్నాము. పెద్దమ్మాయి కూడా వచ్చి వుంటే ఇంకో పది డాలర్లు వచ్చి వుండేవి కదా అనుకున్నాం. 

Iron Man 1 చూడలేదు కాబట్టి ఈ సినిమా నాకు అద్భుతంగానే అనిపించింది. హీరో రాబర్ట్ డానీ జూనియర్ సినిమాలు ఇదివరకు చూసానో లేదొ గుర్తుకులేదు కానీ చక్కగా చేసాడు. మెయిన్ హీరోయిన్ గ్వెనెత్ నచ్చలేదు. అలాంటి అందం చందం లేని వారు కూడా హీరొయిన్లుగా ఎలా పైకొస్తారో ఏమిటో. మిగతావారికి నచ్చుతుందేమోలెండి. ఇంకో హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ మస్తువుంది. ఈమె సినిమా ఎప్పటినుండో చూడాలనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది. అబ్బో, చాలా చక్కగా ఫైట్స్ చేసింది. 

ఇరన్ మ్యాన్లు ఆకాశంలోకి ఎగిరే సీన్లు పేలవంగా, బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో సై ఫై చూసినట్లుగా అనిపించింది. అది తప్పితే స్పెషల్ ఎఫెక్టులు చాలా బావున్నాయి. సినిమా అయిపోయాక ఆ సినిమా పోస్టర్లు మాకు అందించారు. ఒక్కొక్కరం ఒక్కొక్కటి తీసుకున్నాం. వాటిని మా ఆవిడ కిచెన్ కప్బోర్డుల మీద వేసుకుంటానంటే కసిరాను. ఇంటికివచ్చి చూస్తే మ్యాన్ ఒక్కడే పోస్టర్లల్లో వున్నాడు - వుమెన్ లేరు :(  స్కార్లెట్ లేదు. ఇహ కప్‌బోర్డుల మీద వేసుకో అని మా ఆవిడకి అనుమతిచ్చాను.   

మా చిన్న పాప 5/5 స్టార్ రేటింగ్ ఇచ్చేసింది. మా ఆవిడ, నేను 3 స్టార్స్ ఇచ్చాము. మా పెద్దమ్మాయి ఇదివరకే 2 స్టార్స్ ఇచ్చేసింది.  Iron Man 1 లాగా కాకుండా ఈ సినిమాలో మెషినరీకే ప్రాధాన్యత తప్ప మానవకోణం పెద్దగా లేదనే విమర్శ సినిమా చూస్తున్నంత సేపు నాకు గుర్తుకు వుంది కాబట్టి ఆ విధంగా విమర్శనాత్మకంగా చూసాను కాబట్టి 4 స్టార్ రేటింగుకి అర్హమయ్యిందిగా నాకు అనిపించలేదు. మీరు చూసారా ఈ సినిమా? మీకు ఎలా అనిపించింది?     

గురువారం 13 మే 2010

ఏకాకి..ఏక్ నిరంజన్... శరత్

ఏంటోనండి ఆఫీసులో బోరుగా వుంది. సరదాగా గిల్లి కజ్జాలు పెట్టేసుకుందామంటే ఒక్క దేశీ లేరు మా ఆఫీసులో. మన తెలుగు వాళ్ళు లేదా దేశీలు ఆఫీసులో వుంటే వచ్చే మజానే వేరు. రకరకాల పాలిటిక్స్, పాలిట్రిక్స్ వుండి మనకు బోరే కొట్టదు.   తోడుగా మనవాళ్ళుంటే ఎంచక్కా ఎన్నో పుకార్లు సృష్టించీ, వ్యాపింపచేస్తూ పని చేస్తుంటారు కదా.  ఆ రూమర్స్ నిజమయినా కాకున్నా అవి వింటే వచ్చే ఆనందమే వేరు కదా. ఆ ఆనందం మిస్సవుతున్నానిక్కడ.      మరీ ఆఫీసులో నా మనస్సుకి ఇంత ప్రశాంతతా! ప్చ్!  

పోనీ క్యూబికల్ వున్నా ఎవరితోనన్నా పక్కోళ్ళతో ఈజీగా మాట్లాడ్డానికి వీలయ్యేదేమో. నాకో చక్కని గది ఇచ్చి అందులో పడేసారు. మా టీములో నేను ఒక ఆడ్ పర్సన్ని. మా టీము వాళ్ళు చేసే పని నాకు తెలియదు - నేను చేసేపని వారికి తెలియదు. అందుకే వేరే ఎవ్వరూ నన్ను పట్టించుకోరు - నేనూ వాళ్ళని పట్టించుకోను. ఇంకా ఈ తెల్లవాళ్లని కెలకడానికేముంటుంది. హ్మ్మ్.

పోనీలెండి. కనీసం నాకు మీరున్నారుగా. అందుకే బాగా బోరుకొట్టినప్పుడు ఎవరినయినా కెలికి పనిలో పనిగా బ్లాగ్సేవ చేస్తుంటాను.  అలాగే నేను ఆఫీసులో కునికిపాట్లు పడకుండా నా మనస్సును లేపడానికి నన్ను కెలికే అజ్ఞాతల వ్యాఖ్యలు ఎలాగూ వుంటాయిగా. ఇందుకయినా సంతోషిస్తాను :) 

బుధవారం 12 మే 2010

ఈ సినిమా బావున్నా కూడా చూడలేక ఆపేసాను! ఇందుకని...

నిన్నరాత్రి పడుకునేముందు ఒక అరగంట చూద్దామని ఎప్పటినుండో అనుకుంటున్న ఒక విజ్ఞానవంతమయిన(?) డాక్యుమెంటరీ సినిమా మొదలెట్టాను. అది మెక్డోనాల్డ్స్ తింటే వచ్చే విషఫలితాల గురించిన సినిమా. అది నిరూపించడానికై ఒకతను తనకు తానుగా గిన్నీ పిగ్ అయిపోయి నెలరోజులు మెక్డోనాల్డ్స్ ఫుడ్డు మాత్రమే తింటాడు. ఇంకేమీ తినడు. తరువాతేమవుతుంది అని నన్ను అడక్కండి. నేను మూడు రోజుల వరకే చూసాను. ఆ తరువాత చూడలేకపోయాను. ఎందుకంట? 

అస్సలే ఈమధ్య డైటింగు చేస్తూ అర్ధాకలితో గడుతున్నాను. అతగాడు ఎంచక్కా ప్రతిరోజూ, ప్రతీ పూటా మెక్డోనాల్డ్స్ ఫుడ్డు ఎలా తింటున్నాడో, హెంత బావుందో వర్ణిస్తూ మరీ తింటూవుంటే నోరూరిపోయింది. ఆ రాత్రికి రాత్రే అర్జంటుగా ఆ ఫాస్ట్ ఫుడ్డు రెస్టారెంటుకెళ్ళి తినాలనే కోరికను బలవంతంగా బజ్జోపెట్టాను. అలా ఆ సినిమా చూస్తూ నా నోటికి నిద్ర పుచ్చడం సాధ్యం కాదని చెప్పేసి ఆ సినిమా చూడటం ఆపేసి బలవంతంగా గబగబా నిద్దరోయాను. .   

మీరు ఫాస్ట్ ఫుడ్డు అభిమానులయితే ఆ ఫుడ్డు ఎఫెక్ట్ మన శరీరాల మీద ఎంత చందంగా వుంటుదో తెలుసుకోవడానికి ఈ సినిమా తప్పక చూడండి మరి. మీకూ నోరూరిపోయి ఆకలయితే మాత్రం నన్ను తిట్టుకోకండి మరి.    ఆ సినిమా అసాంతమూ చూస్తే మనకు ఇక ఫాస్ట్ ఫుడ్డు ఆకలి జన్మలో వెయ్యదేమో మరి! 

Super Size Me

2004    PG-1   398 minutes
On the heels of recent lawsuits against McDonald's, director Morgan Spurlock takes a hilarious and often terrifying look at the effects of fast food on the human body, using himself as the proverbial guinea pig. For one month, Spurlock eats nothing but McDonald's, ordering everything on the menu and "super-sizing" his order whenever asked. The result is a sobering examination of the line between personal and corporate responsibility.


మంగళవారం 11 మే 2010

3-D blue అంటే నవ్వారు కదా! ఇప్పుడు ఈ వార్త చూడండి ;)


June’s Playboy puts centerfold in 3-D

http://www.thestar.com/entertainment/article/807645--june-s-playboy-puts-centerfold-in-3-d

సమయం వృధా చేయకుండా సినిమాలు చూడటం ఎలాగో చెబుతారా

ఈమధ్య బాగా సినిమాల మీద మనస్సు పడింది. దానికి తోడు నెట్‌ఫ్లిక్స్ అక్కవుంట్ వుంది. ఇంకేం కోతికి కొబ్బరి చిప్ప దొరికినంత ఆనందంగా వుంది. అయితే సినిమాలు చూస్తూ సమయం వృధా చేస్తున్నానని నా అంతరాత్మ ఘోషిస్తూవుంది. నోరు ముయ్యమని నా అంతరాత్మను ఎంత చెప్పినా వినడం లేదు. అందుకే ఓ అవిడియా ఆలోచించాను. ట్రెడ్మిల్ ఇంట్లో వున్న చాలామంది టివినో లేక అందులో సినిమానో చూస్తూ చేస్తుంటారు కదా. అలాంటిదే ఇది. నాకు నెట్ బుక్ వుంది. ఎంచక్కా నెట్‌బుక్కులో నెట్‌ఫ్లిక్స్ చూస్తూ సినిమాలు చూస్తూ ట్రెడ్మిల్ మీద పరుగులాంటి నడక చేయాలని ఆలోచన. అయితే మా ఇంట్లో ట్రెడ్మిల్ లేదు. ఇదివరలో వుండేది కానీ అది అలంకార ప్రాయం అవడంతో అమ్మేసాను.  ఆఫీసు దగ్గరిలోని జిమ్ముకీ, మా రెంటల్ ఆఫీసులో వుండే జిమ్ముకీ నా నెట్‌బుక్ తీసుకువెళ్ళి సినిమాలు లాగించేయొచ్చు.

నా సినిమా + వ్యాయామం ఆనందం బాగానే వుంది కానీ తమని వ్యాహ్యాళికి తీసుకువెళ్లకుండా ఇలా వ్యాయామశాలల్లో సమయం వేస్టుచేస్తున్నానని పిల్లి, పిల్లలు మరియు పెళ్ళాం అనుకుంటారేమో!   

మీకు కూడా ఇంకా ఏమయిన తెలిసిన పద్ధతులు వుంటే చెప్పి ఈ సినిమా ప్రేమికుడి పుణ్యం కట్టుకోండి మరి.   

సోమవారం 10 మే 2010

Living in Oblivion చూసాము

నేనూ, మా అమ్మలు (7) కలిసి ఈ సినిమా డివిడిలో చూసాము. మరీ గొప్ప చిత్రం అనిపించకపోయినా చాలా బావుంది. సినిమా కష్టాలన్నీ సరదాగా వుండటంతో మా అమ్మాయికి కూడా బాగా నచ్చింది. ముఖ్యంగా ఫైటింగు సీన్ తెగ నచ్చేసింది తనకి. ఈ సినిమా ఇంకో సారి కూడా చూస్తానంది.

నాకయితే నేను అప్పట్లో పడిన లోబడ్జెట్ దర్శక,నిర్మాత కష్టాలన్నీ గుర్తుకువచ్చి సినిమా చూస్తున్నంత సేపూ సరదాగా అనిపించింది.  చివర్లో వచ్చిన ట్విస్టు కూడా హృదయానికి హత్తుకుంది. నా కష్టాలు ఇంకా అంతకన్నా ఫన్నీగా వుంటాయేమో అనిపించింది. వ్రాస్తాను - ఎప్పుడయినా. ప్రధాన పాత్రధారి పేరేంటో నాకు తెలియదు కానీ చక్కగా నటించాడు. అతని అసిస్టెంటు కూడా చురుకుగా, అందంగా అనిపించింది. హీరోయిన్ అంత గొప్పగా లేదు కానీ నటన ఓకే. డైరెక్టర్ తల్లి నటన కూడా బావుంది. 

R రేటెడ్ సినిమా కనుక బూతులు బాగానే వున్నాయి. అయితే ఆ బూతులన్నీ ఈ పాశ్చాత్య సమాజంలో కామనే కనుక, సందర్భానుసారమే కనుక  క్యాజువల్గా తీసుకున్నాం. సినిమా అయిపోయాక అప్పుడే అయిపోయిందా అనుకున్నాము. ఇంకా సినిమా ప్రారంభంలోనే వుందేమో అనుకుంటున్న మాకు త్వరగా అయిపోయిందనిపించింది. సినీ అభిమానులందరూ ఒకసారయిన చూడాల్సిన చిత్రం ఇది.

శుక్రవారం 7 మే 2010

ఉక్కు మనిషి 2

ఒరకిల్ కార్పోరేషను వారు నాకు, నా కుటుంబానికీ ఉచితంగా టికెట్లు పంపించారు - ఐరన్ మ్యాన్ 2 సినిమా ప్రత్యేకమయిన ప్రైవేట్ షో  చూడటానికి! వచ్చే గురువారం సాయంత్రం వుంటుందది. సినిమా ఉచితంగా చూపించడంతో పాటుగా పాప్‌కార్న్, సాఫ్ట్ డ్రింక్స్, సినిమా పోస్టర్లూ మా అందరికీ ఉచితంగా ఇచ్చేస్తారట :) మనం ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తాం, చూసేస్తాం కదా - ఓయ్యెస్ అన్నాను. 

ఈ పద్ధతేదో బావున్నట్లుగా వుందే. తమకు నచ్చిన తెలుగు సినిమాకు బాగా డప్పుకోట్టే తెలుగు బ్లాగు సైటు IBT (ఐపి బ్లాక్ తరంగం) కూడా ఈ పద్ధతి పాటించి సినిమా సమీక్షల పోటీ పెడితే ఇరగబడి ఆ సినిమాలు చూసెయ్యమూ, విరగబడి సమీక్షలు వ్రాసెయ్యమూ! ప్రకటించిన బహుమతిని అందరికీ పంచేస్తే అందరికీ పదో, పాతికో రూపాయలు వచ్చినా 'దొంగకి చెప్పే లాభం' లాగా ఉచితంగా చూసిన సినిమాకు అదీ సంతోషమే కదా.

నాకయితే ఈ ఐరన్ మ్యాన్ సినిమా మీద బొత్తిగా అవగాహన లేదు. రిసెర్చ్ చేయాలి. ఐరన్ మ్యాన్  1 సినిమా ఎప్పుడు వచ్చిందో కానీ అప్పుడెవరూ ఉచితంగా చూపించలేదు కాబట్టి ఆ సినిమా చూడలేదు. ఎవరయినా ఈ సినిమా మీద ఐడియా వున్నవారు నాలుగు మాటలు చెప్పండి బాబులూ.

నేను 'ప్రస్థానం' ఇంకా ఎందుకు చూడలేదంటే...

ఏదయినా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మా చిన్నపాప నా అభిప్రాయం అడుగుతుంది. నేను బావుంది అన్నది కాక మరొకటి తాను తీసుకుంటుంది. ఇలాక్కాదని నాకు నచ్చనిది చెప్పడం ప్రారంభించాను. అప్పుడు మాత్రం నేను చెప్పిందే తీసుకుంటుంది :(

అలాగే వారికి నచ్చని వ్యాఖ్యాతల IPలు బ్లాక్ చేసే సైటు వారు ఈ సినిమా బావుందన్నప్పుడు ఈ సినిమా చూద్దామనుకున్నాను. కానీ... ఆ సినిమా గురించి అదే పనిగా మెడకో డోలు కట్టుకొని తెలుగు సినిమా సమీక్షలు చేయం అన్న ఆ సైటు వారు ఈ తెలుగు సినిమాకు మాత్రం డప్పు కొడుతూ, సమీక్షల పోటీలూ పెడుతూ హడావిడి చేస్తుండే సరికి ఎందుకయినా మంచిదని చూడకుండా ఆగాను.   

నా అనుమానానికి తగ్గట్టే వీరి హైప్ ని చూసి ఆ సినిమాకు వెళ్ళిన కొందరు ఆ సినిమానీ, ఈ IP అడ్రసు బ్లాకింగ్ సైటునీ  తిట్ల దండకం అందుకున్నారు. మీరు చెప్పింది విని సినిమా చూసి ఇన్నిన్ని రూపాయలు తగలేసామని మండిపోయారు. ఇంకా నయ్యం - నష్టపరిహారం క్రింద ఈ IP బ్లాక్ తరంగం మీద వారు దావా వెయ్యలేదు! మరి కొందరు ఈ సినిమాని ఆ సైటు వారు ప్రమోట్ చేయడంలో నకిలీ కణికుడి వ్యవస్థ వుందేమో లేక రామోజీ రావు హస్తం వుందేమో అని కాన్స్పిరసీ థియరీలు అల్లారు! గ్యారంటీగా వీరి ఐపిలు బ్లాకయి వుంటాయి.  మరి కొంతమంది ఆ సినిమాని మెచ్చుకున్నారు కూడా. దానితో 'టు డూ ఆర్ నాట్ టు డు' అన్న ధర్మ సందేహంలో పడిపోయాను. చివరికి రాజీ మార్గానికి వచ్చేసాను. ఈ సినిమాను  ఎందుకయినా మంచిదని అన్ని డబ్బులు పెట్టి సినిమా హాలుకు వెళ్ళి చూడొద్దనీ, ఆ సైటు వారు మరీ మరీ ఎగదోసి చెప్పారు కాబట్టి ఒఖ్ఖ డాలరు మాత్రం పెట్టి పైరేటేడ్ సినిమా మాత్రం చూడాలనీ డిసైడ్ అయిపోయాను. ఎలా వుందంటారు నా నిర్ణయం? 

IB (ఐ.పి. బ్లాక్) తరంగం వారు ఓ తెగ రికమెండ్ చేసిన సినిమా పైరేటేడ్ కాపీలు ఇంకా మా దగ్గరకు రాలేదు. నిన్న వెళ్ళి చూసాం కానీ ఈ సినిమా కాపీలు కనిపించలేదు.  కాపీ వచ్చాక సినిమా చూసి ఆ ఒఖ్ఖ డాలరూ తగలెట్టానని ఆ IBT (తరంగం) సైటు వారిని నేను కూడా తిట్టుకుంటానో లేక ఆ డాలరుకి కనీస న్యాయం జరిగిందనిపించిందో మీకు చెబుతానులెండి.  ఈ సినిమా చూసాక IBTకి  సమీక్ష రూపంలో నా అభిప్రాయాన్ని పంపితే ఓ 500 రూపాయలు నా ముఖాన విసిరేస్తారంటారా? అప్పుడు నాకు కనీసం తొమ్మిది డాలర్లు లాభం అవుతుంది.    

గురువారం 6 మే 2010

Living in Oblivion

కొద్ది రోజుల క్రితం నవతరంగంలో విప్లవ్ వ్రాసిన ఒక వ్యాసంలో ఈ చిత్రాన్ని ఉదహరించి కొన్ని బిట్స్ ఇచ్చారు. ఆ బిట్స్ చూసాక ఈ సినిమా తప్పక చూడాలని నిర్ణయించుకున్నాను. ఆ వ్యాసాన్ని ప్రశంసిస్తూ అక్కడ వ్యాఖ్యానిద్దామనుకున్నాను కానీ వాళ్ళు నా IP బ్లాక్ చేసారుగా ;)    

ఆ సినిమా బిట్స్ నచ్చడానికి ఒక చిన్న కారణం వుంది. మీకు తెలుసో తెలియదొ శరత్ - ఒక గొప్ప దర్శకుడు! ఓ రెండు చిత్రాలకు(!?) దర్శకత్వం వహించాను. ఆ తరువాత ఆ సినిమాలు ఏమయ్యాయి, నేనేమయ్యాను అని అడక్కండి - వీలు చూసుకొని నేనే చెబుతాను.  చిత్రాలంటే చిత్రాలు కాదులెండి - డివిడి సినిమాలు. క్యాంకార్డర్ తో షూట్ చేసి డివిడిలు చేసి అమ్మాలని అప్పట్లో ప్రయత్నించానులెండి. అందుకే డైరక్టర్లు పడే కష్టాలు నాకు బాగా తెలుసు. ఆ కథా కమీశూ త్వరలోనే వివరిస్తాగా.  లో బడ్జెట్ సినిమా డైరెక్టర్లు పడే కష్టాలని ఆ సినిమాలో చాలా చక్కగా చూపించినట్లున్నారు.

ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ లో ఆర్డర్ చేసాను. రేపు అందాక చూడాలి. ఆ సైటులో ఆ సినిమా నెట్టులో ఇన్స్టంటుగా చూడటానికి అందుబాటులో లేదు.  ఇలాగే ఏమయినా మంచి ఆంగ్ల సినిమాలు వుంటే సూచించండి. ఈమధ్య నెట్‌ఫ్లిక్స్ కి బాగా అలవాటు అయ్యాను.    అందులో బోలెడన్ని సినిమాలు వున్నాయి కానీ మనం సినీ మేధావులం కాదు కాబట్టి ఏవి మంచి సినిమాలో తెలియడం లేదు.   


Living in Oblivion

1995 R 92 minutes
Living in Oblivion takes you through one hellaciously funny day in the life of small-time independent filmmaker Nick Reve (Steve Buscemi). All Nick wants is to realize his artistic vision within the confines of an extremely low budget. Unfortunately, he keeps encountering a maddening number of obstacles, both real and imagined. Catherine Keener and James LeGros co-star.

వళ్ళు హూనం చేసింది!

అపార్ధం చేసుకోకండి. జిమ్ము ట్రైనర్ సామంతా నా వళ్ళు హూనం చేసింది. పాత జిమ్ముకి కొత్తగా వెళుతున్నా కదా. రెండు ఉచిత శిక్షణలు వుంటాయి లెండి. ట్రైనర్ మగ కావాలా, ఆడ కావాలా అని అడిగారు. ఆడ కావాలన్నాను. అంత అందమయిన ట్రైనర్ కాదు. ప్చ్ అనుకున్నా. క్రితం సారి వచ్చిన ట్రైనర్ కాస్త బావుండేది.     

గంటన్నర సేపు నన్ను ఇరగదీసింది. రోజూ జిమ్ముకి వెళుతుంటాకానీ శరీరాన్ని ఎక్కువ కష్టపడనివ్వకుండా సుతారంగా, సున్నితంగా వర్కవుట్ చేస్తుంటాను.   ఎక్కడ ఒక చెమట బిందువు కారితే అది వేస్టు అవుతుందో అని చెమట్లు పట్టకుండా జాగ్రత్తగా జిమ్ము చేస్తుంటాను. అలాంటి నా శరీరం పని ఇవాళ అయిపోయింది.   

ఆమె అలా నన్ను బాగా కష్టపెట్టిన తరువాత ఇక స్ట్రెచింగ్ చెయ్యి పద అంది. నేను ఇక చెయ్యలేనని మొరాయిద్దామనుకున్నాను. ఒక స్త్రీ ముందు పరువుపోతుందేమో అనుకొని  సరే అన్నాను. నన్ను బెంచ్ మీద పడుకొమ్మని చెప్పి హాశ్చర్యంగా నా మీదికి దాదాపుగా ఎక్కి నా చేతులు, కాళ్ళు, భుజాలు స్ట్రెచ్ చేసింది. ఓ ఇలాక్కూడా వుంటుందా జిమ్ము ట్రైనింగ్ అనుకున్నాను ఆ స్ట్రెచింగుకి తన్మయత్వం చెందుతూ.    

సమయమంతా ఆమెతోనే సరిపోవడం వల్ల ఇక ఆవిరి గదిలోకి వెళ్ళి యోగి వేమన భంగిమ వేసే అవకాశం ఈ రోజు దొరకలేదు. ఆమె దగ్గర ప్రతిరోజూ కూడా ఇలాంటి శిక్షణ తీసుకొని బాగా కండలు పెంచి మిమ్మల్నందరినీ భయపెట్టవచ్చు కానీ ఒక్కొక్క సెషనుకు 80 డాలర్లు. మనకంత దృశ్యం లేదు.   

సోమవారం 3 మే 2010

సెక్స్ డ్రైవ్ తగ్గించడానికి...

"సెక్ష్ డైవ్ ని పెంచడానికి వయగ్రాలు కనిపెట్టినట్టు, దాన్ని తగ్గించడానికి మందులు ఎందుకు కనిపెట్టరు? ఏం? దేశం లో దొరికిన ప్రతీ రేపిస్ట్ కీ ఇలాంటి శిక్ష వేస్తే వచ్చే నష్టం ఏమిటి?" 

...అని ముద్ద మందారం బ్లాగులో రూత్ అడిగారు. దానికి క్రింది సమాధానం ఇచ్చాను.

'అటువంటి మందులు వున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో రిపీటేడ్ రేపిస్టులకి కొంతమందికి అవి ఇస్తున్నారు.'
అయితే అలాంటి మందులే నేనూ ఒకసారి వాడిన సంగతి నాకు గుర్తుకు వచ్చింది.

మా మరదలు నన్ను ప్రేమలో దింపి తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పి జీ చేయడానికి వెళ్ళిన రోజులవి. నా గురించి బాగా తెలిసిన ప్రేయసి తాను దూరంగా వుంటే నేను బుద్ధిగా వుండగలుగుతానా అని బెంగపడింది.  నా గురించి కంగారు పడకులే - అవసరం అయితే కోర్కెలు తగ్గడానికి మందులేమన్నా వున్నాయేమో కనుక్కుంటాలే అని సరదాగా అన్నాను. కానీ ఆమె సరదాగా తీసుకోలేదు - సీరియస్సుగానే తీసుకున్నది :(   డాక్టరుని నిజ్జంగానే కనుక్కో అని ఆర్దర్ పారేసింది.  

ప్రేయసి ఆజ్ఞ శిరోధార్యం కదా.  ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర్లో వున్న ఒక డాక్టరుని కలిసి ఆ కోర్కెలు తగ్గే విధానం ఏమయినా వుందా అని అడిగాను. అతగాడు కాస్త ఆశ్చర్యపడి ఆ కోరికలు సహజమే కదా అని నన్ను కన్విన్స్ చేయబోయాడు.   నేనే అతగాడిని ఏదో విధంగా కన్విన్సు చేసేసి మొత్తానికి మందులు ఇప్పించుకున్నాను. ఆ మందుల పేర్లు నాకిప్పుడు గుర్తుకులేవు.     

ఆ మందులు వాడుతున్నప్పుడు నా మనస్సులో చాలా మార్పే వచ్చింది. అందరూ సోదరసోదరీమణుల్లా మాత్రమే అనిపించేవారు. సినిమాలో వ్యాంప్ డ్యాన్స్ చూస్తున్నా ఏదో చెల్లి పాత్ర సినిమా కన్నీళ్ళ దృశ్యంలా అనిపించేది.   నా మనస్ససలు అటువైపు తొందిచూసేది కాదు. అయ్ బాబోయ్ ఏమయిపోతున్నానేనూ అని బెంగెక్కువయ్యింది. మూడు నెలలకే జీవితం బోరు కొట్టనారంభించింది. నా మీద నాకే పలు సందేహాలు రావడం ఆరంభమయ్యింది. మా వాడు బ్రతికి వుంటే బలుసాకయినా తినిపించవచ్చని బ్రతుకు జీవుడా అని ఆ మందులు వాడటం మానివేసాను. మళ్ళీ కొద్ది రోజులకే మామూలుగా అయిపోయాక అప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకున్నాను.

దయ్యాలతో నా పరిచయం

నా చిన్నప్పుడు మా ఇంట్లో కొంతమంది కిరాయికి వుండేవారు. అందులో సూర్యనారాయణ సారు కుటుంబం ఒకటి. అప్పుడు ఆ సారు దగ్గరే ట్యూషనుకి వెళ్ళేవాడిని. వారు నాకు చక్కని విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా కాకుండా చక్కటి దయ్యాల గురించి కూడా నేర్పించారు. మా నాన్నగారికి దయ్యాలంటే చిరాకు గనుక మా నాన్నగారు లేని సమయంలో ఇంట్లో వాళ్ళందరం  కలిసి కబుర్లు చెప్పుకునే సమయంలో దయ్యాల కథలు, దయ్యాలను వారు ఎదుర్కొన్న సంఘటణలు, వాటితో వారి సమావేశాలు వగైరాలు రసవత్తరంగా చెప్పుకువచ్చేవారు. నేను మనస్సులో కెవ్వు కెవ్వు మంటూనే వింటుండేవాడిని.  

అలా దయ్యాలు నాకు పరిచయం అయి ఎప్పటికీ నన్ను వదలలేదు. ఇహ అప్పటినుండీ  ఒంటరిగా ఒంటేలుకి పోవాలన్నా, చెంబటక పోవాలన్నా నాకు చచ్చేంత వణుకు పుట్టేది.   అప్పుడప్పుడు తోడుగా మా నాన్నని పిలిచేవాడిని. ఎందుకు భయం అని అంటే దయ్యాలు నన్ను పీక్కుతింటాయి అని చెప్పేవాడిని. ఛత్ దయ్యాల్లేవు ఏం లేవు అనేవాడు మా నాన్న. మా నాన్న అమాయకత్వానికి హాశ్చర్యపోయి 'వున్నాయి, సూర్యనారాయణ సారు నాకు దయ్యాల గురించి చాలా చెప్పారు' అని వాదించేవాడిని. ఈ సారు చిన్నపిల్లలకు ఎందుకు దయ్యాల కథలు చెబుతారు అని ఆ సారు మీద మా నాన్నగారు విసుక్కునేవారు.   

ఆ తరువాత మా స్వగ్రామం నుండి మేము భువనగిరికి మారాము. ఎనిమిదవ తరగతి చదువుతుండేవాడిని. నేను ఊరు వదిలినా దయ్యాలు నన్ను వదలలేదు. సెలవుల్లో ఊరికి వచ్చినప్పుడు ఆ దయ్యాలు నా మనస్సుని బాగా పీక్కుతినేవి. అర్ధరాత్రులు ఓంటేలుకి వస్తే ఫర్వాలేదు కానీ ఏ అర్ధరాత్రో నాకు నంబర్ టూకి వస్తే నా గుండె గుభేలుమనేది. అప్పుడు సెలవుల్లో నేను ఒక్కడినే ఊరికి వచ్చేవాడిని కాబట్టి అమ్మా నానలు తోడుగా వుండేవారు కాదు. ఊర్లో తాతయ్య, అమ్మమ్మలే వుండేవారు. పెద్ద ఇల్లు కావడంతో దూరంగా వున్న గదుల్లో పడుకునేవారు.

అది పల్లెటూరు కదా, ఇంట్లో పాయఖానా వుండకపోయేది. ఇంటివెనకాల వున్న పెరడులోకి వెళ్ళాల్సొచ్చేది. ఒకటో నంబర్ ఒక్క నిముషం పని కాబట్టి గాఠ్ఠిగా  కళ్ళుమూసుకొని హడావిడిగా దులపరించుకొని వచ్చేవాడిని కానీ రెండో నంబరుకి ఆ పప్పులు ఉడకవు కదా.  ఎంత ఆపుకున్నా ఎమర్జెన్సీ లెవలుకి వెళ్ళిపోయేది నా ఒత్తిడి. ఇహ చేసేది లేక మా ఇంటి ముందు వరండాలో పడుకున్న పని అమ్మాయిని నా పనికి తోడుకు రమ్మని బ్రతిమలాడేవాడిని. విసుక్కుంటూ, సణుక్కుంటూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ 'మీకెందుకు అంత భయ్యం అబ్బాయి గారూ' అనుకుంటూ నా పనికి తోడుగా వచ్చేది. దాదాపు నా వయస్సే వున్న పని అమ్మాయిని నంబర్ టూ కోసం తోడుగా పిలుచుకోవడం సిగ్గుగా అనిపించినా ఆపద్ధర్మంగా అది తప్పేది కాదు.  

అలా ఎనిమిదవ తరగతి సెలవులు నడిపించాను. తొమ్మిదవ తరగతిలో నేను కొద్దిగా తెలివిమీరాను. అంటే దయ్యాలను ఓడించానని కాదు. నేను భయపడటం అటుంచి నేనే నా పద్ధతిలో ఇతరులని భయపెట్టడం ప్రారంభించాను - అంటే ఏమిటో కాదులెండి చిలిపి పనులు చేయాలని తాపత్రయపడేవాడిని.  ఓ శుభముహూర్తాన  'అమ్మగారూ, ఇవాల్టి నుండి రాత్రి మా ఇంట్లోనే పడుకుంటానండి' అని మా అమ్మమ్మతో మా పని అమ్మాయి చెప్పేసింది. ఎందుకే అని అడిగింది మా అమ్మమ్మ. ఈ ఇంట్లో దయ్యాలున్నాయండి అని చెప్పింది మా పని అమ్మాయి. తేలుకుట్టిన దొంగలా నేను కిక్కురుమనలేదు.