అపార్ధం చేసుకోకండి. జిమ్ము ట్రైనర్ సామంతా నా వళ్ళు హూనం చేసింది. పాత జిమ్ముకి కొత్తగా వెళుతున్నా కదా. రెండు ఉచిత శిక్షణలు వుంటాయి లెండి. ట్రైనర్ మగ కావాలా, ఆడ కావాలా అని అడిగారు. ఆడ కావాలన్నాను. అంత అందమయిన ట్రైనర్ కాదు. ప్చ్ అనుకున్నా. క్రితం సారి వచ్చిన ట్రైనర్ కాస్త బావుండేది.
గంటన్నర సేపు నన్ను ఇరగదీసింది. రోజూ జిమ్ముకి వెళుతుంటాకానీ శరీరాన్ని ఎక్కువ కష్టపడనివ్వకుండా సుతారంగా, సున్నితంగా వర్కవుట్ చేస్తుంటాను. ఎక్కడ ఒక చెమట బిందువు కారితే అది వేస్టు అవుతుందో అని చెమట్లు పట్టకుండా జాగ్రత్తగా జిమ్ము చేస్తుంటాను. అలాంటి నా శరీరం పని ఇవాళ అయిపోయింది.
ఆమె అలా నన్ను బాగా కష్టపెట్టిన తరువాత ఇక స్ట్రెచింగ్ చెయ్యి పద అంది. నేను ఇక చెయ్యలేనని మొరాయిద్దామనుకున్నాను. ఒక స్త్రీ ముందు పరువుపోతుందేమో అనుకొని సరే అన్నాను. నన్ను బెంచ్ మీద పడుకొమ్మని చెప్పి హాశ్చర్యంగా నా మీదికి దాదాపుగా ఎక్కి నా చేతులు, కాళ్ళు, భుజాలు స్ట్రెచ్ చేసింది. ఓ ఇలాక్కూడా వుంటుందా జిమ్ము ట్రైనింగ్ అనుకున్నాను ఆ స్ట్రెచింగుకి తన్మయత్వం చెందుతూ.
సమయమంతా ఆమెతోనే సరిపోవడం వల్ల ఇక ఆవిరి గదిలోకి వెళ్ళి యోగి వేమన భంగిమ వేసే అవకాశం ఈ రోజు దొరకలేదు. ఆమె దగ్గర ప్రతిరోజూ కూడా ఇలాంటి శిక్షణ తీసుకొని బాగా కండలు పెంచి మిమ్మల్నందరినీ భయపెట్టవచ్చు కానీ ఒక్కొక్క సెషనుకు 80 డాలర్లు. మనకంత దృశ్యం లేదు.

:D శరత్ , పిక్చర్ సూపర్.. మీ జిమ్ వర్క్ అవుట్ ఇంకా బాగుంది.
ReplyDelete>>ఎక్కడ ఒక చెమట బిందువు కారితే అది వేస్టు అవుతుందో అని చెమట్లు పట్టకుండా జాగ్రత్తగా జిమ్ము చేస్తుంటాను.
ReplyDeleteఇలా కూడా చేస్తారన్నమాట.
వెధవ శరీరానికి అంత శ్రద్ధ అవసరమా చెప్పండి.ఏదో నాలుగు కాలాలు అలా టపాలు రాసుకుంటూ బతికెయ్యక ఎందుకొచ్చిన జిమ్ములు.
ఫొటో బాగుంది...
ఐతే 80 డాలర్లు వసూలు అయిపోయాయన్నమాట.
ReplyDeleteమీ ట్రైనర్ ఫొటో బాగుందండీ.
జీంతాతా చికా చికా జీం...తా...తా... అయిందన్నమాటా...
ReplyDelete@ భా రా రే
ReplyDelete:)
@ రిషి
అవునండీ, జిమ్ము చేస్తూ బరువులు ఎత్తినప్పుడల్లా నాకు అలాంటి స్మశాన వైరాగ్యమే కలుగుతుంది :))
@ 3g
అవునండీ. పైసా వసూల్.
@ kvsv
ReplyDeleteఎంచక్కా జింతాత అయిపోయింది నాకు :)
@ గణేశ్
:)