ఇక్కడ తొడలు కొట్టబడును!

మన తెలుగు సినిమాలలో అందరూ తొడగొట్టడం చూసి నాకు ఆ ఉబలాటం ఎక్కువయ్యింది. కానీ ఒక చిన్న సందేహంతో ఆగిపోతున్నాను. నా సందేహం ఏంటో మీరు గెస్ చేసేస్తున్నారనుకుంటా. వాచిపోతుందని నా డవుట్ అనుకుంటున్నారు. అంతేనా? అది కాదండీ. అలాంటి చిన్న చిన్న డవుట్లు వస్తే వీడు శరత్ బాబు ఎందుకవుతాడు? మరేంటో చెప్పుకోండి.

సరే నేనే చెప్పేస్తున్నా. ఒకవేళ మన ఖర్మ కాలి ఆ తొడ కొట్టుకోవడం గురి తప్పి తగలరాని దగ్గర తగిలితే నా గతేం కాను? నా బాక్స్ బద్దలవుతుంది :(  అస్సలే తొడకొట్టుకోవడం మనకు కొత్త. ఎక్కడ కొడితే ఎక్కడ తగులుతుందో ఎవడికి తెలుసు? అందుకే ఎందుకయినా మంచిదని నా తొడలు నేను కొట్టుకోకూడదని డిసైడ్ అయ్యా. అందుకే ఇతరుల తొడలు మాత్రమే కొట్టాలని మరీ డిసైడ్ అయ్యా.   అప్పుడెక్కడ తగిలినా మనకు వచ్చిన నష్టమేమీ లేదు కదా. అందుకే.

అలా పక్కనున్న వాళ్ల తొడలు కొట్టడం అస్తమానూ కుదిరి చావదు కనుక యథాశక్తి తొడలు కొట్టుకొమ్మని ఇతరులని ప్రోత్సహిస్తుంటాను. ముఖ్యంగా రౌడీగారిని ప్రోత్సహిస్తుంటాను. ఎప్పుడో ఒకప్పుడు గురితప్పకపోతుందా, నా చిరకాల కోరిక తీరకపోతుందా అని నా బుల్లి ఆశ. నేను రౌడీని ప్రోత్సహిస్తుంటే ఆ ఆనందం పట్టలేక పవన్ కూడా (తొడలు) కొట్టుకుంటున్నాడనీ, వాచిపోయి ఝండూబాం కూడా రాసుకుంటున్నాడనీ తెలియవచ్చింది. నా కోరిక తీరివుండొచ్చంటారా?    

బ్లాగుబద్ధమయిన హెచ్చరిక: నా తొడలు కొట్టాలని ఎవరూ చూడకండి!   కనీసం ఆ ఆలోచన కూడా మనస్సులోనికి రానివ్వకండి.  

14 comments:

  1. "ఇచ్చట తొడ కొట్టబడును"

    అధ్యక్షా!! ఎవరి తొడలు వాల్లే కొట్టుకోవాలి, ఎవరి జండు బాం వాల్లే రాసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండు చేస్తున్నాను.

    ReplyDelete
  2. ముఖ్యంగా రౌడీగారిని ప్రోత్సహిస్తుంటాను. ఎప్పుడో ఒకప్పుడు గురితప్పకపోతుందా.......మీలా అవకపోతాడ,అని మీ కోరిక అనుకుంట?

    ReplyDelete
  3. మీ బ్లాగు లొ ని విషయాల మీద స్పందించె తీరిక ఎవరికి ఉంటుంది. ఇక్కడ మీరొక్కరే ఈ సమాజం కోసం పాటు పడవలసిన అవసరంలేదు. ఎవరికి తీరిక ఉన్నప్పుడు వారు మాత్రమే స్పందిస్తారు. మీరు భాద పడవలసిన అవసరము లేదు.ధన్యవాదాలు అంటె అంత చులకన భావం అవసరము లేదు. మీ వ్యాఖ్యల లొ పస ఉంటె ఎవరు స్పందించకుండా ఉండరు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నొచ్చుకొంటె క్షమించగలరు.

    ReplyDelete
  4. @ గీతాచార్య
    :))

    @ ఆకాశరామన్న
    ఎప్పుడూ ఎవరిది వారే కొట్టుకుంటే కొత్తేముంటుందని క్రొత్త ట్రెండ్ సృష్టిద్దామనుకుంటున్నాను. ఝండూబాంకి మాత్రం మినహాయింపు ఇచ్చాను. ఎవరికి వారే రాసుకొవాలి.

    @ అజ్ఞాత
    బ్రదర్ మీకు గేలంటే చాలా అపోహలే వున్నట్లున్నాయి. గే అంటే కొజ్జా కాదమ్మా. ఇంకా నమ్మకపోతే ఒకసారి నా దగ్గరికి వచ్చెయ్యమ్మా. అర్ధం చేయిస్తాను!

    @ వాసు
    ??
    వేరే బ్లాగులో వేయాల్సిన కామెంటు నా బ్లాగులో వేసారా?

    ReplyDelete
  5. మీరిలా సామూహిక తొడల కొట్టుడు వారోత్సవాలు మొదలుపెట్టిన రోజే నాకూ సందేహం వచ్చింది. అయితే అసభ్యంగా అనిపిస్తుందేమో అని కామెంటలేదు. కాస్త జాగ్రత్తగా కొట్టుకోండి, వీలైతే తొడలకు ప్యాడ్స్ కట్టుకోండి.

    ReplyDelete
  6. >>వీలైతే తొడలకు ప్యాడ్స్ కట్టుకోండి. దానితోపాటు క్రికెట్ గార్డ్ కూడా. మీరు ఈ మధ్య బాలయ్య సింహా చూసారా ఏమి.

    ReplyDelete
  7. ఇంతకూ ఎవరి తొడలు కొట్టబడును ? మీవా? మావా?

    ReplyDelete
  8. బాలయ్యను అడగవలసింది ... మీ బాక్స్ బద్దలవ్వకుండా తొడ ఎలా కొట్టాలో చెపుతాడు

    ReplyDelete
  9. అయితే ఎప్పుడూ గురి తప్పి కొట్టుకుంటారా?అని ఎదురు చూస్తున్నారన్న మాట..

    ReplyDelete
  10. అఘ్యాఠ పేరుతో ఒక కామెంట్ చూశా...ఒక్క విష్యం మాత్రం నిజం...గే లనీ అదనీ ఇదనీ తెగ తెల్సి నట్టు పోజు కొడుతున్నారు గానీన్దీ మనకు తెలిసింది చాలా తక్కువ..సెక్స్ విష్యం లో...ఎన్ని చీకటి గదుల్లో ఎలాంటి మాటర్ జరుగుతుందో నాతో వస్తే చూపిస్తా ...రోజుకి పది హోస్పిటల్స్ చూసే నాకు ఈ వెక్కిరింతలు చూస్తే నవ్వు వస్తూంది...ఆడా మగానే కాదు వంద రకాల సెక్స్ జరుగుతూన్ది మన చుట్టూ...బెస్తీయాలిటీ తో సహా ..అసలు మన చుట్టూ వున్న వాళ్ళు ఏమి చేస్తున్నారో మీకు తెల్సా??వాళ్ళ మనసుల్లో ఎలాంటి కొరికాలున్నాయో మీకు తెల్సా??

    ReplyDelete
  11. @ జీవని
    మేము తొడలు మాత్రమే కొట్టుకుంటున్నాము కదా. అందులో అసభ్యం ఏముందిలెండి :)

    @ వాసుకి
    సినిమానే చూడాలటండీ. బాలయ్య సినిమా పోస్టర్ చూసినా సరిపోతుంది.

    @ అజ్ఞాత
    బాలయ్యను అడగాలనే వుంది కానీ నా తొడ ఎక్కడ కొట్టి చెబుతాడేమోనని భయ్యంగా వుంది.

    @ kvsv
    అంతేకదండీ. గురి తగిలితే వెరయిటీ ఏముంటుందీ.

    నిజమే. మనవాళ్ళు ఓ గే విషయానికి బుగ్గలు నొక్కుకుంటారు కానీ క్యాజువలుగా ఎన్నొ రకాల ప్రవృత్తులు సమాజంలో నడిచిపోతుంటాయి. మనవాళ్ళు భరించలేరు కాబట్టి అవన్నీ నేను కూడా ప్రస్థావించను.

    ReplyDelete
  12. > ఇక్కడ తొడలు కొట్టబడును!
    టైటిల్ చూసి, మీరు మీట్ స్టాల్ (మాంసపు దుకాణం) ఎమన్నా ప్రారంభించి, దానికి బ్లాగ్ ద్వారా పబ్లిసిటి ఇస్తున్నారేమో అనుకున్నాను :-P

    ReplyDelete
  13. @ అజ్ఞాత
    మీ తొడనే :)

    @ పానీపూరి
    ఎదుటివారికి అభ్యంతరం లేకపోతే దానిక్కూడా రెడీనే :))

    ReplyDelete