నా చిన్నప్పుడు మా ఇంట్లో కొంతమంది కిరాయికి వుండేవారు. అందులో సూర్యనారాయణ సారు కుటుంబం ఒకటి. అప్పుడు ఆ సారు దగ్గరే ట్యూషనుకి వెళ్ళేవాడిని. వారు నాకు చక్కని విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా కాకుండా చక్కటి దయ్యాల గురించి కూడా నేర్పించారు. మా నాన్నగారికి దయ్యాలంటే చిరాకు గనుక మా నాన్నగారు లేని సమయంలో ఇంట్లో వాళ్ళందరం కలిసి కబుర్లు చెప్పుకునే సమయంలో దయ్యాల కథలు, దయ్యాలను వారు ఎదుర్కొన్న సంఘటణలు, వాటితో వారి సమావేశాలు వగైరాలు రసవత్తరంగా చెప్పుకువచ్చేవారు. నేను మనస్సులో కెవ్వు కెవ్వు మంటూనే వింటుండేవాడిని.
అలా దయ్యాలు నాకు పరిచయం అయి ఎప్పటికీ నన్ను వదలలేదు. ఇహ అప్పటినుండీ ఒంటరిగా ఒంటేలుకి పోవాలన్నా, చెంబటక పోవాలన్నా నాకు చచ్చేంత వణుకు పుట్టేది. అప్పుడప్పుడు తోడుగా మా నాన్నని పిలిచేవాడిని. ఎందుకు భయం అని అంటే దయ్యాలు నన్ను పీక్కుతింటాయి అని చెప్పేవాడిని. ఛత్ దయ్యాల్లేవు ఏం లేవు అనేవాడు మా నాన్న. మా నాన్న అమాయకత్వానికి హాశ్చర్యపోయి 'వున్నాయి, సూర్యనారాయణ సారు నాకు దయ్యాల గురించి చాలా చెప్పారు' అని వాదించేవాడిని. ఈ సారు చిన్నపిల్లలకు ఎందుకు దయ్యాల కథలు చెబుతారు అని ఆ సారు మీద మా నాన్నగారు విసుక్కునేవారు.

ఆ తరువాత మా స్వగ్రామం నుండి మేము భువనగిరికి మారాము. ఎనిమిదవ తరగతి చదువుతుండేవాడిని. నేను ఊరు వదిలినా దయ్యాలు నన్ను వదలలేదు. సెలవుల్లో ఊరికి వచ్చినప్పుడు ఆ దయ్యాలు నా మనస్సుని బాగా పీక్కుతినేవి. అర్ధరాత్రులు ఓంటేలుకి వస్తే ఫర్వాలేదు కానీ ఏ అర్ధరాత్రో నాకు నంబర్ టూకి వస్తే నా గుండె గుభేలుమనేది. అప్పుడు సెలవుల్లో నేను ఒక్కడినే ఊరికి వచ్చేవాడిని కాబట్టి అమ్మా నానలు తోడుగా వుండేవారు కాదు. ఊర్లో తాతయ్య, అమ్మమ్మలే వుండేవారు. పెద్ద ఇల్లు కావడంతో దూరంగా వున్న గదుల్లో పడుకునేవారు.
అది పల్లెటూరు కదా, ఇంట్లో పాయఖానా వుండకపోయేది. ఇంటివెనకాల వున్న పెరడులోకి వెళ్ళాల్సొచ్చేది. ఒకటో నంబర్ ఒక్క నిముషం పని కాబట్టి గాఠ్ఠిగా కళ్ళుమూసుకొని హడావిడిగా దులపరించుకొని వచ్చేవాడిని కానీ రెండో నంబరుకి ఆ పప్పులు ఉడకవు కదా. ఎంత ఆపుకున్నా ఎమర్జెన్సీ లెవలుకి వెళ్ళిపోయేది నా ఒత్తిడి. ఇహ చేసేది లేక మా ఇంటి ముందు వరండాలో పడుకున్న పని అమ్మాయిని నా పనికి తోడుకు రమ్మని బ్రతిమలాడేవాడిని. విసుక్కుంటూ, సణుక్కుంటూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ 'మీకెందుకు అంత భయ్యం అబ్బాయి గారూ' అనుకుంటూ నా పనికి తోడుగా వచ్చేది. దాదాపు నా వయస్సే వున్న పని అమ్మాయిని నంబర్ టూ కోసం తోడుగా పిలుచుకోవడం సిగ్గుగా అనిపించినా ఆపద్ధర్మంగా అది తప్పేది కాదు.

అలా ఎనిమిదవ తరగతి సెలవులు నడిపించాను. తొమ్మిదవ తరగతిలో నేను కొద్దిగా తెలివిమీరాను. అంటే దయ్యాలను ఓడించానని కాదు. నేను భయపడటం అటుంచి నేనే నా పద్ధతిలో ఇతరులని భయపెట్టడం ప్రారంభించాను - అంటే ఏమిటో కాదులెండి చిలిపి పనులు చేయాలని తాపత్రయపడేవాడిని. ఓ శుభముహూర్తాన 'అమ్మగారూ, ఇవాల్టి నుండి రాత్రి మా ఇంట్లోనే పడుకుంటానండి' అని మా అమ్మమ్మతో మా పని అమ్మాయి చెప్పేసింది. ఎందుకే అని అడిగింది మా అమ్మమ్మ. ఈ ఇంట్లో దయ్యాలున్నాయండి అని చెప్పింది మా పని అమ్మాయి. తేలుకుట్టిన దొంగలా నేను కిక్కురుమనలేదు.
తొమ్మిదో క్లాసులోనే తమకి కోకిల తొందరపడిందన్న మాట
ReplyDelete@ శ్రీనివాస్,
ReplyDeleteనా కోయిల ఇంకా ముందే - ఎనిమిదవ తరగతిలోనే కూసింది కానీ కాస్త ధైర్యం చిక్కబట్టుకోవడానికి కాస్త సమయం పట్టింది :) అది అందరూ కూత పెట్టే వయస్సే కానీ చాలామంది ఆ వయస్సులో బయటకి కూసే ధైర్యం చేయరంతే.
intakee meeru eami koosaro koodaa okaa Tapaa raasedduroo....
ReplyDelete@ రిషి
ReplyDeleteనా కూతల గురించి ఇక్కడ కూస్తే కూడలిలో నా తోక కోసేస్తారు :) నా అడల్ట్ బ్లాగు రసజ్ఞలో వ్రాయొచ్చు కానీ ఎందుకులెండి - ఈ కూతలు అందరూ కూసేవేగా.
పనిపిల్ల ని అప్సెట్ చేసినట్టున్నారు..
ReplyDelete@ kvsv
ReplyDeleteఅప్సెట్ మాత్రమే చేసాను - సెటప్ చేయలేదు లెండి :)
శరత్ గారూ దెయ్యాలతో మీ పరిచయం బాగుంది
ReplyDelete