Heinlein అయిదు సూత్రాలు

మీలో చక్కని రచయిత కావాలని ఆశిస్తున్న వారెందరో నాకు తెలియదు కానీ ఇది కనీసం నాకోసం వ్రాసుకుంటున్న పోస్ట్.

Robert A. Heinlein అనే సైన్స్ ఫిక్షన్ రచయిత ఈ అయిదు సూత్రాలను పేర్కొన్నాడంట.

రూల్ 1. తప్పక వ్రాయాలి.
రచయిత కావాలనుకున్న వాడు చచ్చినట్లు వ్రాయాల్సిందే - మరో మార్గం లేదు. ఓ వందమంది రచయితలం అవుదాం అనుకున్నారనుకోండి. సగం మంది అలా అనుకుంటూనే ...వుంటారు. మిగిలింది ఇక 50 మంది. 

రూల్ 2: మొదలెట్టింది పూర్తి చెయ్యాలి
అందులో సగం మంది ఏవో కారణాల వల్ల మధ్యలోనే ఆపేస్తుంటారు. అందువల్ల ఇక మిగిలింది 25 మంది.

రూల్ 3: సరిదిద్దడం చాలు, ఇహ ఆపెయ్యాలి. 
అందులో సగం మంది సరిదిద్దు...తూనే వుంటారు. ఇక మిగిలింది 12 మంది.  

రూల్ 4: ప్రచురణకర్తలకి పంపించెయ్యాలి
ఈ సూత్రం ఇండియా లోని రచయితలకి ఎంతవరకు పనికివస్తుందో నాకు తెలియదు కానీ ఇక్కడ అవసరం. సెల్ఫ్ పబ్లిష్ చేసుకోదలుచుకుంటే అది వేరు విషయం. పుస్తకం వ్రాసేసి అట్టే పెట్టేసుకోకూడదు - ప్రచురణ కర్తలకి పంపించాలి. బద్దకం వేసో, ధైర్యం చాలకో సగం మంది అయినా అలాగే అట్టే పెట్టేస్తారు. ఇక మిగిలింది 6 మంది.

రూల్ 5: ఎవరయినా ప్రచురణకర్తలు అంగీకరించేదాకా పంపిస్తూనేవుండాలి 
తిరస్కరణలు సర్వసాధారణం. అందువల్ల ఒకరి తరువాత మరొక పబ్లిషరుకి పంపిస్తూనే వుండాలి. ఒకటి రెండు తిరస్కరణలు రాగానే మూసుకొనేవారు సగం మంది అయినా వుంటారు. ఇక మిగిలేది ముగ్గురు. 

 Robert J. Sawyer అనే సైన్స్ ఫిక్షన్ రచయిత ఇంకో సూత్రమూ చెప్పారు. మూల వ్యాసమూ మరియు ఆ ఆరో సూత్రమూ తెలుసుకోవాలంటే ఈ క్రింది సైట్ చూడండి.  

4 comments:

  1. నాకు వ్రాయాలని ఉంటుంది కానీ బద్దకం ఎక్కువ తీరిక తక్కువ.కధ చెప్తాను మీరు వ్రాస్తారా?

    ReplyDelete
  2. @ నీహారిక
    సర్లెండి. నా కథలే బోల్డన్ని వున్నాయి. నిజానికి ఎన్నో ప్లాట్లు, ఐడియాలు వున్నాయి. ఇప్పుడు వ్రాస్తున్న దానికే సమయం అస్సలు కుదరడం లేదు. ఏదో ఒకటి అడ్డొస్తోంది.

    ReplyDelete
  3. సరైన సమయంలో నాకు ఉపయోగపడే విషయాలను పోస్ట్ చేసారు , నేనూ ఒక పుస్తకం రాయాలన్న లక్ష్యం పెట్టుకున్నాను. రూల్ 1. తప్పక వ్రాయాలి ని పాటిస్తాను.

    ReplyDelete
  4. @అ..ఆ..లు
    మంచిది. మొదలెట్టండికా. వీలయితే మీ ప్రొగ్రెస్ తెలియజేస్తుండండేం.

    ReplyDelete