పాజిటివ్ సజెషన్లు, నెగటివ్ సజెషన్ల యొక్క ప్రభావం ఎంతో నాకు ఎన్నాళ్ళనుండో తెలుసు. విషయాలు తెలిసినంత మాత్రాన సరిపోదు కదా. వాటిని ఆచరించాలి కదా. ఏదో అడపాదడపా అవి పాటించేవాడిని కానీ పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత కుదురుతోంది. కారణం - ఈమధ్య తక్కువ కాలంలో ఎక్కువ విజయాలు సాధించిన ఒక మిత్రుడిని అతని విజయ రహస్యం అడిగాను. ఒకటి The Secret (Book/Video) రెండవది ఈ పుస్తకం అన్నాడు. వెంటనే అమెజాన్ లో ఆర్డర్ చేసి తెప్పించాను. చదువుంటే బుర్రలో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇన్నాళ్ళూ ఇంత చెత్తగా ఆలోచిస్తూ వస్తున్నానా అని అర్ధమయ్యింది. నేనొక్కడినే కాదు మీలో కూడా 99% మంది అంత చెత్తగానే ఆలోచిస్తూవుంటారు. మీకు గనుక విజయం పట్ల అయినా లేక మాంఛి వ్యక్తిత్వం పట్ల అయినా లేక మంచి ఆలోచనాధోరణి పట్లా అయినా ఏమాత్రం ఆసక్తి వున్నా క్షణం ఆలస్యం చెయ్యకుండా వెంఠనే ఈ పుస్తకం ఆర్డర్ చెయ్యండి లేదా కొనండి. పీరియడ్!
Reviews in Amazon:
ఆ బుక్కు లొని ముఖ్యమైన అంశాలు తెలుగులొ పంపడి మెము మీద్వార తెలుసుకుంటాం plz
ReplyDeleteపుస్తకం అంతా తెలుగులోకి దించేయడం మంచి పద్ధతీ కాదూ, వీలూ కాదు కాబట్టి ప్రధానాంశాలను తప్పకుండా వివరిస్తాను. నాకూ పునశ్చరణ లాగా వుంటుంది.
ReplyDeleteBook is available in Telugu also. I have ordered it on Friday and waiting for it....
ReplyDelete@ కాళిదాసు
ReplyDeleteమీరు ఆ తెలుగు పుస్తకం ఎలా ఎక్కడ ఆర్డర్ చేసారో వివరాలు తెలియజేస్తారా? ఇతరులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ide telugu link anukunta
ReplyDeletehttp://manjulindia.com/telugu/what-to-say-when-you-talk-to-your-self.html
amazon.in సైటులో కూడా ఈ పుస్తకం దొరుకుతున్నదనుకుంటా.
ReplyDeleteavunu amazon.in link ide
ReplyDeletehttp://www.amazon.in/What-Say-When-Talk-Yourself/dp/8183223559/ref=sr_1_18?s=books&ie=UTF8&qid=1447226378&sr=1-18&keywords=telugu+books
తెలుగు వెర్షన్ తెచ్చుకుని ఆర్నెల్లయింది...మీ పోస్ట్ చూసాక తప్పక చదవాలని తీర్మానించుకున్నా...మీ పోస్ట్లన్నీ ఎప్పటిలానే రెగ్యులర్గా చదువుతున్నా...కామెంటించటం లేదు...అందరిలానే రొటీన్ అలవాటయ్యాక...మంచి అలవాట్లు పోతున్నాయ్...ఖాళీ ... ఉంటే బద్దకంగా గడిపేయడమే కానీ...ఏదో ఒకటి చేయాలన్న ఇంట్రెస్ట్ చచ్చిపోతూంది....
ReplyDelete