సెక్షన్ 8 అమలు చెయ్యొద్దనీ కేసీఆరూ, చెయ్యాలనీ చెంద్రబాబూ ఒకేసారి, ఒకే సమయాన నిరవధిక నిరాహారదీక్షల పోటీ పబ్లిక్కుగా మొదలెట్టాలి. అందుకోసం ట్యాంక్‌బండ్ అయితే బావుంటుంది. రోడ్డుకి చెరో పక్కన కూర్చోవచ్చు. వీళ్ళ మధ్య తెలుగు రాష్ట్రాల గవర్నర్ రోడ్డు మధ్యలో కూర్చొని శాంతిని పరిరక్షిస్తుండాలి. శాంతి అనగా ఓ మహిళ పేరు అనుకొని మీరు పొరపడవద్దు. ఇద్దరికీ దొంగ దీక్షల అనుభవం బాగా వుంది కాబట్టి మళ్ళీ అలాంటి గొప్ప పనులు చెయ్యకుండా సుప్రీం కోర్టు జడ్జిల ఆధ్వర్యంలో వీరి దీక్షలు సాగాలి. అన్నివేళలా ఈ ఇద్దరి దీక్షలని కనిపెట్టుకొనివుండటం కోసం ఆ జడ్జులు మూడు షిఫ్టుల్లో పనిచెయ్యాలి. వారి దీక్షల్లో మరే మతలబులు లేకుండా 24 గంటలూ లైవ్ టెలికాస్ట్ చెయ్యాలి. టాయిలెట్ గదుల్లో దొంగ తిండి పెట్టుకొని తినకుండా వీరు ఆ గదులను ఉపయోగించడానికి ముందూ వెనుకా(?!) ఆ గదులని లైవ్ టెలికాస్ట్ చెయ్యాలి. ఎలాగూ ఇది రంజాన్ మాసమే కాబట్టి ముస్లిం సోదరుల్లాగా వీరు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా నిరవధిక నిరాహార దీక్ష చెయ్యాలి.
పోటీలో ఎవరు గెలిస్తే (?!) వారి అభిమతం ప్రకారం సెక్షన్ 8 చెయ్యాలి. అలా గెలిచిన వారికి ట్యాంక్‌బండ్ మీద శిలా విగ్రహం కూడా కట్టించాలి.
అలా చేస్తే గెలిచినోళ్ళతో పాటు (ఓడీ)'పోయి'నొళ్ళకు కూడా విగ్రహం పెట్టించాల్సి వస్తుంది.
ReplyDeleteMR.యక్ష
manchi idea. kcr ki forword cheddaamaa? mana kosam kudaa police lu vasthaaru*
ReplyDeleteచేసేదేదో తిరప్తిలో సేస్తే గవురనర్కి బాగుంటాది
ReplyDelete@ మిస్టర్ యక్ష
ReplyDeleteమీరు రివర్సులో అర్ధం చేసుకున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో పోటీపడి గెలవడం అంటే గెలిచి'పోవడమే'!
@ అజ్ఞాత*
ఆ పుణ్యమేదో మీరే మూటగట్టుకుందురూ.
@ అజ్ఞాత
ఇంకా నయ్యం - గవర్నరు గారికి మహా సౌకర్యంగా తిరుమలలో చెయ్యమనలేదు!
ఆటలో అరటిపండులు ఉంటే తొక్కి తోలు తీస్తారు..
ReplyDelete