కొన్నేళ్ళ క్రితం. ఆ బ్లాగరుతో పరిచయం ఎలా మొదలయ్యిందో గుర్తుకులేదు కానీ ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడాను. మా ఇద్దరికీ మధ్య ఎంతో పరస్పర గౌరవం, అభిమానం వుంటుండేవి.
అప్పట్లో నేను బ్లాగుల్లో కలహ భోజనుడిగా ప్రసిద్ధి. బ్లాగుల్లో సరదాగా కయ్యాలు పెట్టడం, ఆట పట్టించడం, కెలకడం, గొడవల్లో అగ్నికి ఆజ్యం పొయ్యడం లాంటివి చేస్తూ తమాషా చూస్తుండేవాడిని. నాకు తోడుగా ఇంకొంతమంది తయారయ్యారు. కలిసి సరదాగా కెలుకుడు బ్లాగర్ల సంఘం (కెబ్లాస) అని పెట్టుకున్నాం. ఆ రోజుల్లో తమాషాగా ఆమె ఒక బ్లాగు పోస్టుని కూడా ముందే సరదాగా కెలికేస్తున్నాను అని నా పోస్టులో చెప్పి మరీ ఆటపట్టించాను. ఆమె పోస్ట్ ఏదో సినిమా పాట గురించి అనుకుంటా. అది బావోలేదని తన పోస్టులో విమర్శ చేసారు. నేను దానిని సరదాగా ప్రతి విమర్శ చేసాను. దానికి ఆమె నొచ్చుకొని ఆమె బ్లాగులోనో, నా బ్లాగులోనో కామెంట్ చేసింది. ఇకపై బ్లాగు వ్రాయడం మానేస్తా అని ప్రకటించింది. సరదాగా చేసినదానికి ఆమెను నొప్పించానే అని నేను బాధపడి ఆమెకు ఫోన్ చేసి వివరించాను. సరదాగా అయినా, సీరియస్సుగా అయినా విమర్శ విమర్శే అన్నది. ఏదో ఆట పట్టించడానికి వ్రాసా అని చెప్పినా, ఆ విషయం నా పోస్టులో ముందే సూచించా అని చెప్పినా ఆమె నొచ్చుకోవడం మానలేదు.
సరే అని చెప్పి క్షమాపణలు వ్యక్తం చేసాను. తను ఎవరినుండీ క్షమాపణలకు కానీ, ధన్యవాదాలకు గానీ అర్హురాలను కాను అంది. నాకు బుర్రలో ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను ఎంత కోరినా నా క్షమాపణలు స్వీకరించలేదు. తన పాలసీ మళ్ళీ వివరించింది. తను ఎవరిదగ్గరి నుండి అయినా, ఎప్పుడు అయినా సారీలకు గానీ, థేంక్స్ లకు గానీ అర్హురాలు కాదుట. అదేం పాలసీనో నాకర్ధం కాలేదు. జనాలు ఇలాక్కూడా వుంటారా అనిపించింది. మరీ ఇంత సున్నితమయిన మనస్కురాలితో దూరంగా వుండటమే నాకు శ్రేయస్కరం అని తోచింది. అంతటితో మా స్నేహం ముగిసింది - అలాగే ఆమె బ్లాగూ ముగిసింది.
చేసిన పాపం చెబితే పోతుందంటారు. అందుకే ఇది వ్రాస్తున్నా. ఆమె బ్లాగు వ్రాయడం మానివెయ్యడానికి కారణం నా సరదాతత్వం వల్లనా లేక ఆమె సున్నితత్వం వల్లనా అన్నది నాకిప్పటికీ అర్ధం కాదు. ఏమయినప్పటికీ నా వల్ల ఒక బ్లాగరు అందునా మహిళా బ్లాగరు బ్లాగు మూసుకోవడం నన్ను కించిత్ నొచ్చుకునేలా చేస్తుంటుంది. అంత సున్నితమయిన మనస్కురాలు పాపం ఈ కఠిన సమాజంలో ఎలా నిలద్రొక్కుకుంటోందో అనిపిస్తుంటుంది.
ఆ తరువాత మా కెబ్లాస సరదాగా కెలుకుడు మానేసి సీరియస్సుగా కెలకడం మొదలెట్టడంతో దాంట్లో నుండి బయటకి వచ్చాను. నెమ్మదిగా ఇతరులను ఆటపట్టించడం తగ్గించాను - మానివేసాను - అందుకు కొంత కారణం పై సంఘటణ కూడానూ. అలా అని ముందు ముందు మళ్ళీ సరదాగా కెలుకుడు మొదలెట్టనని కాదు కానీ ప్రస్థుతం అయితే అలా వ్రాయట్లేదు. ఈ మధ్య వ్రాసిన 'నాకో బిరుదివ్వండి బాబయ్యా' అనే టపా కూడా కూడా కాస్త కెలుకుడు టపానే :)
మా కెబ్లాస సరదాగా కెలుకుడు మానేసి సీరియస్సుగా కెలకడం మొదలెట్టడంతో దాంట్లో నుండి బయటకి వచ్చాను ... me too! But good old days.
ReplyDeleteMr.Yaksha
మీ "నా వల్ల బ్లాగింగ్ మానేసిన ఓ మహిళా బ్లాగర్!" పోస్ట్‌పై అజ్ఞాత క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:
ReplyDelete[Edited] ...అదే టైములో జీవితాల్లో రియాలిటీ తన్నింది....
@ Mr.Yaksha
ReplyDelete:)
@ అజ్ఞాత
ఇప్పుడు ఎందుకు లెండి అవన్నీ - అందుకే మీ వ్యాఖ్యని చాలా ఎడిట్ చేసాను. తెలియాల్సిన వాళ్ళకి తెలిసివచ్చి ప్రస్థుతం అంతా ప్రశాంతంగా వుంటోంది కదా. మళ్ళీ ఆ ఎదవ గోల మనం మొదలెట్టడం ఎందుకు?
or.. బ్లాగత్శరచ్చ
ReplyDeleteవ్రాసి పడేసే బ్లాగుల్లో కూడా సున్నితత్వాలు ఏమిటి ? రచయితల జాతికి చెందినవారు మాత్రమే బ్లాగర్లు గా పనికొస్తారనుకుంటా.. మిగతా వాళ్ళు మొదలు పెట్టినా మూణ్ణాళ్ళ ముచ్చటే అనిపిస్తుంది.. సరిపోలేని వారు వారికి సరిపోయేవి వెతుక్కుంటారు..
ReplyDeleteపడమర పొద్దు మళ్ళి ఎర్ర బారుతుంది ..
ReplyDeleteమీరు మళ్ళి రావాలేమో ..
@ కాయ
ReplyDeleteనిజమే.
@ అజ్ఞాత15 మే, 2015 11:11 [AM]
ఆ, సర్లెండి. నేనేమయినా బ్లాగులకు మూల(శంక) పురుషుడినా ఉద్ధరించడానికి?!