నా చిన్నప్పుడు మా అమ్మగారికి జాతకాల మీద విశ్వాసం వుండేది కాబట్టి మా ఊరికి వచ్చిన చిలక జ్యోతిష్యులందరినీ నా భవిష్యత్తు చూడమనేది లేదా హస్తసాముద్రికులను నా చేయి చూడమనేది. ఎవరూ కూడా నేను గొప్పగా సంపాదిస్తా అని చెప్పేవాళ్ళు కాదు కానీ తగినంత సంపాదిస్తా అని చెప్పేవాళ్ళు. అది నా మనస్సులో బలంగా నాటుకుపోయినట్లుంది. ఏదో బొటాబొటిగా సంపాదిస్తూవస్తున్నాను. నేనేదో గొప్పగా సంపాదించాలన్న ఆసక్తీ, పట్టుదలా, విశ్వాసం నాలో లేకుండా అయిపోయాయి.
వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతున్నప్పుడు లేదా ప్రసంగాలు వింటున్నప్పుడు మనలోని రుణాత్మక విశ్వాసాలు మన ఉన్నతికి ఎంత హాని కలిగిస్తాయో తెలుసుకొంటుంటాను. అలాంటప్పుడు ఆ జ్యోతిష్యాలు చెప్పిన ఆ విషయం గుర్తుకువస్తుంటుంది. నేను ఆర్ధికంగా ఎదగాలంటే ఆ బిలీఫ్ సిస్టం ను వదిలించుకోకతప్పదు. నేను ఈమధ్య చదువుతున్న 'సీక్రెట్స్ ఆఫ్ మిలినియనీర్ మైండ్' పుస్తకంలో మన మనస్సులోని అలాంటి విశ్వాసాలను గుర్తించడం ఎలాగో, వాటిని వదిలించుకోవడం ఎలాగో వ్రాసారు. ఇహ ప్రయత్నించాలి.
అన్నట్టు ఆ జ్యోతిష్యులు అందరూ తప్పకుండా ఇంకో విషయమూ చెప్పే వాళ్ళు. నాకు ఇద్దరు పెళ్ళాలంట :) నాకు ఈడూ జోడు అయిన ఓ కోడలూ, ఓ మరదలూ వుండేవారు. ఆ ఇద్దరినీ పెళ్ళి చేసుకుంటావా అని ఆ జ్యోతిష్యం చెప్పేటప్పుడు విన్న చుట్టుపక్కల వాళ్ళు ఉడికించేవారు. నాకేమో సిగ్గు ముంచుకొచ్చేది. ఆ జ్యోతిష్యం ఇంకా నిజమవలేదు కానీ అది మాత్రం నిజం అవుతుందనుకుంటున్నాను :)) ఆ జ్యోతిష్యం గురించి చెప్పి మా ఆవిడను అప్పుడప్పుడూ ఉడికిస్తుంటాను. అయితే నాకు ఒకేసారి ఇద్దరు పెళ్ళాలా లేక ఒకరి తరువాత ఒకరా అన్నది క్లారిటీ లేదు. ఇంత పరిజ్ఞానం అప్పుడే కనుక వుంటే అప్పుడే ఆ విషయం క్లారిఫై చేసుకొనివుందును :)
subject edainaa sare mee oohalu atenaa?*
ReplyDeleteThanks bro ,,,for the tip on the book..Even i don't have financial discipline ,which i am working on to improve..
ReplyDeleteha ha .. you should ask your wife about this doubt (one after other or both at a time ) .. ... :) .... by the way,,, you need not believe all these astrologies.. A very popular and Powerful (peoples belief) astrologer checked GMR horoscope and confirmed that he will be good for nothing and his life is utter waste.... now we can see where he is ... :)
విదేశాలలో ఉండి అంతగా సంపాదించడం లేదు అంటారేమిటి మాష్టారు ?
ReplyDeleteWhen things are not in our favour we just blame it on astrology or some circumstances. If we progress well we boast about our efforts and efficiency. That's normal, keeps us happy.
ReplyDelete@ అజ్ఞాత 9 మార్చి, 2015 7:07 [PM]
ReplyDeleteఅంతే కదా మరీ* :))
@ అజ్ఞాత 9 మార్చి, 2015 8:18 [PM]
ఈ విషయాల మీద ఇంకా చాలా పుస్తకాలు వున్నయ్. ఇకపై విరివిగా ఈ విషయాలు చర్చిద్దాం. నేను నాస్తికుడిని కాబట్టి జ్యోతిష్యాలను ఏమీ నమ్మను అయినా చిన్నప్పుడు పదేపదే విన్న భావనలు నాకు తెలియకుండానే నా మనస్సులో నాటుకుపోయుండొచ్చు అన్న చిన్న అనుమానం.
మా ఆవిడని అడిగితే వన్ బై వన్ అంటుంది. పెళ్ళికి ముందు ఒకర్ని ప్రేమించావుగా - అందుకే ఒకత్తి అయిపోయింది - నేను రెండోదాన్ని అంటుంది. ఆమెను ప్రేమించానంతేగానీ పెళ్ళి చేసుకోలేదు కదా నాకు ఇంకా ఛాయిస్ వుందని నేను అంటుంటాను :))
@ అజ్ఞాత 10 మార్చి, 2015 5:35 [AM]
ReplyDeleteఏలేశ్వరం వెళ్ళినా శనీశ్వరం నాతో పాటే వచ్చేస్తే ఇంకేం సంపాదన లెండి. అందుకు ఎన్నో మింగాలేని కక్కాలేని కారణాలు! ఏమయినప్పటికీ ఇన్నాళ్ళకి కాస్త గ్రహాలు నాకు అనుకూలంగా కూడుతున్నట్టున్నయ్. చూద్దాం. (నేను నాస్తికుడిని కానీ సరదాగా ఆస్తిక భాష ఉపయోగిస్తుంటానేం).
@ శివరాణి
మీరు చెప్పింది నిజమే. విజయానికి దారి తీసే పరిస్థితులూ వుంటాయి, అపజయానికీ దారితీసే పరిస్థితులు వుంటాయి కానీ విజయం వచ్చినప్పుడు మాత్రం వాటిని లెక్కపెట్టం. కరెక్టే కానీ అపజయానికి దారితీయగల పరిస్థితులు వుంటాయి అనేది త్రోసిపుచ్చలేము కదా. అవి విశ్లేషించుకొని సరిదిద్దుకునేంతవరకూ మనతో విజయం దోబూచులాడుతూనే వుంటుంది - అదృష్టం (అనగా పరిస్థితులు కలిసి రావడం) వుంటే తప్ప.