పెంట పెట్టిన నా బర్రెల బ్యుజినెస్సు!

చాలా ఏళ్ళ తరువాత అతన్ని చూసాను నేను. అలాంటి ప్రాణ స్నేహితుడు ముందు పళ్ళు ఏమయిపోయాయో ముందుగా నాకు అర్ధం కాలేదు. "పళ్ళు ఎవరు ఊడగొట్టారు?" దాదాపుగా 20 ఏళ్ళ తరువాత కలిసిన మిత్రుడిని ముందుగా అడిగిన ప్రశ్న అది. ఏదో చెప్పాడు లెండి. సరే అది విషయం కాదు. తన పేదరికం వివరించాడు. తనకూ, తన భార్యకీ, యుక్తవయస్కులయిన అమ్మాయిలకీ, అబ్బాయికీ ఇక ఆత్మహత్యే శరణ్యం అన్నాడు. పాపం అతని దగ్గర బీడీ కాల్చడానికి కూడా డబ్బులు లేవు. ప్చ్ అనిపించింది. మనస్సు ద్రవించింది. అప్పట్లో మేము చాలా 'దగ్గరి' స్నేహితులం. నాకు పన్నెండేళ్ళ వయస్సులో స్నేహితుల మధ్య దగ్గరితనం అంటే ఏంటో తొలిసారిగా రుచిచూపించింది అతనే మరి. అలాంటి...అలాంటి స్నేహితుడు అంత ఇబ్బందుల్లో వుంటే నా మనస్సు సహించగలదా?  బస్సు ఎక్కడానికి కూడా డబ్బులు లేక నేను US తిరుగుప్రయాణం అవడానికి రెండు రోజులకు ముందే కలవగలిగాడు అతను. నాకు తీరికలేక అతనితో ఎక్కువసేపు గడపడానికి సమయం చిక్కలేదు.

గత జూన్ లో యుఎస్ కి తిరిగి వచ్చాకా బాగా ఆలోచించాను. నా కుంటుంబం ఇంకా ఇండియాలోనే వుంది అప్పుడు. తీరిగ్గా వున్నా కదా - బాగా ఆలోచించాను. ఎలాగూ నా రిటైర్మెంట్ సేవింగ్స్ లోనుండి లోన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అదే లోన్ కొంచెం ఎక్కువ తీసుకొని అతనితో వ్యాపారం పెట్టిస్తే ఉభయతారకంగా వుంటుంది కదా అనుకున్నాను. అతనితో ఫోనులో మాట్లాడా. పెట్టుబడి నాది - పని నీది - లాభాలు చెరి సగం - మాంఛి వ్యాపారం చూడూ అన్నా. అలా అని మరీ ఎక్కువగా పెట్టుబడి పెట్టేంత దృశ్యం నాకు లేదని వివరించి కొంత మాత్రమే సర్దుబాటు చెయ్యగలనని చెప్పాను. బర్రెల వ్యాపారం బావుంటుందని కొద్ది రోజుల తరువాత వివరించాడు. నేను పంపిస్తా అన్న డబ్బులకు నాలుగు బర్రెలు వస్తాయనీ - వాటితో ఎలాంటి లాభాలు వస్తాయో దృశ్యం నాముందు కళ్ళకు కట్టాడు. ఇందులో రిస్క్ వుందని తెలుసు. వ్యాపారం అన్నాక రిస్క్ తప్పదు కదా. పైగా ఇతను ఎంత సమర్ధవంతుడో తెలియదు కానీ చచ్చేంత కష్టాల్లో వున్నాడు కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూడాలి కదా అనుకున్నా.

వేరే ఎవరికి చెప్పినా వద్దంటారు కాబట్టి ఎవరికీ - మా ఆవిడకీ - చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు పంపించా. ఒకరి దగ్గర బదులు తీసుకొని కొట్టం వేసాననీ, మూడు బర్రెలే వచ్చాయనీ వాటిని అందాకా తన బామ్మర్ది దగ్గర ఉంచాననీ చెప్పాడు. ఆ బర్రెలు పాలు ఇవ్వాలంటే ముందు ఈనాలి అని చెప్పాడు. అవి ఎప్పుడెప్పుడు ఈనతాయో, ఎప్పుడెప్పుడు పాలు ఇస్తాయో, ఎప్పుడెప్పుడు లాభాలు తెస్తాయో అని ఆత్రుతగా ఎదురుచూడసాగాను. నా డబ్బులే నేను లోన్ తీసుకొని పంపించాను కదా - ఈ మహానుభావుడు ఎలా నన్ను ఉద్ధరిస్తాడో తెలియక కాస్త కంగారు గానే వుంది.

ఇతని యవ్వారం ఎలా వుందో చూసిరమ్మని ఇంకో క్లోజ్ ఫ్రెండును అతని ఇంటికి పంపించాను. అతనికి ఈ బర్రెల సంగతి చెప్పలేదు. చెబితే తిడతాడని తెలుసు. వేస్ట్ ఫెల్లో అని రిపోర్ట్ ఇచ్చాడు. బీడీ వ్యసనం బాగా వుందిట. తాగుడు వ్యసనం కూడా వున్నట్లుందని అన్నాడు. ఇంట్లో పెళ్ళీడుకు వచ్చిన తన కూతుర్లే తనని తిడుతున్నారంట. అప్పుడు దృశ్యం బాగా అర్ధం అయ్యింది. నా బర్రెల సినిమా ఎన్ని ట్విస్టులు తిరగవచ్చో లీలగా నా కళ్ళముందు మెదలాడింది. కొద్దిరోజుల తరువాత అతని నుండి మిస్డ్ కాల్ వచ్చింది. ఫోన్ చేస్తే "బర్రెలు పరార్" అని చెప్పాడు. అనుకున్నా అని మనస్సులో అనుకున్నా. మరో రెండు రోజుల తరువాత మళ్ళీ దొరికాయని చెప్పాడు. ఏమోలే అనుకున్నా. చివరకు మిగిలేది ఏంటో నాకు అర్ధం అవుతూనే వుంది కాబట్టి ఇక పట్టించుకోవడం మానివేసాను. ఓ నెలన్నర తరువాత ఫోన్ చేసి ఏవేవో కారణాలు చెప్పి బర్రెలు అమ్మివేసాననీ, కొట్టం వేసినందుకు గానూ ఇంకా 50 వేల నష్టం వచ్చిందనీ చెప్పాడు. శుభం అనుకొని విరక్తిగా ఓ నవ్వు నవ్వేను. ఆ యాభై వేలు ఎప్పుడు పంపిస్తావని అడిగాడు. మరోసారి విరక్తిగా నవ్వాను. విషయం అర్ధమయినట్లుంది మళ్ళీ ఆ విషయం ఎత్తలేదు. 

ఈ విషయం ఇంకో స్నేహితుడికి చెబితే కొట్టం కట్టడం, బర్రెలు కొనడం, అవి పారిపోవడం, వాటిని అమ్మడం ఇవన్నీ కట్టుకథలు అయ్యుండొచ్చని, డబ్బులు ఎంచక్కా బీడీలకూ, మందులకూ, మిత్రులకూ పెట్టివుంటాడన్నాడు. కావచ్చు అనుకున్నాను. ఏమో - చెప్పలేను మరి. హ్మ్.

ఎందుకయినా మంచిదని అనుకున్నాడేమో కొన్ని నెలలు వ్యవధి ఇచ్చి మళ్ళీ ఈమధ్య మిస్డ్ కాల్ ఇచ్చాడు. తాను చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నాననీ తన కుటుంబం ఇక ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యం అనీ చెప్పాడు.  అలాగా అని కులాసాగా అన్నాను.  మనిషి మంచోడే - నాకు చిన్నప్పటి నుండీ బాగా తెలుసు - కానీ బాగా వ్యసనాల్లో వున్నట్లున్నాడు. ఒకప్పటి ప్రాణస్నేహితుడిగా అతను బాగు పడటానికి ఒక అవకాశం ఇచ్చి చూసాను. అందులో రిస్క్ వుందని తెలుసు అయినా స్నేహితుడి కుటుంబ క్షేమం కోరి రిస్క్ తీసుకున్నాను. ఫర్వాలేదు - పొరపాట్లు జరుగుతూనే వుంటయ్ - Next?  

ఆ తరువాత కొన్ని నెలలకి చూచాయగా మా ఆవిడకి చెప్పాను. సహజంగానే అరిచేసింది. ఎంత అంటే ఏదో నసిగా. ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేదు - మరీ ఎక్కువ మొత్తం కాదని మాత్రం చెప్పాను. 

13 comments:

  1. ఈ క్షవరం నాకు కూడా అయింది .
    లక్ష రూపాయలు వరకు వదిలింది , ఒక స్నేహితుడు చేసిన మోసం .
    మీకు బర్రెలు, నాకు software కంపెనీ . visaakapatnam లో . వాడు నా ఎమ్.సి.యె classmate , రూం మేట్ కూడా కొన్ని నెలలు .
    గుడ్డిగా నమ్మాను . ఆహా ఒహో అన్నాడు . ఇప్పుడు హాస్పిటల్స్, స్కూల్స్ కి సాఫ్ట్వేర్ ఇస్తున్నాం , మార్కెటింగ్ కూడా బాగుంది త్వరలో ఇంకా విస్తరిస్తున్నాం అని అన్నాదు. నేను సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అయిపోయినట్టు , డబ్బులు విసిరేస్తున్నట్టు ఒకటే కలలు , ఆ దెబ్బకి నిద్ర కూడా పట్టేది కాదు .
    ఏడుగురు పార్టనర్స్ అన్నాడు , ఇంకా పార్ట్ టైం పార్టనర్స్ ఇంకా ఉన్నారు అన్నాడు . ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కసారి కూడా వెళ్ళలేదు కంపెనీ కి నేను, వాడి మీద అంత గుడ్డి నమ్మకం , నాది ఆ పక్క ఊరే . ఒక రోజు , చావు కబురు చల్లగా చెప్పాడు, కంపెనీ ని గుడివాడ షిఫ్ట్ చేస్తున్నాం అని . వైజాగ్ నుండి గుడివాడ కి సాఫ్ట్వేర్ కంపెనీ షిఫ్ట్ చేయడం ఏంటో అర్ధం కాలేదు , డీటెయిల్స్ అడిగితె ఏవేవో చెప్పాడు . అప్పుడే అనిపించింది ఛీ అని . కంపెనీ ప్రాజెక్ట్స్ తో ఒక రిపోర్ట్ ఇవ్వు, నేను కూడా ట్రై చేస్తాను అంటే ఏవేవో సోది చెప్పాడు . కొన్ని రోజులు పోయాక కంపెనీ మూసేస్తున్నాం అన్నాడు , ఇప్పుడు అయితే యాభై , సంవత్సరం తరువాత లక్ష అన్నాడు నీ డబ్బులు ఎక్కడకి పోవు నాది పూచి అన్నాడు, సరే ఫ్రెండ్ కదా అని ఊరుకున్నాను , ఇప్పటకి మూడు సంవత్సరాలు అయింది , ముప్పై రూపాయలు కూడా ఇవ్వలేదు . కంపెనీ ఎప్పుడో ఎత్తేసారని అర్ధం అయింది , చరిత్ర తిరగేసి ఆలోచిస్తే వీడు చెప్పిన మాటలు అన్ని నీటి మీద రాతలు అని జ్ఞానోదయం అయింది . పోనీ వాడేమన్న లేనోడా అంటే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ , పెద్ద ఫామిలీ ( ఇది కూడా ఒక కారణం నమ్మడానికి ) .
    నా వైఫ్ అయితే నన్ను ఒక రేంజ్ లో ఆదేసుకుంటుంది , మొత్తం నా ఫ్రెండ్స్ అంతా పెద్ద వెధవలు అని .

    ఇది కదా, ప్రపంచం లో ఫ్రెండ్ తప్ప ఇంకేవాడు మోసం చేయలేడు

    ReplyDelete
  2. hi, annitlo vntaare meeru'

    ReplyDelete
  3. శరత్ గారు, అజ్ఞాత గారూ (March 18, 2015 ; 11.17 am) - lighter vein లో ఓ చిన్న జోకు. మీకు ఆల్రెడీ తెలిసే వుంటుంది. / వినే వుంటారు.
    డబ్బు కలవాడు, అనుభవం కలవాడూ పార్ట్నర్లు గా వ్యాపారం మొదలెడితే, త్వరలోనే అనుభవజ్ఞుడికి డబ్బు దక్కుతుందిట, డబ్బున్నవాడికి "అనుభవం" మిగులుతుందిట :)
    (ఇంగ్లీష్ జోక్ కి స్వేచ్చానువాదం నాది.)
    ఈ జోక్ చెప్పినందుకు ఎద్దుపుండు కాకికి రుచి అని మండిపడకండి.

    ReplyDelete
  4. నా స్నేహితుడొకడు కష్టాల్లో వుంటే ఏమన్నా హెల్ప్ కావాలా ఆంటే, ఏంలేదు మామా, అంతా సెట్ ఐపోద్ది అన్నాడు. నాలాగా సహాయం చేయగల ఫ్రెండ్స్ యింకా వున్నారు వాడికి. మరి అడగడానికి అభిమాన పడ్డాడో, ఏమనుకున్నాడొ గాని ఆత్మహత్య చేసుకున్నాడు భార్యని, ముగ్గురు పిల్లల్ని వదిలిపెట్టి. బలవంతంగానైనా వాడికి ఏదో ఒక హెల్ప్ చెయ్యలేకపోయానే అన్న ఫీలింగ్ వెంటాడుతూనే వుంది.
    మీకు పోయింది ఎంతో తెలియదు కాని, మరీ పెద్ద మొత్తం కాకపోతే, పోన్లే ఓ పదిహేను రోజులు పని చెయ్యలేదనుకోండి. అలాగని అడిగినోల్లందరికి ఇవ్వడానికి మనదగ్గర వుండవు, అప్పుడప్పుడు యిలాంటివి తప్పదేమో.

    ReplyDelete
  5. అర్జంటుగా డబ్బు పంపకపోతే కొంప కొల్లేరు అయ్యే పరిస్థితి అంటే రాత్రికి రాత్రే డబ్బు పంపించాను. పని అయ్యింది అని ఫోన్ వచ్చింది కానీ, అది నిజంగా అత్యవసర పరిస్థితేనా కాదా అన్నది మాత్రం తెలియదు. నా డబ్బు మాత్రం తిరిగి వచ్చే సూచనలేమీ కనిపించటం లేదు. వైఫ్ తో నావి కూడా మీలాంటి బాధలే. మనమేమో ఇండియా వెళ్లి చూడలేము. నాన్నా పులి వచ్చే కథ లాగ తయారయ్యింది పరిస్థితి. ఒక్కోసారి మన సెంటిమెంట్స్ ని తెలివిగా వాడుకుంటున్నారా అనిపిస్తోంది. అందుకే ఇండియాలో మనీ ఇన్వెస్ట్ చెయ్యాలంటే భయంగా వుంది.

    సిద్దార్థ్

    ReplyDelete
  6. @ అజ్ఞాత18 మార్చి, 2015 11:17 [AM]
    "ప్రపంచం లో ఫ్రెండ్ తప్ప ఇంకేవాడు మోసం చేయలేడు".
    కరెక్టే. స్నేహితుడని నమ్మేస్తాం కాబట్టి మోసపోయే అవకాశాలు మెండుగా వుంటయ్. అదే మోసకారో లేక మన శత్రువో అయితే ముందే జాగ్రత్త పడతాం కదా.

    @ అజ్ఞాత18 మార్చి, 2015 12:59 [PM]
    అబ్బో ఇంకా చాలా చాలా వాటిల్లో వుంటానండీ - కానీ అవన్నీ అందరికీ చెప్పలేను కదా ;)

    @ విన్నకోట నరసింహా రావు
    అబ్బే అంత వీజీగా నేనేమీ అనుకోనండీ. మీ జోకూ, సామెతా రెండూ బావున్నయ్ :))

    ReplyDelete
  7. @ తుళ్ళూర్ పాండు
    అరెరే. ఎంత పని జరిగింది! అవసరం అయినప్పుడు అడగడానికి కూడా మొహమాటపడుతారు కొందరు. ప్చ్.

    సామూహిక ఆత్మహత్యలు జరుగుతాయేమో అని వణికిపోయి సహాయం చేసానండీ. అందరికీ అలా చెయ్యగలమా కానీ నా ప్రియతమ బాల్యమిత్రుడు కదా. నా చిన్నప్పుడు వాళ్ళ కుటుంబం నన్ను కుటుంబ సభ్యుడిలా చూసుకునేవారు. మా అమ్మ ఏమో అతగాడిని 'అంటరానివాడి'గా చూసేది!

    మావాడి వల్ల ఆ కుటుంబం, ముఖ్యంగా యుక్తవయస్సుకి వచ్చిన ఆ పిల్లలు ఎంత ఇబ్బందిపడుతున్నారో ఏమో. నేను ఫోన్ చేసినప్పుడు అంకుల్ అని ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా మాట్లాడుతారు ఆ పిల్లలు. జాలేస్తుంది కానీ నేను మాత్రం ఇంతదూరం నుండి ఇంకా ఏమి చెయ్యగలను. నా ప్రయత్నలోపం లేకుండా కృషి చేసాను. మీరు అన్నట్లే పోతే పొయినాయి కొన్ని డబ్బులు కానీ ఆ తృప్తి వుంది నాకు.

    ReplyDelete
  8. @ @ సిద్ధార్ధ్

    ఇండియా బంధుమిత్రులకు కొందరికీ నేనూ అత్యవసరం అంటే మరీ ఎక్కువ కాకపోయినా కొంత మొత్తంలో బదుళ్ళు ఇచ్చాను. ఒఖ్ఖళ్ళూ అడిగినా సరే తిరిగి ఇవ్వలేదు. హమ్మయ్య ఇక ముందు వీడు మళ్ళీ నన్ను బదులు అడగలేడు కదా అని సంతోషపడుతుంటాను :)) నెక్స్ట్ అని మిగతా వారికి అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేస్తూనే వుంటాను. వారి పరిస్థితి అప్పుడు నిజమే కానీ తిరిగి కుదుట పడ్డాక అయినా తిరిగి ఇవ్వాలి కదా. ఊహూ. ఇవ్వనే ఇవ్వరు. అడిగితే ఏవేవో కథలు చెబుతారు. బహుశా వాళ్ళంతా తాము శరత్తుని ఎంత తెలివిగా మోసం చేసామా అని చంకలు గుద్దుకుంటూవుండవచ్చు :( చిరాకేస్తుంది. ఎవరయినా మళ్ళీ సహాయం అడిగితే ఇవ్వాలో వద్దో అర్ధం కాదు. అయినా సరే వీడయినా నిజాయితీగా నా డబ్బులు నాకు తిరిగి ఇస్తాడేమో అని నమ్ముతూ సహాయం చేస్తూనే వుంటా.

    అయితే ఒక్క ఇండియా బంధుమిత్రులనే కాదు గానీ ఇక్కడి వారికి మనం బదుళ్ళు ఇచ్చే సందర్భాలు తక్కువ కాబట్టి ఇక్కడివాళ్ళ సంగతి మనకు అర్ధం కావట్లేదేమో. కెనడాలో వున్నప్పుడు నయాగరా కాలేజీలో చదువుతున్న ఒక తెలుగు విద్యార్ధి పరిచయం అయ్యి కాస్త క్లోజ్ అయ్యాడు. ఓ మూడు నెలల తరువాత ఏదో కాలేజీ ఫీజు కట్టాలని మూడు వేల డాలర్లు అడిగాడు. అంత వద్దు - కొద్దిగా చాలు అనుకొని అంత దృశ్యం నా దగ్గర లేదు బాబూ కానీ ఓ మూడొందలు ఇమ్మంటే ఇస్తా అన్నా. ఓక్కే అన్నాడు. దొంగకి చెప్పు అయినా సరే లాభమే కదా. తీసుకొని మళ్ళీ కనపడితే ఒట్టూ, ఈమెయిల్స్ కి రిప్లయ్ ఇస్తే ఒట్టూ.

    అలాంటి బదుళ్ళ నిర్వాకాలు ఎన్నో వున్నాయి కానీ ఈ పోస్టులో నా బ్యుజినెస్ నిర్వాకం గురించి వ్రాసాను.

    ReplyDelete
  9. జరిగిందేదో జరిగింది,ఇచ్చిన దానికి నీళ్ళొదులుకోండి, దానికోసం ప్రయత్నం వృధా, వ్యధా! ఇప్పటికైనా ఇల్లాలికి నిజం చెప్పండి, అది మంచి పని, ఒక సారి తిట్టినా, మా ఆయన బంగారం నా దగ్గరేం దాచలేరు, అనుకునే ఛాన్స్ ఉంది కదా!

    ReplyDelete
  10. @ శర్మ
    ధన్యవాదాలు.

    నా పోస్ట్ మీరు పైపైన చదివి ఈ వ్యాఖ్య చేసారని అనుకుంటున్నా :)

    - నేనెప్పుడో నీళ్ళొదులుకున్నాను.దానికోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఈ పోస్టులో ఏమీ చెప్పలేదు.
    - ఎంచక్కా మా ఆవిడకి చెప్పాననీ ఇందులో చెప్పాను. అది మీరు గమనించినట్లు లేరు. కాకపోతే పూర్తి వివరాలు చెప్పలేదు. కారణం తను మళ్ళీ ఆ విషయం ఎత్తలేదు - అడగలేదు. అదే విచిత్రంగా వుంది :)) ఈ ఆడాళ్ళు అంత సులభంగా ఊరుకోరే! మరచిపోరే! తల గోక్కుంటున్నా.

    ReplyDelete
  11. May she is waiting for a right time... ladies has permanent memory

    ReplyDelete
  12. మూడువేలడిగితే మూడు వందలు ఇచ్చింది కాకుండా తిరిగి ఇవ్వలేదు అంటారా.. అతను ఎంతమందిని ఇలా అడిగితే మూడు వేలయ్యాయో... ఎంతమందికని ఫోన్ ఎత్తుతాడు..పాపం..

    ReplyDelete
  13. @ అజ్ఞాత
    అంతేనంటారా :(

    @ కాయ
    మీరు నన్ను అపార్దం చేసుకున్నారు. పాపం ఆ అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడో అని మిగిలిన 2700 డాలర్లూ ఇచ్చేద్దామనే ఫోన్లు చేసా. సన్నాసి. ఎత్తితే కదా. మీకు కనపడితే చెప్పండి - ఇప్పటికయినా ఇచ్చేస్తానని.

    ReplyDelete