అందమయిన యువతులందరికీ అందమయిన పాదాలు వుండాలని రూలేమీ లేదు కానీ వికారమయిన పాదాలు చూసినప్పుడు ప్చ్ అనిపిస్తుంది. అందమయిన హీరోయిన్లలో కొంతమంది పాదాలు మాత్రమే బావుంటాయి. అందులో నిత్యా మీనన్ వి కూడానూ. నిన్ననే మళ్ళీ మళ్ళీ రాని రోజు సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చాలా గొప్పగా వుంది అని చాలా రివ్యూలు వచ్చాయి కాబట్టి మళ్ళీ నేనో రివ్యూ లాంటిదేం వ్రాయబోవడం లేదు లెండి.ఈ సినిమాలో ఓ దృశ్యంలో నిత్య హీరో గారి ఇంట తొలిసారిగా అడుగుపెట్టబోతుంది. ముందు ఎడమకాలు పెట్టబోయి తటపటాయించి అది వెనక్కు తీసుకొని కుడికాలు పెట్టి ఇంట్లోకి ప్రవేశిస్తుంది - ఇటు నా పంట పండిస్తుంది.
అసలే అందమయిన అభిమాన హీరోయిన్ను. అటుపై అందమయిన ఆమె పాదాలు తెరంతా పరచుకొని కనిపిస్తుంటే వాహ్ విజిల్ వెయ్యాలనిపించింది కానీ నాకు వెయ్యడం రాదు. పైగా పక్కనే వున్న మా ఆవిడ మరొసారి నన్నో పిచ్చాడిలా చూడవచ్చు - అందుకే అదిమేసుకున్నా. సరే ఇక ఆమె పాదాలు అక్కడ పెట్టేసి అసలు సిసలు సినిమా విషయానికి వద్దామేం. సినిమా సూపరుగా నచ్చింది. మొదటి నుండీ చివరి వరకూ ఆ ఎమోషనల్ దృశ్యాలకు స్పందిస్తూ నా కళ్ళు వర్షిస్తూనే వున్నయ్. నా ఖర్చీఫ్ పూర్తిగా తడిచిపోయింది. ఈమధ్య ప్రతి చిన్న మంచి విషయానికీ నేను ఎమోషనల్ అయిపోతున్నాను. కళ్ళూ, మనస్సూ ఆర్ద్రంగా అవుతున్నాయ్. కారణం... నాకు తెలుసు. సందర్భం వచ్చింది కాబట్టి అదేంటో మీకు వివరిస్తానేం.
సినిమా గురించి చెబుతూ ఈస్ట్రోజన్ గురించి సోదేస్తున్నాడని మీరు అనుకుంటే ఆగిపొండి. తోటి మగాళ్ళూ - మనకు ఇది ముఖ్యమయినది - చదివితే మంచిది.
మొన్న మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. రొటీన్ గా ప్రతి మూడు నెలల కొకసారి చేయించుకునే రక్త పరీక్షల గురించి కలిసాను. అన్నీ దాదాపుగా బావున్నాయని చెబుతూ ఆఖరున ఈస్ట్రోజన్ గురించి కాస్త కంగారుగా చెప్పాడు. అవసరమయిన స్టెప్స్ తీసుకుంటున్నా కూడా అది అంతగా (రెట్టింపు) ఎందుకు పెరిగిపోయిందో తెలియక జుట్టు పీక్కున్నాడు. నేను పళ్ళికలించి అరిమిడెక్స్ ఎక్కువగా వాడట్లేదు అని విన్నవించా. అంతను బోలెడంత ఆశ్చర్యపోయాడు. ఎందుకు అని అడిగాడు. నేను బ్బెబ్బెబ్బె అని నీళ్ళు నములుతూ 'మీరు చెప్పినట్లుగా కాకుండా నేను లక్షణాలను బట్టి ఆ మందు వాడుతున్నాను' అని సెలవిచ్చాను. ఈమధ్య వాడుతున్న మరో మందు వల్ల ఈస్ట్రోజన్ డామినన్స్ సింప్టంస్ తక్కువ అనిపించి ఏంటీ అరోమటేజ్ మందు తక్కువ చేసాను. వంట్లో ఈస్ట్రొజన్ మరీ తక్కువయితే జాయింట్ పెయిన్స్, లిబిడో పడకెయ్యడం, ఎముకల క్షీణత వగైరాలు ఉరికి వస్తాయి. ఆయన గారికేం భేషుగ్గా డోసేజ్ చెబుతాడు. అది ఎక్కువయితే ఇబ్బంది పడేది నేను కానీ ఈసారి మాత్రం నా శరీరంలోని ఈస్ట్రోజన్ కొండెక్కి కూర్చున్నది.
సాధారణంగా మగవాళ్ళకి 55 ఏళ్ళ వయస్సు వచ్చేసరికి వారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ దాదాపుగా ఆడవారి కంటే ఎక్కువ అవుతుంది. టెస్టాస్టెరాన్ హార్మోన్ క్రమంగా తగ్గిపోతూ అది క్రమంగా అలా పెరుగుతూ వుంటుంది. అందువల్ల మేల్ బూబ్స్, లిబిడో సమస్యలూ, అలసట, చిరాకూ, వగైరా వగైరా వస్తుంటాయి. కొంతమంది మగవాళ్ళకు రొమ్ము క్యాన్సర్ కూడా రావచ్చు. కొన్నేళ్ళ క్రితం చేసిన రక్త పరీక్షల్లో నాలో ఈస్ట్రోజన్ ఎక్కువగా వుంటోందని అనుకోకుండా బయటపడింది. అప్పటినుండీ తక్కువ మోతాదులో అది తగ్గించే మందు వాడుతూ వున్నాను. అలాగే నా శరీరంలో ప్రొజెస్టరాన్ బొత్తిగా వుండటం లేదని కూడా తెలుసుకున్నాం. బయో ఐడెంటికల్ ప్రోజెస్టరానూ వాడుతున్నాను. నాకున్న సవాలక్ష చిన్నచిన్న ఆరోగ్య సమస్యల్లో ఇవి కొన్ని.
మగవారి శరీరంలో బాగా ఈస్ట్రోజన్ ఎక్కువయినప్పుడు మనస్సుకి ఆర్ద్రత కల్గించగలిన ఏ చిన్న విషయం చూసినా, చదివినా, తెలుసుకున్నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సినిమాలూ, సీరియళ్ళు చూసి గానీ లేదా చిన్న చిన్న విషయాలకే కళ్ళల్లో నీళ్ళు తిరిగే మగవాళ్ళుంటే ఒకసారి మీ డాక్టరుని కలుసుకొని మీలో ఈస్ట్రోజన్ ఎంత వుందో చెక్ చేసుకోవడం మంచిది. అందుకు గాను మేల్ ఈస్ట్రోజన్ ప్రోటోకాల్ మాత్రమే మెడికల్ ల్యాబులో వినియోగించాలి. ఆడవారికి చేసినట్టు మనకూ ఆ పరీక్ష చేస్తే ఆ ఫలితంతో లాభం వుండదు. అయితే అందరు డాక్టర్లకి ఈ విషయం గురించి అవగాహన వుండకపోవచ్చు. వాళ్ళు దీన్ని తేలిగ్గా తీసుకొని కొట్టిపడెయ్యొచ్చు. మరి మీరు మీ డాక్టరుని లైటుగా తీసుకొని మరో మంచి వైద్యుడిని వెతుక్కుంటారో లేక నన్నూ, ఈ పోస్టునూ లైట్ తీసుకుంటారో మీ ఇష్టం. ఎండోక్రైనాలజిస్టులు ఇలాంటి హార్మోన్ విషయాల్లో నిష్ణాతులు.
నిన్న ఈ సినిమా చూసి బాగా ఏడవడానికి కారణం ఆ సినిమా మంచిగా వుండబట్టా లేక నాలో ఈస్ట్రోజన్ ఎక్కువ కావడం వల్లా అనేది నా అయోమయం. అందువల్ల ఏంటీ అరోమటేజ్ మందు డోస్ కాస్త పెంచాను. కాస్త కీళ్ళ నొప్పులు కనిపించేదాకా పెంచేస్తే ఆ తరువాతా మళ్ళీ నార్మల్ డోస్ వాడొచ్చు.
నిన్న ఈ సినిమా చూసి బాగా ఏడవడానికి కారణం ఆ సినిమా మంచిగా వుండబట్టా లేక నాలో ఈస్ట్రోజన్ ఎక్కువ కావడం వల్లా అనేది నా అయోమయం. అందువల్ల ఏంటీ అరోమటేజ్ మందు డోస్ కాస్త పెంచాను. కాస్త కీళ్ళ నొప్పులు కనిపించేదాకా పెంచేస్తే ఆ తరువాతా మళ్ళీ నార్మల్ డోస్ వాడొచ్చు.
వావ్ కన్నీళ్లకి మీ సైంటిఫిక్ విశ్లేషణ ఇంట్రెస్టింగ్ గా ఉందండీ... కానీ సినిమా కూడా చాలా ఇంటెన్స్ గా తీశాడు ఆ ఎమోషన్ కి కనెక్ట్ అయినవారు అలా భావోద్వేగానికి గురవడంలో ఆశ్చర్యం లేదేమో. ఏదేమైనా సినిమా మీకు నచ్చినందుకు సంతోషం :-)
ReplyDeleteమీ పోస్ట్ లు చదువుతుంటే నాకు కూడా ఏదో ఉన్నదేమో అని డౌట్ వస్తుంది .
ReplyDelete@ వేణూశ్రీకాంత్
ReplyDelete:)
@ అజ్ఞాత
మనకు తెలియకుండా మనలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వుండవచ్చు. Ignorance is bliss అనుకుంటూ అమాయకంగా జీవితాన్ని దొర్లించడమా లేక అనుమానం వచ్చినప్పుడు వుందో లేదో నిర్ధారించుకోని సవరించుకోవడమా? ఏది మంచిది? నాకు అయితే నాకు తెలిసే ఇన్ని శారీరక, మానసిక సమస్యలు వుంటే మనకు తెలియకుండానే మనలో ఎన్ని వున్నాయో అని అనుమానం వస్తుంటుంది. ఏమయినప్పటికీ మనం hypochondriac కాకుండా మాత్రం జాగ్రత్తపడాలి.