ఆ ఆనకట్ట వల్ల ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు రావడానికి మూల కారణం ఏంటో తెలుసా? నాకు తెలుసు. వాస్తు. వాస్తు బావోలేదు. అంచేతా శుబ్బరంగా ఆ డ్యాం ను కూలగొట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సివిల్ ఇంజినీర్లకు బదులుగా తమ తమ ప్రభుత్వ వాస్తు సలహాదారులను ఉపయోగించి విడివిడిగా ఆనకట్టలు కట్టుకోవాలి. ఎందుకయినా మంచిది - మళ్ళీ మళ్ళీ వాస్తు సమస్యలు రాకుండా ఉత్తర దక్షిణ తెలంగాణా కు మధ్యగా గానీ, రాయలసీమకు ఆంధ్రాకు మధ్యగా గానీ ఆనకట్టలు కట్టరాదు.
అదీ కాకపోతే ఇంకో సులభ పరిష్కారం వుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ వాస్తు సలహాదారుల సూచనల మేరకు ఆనకట్టకు మధ్యగా గోడ కట్టాలి. అప్పుడు ఎవరి నీళ్ళు, ఎవరి గేట్లు, ఎవరి కాలువలు వారివి అవుతాయి. సింపుల్. హేంటో ఈమాత్రం దానికి ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకుఛస్తున్నారంట. అవసరమా అదీ?
మీరు కూడా ఇలా వ్రాస్తే ఎలా గురువుగారు..పైకి చెప్పటానికి కారణం వాస్తు.. లోపటి కారణం.. ఆ పాత బంగళాల్లో సౌకర్యాలు లేని గదుల్లో ఎంత కాలమీ సన్యాసి జీవితం.. మన రేంజ్ కి తగ్గట్టు లేవీ భవంతులు.. కొడితే కుంభస్థలమే.. అనేది వారి అభిప్రాయం అని నా అభిప్రాయం.. మరి మనకు కరెంటివ్వని ఆంధ్రోనికి మనమెందుకివ్వాలె నీళ్ళు..?
ReplyDeleteముందన్నది ఇంకా టెస్టింగు పూర్తి కాలేదని.. మరి ఉపయోగంలోకి వచ్చినంక కూడ ఎందుకివ్వరు కరెంటు.. ?
@ కాయ
ReplyDeleteఎవరి గురించీ ప్రత్యేకంగా వ్రాయలేదండీ. ఇరు పక్షాల గురించీ వ్రాసాను.
ఇప్పుడు ఎంత మంది ఆంధ్రా ప్రభుత్వ విధానాన్ని తప్పుబడతారు ? ఇలాంటి సందర్భాల్లో నోరుమూసుకుంటారు.. రేపు ప్రత్యామ్నాయం వెతుక్కుంతుంటే అడ్డొస్తారు.. ఇలాగే తెలంగాణా ఏర్పడింది కదా.. రేపు రాయలసీమ దీ ఇదే దారి అవుతుందేమో....
ReplyDelete