మనం ప్రేమ గురించి ఎంతో వింటుంటాం, చూస్తుంటాం కానీ అదంతా చాలావరకు షరతులతో కూడిన ప్రేమగా అనిపిస్తుంది. అన్‌కండీషనల్ లవ్ చాలా తక్కువగా చూస్తుంటాం. మనం ఇంత ప్రేమించాం కాబట్టి మన పార్ట్నర్ మనల్ని మరింతంగా ప్రేమించాలని ఆశిస్తాం. ప్రేమలో కొలతలు వేసుకుంటాం.
There is a huge difference between unconditional love and conditional
love. Conditional love blames a person, expects things in return and
asks for more. Unconditional love accepts the person, expects nothing in
return and sacrifices.
ప్రేమికుల మధ్య, జంటల మధ్య షరతులు లేని ప్రేమ లేకపోవడం వల్లనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ప్రేమ పేరిట వేధింపులు జరుగుతున్నాయి. ప్రేమించడమే గొప్ప అనుకుంటారు, అనిర్వచనీయమయిన అనుభూతి అనుకుంటారు. ప్రేమతో పాటు పొజెసివ్నెస్స్ పెరుగుతుంది. దాంతో వస్తాయి చిక్కులు. ప్రేమించబడ్డవాళ్ళు ఎదుటివారి అతి ప్రేమా, దాంతో పాటూ వారు ప్రదర్శించే అతి ప్రేమతో విసుగు చెంది ఎందుకు ప్రేమించబడ్డామా అనుకునే పరిస్థితులు కూడా వస్తుంటాయి. నా అభిప్రాయంలో సాధారణమైన ప్రేమ పెద్ద గొప్పదేమీ కాదు. అది చాలామంది చేసేదే. ఒకరి మీద మన ప్రేమ అన్‌కండీషనల్ అయితేనే ఉదాత్తంగా నిలబడిపోతుంది. అలాంటి ప్రేమల్లొ సమస్యలు రావడానికి తక్కువ అవకాశం వుంటుంది.
నేను కూడా నా పెళ్ళికి ముందు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. నన్ను ముందుగా ఆమెనే ప్రేమలోకి దింపింది. అటుపై ఆమెను అతిగా ప్రేమించేవాడిని. దాంతో పొసెసివ్నెస్ ఎక్కువయిపోయి కాస్త ఇబ్బంది పెట్టాను. ప్రేమించాను కానీ ఆమెకు అంకితం (సబ్మిట్) కాలేకపోయాను. షరతులు లేకుండా ప్రేమించేంత గొప్ప గుణం అప్పట్లో నాలో లేదు కనుక ఓ మూడేళ్ళలో మా ప్రేమ విఫలం అయ్యింది. మా ప్రేమ విఫలం కావడానికి ఆమెనే ముఖ్య కారణం. ఆమెని అడిగితే నన్ను తప్పుపట్టవచ్చు. నాది అన్‌కండీషనల్ లవ్ కనుక అయివుండినట్లయితే ఆమెను సవ్యంగా అర్ధం చేసుకొనివుండేవాడిని.

No comments:
Post a Comment