స్త్రీల శరీరంలో ఎక్కువగా పురుషులకి ఏం నచ్చుతుంది అనే దాన్ని బట్టి పురుషులని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
1. తల: వీరికి స్త్రీ తల భాగం కానీ తలలోని ఒక భాగం అనగా కళ్ళు కానీ, చెవులు కానీ, నోరు కానీ, దంతాలు కానీ, శిరోజాలు కానీ, మెడ కానీ బాగా నచ్చుతాయి. నా మిత్రుల్లో ఒకరికి శిరోజాలు బాగా నచ్చుతాయి.
1. తల: వీరికి స్త్రీ తల భాగం కానీ తలలోని ఒక భాగం అనగా కళ్ళు కానీ, చెవులు కానీ, నోరు కానీ, దంతాలు కానీ, శిరోజాలు కానీ, మెడ కానీ బాగా నచ్చుతాయి. నా మిత్రుల్లో ఒకరికి శిరోజాలు బాగా నచ్చుతాయి.
2. బాడీ: వీరికి స్త్రీ శరీరం (తల మరియు పాదాలు మినహా) కానీ లేదా అందులోని ఏ భాగం అయినా కానీ నచ్చవచ్చు. స్థనాలు, నడుము, వీపు, పిరుదులు, తొడలు, కాళ్ళు వగైరాలలో ఏదయినా వీరికి విపరీతంగా నచ్చవచ్చు.
3. పాదాలు: వీరికి స్త్రీల పాదాలు అంటే మహా ఇష్టం
అలా అని పై వర్గాల వారికి కేవలం అవే నచ్చుతాయని కాదు కానీ వాటిని మాత్రం అన్నింటికంటే బాగా ఇష్టపడుతారు.
నాకు స్త్రీల పాదాలు అంటే బోలెడంత ఇష్టం. అయితే చాలామంది స్త్రీల పాదాలు బావుండవు - కొద్ది మందివి మాత్రమే బావుంటాయి. అందంగా వున్నంత మాత్రాన అందమయిన పాదాలు వుండాలని ఏమీ లేదు. నేను పెళ్ళి చేసుకున్నప్పుడు కూడా పెళ్ళి చూపుల్లో పాదాలు కనిపిస్తాయేమోనని చూసేవాడిని కానీ ఆ అవకాశం రాలేదు - మనమేమో సిగ్గు విడిచి అడగలేం. మీరు మరీనూ! ఎలా అడుగుతారండీ అలా?
నాకు పెళ్ళి సంబంధం కుదిరినప్పుడు నా కాబోయే భార్య పాదాలు బావుండాలని వెయ్యి నాస్తిక దేవుళ్ళకి (?) మొక్కుకున్నాను. ఏ నాస్తిక దేవుడో (!) కరుణించాడనుకుంటా. పెళ్ళి రోజు చూసాను - సూపర్ అంటే సూపరూ! ఇంకేం ఇహ ఇంట్లో నా చూపులెప్పుడూ అటువైపే :) అతిగా అవకాశం ఇస్తే పాదాలు పలుచన అయిపోతాయనేమో ఎక్కువ భాగం కప్పివేయబడేవుంటాయి - కోపం చెందినప్పుడయితే మరీనూ :(
మీరు ఏ టైపు పురుషులో చెప్పుకోండి చూద్దాం!
No comments:
Post a Comment