తల్లితండ్రులు తెలుసుకోవాల్సిన 28 ఇంటర్నెట్ సంక్షిప్త పదాలు :)
http://www.cnn.com/2014/12/08/living/internet-acronyms-every-parent-should-know/index.html?hpt=hp_c2
పాదాభివందనం
నాకు స్త్రీల అందమయిన పాదాలు అంటే బోలెడంత ఇష్టం అని చెప్పా కదా. వాటి గురించి మరికొంత మాట్లాడుకుందాం. నాకు అవంటే ఇష్టం కాబట్టి వాటిని పరిశీలిస్తుంటాను. అమ్మాయి అందంగా వున్నంత మాత్రాన తన పాదాలూ అందంగా వుండాలని లేదు కదా. మనిషి బావుండి పాదాలు బావోలేకపోయినా లేక పాదాలు బావుండి మనిషి బావోలేకపోయినా ప్చ్ అనిపిస్తుంది. మనిషీ, పాదాలూ బావున్నాయనుకోండి సూపరూ. మరి మనస్సఖ్ఖరలేదా అంటారా? అది అప్రస్థుతం.
స్త్రీ పాదాలు లేత తమలపాకుల వుండాలి! మెత్తగా, మృదువుగా, సుకుమారంగా, లేతగా, సుందరంగా వుండాలి. రాధ నాకు బాగా నచ్చిన హీరోయిన్ - ఆమె పాదాలు చాలా బావుంటాయి. మిగతా హీరోయిన్లలో అసిన్, అమలా పాల్, ప్రియాంకా చోప్రా పాదాలు చక్కగా అనిపిస్తాయి. అనుష్క పాదాలు అస్సలు నచ్చవు. కాజోల్, హన్సిక వి కూడా అంతగా నచ్చవు. సమంతా కాస్త ఓకే. ఐశ్వర్య పాదాలు ఎప్పుడూ స్పష్టంగా చూడలేకపోయాను కానీ చూసినంతవరకు సూపర్ కాకపోయినా వోకే. ఆమెకు వున్న సౌందర్యానికి పాదాలు ఇంకా సుందరంగా వుంటే బావుండేది.
పాదాల అందానికి తోడుగా వాటికి హుందాతనం కూడా తోడయితే, వాటికి తగ్గ పాదరక్షలూ జోడయితే దాసోహం కావాలనిపిస్తుంది. పై చిత్రం చూడండి. పాదాలూ, పాదరక్షలూ అందంగానే కాకుండా ఎంత హుందాగా, అధికార దర్పంతో వున్నాయో. అలాంటి పాదాల ముందు నాలాంటి వాడు ప్రణమిల్లకుండా వుండగలడా? పాదాభివందనం చేయకుండా వుండగలడా? అలా అని నిజంగా చేసేస్తే ఆ పాదాలతోనే తన్నులు తినాల్సిరావచ్చు. అందుకే మౌనంగా, మనస్సులో ప్రణమిల్లుతుంటాను.
అందమయిన స్త్రీత్వానికి తోడుగా, సుందరమయిన పాదాలూ వాటికి తోడుగా మంచి మనస్సూ కలగలిస్తే ఇంకేం. అందమయిన శరీరం వున్నంత మాత్రాన వారి వ్యక్తిత్వం కూడా చక్కనిది అయివుండాలని లేదు కానీ వుంటే మాత్రం భలే బావుంటుంది. అలా మూడూ బావుండే అతివలు అతి కొద్ది మంది కనిపిస్తారు. వాళ్లని చూసి నేను ప్రతి క్షణం అబ్బురపడుతుంటాను.
అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే అన్నింటికన్నా ముఖ్యం మంచి మనస్సు కదా. అందమయిన మనస్సు ముందు మిగతావన్నీ దిగదుడుపే కానీ మనిషిని చూడగానే మనస్సు తెలియదు కదా. అందుకే దాన్ని ప్రస్థుతం పక్కకు పెట్టి పాదాల సంగతి చూద్దామేం. మా దగ్గర చలికాలం ఎక్కువగా, తీవ్రంగా వుంటుంది కాబట్టి కొద్దిగా చలి మొదలవగానే పాదాలు బూట్లతో కప్పేస్తారు. అలా నాకు వాటి దర్శనభాగ్యం మళ్ళీ వేసవి వచ్చేదాకా దుర్లభమవుతుంది. వేసవిలో ఎన్నెన్నో అందమయిన పాదాలు అర్ధనగ్నంగా సంచరిస్తుంటాయి - ఈ సౌందర్య పిపాసిని పరవశింపజేస్తుంటాయి.
ఓషో మరియు చలం లకు అభిమాని.
కామెంట్లెయ్యడం కష్టమే కానీ...
ఇదివరలో బ్లాగుల్లో బాగానే వ్యాఖ్యలు వేసేవాడినే కానీ ఈమధ్య ఇతరుల టపాలు ఏవో కొన్ని తప్ప చాలావరకు పెద్దగా నాకు ఆసక్తి కలిగించనివే వుంటున్నాయి. ఇక ఆసక్తి కలిగించిన టపాలను కూడా చదవడమే ఎక్కువ కాబట్టి కామెంట్లేసేంత కష్టపడాలనిపించడం లేదు. అయితే వారి టపా క్రింద రియాక్షన్స్ వున్నట్లయితే మాత్రం వీలయినంతగా ప్రతిస్పందిస్తాను. నాకు లాగే చాలా మంది బద్దకిస్టులు వుంటారు కాబట్టి మాలాంటి వారికి వీజీగా వుండేందుకై మీ బ్లాగుల్లో కూడా రియాక్షన్స్ పెట్టుకోండేం.
నా బ్లాగు పోస్టుల క్రింద కూడా 'చాలా బావుంది', 'బావుంది', 'బావోలేదు' అనే రియాక్షన్స్ వుంటాయి. కామెంటెయ్యడం కష్టంగా అనిపించినా కనీసం మీ స్పందన ఏంటో తెలిస్తే కాస్త బావుంటుంది. నా ధోరణిలో నేను వ్రాసుకుపోవడమే తప్ప ఇతరుల ప్రతిస్పందనలను బట్టి నేను వ్రాసే రకం కాదు గానీ జనాలకి ఏం నచ్చుతున్నాయో ఏం నచ్చట్లేదో కాస్త ఐడియా వుంటుంది.
ఓషో మరియు చలం లకు అభిమాని.
షరతులు లేని ప్రేమ
మనం ప్రేమ గురించి ఎంతో వింటుంటాం, చూస్తుంటాం కానీ అదంతా చాలావరకు షరతులతో కూడిన ప్రేమగా అనిపిస్తుంది. అన్‌కండీషనల్ లవ్ చాలా తక్కువగా చూస్తుంటాం. మనం ఇంత ప్రేమించాం కాబట్టి మన పార్ట్నర్ మనల్ని మరింతంగా ప్రేమించాలని ఆశిస్తాం. ప్రేమలో కొలతలు వేసుకుంటాం.
There is a huge difference between unconditional love and conditional
love. Conditional love blames a person, expects things in return and
asks for more. Unconditional love accepts the person, expects nothing in
return and sacrifices.
ప్రేమికుల మధ్య, జంటల మధ్య షరతులు లేని ప్రేమ లేకపోవడం వల్లనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ప్రేమ పేరిట వేధింపులు జరుగుతున్నాయి. ప్రేమించడమే గొప్ప అనుకుంటారు, అనిర్వచనీయమయిన అనుభూతి అనుకుంటారు. ప్రేమతో పాటు పొజెసివ్నెస్స్ పెరుగుతుంది. దాంతో వస్తాయి చిక్కులు. ప్రేమించబడ్డవాళ్ళు ఎదుటివారి అతి ప్రేమా, దాంతో పాటూ వారు ప్రదర్శించే అతి ప్రేమతో విసుగు చెంది ఎందుకు ప్రేమించబడ్డామా అనుకునే పరిస్థితులు కూడా వస్తుంటాయి. నా అభిప్రాయంలో సాధారణమైన ప్రేమ పెద్ద గొప్పదేమీ కాదు. అది చాలామంది చేసేదే. ఒకరి మీద మన ప్రేమ అన్‌కండీషనల్ అయితేనే ఉదాత్తంగా నిలబడిపోతుంది. అలాంటి ప్రేమల్లొ సమస్యలు రావడానికి తక్కువ అవకాశం వుంటుంది.
నేను కూడా నా పెళ్ళికి ముందు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. నన్ను ముందుగా ఆమెనే ప్రేమలోకి దింపింది. అటుపై ఆమెను అతిగా ప్రేమించేవాడిని. దాంతో పొసెసివ్నెస్ ఎక్కువయిపోయి కాస్త ఇబ్బంది పెట్టాను. ప్రేమించాను కానీ ఆమెకు అంకితం (సబ్మిట్) కాలేకపోయాను. షరతులు లేకుండా ప్రేమించేంత గొప్ప గుణం అప్పట్లో నాలో లేదు కనుక ఓ మూడేళ్ళలో మా ప్రేమ విఫలం అయ్యింది. మా ప్రేమ విఫలం కావడానికి ఆమెనే ముఖ్య కారణం. ఆమెని అడిగితే నన్ను తప్పుపట్టవచ్చు. నాది అన్‌కండీషనల్ లవ్ కనుక అయివుండినట్లయితే ఆమెను సవ్యంగా అర్ధం చేసుకొనివుండేవాడిని.
నేను కూడా నా పెళ్ళికి ముందు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. నన్ను ముందుగా ఆమెనే ప్రేమలోకి దింపింది. అటుపై ఆమెను అతిగా ప్రేమించేవాడిని. దాంతో పొసెసివ్నెస్ ఎక్కువయిపోయి కాస్త ఇబ్బంది పెట్టాను. ప్రేమించాను కానీ ఆమెకు అంకితం (సబ్మిట్) కాలేకపోయాను. షరతులు లేకుండా ప్రేమించేంత గొప్ప గుణం అప్పట్లో నాలో లేదు కనుక ఓ మూడేళ్ళలో మా ప్రేమ విఫలం అయ్యింది. మా ప్రేమ విఫలం కావడానికి ఆమెనే ముఖ్య కారణం. ఆమెని అడిగితే నన్ను తప్పుపట్టవచ్చు. నాది అన్‌కండీషనల్ లవ్ కనుక అయివుండినట్లయితే ఆమెను సవ్యంగా అర్ధం చేసుకొనివుండేవాడిని.
ఓషో మరియు చలం లకు అభిమాని.
మగాళ్ళు మూడు రకాలు
స్త్రీల శరీరంలో ఎక్కువగా పురుషులకి ఏం నచ్చుతుంది అనే దాన్ని బట్టి పురుషులని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
1. తల: వీరికి స్త్రీ తల భాగం కానీ తలలోని ఒక భాగం అనగా కళ్ళు కానీ, చెవులు కానీ, నోరు కానీ, దంతాలు కానీ, శిరోజాలు కానీ, మెడ కానీ బాగా నచ్చుతాయి. నా మిత్రుల్లో ఒకరికి శిరోజాలు బాగా నచ్చుతాయి.
1. తల: వీరికి స్త్రీ తల భాగం కానీ తలలోని ఒక భాగం అనగా కళ్ళు కానీ, చెవులు కానీ, నోరు కానీ, దంతాలు కానీ, శిరోజాలు కానీ, మెడ కానీ బాగా నచ్చుతాయి. నా మిత్రుల్లో ఒకరికి శిరోజాలు బాగా నచ్చుతాయి.
2. బాడీ: వీరికి స్త్రీ శరీరం (తల మరియు పాదాలు మినహా) కానీ లేదా అందులోని ఏ భాగం అయినా కానీ నచ్చవచ్చు. స్థనాలు, నడుము, వీపు, పిరుదులు, తొడలు, కాళ్ళు వగైరాలలో ఏదయినా వీరికి విపరీతంగా నచ్చవచ్చు.
3. పాదాలు: వీరికి స్త్రీల పాదాలు అంటే మహా ఇష్టం
అలా అని పై వర్గాల వారికి కేవలం అవే నచ్చుతాయని కాదు కానీ వాటిని మాత్రం అన్నింటికంటే బాగా ఇష్టపడుతారు.
నాకు స్త్రీల పాదాలు అంటే బోలెడంత ఇష్టం. అయితే చాలామంది స్త్రీల పాదాలు బావుండవు - కొద్ది మందివి మాత్రమే బావుంటాయి. అందంగా వున్నంత మాత్రాన అందమయిన పాదాలు వుండాలని ఏమీ లేదు. నేను పెళ్ళి చేసుకున్నప్పుడు కూడా పెళ్ళి చూపుల్లో పాదాలు కనిపిస్తాయేమోనని చూసేవాడిని కానీ ఆ అవకాశం రాలేదు - మనమేమో సిగ్గు విడిచి అడగలేం. మీరు మరీనూ! ఎలా అడుగుతారండీ అలా?
నాకు పెళ్ళి సంబంధం కుదిరినప్పుడు నా కాబోయే భార్య పాదాలు బావుండాలని వెయ్యి నాస్తిక దేవుళ్ళకి (?) మొక్కుకున్నాను. ఏ నాస్తిక దేవుడో (!) కరుణించాడనుకుంటా. పెళ్ళి రోజు చూసాను - సూపర్ అంటే సూపరూ! ఇంకేం ఇహ ఇంట్లో నా చూపులెప్పుడూ అటువైపే :) అతిగా అవకాశం ఇస్తే పాదాలు పలుచన అయిపోతాయనేమో ఎక్కువ భాగం కప్పివేయబడేవుంటాయి - కోపం చెందినప్పుడయితే మరీనూ :(
మీరు ఏ టైపు పురుషులో చెప్పుకోండి చూద్దాం!
ఓషో మరియు చలం లకు అభిమాని.
Subscribe to:
Posts (Atom)