సిక్కయ్యానోచ్!


Medical Flat Boot

పాశ్చాత్య జీవనంలో ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే సులభంగా అనారోగ్యం రాకపోవడం. సాధారణ అనారోగ్యం వచ్చినా ఒక పూటో, ఒక రోజో వుంటుంది అంతే. కాస్త నలతగా అనిపించి సిక్ లీవ్ తీసుకున్నా కూడా ఒక రోజుకన్నా ఎక్కువ అలా తీసుకోవడానికి మొహమాటంగా వుంటుంది. నిజంగా అనారోగ్యానికి గురి అయ్యి సిక్ లీవ్ ఒక్క రోజు తీసుకున్నా అది బోగస్ అనే సాధారణంగా ఆఫీస్ ప్రజలు అనుకుంటారని అంటారు.  అదే ఇండియాలో వున్నప్పుడు అయితే తరచుగా జ్వరాలు వచ్చేవి - ఓ వారం అయినా వుండేవి. అన్నిరోజులు మనం దర్జాగా గడుపుతూవుంటే ఇంట్లో వారు సపర్యలు చేసేవారు. జరుగుబాటు వుండే జ్వరం వచ్చినంత సుఖం లేదని సామెత కూడా వుంది కదా.
 
ఈ దేశాలకు వచ్చిన తరువాత 1999 డిసెంబరులో కెనడాలో ఓ సారి ఫ్లూ వచ్చి ఓ పది రోజులు ఆఫీసుకి వెళ్ళలేకపోయాను కానీ జరుగుబాటు జరగలేదు :( కారణం మా పాప స్కూల్లో ఫ్లూ తగిలించుకొని వచ్చి నాకూ, మా ఆవిడకీ, మా ఇంట్లోనే అప్పుడు వున్న మా మేనల్లుడికీ అంటించింది.  అప్పుడు నాకు ఫ్లూ వాక్సిన్ల గురించి అవగాహన లేదు. ముందుగా మూడురోజుల్లో కోలుకుంది నేనే. కిందామీదా పడి ఎలాగోలా ఓపిక తెచ్చుకొని ఇంట్లోవారికందరికీ నేనే సపర్యలు చేసి వారిచేత సెబ్బాస్ అనిపించుకున్నా :(  అలా నేను బాగా సిక్కయ్యానన్న ఆనందం ఆవిరి అయ్యింది. ఆ తరువాత కొన్ని నెలల క్రితం ఓ చిన్న సర్జెరీ అయి కొద్దిరోజులు ఇంట్లోనే వున్నాను.
 
మళ్ళీ ఇన్నాళ్లకి కాస్తంత కాలం అనారోగ్యం కలిగింది. గతవారం ఒకరోజు రాత్రి కాలు నొప్పిగా అనిపించి ఆశ్చర్యం వేసింది. ఏం జరిగిందబ్బా అని బుర్ర గోక్కుని జ్ఞాపకాలు రివైండ్  చేసుకొని చూసుకుంటే ఓ రెండు రోజుల క్రితం నా కుడి పాదానికి బాత్రూం తలుపు తగిలి స్వల్పంగా నొప్పి అనిపించడం గుర్తుకువచ్చింది. హోం రెమెడీస్ నడిపిస్తూ స్వల్పంగా కుంటుకుంటూ ఆఫీసుకి రెండు రోజులు అలాగే వెళ్ళాను. మూడో రోజు రాత్రికి వాచిపోయింది! నన్ను నడవనియ్యలేదు. ఆఫీసు ఎగ్గొట్టి గాభరాగా డాక్టరు దగ్గరికి వెళ్ళాను. అతను మరింత గాభరాగా బొటనవేలి ఎముక ఫ్రాక్చర్ అయ్యిందేమో అన్నాడు. ఎక్స్-రేలకు వ్రాసాడు. మరీ బాత్ రూం తలుపు తగిలినంతనే పాదం ఫ్రాక్చర్ అవుతుందా అనుకున్నా.  పాదం వంగకుండా మెడికల్  ఫ్లాట్ బూట్ ఓ వారం వాడమన్నాడు! ఫ్రాక్చర్ అయితే నెలన్నర వాడాలి అన్నాడు. అదే అయితే కనుక క్రచెస్ కూడా వాడాల్సివుంటుంది అన్నాడు. అవన్నీ వేసుకొని ఆఫీసుకి వెళ్ళాల్సి వుంటుంది. ప్రస్థుతానికి ఓ వారం ఆఫీసుకి వెళ్ళకుండా పాదానికి విశ్రాంతి ఇవ్వమన్నాడు. 
 
అదేరోజు ఎక్స్-రే ఫలితాలు వచ్చాయి. ఫ్రాక్చర్ ఏమీ లేదు. సంతోషం. మా డాక్టర్ పెయిన్ కిల్లర్స్ వాడొద్దని చెప్పి నొప్పి తగ్గటానికి కొన్ని హెర్బల్ మందులు సూచించాడు. పాదానికి పసుపు పట్టించమన్నాడు. పసుపు రోజూ ఓ మూడు చెంచాలు పాలల్లో వేసుకొని తాగమన్నాడు. మా వైద్యుడు డాక్టర్ ఆఫ్ ఆస్టియోపతీ లెండి.  వాటికి తోడుగా హీట్ ప్యాడ్, కూల్ ప్యాడ్ లు వాడుతున్నాను. నొప్పి, వాపు రోజురోజుకీ స్వల్పంగా తగ్గుతున్నాయి. వచ్చేవారం కల్లా పూర్తిగా నయం అవచ్చు. ఈ వారం అంతా మెడికల్ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ క్రింద ఇంట్లోనే వుంటున్నా. అదండీ సంగతి.

11 comments:

  1. '
    శరత్తుడు' 'సిక్కినా', చిక్కినా టపా యే !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  2. నా బాధ ప్రపంచానికే బాధ :)

    ReplyDelete
  3. akkada xray ne tiyyamanaru, India lo aythe epatiki meeku oka vandha testlu raasi , em kaledahu ani cheppunde vaallu :P

    ReplyDelete
  4. @ నికిత
    హహ. ఇండియాలో వున్నప్పుడు మా టవునులో ఒక డాట్రు బాబు వుండేవాడు. అతని హస్తవాసి మంచిదని పేరు. విషయం ఏంటంటే ఒక సమస్యకి మూడు రకాల మందులు వ్రాసేవాడు. దేనితోనన్నా ఒకదానితో జబ్బు నయమయిపోయేది. తన మందుల షాపుకి కూడా అందువల్ల బోలెడన్ని లాభాలు వచ్చేవి. పేరుకి పేరు - డబ్బుకి డబ్బు.

    ReplyDelete
  5. Oh.. Get well soon.. but don't take two or three spoons full of Turmic... because it will produce lot of heat and overwhelm the liver and gall bladder...

    ReplyDelete
  6. sarat garu, plz don't wish for ill health as a joke too, just as it seems nice for a while. we get what we wish for. ( our subconscious gets what we wish for, always ). There's nothing more sweeter in life than health.

    yes, ur true fellow agnatha, lot of turmeric is not great for health. as he's American, he may not know the details of using turmeric. one fourth of a small tea spoon is the max one may use. any herb in large amounts is harmful. athi sarwatra warjayet.

    ReplyDelete
  7. See the below Link.. The Gentleman says how to use turmeric,,

    At the beginning ,see how american doctors are making mistakes in advising lot of Turmeric,,,

    and also at 3.00 min , see this

    https://www.youtube.com/watch?v=cafoiHQiwPw..

    ReplyDelete
  8. @ అజ్ఞాత9 ఎప్రిల్ 2014 12:57 AM
    :)

    @ అజ్ఞాత9 ఎప్రిల్ 2014 2:19 AM
    నొప్పి వాపు చాలా వరకు తగ్గాయి కానీ గ్రవుండ్ జీరో ఇంకా వేడి గానే వుంది :) ఈ వారం ఆఫీసుకి మెడికల్ ఫ్లాట్ బూట్ వేసుకెళ్ళాలేమో! లేకపోతే నొప్పి మళ్ళీ బాగా తిరగబెట్టే అవకాశం వుంది.

    మీ అందరి సలహా మేరకు పసుపు తగ్గించాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  9. @ అజ్ఞాత10 ఎప్రిల్ 2014 1:18 PM
    మీరు చెప్పింది నిజమే. అనారోగ్యం గురించి పరిహాసం ఆడటం అంత మంచి పద్ధతి కాకపోవచ్చు. తధాస్తు దేవతలుంతారని నేను నమ్మకపోయినా కొంపదీసి వుంటే పరిహాసాలు నిజమయ్యే అవకాశం వుంది :)

    మా డాక్టర్ అమెరికన్ కానీ ఇండియన్ ఆరిజిన్. తండ్రి భారతీయుడు, తల్లి పాకిస్తానీ. మన భారతీయ వైద్య విధానాల గురించి అవగాహన వుంది కానీ ఎందుకయినా మంచిదని మీరందరూ చెప్పారు కాబట్టి పసుపు తగ్గించాను. నాకు బ్లాగుల్లో కొంతమంది అయినా శ్రేయోభిలాషులు వుండటం సంతోషం కలిగిస్తోంది.

    వారం పైగా విశ్రాంతి తీసుకుంటూ ఇంట్లోనే గడపడం మొదట్లో బాగున్నా తరువాత కాస్త చిరాగ్గా వుంది. ఈ వారం నుండి ఆఫీసుకి వెళ్ళాలి.

    ReplyDelete
  10. @ అజ్ఞాత11 ఎప్రిల్ 2014 2:32 AM
    వీడియో చూసాను. ధన్యవాదాలు. మీ అందరి సూచన మేరకు పసుపు వాడకం తగ్గించాను.

    ReplyDelete