సాండ్రా బుల్లాక్ ప్రధాన పాత్రలో నటించిన గ్రావిటీ సినిమా మీరు చూసారా? మీ అభిప్రాయం ఏంటి? ఓ ఆ సినిమా గురించి సమీక్షలూ, అభిప్రాయాలూ చాలా గొప్పగా వుండటంతో మనసాగక కొన్ని వారాల క్రితం సకుటుంబసపరివార సమేతంగా అనగా మా ఆవిడ్ని, పాపని వెంటేసుకొని ఆ సినిమాకి వెళ్ళాను. స్పేస్ ఫిక్షన్ అయినా స్పేస్ నాన్ ఫిక్షన్ అయినా నాకు బాగా ఇష్టం. కొంతమంది అయితే '2001: ఎ స్పేస్ ఒడెస్సీ' అంత గొప్ప చిత్రమని పోల్చారు. ఇంకా ఆగుతానా? బాహ్గానే వుంది కానీ అనుకున్నంత గొప్పగా ఆ సినిమా మాకు అనిపించలే. సైన్స్ ఫిక్షనుకి తక్కువ, వీడియో గేముకి ఎక్కువగా అనిపించాయి స్పెషల్ ఎఫెక్ట్సూ. ఎందుకబ్బా అని రంధ్రాన్వేషణ చేస్తే అర్ధమయ్యింది. ఏంటో ఊహించండి చూద్దాం.
అంత గొప్ప చిత్రాన్ని డబ్బులు తక్కువ అవుతాయని డబ్బా టాకీసులో చూస్తే అలాగే వుంటుంది. ఆ సినిమాను 3-డి లో వీలయితే IMAX తో కలిపి చూడాలంట. ఆత్రగాడికి బుద్ధి మట్టు కదా. నేనేమో మా ఇంటికి దగ్గర్లో వున్న ఓ డొక్కు మల్టిప్లెక్స్ కి వెళ్లాను. ఆ తెర హోం థియేటరు కంటే కొద్దిగా పెద్దగా వుంటుందేమో. ఇంకా ఆ తెర మీద సాండ్రా బుల్లాక్ గ్రావిటీకి ఏం పడిపోతాం? అన్నట్లు అంత వయస్సులో కూడా ఆమె యొక్క ఓ సన్నివేశం బలే వుంటుంది.
మీరు ఎక్కడ చూసారు? మీకెలా అనిపించింది. కొంత మంది విమర్శకులు, ప్రేక్షకులూ ప్రవచిస్తున్నట్లుగా అంత గొప్ప సైన్స్ ఫిక్షన్ చిత్రరాజమా అది?
మీరు ఎక్కడ చూసారు? మీకెలా అనిపించింది. కొంత మంది విమర్శకులు, ప్రేక్షకులూ ప్రవచిస్తున్నట్లుగా అంత గొప్ప సైన్స్ ఫిక్షన్ చిత్రరాజమా అది?
డబ్బా దియేటర్ లలో చూస్తే ఎలాంటి సినిమా అయినా తుస్ మంటుంది....పోల్టర్ గైస్ట్ Poltergeist సినిమా కి అలానే దెబ్బయిపోయా :)
ReplyDelete