ఇది మరో కొవ్వు టపా లెండి. నా బాడీ ఫ్యాట్ 17 కి లోగా దించాలని ప్రయత్నిస్తూవున్నా కదా. ఇంతవరకూ అందులో విజయం సాధించలేదు. వారానికీ, వారానికీ మధ్యలో వారాంతం అవుతూవుంటే అదెలా సాధ్యం అవుద్దీ? కష్టపడి 17.2% కి ఓ సారి లాక్కొచ్చా కానీ 17 కి లోగా దిగ్గొట్టలేకపోయాను. హ్మ్. కానీ కారణం మాత్రం అర్ధం అయ్యింది లెండి.
ఏం చెయ్యమంటారు మహా ప్రభో. వీక్ డేస్ లో ఎంచక్కా వ్యాయామం చేస్తూ చక్కని ఆహారం భుజిస్తూ కొవ్వు తగ్గిస్తున్నవాడినల్లా వారాంతం వచ్చేసరికి రివర్స్ గేరులో పడిపోతున్నా. వీకెండ్ అన్నాక చుట్టాల ఇంటికో పక్కాల ఇంటికో వెళతాం కదా. అక్కడ మొహమాటానికయినా మరీ ఎక్కువ కాకపోయినా ఓ బుల్లి బీర్ సీసా ఒక్కటి అయినా పుచ్చుకొని సేద తీరాలి కదా. అలాగే వేరే వారింటికి వెళ్ళినప్పుడు పెట్టింది తినాలి కానీ అక్కడ జంక్ ఫుడ్డు నాకు పెట్టొదు అని మారాం చెయ్యలేము కదా. మటన్ అంటూ వడ్డిస్తున్నప్పుడు ముచ్చటగా మూడు ముక్కలయినా వేసుకోవాలి కదా. తీపి పదార్ధాలూ, ద్రవాలూ పనిలో పనిగా కడుపులో పడతాయి కదా, అలా అలా వంట్లో నిక్షేపంగా చేరిపోతున్న కొవ్వుని కాదనలేము కదా. అలా అలా వారాంతం మొదట్లో దాదాపుగా 17 శాతానికి కొవ్వు దించినా కూడా ఇలాంటి వారాంతం మినహాయింపులతో దాదాపుగా 20 శాతానికి వారం మొదట్లో పెరుగుతోంది. అలా కొన్ని వారాలుగా 17 నుండి 20 శాతం మధ్య నా బాడీ ఫ్యాట్ వుంటూ వస్తోంది.
అంచేతా ఇలా వీకెండ్సును నమ్ముకుంటే నా కొవ్వు లక్ష్యాలని ఛేదించలేనని అర్ధం అయిపోయింది. ఇంకా నయ్యం ఇదివరలో ఇంకా ఎక్కువ బరువూ, కొవ్వూ పెరిగేవాడిని. ఏం తిన్నా, తాగినా కాస్త మితంగానే వుంటున్నా కాబట్టి కాస్తంత బరువు, కాస్తంత కొవ్వు మాత్రమే పెంచుతున్నా - మళ్ళీ తగ్గిస్తున్నా. అయితే ఇంకా జాగ్రత్త పడాలని, వారం రోజుల్లో తింటున్న తిండినే వారాంతాలూ వీలయినంతగా తీసుకోవాలని తీర్మానించేసా. పండగలకు, పబ్బాలకు, విజిటింగ్ ప్లేసెస్ కు వెళ్ళినా కూడా నా ఆహారం నేను తీసుకెళ్ళాలని, అదే తినాలని నిశ్చయించేసా. మొదట్లో జనాలు నన్ను వింతగా చూసినా, నిరుత్సాహ పరచినా, వేళాకోలం చేసినా సరే నా పట్టుదలను, అభివృద్దిని గమనించాక వారే ప్రశంసిస్తారు లెండి. ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా నా ఫ్యామిలీ ప్యాక్ తగ్గితే సిక్స్ ప్యాక్ సాధించినంత సంబరం నాకు. ప్రయత్నిద్దాం మరి. రోజూ నా బాడీ ఫ్యాట్ పరిశీలన ద్వారా లోపం ఎక్కడుందో తెలిసిపోయింది. అంచేతా సగం విజయం సాధించినట్లే. ఇహ ఆ లోపాన్ని సవరించుకొని మిగతా విజయాన్ని సాధించడమే తరువాయి.
ఊరుకోండి సర్, మీరు మరీను, జస్ట్ త్రీ పెర్సెంట్ కి ఏమైపోతుంది.
ReplyDeleteకడుపు నిండా తిని, కంటి నిండా పడుకోండి.
garden photos evandi?
ReplyDeletehow do you measure body fat? If you already wrote a post about, pl point to the link. thanks
ReplyDeletemi pratnam e addankulu lekundaa saagi povaalani....
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteకంటి నిండా పడుకోవడానికి అభ్యంతరం లేదు గానీ కడుపు నిండా తిని బ్రతికే రోజులు కావు ఇవి. ఫిట్టుగా వుండకపోతే తొందరగా ఫట్టయిపోతాం.
@ అజ్ఞాత
ఫోటోల సెక్షన్ అంతా మా అవిడదే. నాకు అంత ఆసక్తి వుండదు. ఈమధ్య మా గార్డెన్ ఫోటోల కంటే పొరుగు గార్డెన్ల ఫోటోలే మా వాళ్ళు ఎక్కువగా తీసారు. మేం మొదటిసారి కాబట్టి పలు పొరపాట్లు చేసాం. అందువల్ల అంత బాగా రాలేదు. పక్కవారందరూ పద్ధతిగా, కళాత్మకంగా పెంచారు. అందువల్ల వారి పంట విరగ కాచి చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తున్నాయి. వీలు చూసుకొని ఆ ఫోటోలయినా పెడతాను. అలాగే మావి కూడానూ.
@ నారాయణ స్వామి
ఈ టపా చూడండి:
http://sarath-kaalam.blogspot.com/2012/03/blog-post_5549.html
@ చెప్పాలంటే
ధన్యవాదాలండి.
I thought you will find it interesting.
ReplyDeletehttp://eenadu.net/Specialpages/sukhibhava/Sukhibavainner.aspx?qry=sp-health1
@ చక్రపాణి
ReplyDeleteట్రైగ్లిసరాయిడ్స్ మీద చక్కటి వ్యాసాన్ని సూచించారు. నాకు ఆ సమస్య కొన్నేళ్ళుగా వుంది. అందుకే నా శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాను.
Sarat garu, Absolutely love your sense of humor in every post n comments.Also, your blog is knowledgeable n interesting these days. Wish you post more often. :-)
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteపలు కారణాల వల్ల అప్పుడప్పుడూ వ్రాయడానికి బద్దకించి విశ్రాంతి తీసుకుంటుంటాను. మంచి మంచి టాపిక్సుతో ఇహపై తరచుగా నేను వ్రాస్తుండవచ్చు. మీ ప్రశంస నన్ను ఉత్సాహపరుస్తోంది మరి.