ఓషో ...వైపుగా నా అడుగులు

ఈమధ్య నాలో కొంత ఏకాంతం వచ్చేసి నన్ను నేను పరిశీలించుకోవడానికి అవకాశం కలిగింది. నాలో స్పిరిచువలిటీ (దైవ సంబంధమయినది కాదు) లోపించిందనీ, ఆ శూన్యతను పూరించుకోవాల్సి వుందనీ అర్ధమయ్యింది. అందువల్ల అలా అన్వేషణ మొదలెట్టి నాకు దగ్గరగా వుండే, ఇష్టమయ్యే బుద్ధ, జెన్, జిడ్డు, ఓషో బోధనలతో పాటుగా సద్గురు జగ్గి వాసుదేవ్ బోధనలు కూడా కొన్ని పరిశీలించాను. జెన్ యొక్క జాజెన్ లాంటి ధ్యానాలకు కూడా వెళ్ళాను. మొత్తమ్మీద ప్రస్థుతానికయితే ఓషో దగ్గర ఆగి వారి రచనలు చదువుతూవస్తున్నాను. అందుకే...ఆసక్తి అంతా అటువైపు వుంది కనుకనే ఈమధ్య బ్లాగులు వ్రాయడం లేదు. నా తీరిక సమయమంతా నాలో ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ఉపయోగిస్తున్నాను.

నేను పిజి చేస్తున్నప్పుడే ఓషో పూణెలోని ఓషో ఆశ్రమాన్ని సందర్శించాను కానీ అందులో భోగం కంటే ధ్యానమే ఎక్కువుందని చిరాకు అనిపించి అప్పట్లో ఓషోని తిరస్కరించాను కాని ఇప్పుడు ఆ తంత్రాల పట్ల ఆసక్తి మళ్ళింది. అలా అని నేను ఎందులోనూ చేరకపోవచ్చు, దేనినీ విడవకపోవచ్చు కానీ ఏ మార్గాన్నయినా సందర్శిస్తుండవచ్చు. ఇప్పటికిది నచ్చుతుంది. నడిపించేద్దాం. రేపు ఎటు దారితీస్తానో ఎవరికి తెలుసు. నచ్చినంత సేపే ఆగిపోవడం, నచ్చనప్పుడు మరో దారి చూసుకోవడం. మనకు ముఖ్యమయ్యింది (స్పిరిచువల్) మకరందం కానీ దాని వైపు వెళ్ళే దారి కాదు కదా.

నా ప్రస్థుత  ఆసక్తికి తగ్గట్టుగానే మా ఊరిలోనే ఒక ఓషో ప్రాంతీయ కార్యక్రమాల నిర్వాహకులు వున్నారు. వారు తెలుగు వారే అవడంతో ఇంకా సౌకర్యంగా వుంది. మొన్ననే వారిని కలుసుకొని  కొన్ని సందేహాలు తీర్చుకున్నాను. మా ఇళ్ళు కాస్త దగ్గరే కాబట్టి నేను వారితో కలిసి ఓషో కార్యక్రమాల్లొ పాల్గొనే అవకాశాలు బాగానే వున్నాయి. ఓ రెండు వారాల తరువాత ఓషో ధ్యానం వగైరాలతో ఓ అర రోజు కార్యక్రమాలున్నాయి.

20 comments:

  1. మీనుండి మరిన్ని వివరాలు రాగలవన్న ఆసక్తితో ఎదురు చూస్తుంటా...

    ReplyDelete
  2. ఏంటి మరి ఈ మద్యన మీరు పూర్తిగా నల్లపూస అయిపోయారు.

    ReplyDelete
  3. శరత్ గారు !! నమస్తే అండీ!!

    మొన్న ఈ మధ్యన మీ blog కి subscribe అయ్యాను,

    అప్పుడే ఇలా osho ని ఇష్ట పడుతున్నట్లుగా గుర్తించాను,

    Very Nice , చాల సంతోషం.

    "నాకు జన్మ రాహిత్యమే కావలి " అనుకునే వాళ్ళకే వేదాంతం ఆసాంతం ఉపయోగ పడుతుంది.

    అలా కాక లోక పరమైన ఆసక్తులతో ఉంటూ, మరింత స్పష్టంగా జీవితాన్ని ఒక నూతన దివ్య చేతన దృక్కోణంలో

    చూసేందుకు జిడ్డు కృష్ణ మూర్తి గారి పరిశీలనాత్మక వైఖరి,

    ఓషో మహాశయుని ఆలోచనా దృక్పథం మనకు సరిగ్గా సరిపోతాయి.

    అందుకనే అప్పుడప్పుడు వీరి రచనలను అనువదించే వారిలో,

    పాత చింతకాయలను పచ్చడి చేయటం కుడా చూస్తూ ఉంటాం.

    ఒక విధంగా చూస్తే అదీను సబబే. కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి.

    ఇప్పటి దాక అపరిపక్వమైన, అసంపూర్ణమైన భావజాలాలతో నిండిన మనసుకి

    ఒక broad view ని అందజేయటం, తద్వారా పరితత్వం నుంచి అపరిమితం వైపుకు నడిచే ధోరణి అలవడుతుంది.

    ఇప్పుడే లేచి అలా ఒక cup bed coffee ని ఆస్వాదిన్చగానే, నా inbox లో మొదటి mail osho చిత్రం తో తళ తళా మెరిసింది.

    వెంటనే జాగు చేయక ఆ pic save చేసుకున్నాను.

    అయితే నాదొక మనవి. ఆ ఒకటిలో రెండు ఉన్నాయి.
    1 వ్యాఖ్యానం పట్టి పోకుండా మీదైన స్పృహతో చూస్తూ, actual గా osho or JK ఏమి చెప్పదలుచుకున్నారో అది వారి హృదయం గ్రహించండి.
    2 blogging ద్వారా మీ స్థితి ని మా అందరికి పంచండి.

    ఈ విజ్ఞప్తులు వినమ్రతతో కుదినవే సుమా!

    భావం ఆలోచన అయ్యి, ఆ ఆలోచన మాట గా అయ్యి, ఆ మాట వాకు గానో, చేత గానో మారేప్పటికి
    దాని యదార్ధ స్థితిని కోల్పోయి కేవలం చొప్ప మటుకే నిలుస్తుంది.

    ఎవరో చెప్పినట్లు, నా comment పైకి కనిపించే మంచుకొండ శిఖరమే,
    అంతరంలో అంతకు పదింతల ప్రేరణ ఉన్నది. గుర్తించగలరు.

    osho వంటి వారితో సాంగత్యం చేసిన వారిని కలిసినప్పుడు నాకు వారి హృదయం పట్టే అవకాసం లభించింది.

    నేను చదివిన మొదటి పుస్తకం "జీవితాన్ని పండుగ చేసుకో" ఆ టైటిలే లోనే అంతా ఉన్నది.

    వీలు చిక్కితే అదీ చూడగలరని మనవి.

    మరో శరత్కాలం కోసం ...
    శివ
    http://endukoemo.blogspot.com

    ReplyDelete
  4. వీలుంటే ఓషో జీవిత రహస్యాలు చదవండి

    ReplyDelete
  5. Anny...nadi oka salaha.....edi chesina koncham limit lo cheyagalavu....dont do toooooo much wheather its osho or GYM.
    everything is gud in limit.

    ReplyDelete
  6. @ కెక్యూబ్
    అలాగేనండి. మీ నాన్న గారి మరణ వార్త చూసాను. మీకు నా సంతాపం తెలియజేసుకుంటున్నాను.

    @ శ్రీను
    ఆలోచనల్లో పడ్డాను. అందుకే...

    @ శివ
    మీ వ్యాఖ్యా మరియు మీ బ్లాగ్ పోస్టూ నన్ను బాగా ఆహ్లాద పరిచాయి. వివరంగా, ప్రభావవంతంగా వ్రాసారు. సంతోషంగా వుంది. బ్లాగులోకంలో ఓషో అభిమానులయిన మీతొ స్నేహం నాలో మరింత వివేచనకి దారితీస్తుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ప్రత్యేకంగా ఓషో పుస్తకాలు చదవకపోయినా బిట్స్ బిట్స్ గా వెబ్ సైట్లలోనుండి, ఆన్లైన్ లైబ్రరీ నుండి వెతుక్కొని చదివేస్తున్నాను. మీరు సూచించిన పుస్తకాన్ని దృష్టిలో వుంచుకుంటాను. ఆచరణాత్మకంగా ఈ మార్గం నాలో తెచ్చిన పరిణతీ, పరివర్తనా నా బ్లాగులో అందిస్తూనే వుంటాను. అలాగే నచ్చనివి వున్నా తెలియజేస్తాను.

    ReplyDelete
  7. అయ్యా శరత్ గారు,

    ఇదేమన్నా స్మశాన వైరాగ్యమా ? రూటు మార్చారు ?

    ReplyDelete
  8. జిలేబిగారు, కామిగాక మోక్షగామి గాడు అన్నారు. కామి అయ్యాడంటే మోక్షకామిత్వం ఎంతో దూరంలో లేదన్నమాటే!
    ఎందుకోఏమోగారు, పాత చింతకాయల్ని తెచ్చి పచ్చడి చెయ్యరు. కొత్త చింతకాయల్నే పచ్చడి చేసి నిలవ ఉంచితే అది పాచ్చింతకాయపచ్చడవుతుంది.
    Sarat - good show.

    ReplyDelete
  9. @ మినెర్వా
    థాంక్ యూ

    @ మురళి
    అలాగేనండి. ధన్యవాదాలు.

    @ అజ్ఞాత సోదరా
    అందరిలాగే నేనూ జిమ్ము చేసాకానీ నా స్థితికి, స్థాయికి అది కాస్త ఎక్కువయ్యింది. ఎక్కువో, తక్కువో ముందు మొదలెడితే అనుభవాలని బట్టి బ్యాలన్స్ చేసేసుకోవచ్చు.

    ReplyDelete
  10. @ జిలేబీ
    అవునండీ. శ్మశానం మీద వైరాగ్యం ;) రూటు మార్చా అంతే కానీ రివర్స్ రూట్లోకి నేను రావడం లేదు కదా. ఒక రూటు బోర్ కొడితే మరొక రూట్లోకి వెళ్లిపోవాలంతే. నాకున్న భావాలకే స్పిరిచువాలిటీ అద్దుతున్నాను. ఓషో అన్నీ ఆనందించమంటాడు కానీ వదిలేసుకొమ్మనడు. పరిపూర్ణ ఆనందం కోసమే ఆ మార్గం ఆలోచిస్తున్నాను.

    @ కొత్తపాళీ
    ధన్యవాదాలు మాస్టారూ.

    ReplyDelete
  11. :)

    "మనసైన చోట మజలీ, కాదన్న చోట బదిలీ" !!

    అంటే అదే కదా మరి ....

    ?!

    ReplyDelete
  12. నేనైతే ఎవరినీ ఫాలో అవను. వాళ్ళేం చెప్పారో నాకు తెలియదు..., నాకు అనవసరం. అయినా నేను కూడా చిన్న వయసు లోనే ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదిద్దామని ప్రయత్నించాలెండి. చివరకు ఆ ప్రయత్నాలు మాని, మనసు ను హ్యాపీ గా ఉంచుకోవడం మొదలెట్టా. కష్టాలు, బాధలూ వస్తే ఈ జీవితం ఓ మిధ్య అనుకోవడమే...

    ReplyDelete
  13. @ ఎందుకో ఏమో శివ
    చక్కగా, పసందుగా చెప్పారు.

    మీ వివరాలు తెలుసుకోవాలని ఆసక్తిగా వుంది కానీ మీ ప్రొఫయిల్ ఎనబుల్ చేసి లేదు. ఓషో మార్గాన్ని నిత్యజీవితంలో ఎలా పాటిస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలమూ వుంది.

    @ మిర్చి
    నాకయితే నా కంటే బాగా తెలిసిన వ్యక్తి దగ్గరినుండి తెలుసుకోవడంలో తప్పనిపించదు. అన్నీ మనకే తెలుసు అనుకుంటే అక్కడే ఆగిపోతాం.

    ReplyDelete
  14. hello సర్, నమస్తే, నా పేరు శివ అండీ, ఎందుకో?ఏమో? ( किम कारणं कुत आयाता ?) వంటి ప్రశ్నలకు modernization ఇంకా నిత్య జీవితం లో osho philosophy సంగతికి వస్తే
    Coffee తాగటం నుండే ఆస్వాదన ప్రక్రియ సాగుతుంది, మీరు పెట్టిన వారి photo quoted ఇమేజ్ దాని meaning యధాతధం గా తీసుకో గలిగితే చాలు అని నా అభిప్రాయం.
    సాధన ద్వారానే (పాత చింతకాయ భావన) సాధ్యం అనుకునే state ఇప్పుడు లేదు, అంత సిద్ధ దశలోనే ఉన్నది. అయితే దాన్ని గురిస్తూ వర్తిన్చాల్సి ఉంటుంది.

    ReplyDelete
  15. 2.
    మీకు గతం లో చెప్పిన "జీవితాన్ని పండుగ చేసుకో" లో ఇలా ఉంటుంది, " దేవుడు మిమ్మల్ని సృష్టించాదంటేనే దేవుడు already మిమ్మల్ని accept చేసేసాడు అని " నాకు బాగా నచ్చిన నన్ను బాగా ప్రభావితం చేసిన వాక్యం అది

    ReplyDelete
  16. మీకో చిన్న incident చెప్పాలని అనిపిస్తున్నదండి...!
    "ఒక మారు మౌద్ఘల్యుడనే శిష్యుడు బుద్ధుడి ని ఏకాంతంగా అడవిలో ఉన్నప్పుడు ఇలా అడుగుతాడు " స్వామీ!మీరు మాకు ప్రతి దినము బలద చేస్తున్నారు కదా, మొత్తం మీకు తెల్సినదంతా చెప్తున్నర? వెంటనే నెమ్మదిగా బుద్ధుడు ఆడవి (మొత్తం అంత ఎండిపోయిన ఆకులతో నిండి పోయి ఉన్నది) లో ఒక చేతితో గుప్పెడు ఆకులు తీసి, చూసావా ఈ చుట్టూరా ఇన్ని ఆకులు ఉంటె నేను మీకు అందిస్తున్నది ఈ గుప్పెడు మాత్రమె అంటాడు. " ఈ కథను ఉదాహరించి సాక్షాత్ భగవాన్ బుద్ధుడు అల చెప్పాడు, కాని నేను మీకు ఏ ఒక్క అకునీ వదలకుండా ఇస్తున్నాను జుర్రుకోంది అని...
    అదీ Bhagavan Osho standards

    ReplyDelete
  17. sarath garu, meru art of living kooda try chesara?

    ReplyDelete
  18. first time i have seen your blog spot.i like osho .i am inspired by osho books.

    read ASHTAVAKRASAMHITA AND PARIPOORNANDA SARASWATI UPADESASARAM (RAMANAMAHARSHI) IN YOU TUBE.

    all the best in your spiritual life.

    ReplyDelete
  19. ఓషో మిమ్మల్ని మీరుగా ఉంచుతాడు. Best of luck..

    ReplyDelete