ఇంటి నుండి పని!

కొంతమంది ప్రతి రోజూ వర్క్ ఫ్రం హోం చేస్తుంటారు. వారిని చూస్తే నాకు బోలెడు జాలేస్తుంది. హాయిగా ఆఫీసుకి వెళ్ళి కాలక్షేపం చెయ్యకుండా అస్తమానం ఇంట్లో ఎలా వుండబుద్ధవుతుందా అని అనుమానం వేస్తుంటుంది. కొత్తగా పెళ్ళయిన వారయితే భార్యాభర్తలు ఒకరిని విడిచి ఒకరు  కొంతకాలం వుండలేరు కాబట్టి అర్ధం చేసుకోవచ్చు. కానీ పెళ్ళయిన సీనీయర్లూ అలా చెయ్యడం అంటే నాకు నమ్మ బుద్ధెయ్యదు. ఇంటికీ, ఆఫీసుకీ తేడా లేకుండా అలా ఇంట్లో పడి ఎలా వుంటారబ్బా! ఆఫీసు పని కోసం ఇంట్లో బేసుమెంటులోనో, పై అంతస్థులోనో ప్రత్యేకమయిన గది ఏర్పాటు చేసుకున్నా కూడా  అహబ్బే నా వల్ల కాదు బాస్.

ఆఫీసుకి వెళితే అదో ఆనందం. కోలీగ్స్ కలుస్తారు, అవో ఇవో విశేషాలు మాట్లాడుకుంటాం. అలా లోకజ్ఞానం అబ్బుతుంది. అస్తమానం పెళ్ళాంతో హస్కు వేసుకుంటే ఏమొస్తుంది? మహా అయితే అత్తోరింటి వైపు రాజకీయాలు మహా బాగా అర్ధమవుతాయేమో. ఇంట్లోంచి పని చేస్తున్నా కూడా కోలీగ్స్ తో ఫోనులోనో, చాటింగులోనో మాట్లాడుతూనే వుంటంగా అని మీరనవచ్చు. అబ్బే, ఆఫీసు కిచెను దగ్గరో, కాఫీ మెషిన్ దగ్గరో బాసులతోనో, తోటి వర్కర్ బీలతోనో జరిగే ముచ్చట్లకి అవి సాటి అవుతాయటండీ.  ఆఫీసుకి వెళితే ఎంత రిలీఫుగా వుంటుంది. ఇంటి యొక్క, ఇంతి యొక్క ఈతి బాధలు హాయిగా మరచిపోవచ్చు. ఇల్లు కన్నా ఆఫీసు పదిలం అనుకోవచ్చు. కాదూ? 

మీ సంగతేమో గానీ, నా సంగతి ఓ సారి సీన్ వేసుకుని చూసుకుందాం. నేనే గనుక అస్తమానం ఇంటి నుండి పని చేసినట్లయితే ఇలా వుంటుంది.

ఏం చేస్తున్నారు?
పని చేస్తున్నా.
చాల్లెండి. సంబడం. ఇంట్లో పాలు అయిపోయాయి. డొమినిక్సుకు వెళ్ళి కాస్త తెచ్చి పెడుదురూ.
పనే.
అబ్బ జోకులు.
?!
(ఇంట్లో అంతటి గౌరవ వాచకాలు ఏమీ వుండవు లెండి కానీ తేడా తెలియడం కోసం అలా పెట్టా ) 

అదే ఆఫీసులో అయితే నన్ను అడిగే వాడు వుండడు. పని చేస్తున్నా అంటే గౌరవిస్తారు, డిస్ట్రబ్ చెయ్యకుండా దూరం జరుగుతారు కానీ ఇలా నవ్వి పడెయ్యరు.

పిల్లలు పెందరాళే ఇంటికి వస్తారు కదా.

డాడీ, డాడీ.
ఏమ్మా.
అక్క గిచ్చింది.
అమ్మతో చెప్పు.
అమ్మ టివి సీరియల్లుతో బాగా బ్యుజీట. నీకే చెప్పమంది.
పనిలో వున్నా కదా.
అక్క గిచ్చింది.
పనిలో...
అక్క....
ప...
అ...

మీ సలహా నాకు తెలుసు. పని చేసేటప్పుడు గది తలుపులు వేసుకొమ్మంటారు కదూ. అలా అయితే తలుపులు బాదుతారే. అయినా తియ్యకపోతే సెల్లుకి ఫోను చేస్తారే.    ఆఫీసులో అయితే నా గది తలుపులేసుకొని పని చేసుకుంటున్నా ఎవరూ అంతరాయం కలిగించరు. ఎప్పుడో ఒకరోజు అంటే ఏమో గానీ అస్తమానం ఇంటి నుండి పని అంటే నా వల్ల కాదండి బాబూ. కాదు.

వర్కింగ్ ఫ్రం హోం గురించి టొరొంటో స్టార్ ఆర్టికల్:
http://www.thestar.com/business/article/1057487--are-you-reading-this-in-your-pyjamas?bn=1

9 comments:

  1. This article reflects my exact feelings about work from home.

    ReplyDelete
  2. హీ హీ హీ. మా ఆయ్న ఇంట్లో (whenever he works from home esp while Telangana Bandh is On) ఉన్నా నాకు చిరాకే. పిల్ల వెళ్ళి నాన్న చుట్టూ తిరుగుతుంది. మనం అస్తమానం తెచ్చుకోవాలి. గొడవ చెయ్యకూడదు. No Rest... No privacy.. అబ్బ చాల చికాకు. ఫ్రీ గా వుండదు. తను ఆఫీసు కెళ్తేనే హాయి.

    ReplyDelete
  3. @ అజ్ఞాత
    :)
    @ సుజాత
    ఇప్పటిదాకా మాకే ఇబ్బందులు వుంటాయనుకున్నా. ఇంట్లో వుంటే ఇతరులకూ ఇబ్బందే అన్నమాట :)
    @ రాజేశ్
    :)
    @ గాయత్రి
    :)

    ReplyDelete
  4. Sharat, I worked in the airport for more than two decades and now I work from home. I find the later so far better since I keep my own hours and have no bosses who control over me as long as I meet the deadlines. Besides I can look after the home too.
    This is just my opinion. It might differ from yours.
    Krishna Veni

    ReplyDelete
  5. @ క్రిష్ణవేణి
    మీకు ఇంటి నుండి పని చక్కగా వర్కవుట్ అవుతోందన్నమాట.

    ReplyDelete
  6. శరత్
    సుజాత గారు చెప్పింది నిజ్జం గా నిజం

    @పనే.
    అబ్బ జోకులు.
    ?!

    హ హ పాపం మీరు :)

    ReplyDelete
  7. bagundi mavayya

    idi naku upayoga padutundi future lo, gurtunchukunta

    ReplyDelete