- రాముడు బుద్ధిమంతుడయిన బ్లాగరు లాగా వుండాలి.
- గాంధీ గారి మూడు కోతుల్లాగా వుండాలి. చెడు బ్లాగులు వినవద్దు - చెడు బ్లాగులు చూడవద్దు - చెడు టపాలు వ్రాయవద్దు.
- బ్లాగు జనులందరూ సోదరసోదరీమణులు.
మరీ అలా కాదులెండి కానీ ఎలా వుంటే బావుంటుందో చూద్దాం. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే కానీ ఎవరో ఎక్కడో వ్రాసిన శిలాశాసనాలు కానీ, మత ఫత్వాలు కానీ కావు కాబట్టి మీకు ఇష్టం వుంటే గైడ్‌లైన్స్ లాగా ఉపయోగించుకోండి. ఇక్కడ వ్రాస్తున్నది మంచి బ్లాగరంటే ఎలా వుండాలి అంతే కానీ మంచి బ్లాగు ఎలా వుండాలి అని కాదు. దాని గురించి మరో సారి చూద్దాం.
మనకు వయస్సులో ఎలాగయితే వివిధ దశలు ఎలా వుంటాయో బ్లాగు వయస్సులో కూడా అలాంటి దశలుంటాయనుకుంటాను. నేను బ్లాగులోకంలోకి ప్రవేశించినప్పుడు నాకు బ్లాగు గాడ్ ఫాదర్లు కానీ బ్లాగు అక్కలు కానీ ఎవరూ లేరు కాబట్టి తప్పటడుగులు వేస్తూ నా తిప్పలేవో నేను పడుతూ నిలదొక్కుకున్నాను. అలా బ్లాగు బాల్యం నుండి బ్లాగు కుర్రాడినయ్యాక ఆ పెంకితనం ఎక్కడికిపోతుందీ? సీనియర్ల పట్ల కాస్త దురుసుగా వుంటుండేవాడిని. వారూ అప్పట్లో తాము బ్లాగు పీఠాధ్యక్షులం అన్నట్లుగా కాస్త అతిశయంతో వుంటుండేవారనుకుంటా. కొంతమంది శ్రేయోభిలాషులు బ్లాగులమాటున నాకు మొట్టికాయలు వేసేవారు. అలా కొంత బుద్ధి తెచ్చుకున్నాను.
(బ్లాగు) కుర్రాళ్లం కదా ఆ సరదా తనం, చిలిపిదనం ఎక్కడికి పోతుందీ? ఇతరులతో కలిసి పలు బ్లాగుల్లో వ్యాఖ్యలు వేసీ, టపాలు వేసీ ఇతరులని ఆటపట్టించేవాడిని, సరదాగా ఏడిపించేవాడిని. అలా అప్పుడంతా కోలాహలంగా, హడావిడిగా వుండేది. అలా బ్లాగుల్లో కిష్కింధకాండ చేస్తూ సరదాగా రచ్చరచ్చ చేసేవారం. అలాంటి చిలిపిదనం ఒకోసారి వికటిస్తుండేది కూడనూ. ఉదాహరణకు ఒక లేడీ బ్లాగర్ వ్రాసిన టపా నచ్చక సరదాగా ఒక పోస్ట్ వేసాను. అది ఆమె సరదాగా తీసుకోకపోవడంతో ఆమె మనస్సు గాయపడింది. ఆమె మనస్సు మరీ అంత సున్నితం అని తెలియక టీజ్ చేసిన నేను ఆమెకి ఈమెయిల్లో సారీ చెప్పాను కానీ స్వీకరించలేదు. తాను థేంక్సులకు గానీ, సారీలకు కానీ అర్హురాలిని కాదని తెలియజేసింది! నాకేం అర్ధం కాక ఆ విషయం వదిలేసాను. ఏం వ్రాస్తే ఎవరు నొచ్చుకొని మళ్ళీ దానిమీద టపా వ్రాస్తారెమో అన్న భయంతో ఆమె ఇక బ్లాగు వ్రాయనని కూడా తెలియజేసింది. ఆ మాత్రం సరదాతనం లేనివారు, మరీ అంత సున్నితమనస్కులు ఈలోకంలో మనజాలరని ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాను. అప్పుడప్పుడు ఒకటి రెండు భక్తి టపాలు మాత్రం ఆ బ్లాగు నుండి వెలువడుతూ వుంటాయి.
ఆ తరువాతా మేము టీజింగులు అనుకుంటున్నవల్లా క్రమంగా బుల్లీయింగులు అవుతుండటంతో అలా పద్ధతి కాదని అలాంటి ధోరణి నుండి నెమ్మదిగా వెనక్కి వచ్చేసాను. మరి బ్లాగుల్లో వయస్సు పెరుగుతున్నా కొద్దీ పరిపక్వత కూడా పెరగాలి కదా. వయస్సు పెరిగినా పరిపక్వత పెరగని వారు అక్కడే వుండి ఇంకా ఆగడాలు చేస్తుంటారనుకోండి. అలా అలా బ్లాగుల్లో నేను నడివయస్సుకి వచ్చేసానేమో అనిపిస్తుంది. అలా నేను చేసిన ఎన్నో చిన్నా, పెద్దా తప్పులూ, ఇతరులు చేస్తున్న పొరపాట్లూ మీరు చెయ్యకుండా ఈ జాగ్రత్తలు పనికివస్తాయి. అలా అని చెప్పి అస్తమానం నేను వ్రాసినవి నేను పాటిస్తుంటాను అనుకోకండి - అప్పుడప్పుడు మినయాయింపులు వుంటుంటాయి కదా.
ఇవి ఒక క్రమ పద్ధతిలో ఇవ్వడం లేదు. గుర్తుకువచ్చినవి, తోచినవి వ్రాస్తున్నాను. మీకు తోచినవి మీరూ చెప్పండి.
- మీకు నచ్చిన టపాల్ని ప్రశంసిస్తూ వుండండి. కనీసం మీ రియాక్షన్ అయినా తెలియజేయండి.
- మీకు నచ్చని టపాలని విమర్శించండి అంతే కానీ వెటకారం చెయ్యకండి. కనీసం రియాక్షన్సులో మీకు నచ్చలేదన్న విషయం తెలియజేయండి.
- సరదాగా టీజింగ్ తగిన పరిమితుల్లో చేస్తే సరదాగానే వుంటుంది కానీ అది వేధింపులు అవకుండా చూడండి
- సీనీయర్లము అన్న అహంభావంతో బ్లాగు పిల్లకాయలతో చెడుగుడు ఆడుకోకండి
- కుర్రాళ్లం అన్నటువంటి కొంటెదనంతో పెద్దల పట్ల దురుసుగా వ్యాఖ్యానించకండి
- మాటిమాటికీ ప్రతి ఒక్కరికీ శుభాకాక్షలు తెలియజేస్తూ కాపీ & పేస్టు టపాలు, వ్యాఖ్యలు వ్రాయకండి. పండగలు, పబ్బాలు జరిగినప్పుడు అన్ని సంకలినులల్లో అంతా అవే చూసి చూసి చిరాకు వస్తుంటుంది. అవన్నీ వ్యక్తిగతంగా తెలియజేసుకుంటే బావుంటుంది. మీ బ్లాగు అగ్రిగేటర్లలో రాకపోతే మీరేం వ్రాసుకున్నా ఇతరులకు అంతగా ఇబ్బంది వుండదు.
- వ్యక్తిగతదాడులకు దిగకుండా బ్లాగర్ వ్రాసిన విషయం మీద విమర్శలుంటే హుందాగా తెలియజేయడం మంచింది.
- మీకు ఇతరులు వ్రాసిన టపాలు నిజ్జంగా నచ్చితేనే మెచ్చుకోండి. మొహమాటానికో, అలవాటుగానో, స్వామిభక్తి తోనో ఆహా ఓహో అనేసెయ్యకండి.
- బ్లాగుల్లో ఎన్నో వివాదాలు కూడా జరుగుతూ వుంటాయి. అలాంటప్పుడు కనీసం మానవత్వం మంటగలుస్తున్నప్పుడన్నా ముందుకురండి. బ్లాగు పౌరులుగా మీ కనీస కర్తవ్యం నిర్వర్తించండి. అన్నీ నాకెందుకులే అనుకుంటే అదే సమస్య మీకు వచ్చినప్పుడూ తోడుగా ఎవరూ రాకపోవచ్చు.
- బ్లాగుల్లో భావ స్వేఛ్ఛకి మద్దతు ఇవ్వండి. అలా అని చెప్పి బ్లాగుల్లో తీవ్రవాదమో లేక చేతబడుల్లాంటివో పెంచి పోషిస్తామంటే నిరసించండి.
- ఎవరికి వారు వారి అభిప్రాయాలను స్వేఛ్ఛగా తెలియజేసుకునే పరిస్థితికి దోహదపడండి.
- బ్లాగుల్లో వైవిధ్యం, కొత్తదనం వెల్లివిరియడాన్ని స్వాగతించండి, ప్రోత్సహించండి.
- బ్లాగులు ఎవరికి నచ్చినట్టుగా వారు వ్రాసుకోవడానికి కానీ మీకు నచ్చినట్లుగా ఇతరులు వ్రాయడానికి కాదని గుర్తించండి. మీకు నచ్చనివి ఇతరులు వ్రాస్తే మౌనంగా పక్కకి తొలగిపోవడమో లేదా హుందాగా మీ నిరసన తెలియజేయడమో చెయ్యవచ్చు. అంతేకానీ వేధింపులు, అవహేళనలు అవసరం లేదు అని గుర్తించండి.
ఇప్పటివరకూ గుర్తుకు వచ్చినవి ఇవీ. ఇంకా గుర్తుకువచ్చినవి దీని తరువాత జతచేస్తూనే వుంటాను. ఈలోగా మీరు అందిస్తూవుండండి.
I Liked it
ReplyDeleteబ్లాగుల్లో ఎన్నో వివాదాలు కూడా జరుగుతూ వుంటాయి. అలాంటప్పుడు కనీసం మానవత్వం మంటగలుస్తున్నప్పుడన్నా ముందుకురండి. బ్లాగు పౌరులుగా మీ కనీస కర్తవ్యం నిర్వర్తించండి. అన్నీ నాకెందుకులే అనుకుంటే అదే సమస్య మీకు వచ్చినప్పుడూ తోడుగా ఎవరూ రాకపోవచ్చు.
yes, I have seen some controversy on krishnasri's blog about his experience of picnics that he was organizing.. (controversy with rajesh.g) that went to the worst stage. i should have responded that time..
i have been only a silent reader and admirer of the blogs now, i'm learning to put comments on blogs.
good one!
ReplyDelete"బ్లాగులు ఎవరికి నచ్చినట్టుగా వారు వ్రాసుకోవడానికి కానీ మీకు నచ్చినట్లుగా ఇతరులు వ్రాయడానికి కాదని గుర్తించండి. మీకు నచ్చనివి వ్రాయకపోతే మౌనంగా పక్కకి తొలగిపోవడమో లేదా హుందాగా మీ నిరసన తెలియజేయడమో చెయ్యవచ్చు. అంతేకానీ వేధింపులు, అవహేళనలు అవసరం లేదు అని గుర్తించండి.",....good point!
మీరు చెప్పిన పాయింట్లు బాగున్నాయి.
ReplyDeleteసౌమ్య, అజ్ఞాత చెప్పినవే కాకుండా.. ఇది కూడా మంచి పాయింట్..
***********మీకు ఇతరులు వ్రాసిన టపాలు నిజ్జంగా నచ్చితేనే మెచ్చుకోండి. మొహమాటానికో, అలవాటుగానో, స్వామిభక్తి తోనో ఆహా ఓహో అనేసెయ్యకండి.
@ అజ్ఞాత, సౌమ్య, క్రిష్ణప్రియ
ReplyDeleteకొన్ని ఆంశాలు మీకు బాగా నచ్చినందుకు సంతోషంగా వుంది. అయితే మీరు కానీ, ఇతరులు కానీ ఏ ఒక్క కొత్త ఆంశాన్ని సూచించకపోవడం విస్మయాన్ని కలగజేస్తోంది.
ఈ రె౦టిలో పరస్పర వ్యతిరేకత తగ్గి౦చ గలరేమో చూడ౦డి
ReplyDelete- కనీసం రియాక్షన్సులో మీకు నచ్చలేదన్న విషయం తెలియజేయండి.
And
-బ్లాగులు ఎవరికి నచ్చినట్టుగా వారు వ్రాసుకోవడానికి కానీ మీకు నచ్చినట్లుగా ఇతరులు వ్రాయడానికి కాదని గుర్తించండి.
ఈ క్రి౦ది వాక్య౦ సరి చెయ్య౦డి :
మీకు నచ్చనివి వ్రాయకపోతే మౌనంగా పక్కకి తొలగిపోవడమో లేదా హుందాగా మీ నిరసన తెలియజేయడమో చెయ్యవచ్చు.
@ స్వామిభక్తి తోనో ఆహా ఓహో అనేసెయ్యకండి.
ఇలా ఉ౦టే స్వామి భక్తి కి అర్ధ౦ ఉ౦టు౦దా :)
@ మానవత్వం మంటగలుస్తున్నప్పుడన్నా ముందుకురండి.
అప్పుడు "మానవత్వ౦ పరిమళించే మ౦చిమనిషికి స్వాగత౦" అనరు :D .
"ము౦దు౦ది ముసళ్ల ప౦డుగ" అ౦టారు :-)
@పండగలు, పబ్బాలు జరిగినప్పుడు అన్ని సంకలినులల్లో అంతా అవే చూసి చూసి చిరాకు వస్తుంటుంది.
అసలు ప౦డుగ పబ్బాలప్పుడు బ్లాగులె౦దుకు చూస్తార౦డి ;-)
మీ పుట్టిన రోజు వివరాలు ఎక్కడో అక్కడ పబ్లిష్ చెయ్య౦డి మీక్కూడా పెడతారు టపాలు. అసలిప్పటివరకు మీ బ్లాగు గురి౦చి ప్రత్యేకవ్యాఖ్యానం ఎవ్వరు వ్రాయలేదు , పేపర్లోకుడా రాలేదు, ఒక సానుభూతి టపా వెయ్యాలి :-)
చివరిగా, బాగున్నాయి మీ సలహాలు. స౦కలినులు ఈ వివరాలతో ప్రత్యేక౦గా 'వ్యాఖ్యాతలకు గమనిక' గా పొ౦దుపరిస్తే ఉపయోగం గా ఉ౦టు౦ది.
శరత్ గారు,
ReplyDeleteమీరే చాలా పాయింట్లు రాసేశారు. మీరు ఇంకేమన్నా పాయింట్లు ఏడ్ చెయ్యమన్నప్పుడు మా ప్రొఫెసర్ గుర్తొచ్చారు. ఆయన అనేక జర్నల్స్ లోంచి బొచ్చెడన్ని రిఫరెన్సులు అలవోకగా కోట్ చేసేసి.. " if i miss any reference, you may add " అంటూ గడ్డాన్ని నిమురుకుంటూ శూన్యంలోకి చూస్తుండేవారు ( ఆయనది రుషుల గడ్డం లేండి. ఆయనతో పాటు ఆయన గడ్డం కూడా ఇండియాలో పాపులర్ ).
@ మౌళి
ReplyDelete"ఆలస్యం అమృతం విషం" అంటారు పెద్దలు. అదే పెద్దలు "నిదానమే ప్రధానం" అని కూడా అంటారు. మరి ఏది నిజం? ఏది వినాలి? రెండూ నిజమే. పరిస్థితులకు అనుగుణంగా నిర్వర్తించుకోవాలి. అలాగే నేను చెప్పిన విషయాల్లో వైరుధ్యం కూడానూ. ప్రజాస్వామ్యంలో అసమ్మతికి ఎప్పుడూ స్థానం వుంటుంది. గౌరవంగా ఎవరయినా తమ అయిష్టాలని, నిరసనని వెళ్ళడించవచ్చు అంతేకానీ ఆవేశాలూ, అవహేళనలూ అవసరం లేదు. అలా గౌరవంగా విమర్శించగలిగే ఓపిక లేకపోతే మౌనంగా ముందుకు సాగిపోవడమే మంచిది.
ఇక నా బ్లాగు సంగతి అంటారా! ఇదో అస్పృశ్య బ్లాగు. ఏ ఉటంకింపుకీ నోచుకోదు. నా బ్లాగును ప్రస్థావిస్తే వాళ్ళు మైల బడిపోరూ :D
@ యరమన
:))
ఊహి౦చిన సమాధానమే. కాబట్టి నిరాశ పరచి౦దని చెప్పాలి కాకపొతే మొదటిపాయి౦ట్ నచ్చిన వారికి రె౦డవది కూడా నచ్చాలి.ఒప్పుకోవాలి :) .అది కనిపి౦చడ౦ లేదు.
ReplyDelete(చిద౦బర౦ డిస౦బర్ తొమ్మిదొక్కటి చూడద్దని 23 కూడా ఉ౦ది అని బతిమాలుకొ౦టున్నట్లు :) )
@అలా గౌరవంగా విమర్శించగలిగే ఓపిక లేకపోతే మౌనంగా ముందుకు సాగిపోవడమే మంచిది.
విమర్శ విషయ పరమైనది అయినపుడు గౌరవానికి స౦బ౦ధి౦చిన ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు . (రచయిత వ్యక్తిగతం గా తీసికొని గౌరవం కోసం ప్రాకులాడితే అది 'వ్యాఖ్యాత' తప్పు కాదు :) )
మొత్తానికి , బాగు౦దని మెచ్చుకొనే వాళ్ళకోసమే వ్రాస్తూన్నారని అర్ధమవ్వగానే ష్ గప్ చుప్ :)
ఒక వాక్య౦ తప్పుగా పడి౦ది అని సూచి౦చాను. 'బుడుగు' రమణ గారిలా కావాలనే తప్పు రాసార, సరిచెయ్యలేదు :)
ReplyDelete@ మౌళి
ReplyDeleteసరిచేసాను :) ధన్యవాదాలు.