నాకు ఇష్టమయిన కూరలు ప్రాధాన్యతా పరంగా వరుసగా:
చేపల పులుసు
చేమగడ్డ పులుసు
బెండకాయ పులుసు
అవునండీ నాది పులుసు పార్టీ. వేపుడు పార్టీ కాదు. మా ఆవిడ వేపుళ్ళ పార్టీ. అలాగే నాది చేపల పార్టీ. మా ఇంట్లో మిగతావారిది అందరిదీ కోడి పార్టీ. మా ఇంట్లో ఇహ నా మైనారిటీ పార్టీ బ్రతుకు ఎలా వుంటుందో మీరు ఊహించుకోవచ్చు :) అడుగడుగునా వివక్షత. ముద్ద ముద్దకీ అన్యాయం. ఎప్పుడో కానీ నా జిహ్వ చాపల్యం తీరని వైనం. అదేమని నిలదీస్తే పిల్లలు చేపల కూర ఇష్టపడరూ, పులుసు ఇష్టపడరూ అని సమర్ధింపులు. వద్దు మొర్రో అంటున్నా ప్రేమతో కోడికూర నా నోట్లో కుక్కేసే నా పెళ్ళాం. వా... నా కూర కష్టాలు ఎన్ననీ, ఏమని చెప్పుకోనూ...?
అందుకే మా ఆవిడ ఎప్పుడన్నా పుట్టింటికి అనగా పుట్టిన దేశానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎంచక్కా నాకు ఇష్టమయిన కూరలు, నాకు ఇష్టమయిన విధంగా చేసుకొని తింటాను. ఇదేమన్నా ఇండియానా ప్రతి పండక్కీ మా ఆవిడ పుట్టింటికి వెళ్ళడానికీ? అందుకే నా స్వయంపాకావకాశం ఎన్నాళ్లకో, ఎన్నేళ్ళకో గానీ నన్ను వరించదు. మరి నా వంటలు ఇతరులకు ఇష్టంగా వుంటయా అనే విషయం సందేహాస్పదమే మరియు హాస్యాస్పదమే! మా ఆవిడ మా ఇంట్లో వుండగా మాత్రం నా వంటలు నేను వండుకోవడానికి అస్సలు సాహసించను. కొంపదీసి నా వంటలు ఇంట్లో వారందరికీ నచ్చేస్తే? ఇంకేమన్నా వుందా! అఫీసు నుండి ఇంటికి రాగానే మా ఆవిడ నన్ను వంట పనిలో పెట్టదూ! అందుకే రిస్కెందుకని చెప్పి ఆ మాత్రం సాహసం కూడా చెయ్యను. కష్టమో, నిష్టూరమో వండింది వేసుకు తింటా. అసలే ఇష్టం లేని కూరలు తింటున్నా కూడా బరువు తగ్గడం తక్కువవుతోంది. ఇంకా ఇష్టమయిన కూరలు తింటే ఇంకేమన్నా వుందా?
నా సంగతి సరే. మీకు ఇష్టమయిన కూరల లిస్టు చదువుదురూ.
రొయ్యల ఇగురు
ReplyDeleteటునా చేప పెప్పెర్ ఫ్రయ్
మటన్ మునక్కాడల కూర
చికెన్ రోస్ట్
.
.
ఇంక అంతే..
అడుగడుగునా వివక్షత. ముద్ద ముద్దకీ అన్యాయం.
ReplyDeleteSuper
మనకి కూడా చేపల పులుసు అంటే ఇష్టం!
ReplyDeleteమొన్న నెల్లూరులో బొమ్మిడాయిల పులుసు, మా ఇంట్లో కొరమీను పులుసు అదిరాయి.
ఇక్కడ మాకు ప్రవేశం లేనట్లుంది.. :-)
ReplyDeleteఅరిటాకు వేసి అప్పడం పెరుగు, పప్పు, ములకాళ్ళ కూర, అరటిపండు, ఇంకెదో చట్నీ వేసి,మమ్మల్ని పిలిచి ముద్ద నోటిదాకా రానివ్వకుండా .. కోడి కూర, చాపల పులుసు మాట్లాడుకుంటున్నారు కదా!! అందుకని అన్నా.. ఈ వేసవి కాలమంటే పెరుగు , మామిడి పండు సూపర్ కాంబినేషన్. మామిడికాయ పప్పు ఇంకా అదరహో.
ఏంటో సర్, తెలుగు బోజనమో, తెలంగాణా బోజనమో పెడుతారు అనుకుంటే. మలయాళం అరటాకు వేసేసారు.
ReplyDeleteమోట రైస్ , చల్ల దప్పడం, ములక్కాడ కూర , అరటి చిప్స్ కనిపిస్తున్నాయి. నేను వెజ్ కాబట్టి- నా ఫేవరట్
౧) వేడి అన్నం, టొమాటో పప్పు, నెయ్యి, చారు, పెరుగు, మామిడికాయ తొక్కు(ఆవకాయ)
౨) మామిడికాయ పులిహోర , ముద్ద పప్పు.
౩) సర్వ పిండి
@ మిస్టర్ గలి/గాలి
ReplyDeleteమీరు నా పార్టీ కాదులా వుంది
@ వంశి
:)
@ శ్రీ
మీరు నా కూరల పార్టీ లా వుందే. వివరించకండీ బాబూ - నోరూరుతోంది.
@ రమణి
ReplyDeleteపెరుగు + మామిడి పండు. ఈ కాబినేషన్ విన్నట్టుంది కానీ తిన్నట్టు గుర్తుకులేదు. గుర్తుంచుకొని ట్రై చేసి చూడాలి. అవునండీ. ముద్దపప్పూ, పచ్చిపులుసూ, నెయ్యీ, ఆవకాయీ ఇవన్నీ కలుపుకొని అరటి ఆకు మీద నంజుకొని తింటూవుంటే వచ్చే తృప్తి ఏ నాన్ వెజ్జులో వుంటుంది చెప్పండి? మీరు కోడిని తినరు సరే. దాని గుడ్డూ తినరా? పైన లిస్టులో వ్రాయడం మరచిపోయా కానీ నాకు కోడిగుడ్డు పులుసూ బాగా ఇష్టం.
@ అజ్ఞాత
అరటి ఆకు మీద మనం కూడా తింటుంటాము కదా. నాకు అయితే అలా తినడం ఎంత ఇష్టమో. మీ లిస్టులో సర్వ పిండి అంటే ఏంటో నాకు అర్ధం కాలేదు.
@ అజ్ఞాత
ReplyDeleteమీకోసం తెలంగాణా భోజనం ఏర్పాటు చేసాను (అనగా తెలంగాణా భోజనం ఫోటో). ఇప్పుడు ఆంధ్రా భోజనం ఏర్పాటు చెయ్యమని అడగరు కదా మన జనాలు :)
గట్ల కాదు భై ఇగ నేను కండితన్న, సర్వ పిండి అంటే ఏంటో తెల్వదా. ఇగ నీ కోసం కింద లింక్ ఇత్తన్న సుడు.
ReplyDeletehttp://www.google.com/search?q=sarva+pindi&hl=en&client=firefox-a&hs=d6j&rls=org.mozilla:en-US:official&prmd=ivns&source=lnms&tbm=isch&ei=877BTZfLKYyFhQe-lvzIBQ&sa=X&oi=mode_link&ct=mode&cd=2&ved=0CAsQ_AUoAQ&biw=1152&bih=౬౪౭
నోట్: do not take it as offensive.
@ అజ్ఞాత
ReplyDeleteఓ అదా. మేము దాన్ని తపాలచెక్క అంటాము. థేంక్స్ :)
వంకాయ కొత్తిమీర కారం
ReplyDeleteకంద బచ్చలి కూర
పనస పొట్టు కూర
మామిడికాయ పప్పు
చల్ల/మజ్జిగ మెరపకాయలు
గుమ్మడి వడియాలు
ఆనపకాయ+చింతకాయ పులుసు
కొత్తావకాయ
...
చివర్లో గడ్డ పెరుగు విత్ మామిడికాయ గానీ అమృతపాణీ అరటిపండు గానీ ...
ఎలాఉంది నా మెనూ?
వంకాయ కూర - ఏ రూపంలో అయినా.
ReplyDeleteవంకాయ కూరగాయలకి రారాజు. అందుకే దేవుడి దాని నెత్తిన కిరీటం పెట్టాడు.
కావాలంటే ఇక్కడ చదవండి.
వంకాయ వంటి కూరయు ..పంకజ ముఖి సీత వంటి భామయుగలదే?
ReplyDeleteశంకరుని వంటి దైవము, లంకాపురి వైరి(రముడు) వంటి రాజుయు గలడే...
అన్నారు ...
వంకాయతో వంద రకాల వంటలు చేయొచ్చు...
ఈ విష్యం లో నూటికి తొంబై మంది మొగుల్లది సేం స్టొరీ
ReplyDeleteSARATH JI
ReplyDelete''MANDU'' GURINCHI OKA RTAPA RAYALANI NAA MANAVI.
SADIVITHE MAANCHI KIKKUNDAALI.
@ అజ్ఞాత
ReplyDeleteమీ లిస్టుకేమండీ సూపర్. అందులో కొత్తావకాయా, మజ్జిగ మిరపకాయలూ, మామిడికాయ పప్పూ నాకూ బాగా నచ్చుతాయి.
@ కొత్తపాళీ
కథ బావుంది :)
నాకూ వంకాయ నచ్చుతుంది కానీ మరీ అంత ఫేవరెట్ కాదు. గుత్తొంకాయ ఇంకా నచ్చుతుంది. సో మీరు వంకాయకి కిరీటం పెట్టేసారు. వంకాయ పులుసు చేసుకొని చూస్తే ఎలా వుంటుందా అని చూస్తున్నా.
@ అజ్ఞాత
ReplyDeleteవంకాయ మీద మీ వ్యాఖ్యానం బావుందండీ. ఈసారి వంకాయ కూర తిన్నప్పుడు మీ మాటలని దృష్టిలో పెట్టుకొని మరింత ఇష్టంగా తింటాను.
@ మొగుడు
అంతేనంటారా, మన మొగుళ్ళ కష్టాలు ఇంతేనంటారా భర్తశ్రీ గారూ!
@ అజ్ఞాత జీ
నేను మందు టపా వ్రాస్తే మీకు కిక్కొస్తే బాగానే వుంటుంది కానీ కక్కొస్తే? చాలా సార్లు కూరలు ఆడవారు ఎందుకు చెడగొడతారో తెలుసా? ఎవరయినా ఇంటికి వచ్చినప్పుడు ఓ మహా గొప్పగా కూర వండేద్దామనుకుంటారా - ఏదో ఒకటి ఎక్కువో, తక్కువో అవుతుంది అందులో. అలాగే మనం కూడా ఎంచక్కా మీరు కోరారని చెప్పేసి టపా చక్కగా వండేద్దామనుకుంటే తుస్సు అనగలదు. అంచేత ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్లు లేకుండా ఎప్పుడయినా మీరు కోరిన టపా వ్రాస్తాను - మీరు కూడా ఎక్కువగా కిక్కు కోసం చూడకుండా చదివెయ్యండి. అప్పుడు ఆ టపా మీకు నచ్చుతుండవచ్చు. ఏమంటారు?
అయితే సమస్య ఏమిటంటే నేనేమీ మందు ప్రియుడినేమీ కాదు. అయినా సరే ఆ విషయంపై ఆలోచిద్దాం.
సర్వ పిండి ఫోటోలు పెట్టిన అజ్ఞాత అన్నయ్య/అక్కయ్య కు తాంక్స్..
ReplyDeleteచల్ల/మజ్జిగ మెరపకాయలు గుర్తు చేసిన అజ్ఞాత అన్నయ్య/అక్కయ్య కు తాంక్స్..
నాకు మా అమ్మ చేసే మటన్ పచ్చడి, కాకర కాయ పులుసు/ఫ్రై, బెండకాయల పులుసు/ఫ్రై, ఇంకా పులి హోర ఉంటే సూపర్
@ కాయ
ReplyDeleteనా పోస్టుకి మీ వ్యాఖ్య రాకపోతే ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుంటుంది. నేను బ్లాగుల్లోకి వచ్చిన మొదట్లో కత్తి మరియు సుజాత వ్యాఖ్యల కోసం కూడా అలాగే అనిపించేది. ఇప్పుడు కత్తిగారు గారు బ్లాగుల్లో యుద్ధం మానివేసినట్లున్నారు. సుజాత గారు ఎక్కువగా బ్లాగుల్లో 'బజ్జుం'టున్నారనుకుంటా.
ఆహా మీరు కాకరకాయ పులుసు గుర్తు చేసినందుకు మీకు థేంకులు చెప్పుకోవాలి. మీరూ నా పులుసు పార్టీనే నన్నమాటా.
ఎదవని కాకపోతే ఒక వైపు డైటింగు చేస్తూ మరో వైపు కూరల గురించి టపా వెయ్యడం ఏంటీ విచిత్రం కాకపోతేనూ. వ్యాఖ్యలొచ్చినప్పుడల్లా నోరూరి ఛస్తున్నాను. మా అమ్మలు కూడా అంతే నేను ఏదయినా తినొద్దనుకుంటున్నానని తెలిస్తే అది ఊరించి ఊరించి చంపేస్తుంది :)
గురువు గారూ, ఎంత స్థాయి ఇచ్చారు గురువు గారు.. హృదయం ద్రవించింది ఒక్క క్షణం పాటు ... మీ బ్లాగు రోజూ చూడకపోతే నాక్కూడా ఏదో కోల్పొయినట్లు ఉంటుంది గురువు గారు... అప్పుడప్పుడు పని వత్తిడి వల్ల ఎప్పటి టపాలు అప్పుడు కవర్ చేయలేకపోతున్నా... కానీ రెగ్యులర్ గా ... కొంచెం లేట్ అయినా.. ఏదో ఒకటి అంటూ ఉంటూనే ఉన్నా కదా..
ReplyDeleteఈ బ్లాగర్ బ్లాగభిమాని బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ...
మీ
కాయ
అవునూ.. మన ఈ పులుసు కూరలు తింటుంటే నరాలు జివ్వు మంటాయి .. ఈ టపా వేసి ...నాకు గుర్తొచ్చేలా చేసి నా నాలుక తహ తహ లాడేలా చేశారు.. ఇప్పుడెలా... మమ్మీ ...వా..వావ్వా..వ్వా..
@ కాయ
ReplyDelete:) అలా అని కష్టపడి కామెంట్లు వెయ్యకండి - ఇష్టం అయినప్పుడే చెయ్యండి ఆ పని.
మజ్జిగ పులుసును చప్పిడిపప్పుతో కలిపీ..
ReplyDeleteకొత్తావకాయ ..నంచీ..ఓ స్పూనుడు నెయ్యి తగిలించీ..
మా పాప నోట్లో పెడతాను..
అన్నట్లు దానికి పన్నెండేళ్ళు..పాపం చిన్నది కదూ..