ఇవాళ ఓ అజ్ఞాత మందు బాబు నన్ను మందు మీద టపా వెయ్యమని కోరితే ఈ విషయాలు గుర్తుకువచ్చాయి. ఇది వారు కోరిన టపా కాదులెండి. మా ఆవిడ నన్ను కొన్ని విషయాల్లో భలే ప్రోత్సహిస్తుంది. కాకపోతే అవేమన్నా నాకేమన్నా పనికి వచ్చే విషయాలా కదా అనేది నా అనుమానం. చుట్టాలో, పక్కాలో వచ్చినప్పుడు అతిధి మర్యాద కోసం మందు తెచ్చిపెడతాను. వారు మొహమాటానికి పోయి మొత్తం తాగెయ్యరు కాబట్టి కొంతయినా ఉండిపోతుంది. అదలా మిగిలేపోతుంది. అది గుర్తుంచుకొని గుటాకాయాస్వాహా చెయ్యడానికి నేనేమో మందు ప్రియుడిని కాకపోతిని. ఏదో ఇతరులకు కంపెనీ ఇవ్వడం కోసం కొద్దిగా పుచ్చుకోవడం తప్పించి నాకు అసలు అంతగా తాగాలనే సోయే వుండదు. అలా వారాలు, నెలలూ మరో అతిధికోసం ఎదురుచూస్తూ ఆ మందు అలాగే వుండిపోతుంది. నాకు ఇంట్లో మందు మిగిలివున్న సంగతే గుర్తుకువుండదు.
అయితే మా ఆవిడ అప్పుడప్పుడూ మందు మిగిలేవున్న విషయం గుర్తు చేసి తాగొచ్చుకదా అని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రోత్సాహమే మరో విషయంలో వుంటే ఎంత బాగుండూ అని మరో వైపు నేను మనస్సులో ఏడుస్తుంటాను. అబ్బే నాకంత ఆసక్తి లేదు అని అంటూవుంటాను. పర్లేదూ, తాగూ అంటుంది. నేను ఆడవారి మెంటాలిటీ గురించి ఆలోచిస్తూ ఆమె వైపు అలా చూస్తుంటాను. ఏంటోనండీ ఈ ఆడవాళ్ళు. కొద్దిగా మందు ప్రియులం అయితే చాలు - గజ తాగుబోతులా చూస్తారు. తాగకపోతేనేమో మా ఆవిడ లాంటి వారు గుర్తుచేసి మరీ ప్రోత్సహిస్తారు. అంతగా ఇష్టం లేనప్పుడు కష్టపడి అది లాగించడం ఇప్పుడంత అవసరం అంటావా అని నేనంటే కొద్దిగా తాగితే ఏమవుతుంది అంటుంది. ఆమె మాట తీసివెయ్యడం ఇష్టం లేక అప్పటికి తాగి పెట్టినా మందు ఇంట్లో వున్న విషయం మళ్ళీ గుర్తుకువుండదు.
రోజూ ఓ పెగ్గు రెడ్ వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేమో, తాగుదాములే అనుకుంటుంటా కానీ అసలు సమయానికి అది నాకు గుర్తుకు వుండనే వుండదు. అలా ఇంట్లో ఇప్పుడు కొన్ని వైన్ బాటిళ్ళూ, ఓ సగం విస్కీ బాటిలూ ఎన్నాళ్ళ నుండో అలా పడేవున్నాయి. మనకున్న ఆసక్తులూ, అలవాట్లూ చాలకనా అని కూడా మందుని పెద్దగా నా మనస్సు ముందుకు రానివ్వను.
ఎవరింటికి అయినా వెళ్ళినప్పుడు కూడానూ మిగతావారందరూ మందు బాగానే తీసుకున్నారు కదా. నువ్వూ తీసుకోకపోయావా ఇంకా అంటుంది మా ఆవిడ. ఇంకా తాగీ, అది ఎక్కీ, నేను ఏదేదో వాగీ మళ్ళీ నీతో అవన్నీ ఎందుకు మాట్లాడావంటూ మాటలు పడాలి, ఎందుకులే అని అంటాను నేను. తాగూ...వద్దన్నానా అంటుంది మళ్ళీ కానీ వద్దులెండి. మళ్లీ ఈ ఆడాళ్ళే సన్నాయి నొక్కులు నొక్కుతారు - తాగామంటే అంతగా తాగమన్నానా అని. ఓ రెండు, మూడు పెగ్గులు దాటితే ఎంత తాగామన్నది మనకు లెక్క తెలుస్తుందేమిటీ?
సిగరెట్టూ, మందూ..., ఎక్కువగా తాగేవాళ్లు ఆ విషయం లో వీక్ అయిపోతారంట. కొంపదీసి ఎంకరేజ్ అందుకేనా...? అయినా నాకెందుకొచ్చిన గొడవ లెండి. కొత్త పాయింట్ రైజ్ చేసి మీ ఇద్దరి మధ్య కొత్త ఫిట్టింగ్ పెట్టారంటారు అందరూ..., నేనే కామెంట్ రాయలేదు..., మీరు చదవలేదు... ఓకే నా...
ReplyDeleteకొంత మంది ఆడవారికి భర్త తాగాక, అతన్ని ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటారు అని విన్నాను... అప్పుడైతే ఏం చేసినా పడి ఉంటారని... వాళ్ళ ఉద్దేశ్యం అట.. అలాంటి దేమైనా...
ReplyDelete@ మిర్చి
ReplyDeleteఅలాంటి కాన్స్పిరసీ, కుట్రలూ, కుతంత్రాలూ ఏమీ లేవు లెండి :) జస్ట్ సరదాగా అలా అంతే.
@ కుండ
తాగి మనం పడిపోయాక ఇంకా వాళ్ళు ఏం చేసినా, ఏం అన్నా ఏం ప్రయోజనం వుంటుంది లెండి.
Photo kekaaaaa
ReplyDeleteమీరు భలే వారు శరత్ గారు, నాకు మందు తగితే యమా మూడ్ వచ్చేస్తుంది...అవునవును మీరు అనుకుంటున్న మూడే ;-)......మీకు పిల్లలున్నారు కాబట్టి కుదరదేమో కాని......మీ ఇద్దరూ కొద్దిగా పుచ్చుకుని రంగం లోకి దిగితే......అబ్బో ఇంకేముంది చెప్పడానికి...అన్ని చేతలే ;-) ...ఎలాగూ మీరు అరోగ్యం కోసం అని వైను సేవిస్తాను అన్నారు కదా......దాన్ని స్ట్రాబెర్రిస్ (strawberries) కాంబినేశన్ తో ట్రై చేయండి.....అబ్బో నాకు రాస్తుంటేనే మత్తెక్కుతుంది . :-ఫ్
ReplyDeleteమా ఫ్రెండు ఈ మధ్యనే చెప్పాడు...
ReplyDeleteవాళ్ళ ఆవిడ కొంచెం రిజిడ్ టైపు అయినా మందు మాత్రం మొహమాటం లేకుండా లాగించేస్తుందంట. తనకు తాగాలనిపించినప్పుడు... డైరెక్ట్ గా అడగలేక... ఇవ్వాళ మీరు తాగొచ్చుగా అని మొదలెడుతుందట. మీకిస్టమైనవి మీరు చేస్తున్నప్పుడు తనకి ఇది ఇష్టమేమొ కనుక్కొవచ్చుగా. - చక్రి
@ రవితేజ
ReplyDelete:))
@ అజ్ఞాత
మందు (కొద్దిగా) తాగితే మాంఛి మూడు వస్తుంది సరే. ముందు మందు మీదికి మూడు రావాలంటే ఏంచెయ్యాలో చెబుదురూ? సర్లెండి నాకు మందే సరిగ్గా గుర్తుండదూ ఇంకా దాంతో పాటు స్ట్రాబెర్రీలు ఏం గుర్తుంటాయీ? ప్రయత్నిస్తాను :)
@ చక్రి
బంతి భోజనాలు జరిగినప్పుడు ఇలాంటి సంఘటణలు జరుగుతుంటాయి. ఉదాహరణకు మనకు ఏ మటన్ కర్రీనో కావాలనుకోండీ అది వడ్డిస్తున్నవాడిని మనకోసం పిలవడానికి కాస్తయినా మొహమాటపడతాం. అందుకే కొందరు ఏం చేస్తారంటే పక్కనే కూర్చున్నవాడిమీద వల్లమాలిన శ్రద్ధ వలకబోస్తూ అతని వడ్డించమని పిలిచి వురమాయిస్తారు. పనిలో పనిగా వారికీ వడ్డన జరుగుతుంది. అలాంటిదే అన్నమాట మీరు చెప్పింది.
తన ఇష్టాయిష్టాలు బాగానే తెలుసు నాకు. కాకపోతే మా ఇద్దరి ఇష్టాలూ చాలావరకు కలవవు. ఇది కూడానూ.
entha manchi vaarandee
ReplyDeleteఆయన హాల్లో మందు సేవ చేస్తుంటారు..
ReplyDeleteనేను ఏ సినిమానో నెట్లోనో ఫోన్లోనో వుంటాను..
త్వరగా చపాతీ చై నేను పడుకోవాలి అంటూవుంటారు..
అందుకే నేను ఇంకో బాటిలు తాగొచ్చు కదా..
అని ప్రోత్సహిస్తూంటాను..
ఎలాగూ తాగొద్దని చెబితే వినరు..
కనీసం మనకి డిస్టర్బెన్స్ అన్నా లేకుండా వుంటుందని..
ఏమంటారు..?
HALF THANKS......
ReplyDelete