ప్రకృతిలో పవళించడం కోసం...పరవశించడం కోసం...

... కెనడాలో వున్నప్పుడు అప్పుడప్పుడు క్యాంపింగుకి వెళుతుండేవారం. ఇక్కడ ఓ రెండేళ్ళ క్రితం వెళ్ళాం కానీ మా కుటుంబంలో అదంటే ఆసక్తి తగ్గింది. ఎందుకూ అంటే ప్రకృతిని అంత దూరం వెళ్ళి అంత కష్టపడి చూడ్డం ఎందుకూ ఎంచక్కా హాయిగా ఆన్లైనులో చూసుకోవచ్చు కదా అని మా పెద్దదాని వాదన! ఏం చెబుతాం? ఇహ చిన్నది వివరణ కూడా ఇవ్వదు - స్టేట్మెంట్ ఇచ్చేసి ఇహ చాలు నోరు మూసుకొమ్మంటుంది. ఇహ మా ఆవిడేమో చిన్నప్పుడు పల్లెటూర్లోనే కదా పెరిగిందీ ఇంకా ఎందుకూ ప్రకృతీ - వికృతి కావాలి గానీ అంటుంది. ఇహ వీళ్ళతొ లాభం లేదని క్యాంపింగ్ గేర్ వెసుకొని ఈ సారి నేనొక్కడినే వెళ్దామనుకున్నాను.

అయితే ఈమధ్య మళ్లీ వావాళ్ళు క్యాపింగుకి ఓక్కే అంటున్నారు. అలాగే పక్కింటివారూనూ. వచ్చేనెల నుండి మొదలెడుతున్నాం. మొదట ఒక రోజుతో మొదలెట్టి మంచిగా వర్కవుట్ అయితే తరువాత్తరువాత వారాంతాలంతా వెళ్ళాలని ఆలోచన. మీలో క్యాంపింగుకి వెళ్ళిన వారు మీ అనుభవాలు, అనుభూతులూ మాతో పంచుకుందురూ. మావి నెమ్మదిగా వ్రాస్తాలెండీ. 

5 comments:

  1. naku kuda chala chala ishtam, eppudu vellale. ma ayanni aduguta ika tisukellamani :)

    ReplyDelete
  2. మొత్తానికి వెల్తున్నరనమటా.మంచిది....ఇక్కడ నార్వే లో...కాబిన్ ట్రిప్ లని..క్యాంపింగ్ లాంటిదే కాని ఎక్కడో కొండల్లో ఒక చెక్కల కొస్టం వుంటది...అక్కడికి వెళ్ళిపోతారు..ఈస్టర్ వస్తుంది కదా అండి..అందరికి వాళ్ళ వాళ్ళ కాబిన్స్ వుంటాయ్ పారంపర్యం గా వచ్చినవి...వాటిల్లో చేసుకుంటారు...వారం నుండి పది రోజులు అక్కడే వుంటారు..రేపు సాయంత్రం బయల్దేరుతున్నారు చాలా మంది..
    ఆఆ మీరు వెళ్లి వచ్చాక దానిగురించి రాయడం మర్చిపోకండి..నేను వచ్చే నెలలో సైకిల్ ట్రిప్ కి వెళ్తున్నాను..పన్నెండువందల కిమీ ట్రిప్ కి..ఒక పది రోజులు అటు ఇటు గా..మీరు మీ అనుబవాలు రాస్తే..కాస్త హెల్ప్ గా వుంటది....

    ReplyDelete
  3. @ స్వప్న
    వెళ్ళివచ్చి ఆ విశేషాలు మాతో పంచుకోండి.

    @ ప్రబంధ్
    క్యాబిన్ ట్రిప్పులా. ఇదేదో బావుందే. అంత సైకిల్ ట్రిప్పే - మంచి పని చేస్తున్నారు. మా క్యాంపింగ్ విశేషాలు తప్పకుండా వ్రాస్తాను. వ్రాయకుండా వుండగలనా?

    ReplyDelete
  4. నేనొకసారి వెళ్ళాను. అనుభూతి కొంతవరకు బాగుంది.

    సమస్యేంటంటే, మిగతావిలానే అమెరికాలో‌ చాలా చోట్ల ఈ విషయం వ్యాపారమయమైంది. ఏజెంట్ దగ్గరే మనం గుడారం వేసుకునే చోటు అద్దెకు తీసుకోవాలి. వచ్చేవాళ్లు సుకుమారులని వాడు బాత్రూంలు, నీళ్ళు, అన్నీ ఇస్తాడు.

    ఇక వచ్చేవాళ్లు కార్లు, ట్రాలీలు, ఆర్‌సీవీలనిండా ఐసుపెట్టెలు, వాటినిండా బీరులు, బార్బెక్యూకి చికెన్/పోర్కు/బీఫ్ వగైరా : ఇవి చాలదన్నట్లు రోజుకి మూడుసార్లు దగ్గర్లోని వాల్మార్ట్-స్టార్బక్స్-బర్గర్ కింగ్ మొదలగుచోట్లకి ట్రిప్పులు

    ఇటువంటివి పట్టించుకోకుండ ఉంటే అది ఒక మంచి అనుభవం. ముఖ్యంగా రాత్రిపూట పాలపుంతని చూసిన దృశ్యం ఇంకా కళ్లముందుంది.

    -

    ReplyDelete
  5. @ జీబీ
    క్యాంపింగ్ సెంటర్లు మనకు రక్షణ మరియు సౌకర్యాలను ఏర్పాటుచేస్తాయి. ఇలాంటి క్యాంపుల్లో మరియు ప్రిమిటివ్ మరియు సాధారణ క్యాంపింగులు వుంటాయి. ప్రిమిటివ్ లల్లో నీరు, కరెంటు కూడా వుండదు. నీరు మనం పక్కనుండి తెచ్చుకోవాలి, వెలుతురు కోసం లాంతర్లు ఉపయోగించాలి. ప్రిమిటివ్ క్యాంపింగ్ చెయ్యడమే క్యాంపింగులా వుంటుంది. ఇక కరెంటు పెట్టేసుకొని టివి పెట్టేసుకొని నేట్టేసుకొని టెంటులో కూర్చోవడానికి ఇఖ్ఖడిదాకా రావడం ఎందుకంఠా? ఆ ఆనందమేదో ఇంటిదగ్గరే పడొచ్చు కదా.

    మీరన్నట్లుగా నిజమయిన క్యాంపింగ్ చెయ్యాలంటే బ్యాక్ కంట్రీ క్యాంపింగ్ చెయ్యాలి. అప్పుడు సహజంగా వుంటుంది - అలాగే సహజమయిన భయాలు, ప్రమాదాలూ కూడా వుంటయ్! మొదట్లోనే అటెళితే చాలా ఇబ్బందులు వుంటయ్. క్యాంపింగ్ సెంటర్లల్లో ప్రాక్టీసు అయ్యాక బ్యాక్ కంట్రీ క్యాంపింగులో వుండే లోటుపాట్లని క్షుణ్ణంగా అధ్యయణం చేసి మరీ వెళ్ళాలి. మా కుంటుంబం క్యాపింగ్ సెంటర్లకే రావడం ఎక్కువ కాబట్టి నేనింకా బ్యాక్ కంట్రీ వెళ్ళలేదు. మంచి తోడు వుంటే అటు వెళ్ళడమే సహజంగా, సాహసోపేతంగా వుంటుంది. ఎలుగుబంట్లు కూడా తారసపడవచ్చు, తలపడవచ్చు!

    ReplyDelete