ఆఫీసులో బాస్ కోసమో, కంపెనీ కోసమో పనిచేస్తాం, ఇంట్లో కుటుంబం కోసం కష్టపడుతుంటాం. మరి మనకోసం సమయం ఎప్పుడు. ప్రతి వ్యక్తికీ తమదైన ప్రత్యేక సమయం వుండాలంటారు మానసిక నిపుణులు. నాకయితే ఆ సమయం వుంది. రోజుకి రెండు సార్లు - పని రోజుల్లోనే అనుకోండి. ఆఫీసు డవున్ టవునులో వుంటుంది కాబట్టి రోజూ రైలులో వస్తుంటాను. సీట్లు తప్పనిసరిగా దొరుకుతాయి కాబట్టి ఆ ఆదుర్దా ఏమీ వుండదు. 45 - 50 నిమిషాల సమయం తీసుకుంటుంది. పేపరో లేక ఇష్టమయిన పుస్తకమో కొద్దిసేపు చదువుతాను. ఆ తరువాత ఎంచక్కా ఓ ఇరవై నిమిషాల కునుకు తీస్తాను. అలా రోజూ వచ్చేటప్పుడూ, వెళ్ళేటప్పుడూనూ. ఆ సమయంలో ఏ ఒత్తిడులూ వుండవు. పని ఒత్తిడి వుండదూ, ఇంటి వత్తిడీ వుండదు. అది నా సమయం. ఆ సమయంలో ఫోన్ కాల్స్ వచ్చినా మరీ అవసరం అయితె తప్ప ఎత్తను. ఎత్తినా ఇతరులకు ఇబ్బందిగా వుంటుందని చెప్పి త్వరగానే ముగిస్తాను.
ఆ సమయంలో తీరిగ్గా వుంటాను కాబట్టి ఎంచక్కా కిటికీ అద్దాల లోనుండి కనపడే శికాగో నగర సౌందర్యాలనూ, ఆ తరువాత నగర పొలిమేరల్లో వుండే పాతబడ్డ, పాడుబడ్డ నిర్మాణాలనీ చూస్తూ వెళుతుంటాను. ఆ తరువాత పచ్చటి ప్రకృతి సౌందర్యాన్నీ తిలకిస్తూ వెళుతుంటాను. చలికాలంలో అయితే కురుస్తున్న లేక కురిసిన మంచును వీక్షిస్తూ వెళుతుంటాను. అయితే ఓ అసంతృప్తి వుంటుంది. రైలులోవి ఏసీ కోచులు కాబట్టి విమానాల్లో లాగానే కిటికీలు తెరిచే అవకాశం వుండదు. బయట ఎంత బాగున్నా కిటికీ అద్దాల్లోంచి చూసి ఆనందించాల్సిందే. బయట చక్కటి పిల్లగాలులు వీస్తున్నా చేతులు చాచి తాకలేము కాబట్టి చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే. ఉడుక్కొని అలా లాభం లేదనుకుంటూ కళ్ళు మూసుకొని తియ్యటి కలలు కంటూ కునుకులోకి జారిపోతుంటాను.
నా సమయం నాకుంది మరి మీకంటూ ఓ సమయం మీకుందా? ఇలా మనకంటూ సమయం వున్నప్పుడు మనని మనం సమీక్షించుకునే అవకాశం, ఆలోచనలూ కలుగుతుంటాయి. అలాక్కాకపోతే నిలబడి సేదతీరే వెసులుబాటు లేకుండా జీవిత గమనంలో అలా పరుగెత్తుతూనేవుంటాము. ఆగి మనం ఏం చేస్తున్నామో, ఏం చెయ్యాలో ఆలోచించుకోవడానికి అంతగా తగిన వ్యవధి, అవకాశం వుండవు మరీ.
I envy u in this regard
ReplyDelete@ రవి
ReplyDelete:)
నేను కూడా అంతే,మంచి రోడ్డుంటుంది, పక్కనే నీళ్ళుంటాయి, జాడించడానికి సర్ఫ్ పౌడరుటుంది, జబ్బల్లో సత్తువుటుంది, అయినా నా కడ్డాయరు ఇప్పి ఉతుక్కోలేను పుచుకు పుచుకు
ReplyDeleteపతొడు
@ పతోడు
ReplyDeleteఇప్పుడు నేను మీకు ఏమని స్పందించాలబ్బా!
మహోప్రభో మమ్మల్ని కెలికి ఏడిపించకండి..
ReplyDeleteహేవ౦డీ, ఏవన్నా అ౦టే అన్నావ౦టారు గానీ శరత్ గారి "కాలమ్" కోస౦ ఎదురు చూస్తూ
ReplyDeleteమా కాల౦ వృధా అవుతో౦ది. ఎలా. ఎలా.. ఎలా... లా.... లా.....లా!!!!!!
రోజూ న్యూస్ పేపర్ కోస౦ ఎదురు చూసినట్టు (నేను హైద్రాబాద్ ఉ౦ట౦ వల్ల ఇ౦కా పొద్దున్నే
వేసే పేపర్ కోస౦ చూస్తూవు౦టాను. నెట్ లో అప్పటికే అన్ని పేపర్స్ ఉన్నా, పేజ్ తిరగేస్తూ
ఉ౦టే ఆ మజా వేరు కదా)
మా చిన్నప్పుడు పచారీ కొట్లో బెల్ల౦ కొ౦టూ, ఎప్పుడు చేతిలో కొసరు బెల్ల౦
పడుతు౦దాని ఎదురు చూసినట్టు
రేడియోలో పాత పాటలొస్తు౦టే పి. లీల పాట కోస౦ ఎదురు చూసినట్టు
అ౦దమైన పెళ్ళా౦తో బజారుకెళ్ళి ఇ౦కో అ౦దగత్తె కోస౦ ఎదురు చూసినట్టు
ఏవిటి ఏవిటిద౦తా అనుకు౦టు౦టే గ్నాన౦ ఉదయి౦చి౦ది.
నిజమే కదా పక్కి౦టాయన ఆయన తన ఇ౦టి విషయాలు వివరిస్తు౦టే,
కథలు కథలుగా చెప్తూ౦టే ఎవరికి మాత్ర౦ ఆ మాత్ర౦ ఆత్ర౦ ఉ౦డదూ
అనుకు౦టు౦టే, ఓహో అసలు విషయ౦ కన్నా, పక్కి౦టాయన పర్సనల్
విషయ౦ అయితే ఆ ఆతృత ఇ౦కా ఎక్కువగా, అదీ శరత్"కాలమ్" అయితే
ఇ౦౦౦కాఆఆఆ హేక్కువన్న మాట. హమ్మయ్య.
ఈయన గారి గొప్పతన౦ లేద౦డోయ్.
20 + 20 = 40 mins in office bus
ReplyDelete@ kvsv
ReplyDeleteమీలాంటి వారు ఈమధ్య మృగ్యం అయిపోతున్నారు. ఇలా కెలికితేనన్నా ఓ సారయినా కనపడివెళతారేమోననీ :)
@ మహాప్రసాదం
:)
ధారాళంగా నన్ను ప్రశంసించేరు. సంతోషంగా వుంది. అలాగే బాధ్యతా పెంచారు. అయితే నా లైఫ్ నా బ్లాగు ద్వారా ఓ రియాలిటీ షోలాగా అయ్యిందన్నమాట :) పోచుకోలు కబుర్లు ఎవరయినా చెప్పొచ్చండీ. నేను చెప్పే కబుర్లలో చాలా వరకు ఏదయినా ప్రయోజనం కూడా వుండేట్లు చూసుకుంటాను. ఇంఫోటెయిన్మెంటు లాగా. అయితే కొన్ని విధముల సమాచారం చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ నాకు నచ్చుతుందే! నచ్చకపోయినా అలాంటివాటికి (సమాచారానికి) అలవాటు పడతారు - అది చాలు నాకు.
నాకు ఇప్పటికి ఆఫీసు మాత్రమే కాబట్టి మిగతా అంతా 'గిరీష్ సమయమే' :).
ReplyDeleteమనకిష్టమైన పనులు చేసే టప్పుడు కూడ అది మన కాలమే..
మీరు Back to form అనుకుంటా
ReplyDeleteఈ మద్య సూపర్ గా రాస్తున్నారు :)
@ కంఫ్యూజ్డ్
ReplyDeleteపర్లేదే.
@ గిరీశ్
:)
@ వంశి
:)
meeru Libertyville lo vuntaara. ninna mee laanti vallani evarino chusinatlu anipistenu..
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteలేదండీ. అక్కడికి అరగంట దూరంలో వుంటాం.