మల్లన్న దేవుడు - 1

మా అమ్మగారు మహా భక్తురాలు. మా ఊరికి దగ్గర్లోని ఏపూరు గ్రామంలోని మల్లన్న దేవునికి భక్తురాలిగా వుండేది. మా ఊర్లో ఆ దేవునికి ఓ భక్త బృందం వుండేది. అందరూ కలిసి తరచుగా ఏపూరుకు వెళ్ళి ఆ గుడినీ, దేవుడినీ దర్శించుకొని వస్తుండేవారు. అక్కడ ఏమయినా ప్రత్యేక కార్యక్రమాలు వుంటే అక్కడే ఒకటీ రెండు రోజులు గడిపివస్తుండేవారు. ఏడాదికి ఒకరోజు అక్కడ మల్లన్న జాతర జరిగేది. చుట్టుపక్కల ఊర్ల నుండి భక్తులు చాలామంది ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవారు.

ఆ గుడికి నా చిన్నప్పుడు నన్ను తరచుగా మా అమ్మ తనతో పాటుగా తీసుకెళుతూ వుండేది. మా నాన్న గారేమో నాస్తిక సువార్తా సభలకి తీసుకువెళుతుండేవారు. ఇలా మా అమ్మా నాన్నలు ఇద్దరూ నాకు ఏడో తరగతి వచ్చేవరకు ఫుట్ బాల్ ఆడుకున్నారు.  ఏదో ఒక పార్టీలో సెటిల్ అవకపోతే అలాగే అన్యాయం అయిపోతానని భావించి మా నాన్నగారి నాస్తిక పార్టీకి జై బోలో అన్నాను.

ఏమాటకామాటే చెప్పాలి. ఆ గుడికి వెళ్ళడం నాకూ బాగా నచ్చేది. అక్కడ పెట్టే ప్రసాదం, పరమాన్నం వగైరాలు ఇంకా నచ్చేవి. ఆ గుడిని ఒక గొల్ల అతను నిర్వహిస్తుండేవాడు. అతని పేరు మల్లన్న. అతనికే అప్పుడప్పుడు దేవుడు పూనేవాడు(ట). ఏ భజనలో, కీర్తనలో పాడుతున్నప్పుడు దేవుడు పూని ఎవో జ్యోతిష్యాలు మాట్లాడేవాడు. ఆ మాటల్లో క్లారిటీ వుండేది కాదు. వాటిని ఈ భక్తులు ఎవరికి తోచినట్లుగా వారు అన్వయించుకొని తృప్తిపడేవారు. తమ సమస్యల పట్ల ఆ మల్లన్న దేవుడు ఏమీ భవిశ్యత్తు చెప్పనట్లు అనిపిస్తే నిరాశ పడి ఇంకా తమకు ఆ ఆదృష్టం రాలేదని ఊరడించుకొని మళ్ళీ తరువాతి భజనలో నయినా తమకేమయినా ఆ దేవుడు చెబుతాడేమో అని ఎదురు చూసేవారు.

ఆ మల్లన్న దేవుని మహత్మ్యాల గురించి భక్తులు, భక్తురాండ్రు తన్మయత్వతో చర్చించుకునేవారు. మనలో అప్పటికే కొన్ని నాస్తిక బీజాలు వున్నాయి కాబట్టి ప్రసాదాలు గట్రా లాగిస్తూ అరమోడ్పు కన్నులతో ఆ మహత్మ్యాలను వింటూ నమ్మీనమ్మనట్టు వుండేవాడిని. అవన్నీ తూచ్ అందామంటే ఎక్కడ నాముందు వున్న ప్రసాదం లాక్కెళతారో అన్న భయమాయె. ఆ మల్లన్న దేవుడు పూనకం వచ్చినప్పుడు నేను నాస్తిక సభలకీ వెళతానని ఎక్కడ కనిపెడతాడేమో మరో బెంగానూ. ఎందుకయినా మంచిదని ఆ పూనకాలు వచ్చినప్పుడు ఏ స్తంభం పక్కనో దాక్కుని మొత్తమ్మీద అలా పట్టుబడకుండా పని కానిచ్చేసా.  పూనకంలో లేనప్పుడు నా గురించి కనిపెట్టలేడు కదా అందుకని ఆ మల్లన్నతో చనువుగానే మాట్లాడేవాడిని. అతగాడు కూడా నన్ను ఆప్యాయంగా చూసుకునేవాడు. అప్పుడప్పుడు బెల్లమో, పప్పులో నా దోసిలిలో నిండుగా పోసేవాడు. అందుకేనేమో ఆ మల్లన్న నాకు కూడా బాగానే నచ్చేవాడు. 

మా అమ్మతో పాటే అప్పుడప్పుడు అక్కడ రెండు మూడు రోజులు వుండేవాడిని - గోళ్ళు గిల్లుకుంటూ. అవి అరిగిపోయి, అరిగిపోయి అక్కడ వుండటం ఒకటి రెండు రోజులయ్యాక విసుగొచ్చేది కానీ మా అమ్మగారు పరమాన్నం ఆశపెట్టి ఊరకుంచేది. అలా ఊరికే వుండక మన హాల్ఫ్ నాలెజ్ నాస్తిక జ్ఞానంతో గుడిని నఖశిఖ పర్యంతం పరీక్షించేవాడిని. మరొ వైపు ఆ గుడిలో జరిగే వివిధ భక్తి కార్యక్రమాలు కూడా కాస్తో కూస్తో నచ్చేవి కూడా లెండి. ఆ గుడిలో ఓ అద్దాల గది కూడా వుండేది. దాని గురించి భక్తులు విశేషంగా చెప్పుకునేవారు. అది ఎప్పుడో ఒకసారి తప్ప తెరిచేవారు కాదు. అందులోకి అందరికీ ప్రవేశం వుండేది కాదు. ఎలాగోలా ఒకసారి జొరబడి ఆ గదీ చూసేసాను. ఓ దేవుడి ప్రతిమా, చుట్టూ అద్దాలూ వున్నట్టు గుర్తుకువుంది నాకు.  మొత్తమ్మీద తీరిగ్గా గోళ్ళు కొరుక్కుంటూ బహుశా బడి ఎగ్గొట్టుకుంటూ తాపీగా ఆ గుడిని పరిశీలిస్తూ వుండటం బాగానే నచ్చేది.  పైగా ప్రత్యేక అర్చనలు చేసేప్పుడు ఏ పులిహోరానో, తీర్ధమో బాగానే గిట్టుబాటు అవుతూనే వుండేది నాకు.    

ఏడాదికొకసారి జరిగే మల్లన్న జాతర భలే నచ్చేది నాకు. అప్పుడు మా తాత, అమ్మామ్మలతొ సహా ఏ మూడింటికో ఎడ్లబండి కట్టుకొని ఆ గుడికి వచ్చేవారం. ఆ గుడి కొండ చుట్టూ ఆ ఎడ్ల బండితో కొన్ని సార్లు ప్రదక్షిణం చెయ్యడం పద్ధతిగా వుండేదక్కడ. ఆ జనసందోహంతొ అంతా తిరునాళ్ళ లాగా వుండి చాలా ఆనందించేవాడిని నేను. అక్కడే వేటలు కోసి మాంఛి రుచికరమయిన భోజనం వండితే ఆ ఆరుబయలు గాలికి  పిచ్చపిచ్చగా ఆకలేస్తే ఆవురావురుమని భోజనం లాగించేవాడిని. 

ఆ తరువాత మా నాన్నగారికి భువనగిరి, సూర్యాపేట ట్రాన్స్ఫర్ కావడంతో మా అమ్మకి ఆ గుడికి వెళ్ళడానికి ఎక్కువగా వీలయ్యింది కాదు. అలాగే నేనూ వెళ్ళలేకపోయాను.  మా పెద్దక్క ఊరికి బస్సులో వెళుతుంటే ఆ మల్లన్నది కూడా అదే రూటు కావడం వల్ల ఎప్పుడన్నా ఒకసారి కనిపించి ఆప్యాయంగా పలకరించి మాట్లాడి మా కుటుంబ యోగక్షేమాలు కనుక్కునేవారు. నేను నాస్తికుడినే అయినప్పటికీ అలాంటి దేవుళ్ళనీ, దయ్యాలనీ నమ్మనప్పటికీ వినయంగా జవాబు ఇచ్చేవాడిని.      

కట్ చేస్తే...

(ఇంకా వుంది)

12 comments:

  1. మా వరంగల్ లో ఇంకో మల్లన్న జాతర ఏమైనా ఉందా గురువు గారు.. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళతో ఎడ్ల బండి లో వెళ్ళేవాడిని, .. ఆ జాతర సూపర్ గా ఉండేది అక్కడే మా అమ్మమ్మ వాళ్ళు వంట చేశాక, అందరం కలిసి తిని చిన్నవాళ్ళమంతా హాయిగ ఆడుకునేవాళ్ళం.. ఇంకా సర్కస్ లు కూడా వచ్చేవి.. వచ్చెటప్పుడూ, పోయేటప్పుడూ ఎడ్ల బండి లో .. బండి కొద్దిగా ఎగురుతూ, ఊగుతూ ఉండగా చెప్పుకునే ముచ్చట్ట్లు ఎంతో హాయిగా ఉండేవి.......

    ReplyDelete
  2. "కాయ" గారూ,
    మల్లన్న జాతరలు తెలంగాణా జిల్లాల్లో లెక్కలేనన్ని ఉన్నాయి. శరత్ గారు చెప్పింది కచ్చితంగా నల్లగొండ జిల్లాలో సూర్యాపేట పరిసరాల్లో ఉంటుందనుకుంటాను. "మన" వరంగల్ జిల్లాలో నాకు తెలిసి మూడు ఉన్నాయి. (తెలియనివి ఎన్నో?). అయినవోలు మల్లన్న, ధర్మసాగర్, నారాయణగిరి దాటాక వచ్చే "గట్టు మల్లన్న", వరంగల్ నగరంలోనే "కట్ట మల్లన్న". అన్నట్టు .. కరీంనగర్ జిల్లా ఓదెల సమీపంలో "దుబ్బ మల్లన్న" ఉన్నాడట!

    ReplyDelete
  3. శరత్ గారు,
    ఆ టపా లో మీరు రాసిన దానికి థాంక్స్. నేను రాసిన దానికి కొత్త ఫిటింగ్ పెట్టారు..బ్లాగులంటే చిన్న చూపా అని. ఓరి నాయనోయ్...జర్నలిస్టులను మించిపోయారు సారూ ఈ ముదురు బ్లాగర్లు. (నేనేదో నవ్వుతూ రాసాను. మళ్ళీ దీన్ని కంపు చేయకండి.)
    నా బ్లాగు మూసుకోవడం ఉత్తమమని నాకు బోధ పడింది.
    థాంక్స్
    రాము

    ReplyDelete
  4. @ రాము
    నా వ్యాఖ్యను మీరు పాజిటివ్ గా తీసుకున్నందుకు సంతోషంగా వుంది.

    "నేను రాసిన దానికి కొత్త ఫిటింగ్ పెట్టారు"

    కేవలం మీరు వ్రాసింది అనే కాదు, ఈమధ్య కొందరు జర్నలిస్టులు 'మేము మీడియా వాళ్ళం, జాగ్రత్త' అనే తలబిరుసు బ్లాగుల్లో ప్రదర్శిస్తూ వుండటం గమనిస్తూనేవున్నాను.

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. ఎనానిమస్ బాబాయ్,

    కెలుకుడిని తీసుకొచ్చింది కెబ్లాసనే. 2007 నుండీ 2009 దాకా తమరి గేంగు చేసిన పనులకి సమాధానంగానే కెలుకుడు పుట్టింది. ఇది కొనసాగుతూనే ఉంటుంది.

    పేరు చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడే తమదా లేక మా పేర్లతోనే చేసేది చేస్తున్న మాదా ఆత్మన్యూనతా భావం? మాలిక మీద ఏడుపు ఈ విధంగా చూపించుకోవటంవల్ల మాకు మేలే జరుగుతుంది.

    ఏమిటీ తమరు అమాయకులా? జోకులెయ్యకండీ సార్! కొత్తగా వచ్చిన వాళ్ళని హింసించి నానా బాధలూ పెట్టిన తమలాంటి వాళ్ళు అమాయకులని చెప్పుకోవటం చండాలంగా ఉంటుంది.

    You gave us one and we gave you TEN :)

    ReplyDelete
  7. చెప్పండి .. ఈ కెలుకుడుకి అసలు కారణం ఎవరు?
    ______________________________________

    ఈ కామెంట్ పోస్టు చేసిన పెద్దమనిషి.


    ఈ సంస్కృతిని బ్లాగుల్లోకి తీసుకొచ్చిన పెద్దమనిషి ఎవరు?
    _______________________________________________

    ఆ నికృష్టపు పెద్దమనిషి చెంపమీద చెప్పుతో సమాధానం ఇచ్చిన కెబ్లాస


    ఎవరికారణంగా ఈ హింస ఈ ద్వేషం ఇంతలా వ్యాప్తిచెంది ఇవాళ ఇంతింతై అంతింతై ఒక్కొకర్నీ కబళిస్తోంది ..
    ___________________________________________________

    కొత్తగా బ్లాగుల్లోకి వచ్చినవాళ్ళని హింసించే సాంప్రదాయాన్ని 2007-2009 మధ్య నడిపి, దానికి ప్రతిగా కెబ్లాస చేత హింసింపబడిన నికృష్టుల సంఘం వలన. పాపం మీరు కూడా పెట్టూకున్నారుగా ప్రమోదవనం అని. మా మీడ ఏడుపు దేనికీ?

    ReplyDelete
  8. ఏదో అర్భకుణ్ణి, ఈ అంత నలుగురికీ తెలిస్న వాణ్ణీ కాను, పేరుతెచ్చుకోవాలన్న తపనా లేదు. పేరు పెట్టిరాసి ఈ గొడవల్లో ఇరుక్కోదలుచుకోలేదు.
    _____________________________________________________

    కబుర్లొద్దు సర్! తమలాంటి నీచులకి సమాధానం ఇచ్చేది వెధవలే.

    ReplyDelete
  9. కంది శంకరయ్య గారు ,

    కృతజ్ఞతలు.. అవును మన వరంగల్ లో నేను చెప్పేది గట్టు మల్లన్న జాతర గురించి... మా అమ్మమ్మ వాళ్ళది ధర్మ సాగర్ మండలమే..
    --కాయ

    ReplyDelete
  10. @ కాయ/కిరణ్
    అలాంటి జ్ఞాపకాలు ఎన్నీ గుర్తుకు తెచ్చుకోవడం ఎంతో బావుంటుంది కదా. మళ్ళీ మనం బాల్యంలోకి వెళ్ళి అలాంటివన్నీ గడపగలిగితే ఎంత బావుండును. హ్మ్. రిటైర్మెంట్ అయ్యక నయినా అలాంటివన్నీ మరోసారి ప్రయత్నించాలి.

    ReplyDelete
  11. "జర్నలిస్టులను మించిపోయారు సారూ ఈ ముదురు బ్లాగర్లు. (నేనేదో నవ్వుతూ రాసాను. మళ్ళీ దీన్ని కంపు చేయకండి.)"

    Ha Ha Ha..It's so refreshing to see you cool down and smiling again:-)

    బ్లాగర్లయినా, ఇంకెవరయినా ముదుర్లెందుకు అవుతారంటే సార్.. వాళ్ళని అవతలి వాళ్ళు చెడుగుడు ఆడుకున్నప్పుడు, రెండు, మూడు సార్లు చెరచబడ్డ తరవాత, తిక్క పుట్టి ముదుర్లవుతారు :-) బ్లాగు వాతావరణం ఇన్ని ఫ్లాష్ పాయింట్స్, లాండ్ మైన్స్ తో నిండి లేకుండింది మొదట్లో, కాని కొంత మంది సో కాల్డ్ మేధావి వర్గం, బ్లాగు ప్రపంచపు బాధ్యత సెల్ఫ్ ప్రొక్లేయిండ్ పెద్దరికంతో భుజాన వేసుకున్న వర్గం, తమకున్న వాక్చాతుర్యంతో నిజాయితీ కోల్పోయి అవతలి వాళ్ళని అయినదానికీ/కానిదానికీ కించపురిచే వర్గం, అందరూ తలా ఒక పద్దతిలో, మామూలుగా రాసుకునే వాళ్ళని హేళన చేస్తూ ఉంటే, ఈ తిరుగుబాటు వర్గం బయల్దేరింది.

    ఈ తిరుగుబాటు వర్గం దాడికి నీతులు చెప్పే వర్గం రిట్రీట్ అయ్యింది.

    మీరు మొదటి నించీ లేరు కాబట్టి మీకు పూర్తిగా తెలీదనుకుంటా.

    అయితే ఈ దాడి, ప్రతిదాడుల్లో inadvertent గా, collateral damage జరుగుతుంది especially with limited information about other people . ఆ డామేజ్ లోంచి ఇంకో వర్గం పుట్టుకొస్తూంటూంది. I think that's why I believe I see some blogs going against Malak& Co, but not really because they have anything against Malak from begining(This is my belief, I am not sure).

    I noticed that The original intent was to push back these oppressive elements in telugu blog world, but I guess it wouldn't be too unfair to say that at times, it kind of has gone slightly beyond the target, but hey that kinda goes with the territory right?!!

    Anyways, now that you are back to normal mood, just sit down and enjoy :-).

    And yeah, as to closing the blog..Common Ramu garu, for such a small thing..If nothing else, this blog world will teach you the ART OF IGNORING THE DISTRACTIONS AND KEEP YOUR EYES ON TARGET..I am telling you, it's an important lesson each parent in today's world MUST LEARN, so that they can teach this to their children, because our children are going to live their lives on Facebook/On-line communities. Unlike you and I, they won't go to the irani-chai store down the street with friends, they just go online to meet people. Their chowrastaas are on facebook, and you have no idea what kind of bullying goes on there. Some kids do/did commit suicide, finding themselves at the receiving end all the time.

    This blog world certainly prepares us well to teach our kids to develop thick skin, to carefully monitor and nurture their online image, to drive their point without any distractions etc.,

    OK, enough of my ramblings on a lazy saturday cold evening.

    Kumar N

    ReplyDelete
  12. పైన కామెంటు వేసిన అజ్ఞాత ఆ కామెంటుని తీసివెయ్యమని కోరడంతో అది తీసివెయ్యడం జరిగింది. తొలగించమని కోరిన కామెంటుని కూడా పబ్లిష్ చెయ్యొద్దని కోరారు.

    ReplyDelete