ఫలిస్తున్న స్వయం ప్రార్ధనలు

ఈమధ్య బుర్ర ఖాళీగా వుంటొందని బుర్రకి కాస్త పని ఇస్తున్నాను. నేను పెద్దగా ఆలోచించకుండా ఎప్పటికప్పుడు నాకు పనులు సూచించే పనిని నా అంతహ్ చేతనకు ఇచ్చేసాను. అయితే నాకేం కావాలో తెలిస్తే కదా నా సబ్ మైండు, సబ్మిసివ్ మైండ్ నాకు సూచనలు ఇవ్వగలిగేది. అందుకే రోజూ ధ్యానం లాంటి సెల్ఫ్ హిప్నటిజం చేస్తూ నా సబ్ మైండుకి నాకేం కావాలో బోధించాలి. బహిర్ చేతన మెలకువలో వుంటే అంతహ్ చేతన అంత దూరం నన్ను వెళ్ళనివ్వదు. మనకెన్నో పనులాయే - ఆ మాత్రం హిప్నటిజం చేసుకుంటూ ఆటో సజెషన్స్ ఇవ్వడానికి సమయం ఎలా దొరుకుతుంది. అలా లాభం లేదని రోజూ నేను ఆఫీసుకి రైల్లో వెళ్ళి వచ్చే సమయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను.

చేసుకోవాలనుకున్నానూ...హంతవరకు బాగానే వుంది కానీ 45 నిమిషాల రైలు ప్రయాణంలో ఓ పది నిమిషాలు పేపర్ చదివేసరికే కళ్ళు మూతలు పడుతుంటాయే! అలాంటప్పుడు ధ్యానముద్రే కానీ ధ్యానం ఎలా కుదురుతుంది. అయినా సరే నా ధ్యానానికో దారి కనిపెట్టేసా... కునుకుపాటు అయిన తరువాతే అయ్యగారు హాయిగా విశ్రాంతి తీసుకున్నాకే ధ్యానం పాట మొదలెట్టాలనుకున్నా. మహా అయితే ఓ ఇరవై నిమిషాలు కునికిపాట్లు పడతాను. తరువాత అంతా కలత నిద్రే కదా. అప్పుడు నా సబ్‌కాన్షియస్  మైండుకి నాకేం కావాలో, నేనేం చెయ్యాలనుకుంటున్నానో, నేను ఎలా తయారవాలనుకుంటున్నానో సూచనలు ఇవ్వదలిచాను. గత రెండు రోజులుగా అలాగే చేస్తున్నాను. నా ఆశలు, ఆశయాలు దానికి విన్నవించుకొని వాటికి తగ్గట్టుగా సంసిద్ధం అవాల్సిందిగా, నన్ను నడిపించాల్సిందిగా వేడుకుంటున్నాను.

ఇలాంటప్పుడు ఒక ముఖ్యమయిన టెక్నిక్ మరువవద్దు. మనం ఎలా వుండాలనుకుంటున్నామో చాలా బాగా విజువలైజ్ చేసుకోవాలి. అలా అని ఓ సూపర్ మ్యాన్ లా దృశ్యాలు వేసుకొని గోడమీది నుండి దూకమని కాదు. వాస్తవ విరుద్ధంగా కలలు కంటే మీ సబ్ మీ పట్ల మొరాయించక ఛస్తుందా? రోజూ ఆఫీసుకి వెళ్ళేప్పుడు ఆఫీసులో గడిపే సమయం ఎలా నిర్మాణాత్మకంగా వుండాలో ఆలోచిస్తుంటాను. ఇంటికి వెళ్ళేప్పుడు ఇంట్లో పనులు ఎలా సమర్ధవంతంగా చక్కబెట్టుకోవాలో ఆలోచిస్తుంటాను.   

పాపం నా సబ్ మైండు బాగానే నా కొరకు పాట్లు పడుతోంది - కానీ నేనూ నా అవుటర్ మైండూ కొన్నిసార్లు దాన్ని సరిగ్గా వినిపించుకుంటే కదా. నిన్న రాత్రి 9 గంటలకి నిద్రకు సంసిద్ధం కావాలని నా సబ్ మైండ్ నాకు సూచించింది. కానీ మనం వింటేనా? ఎదురుగా టివిలో రోకు ప్లేయరు ద్వారా మా ఆవిడ పెట్టిన అల్లుడా మజాకా సినిమా వస్తోంది. చిరంజీవి సినిమా అసాంతమూ చూడకుండా నిద్రకు వెళ్ళడమే! మా ఆవిడకి ఎప్పుడూ చెబుతుంటాను - పని దినాలు సినిమాలు పెట్టి పనులు పాడు చెయ్యొద్దని. సినిమా పూర్తి అయ్యేక మాత్రమే కసిరాను. ఇంకా అనలేదేమిటా అని అనుకుంటున్నా అని అంది. నిద్రపోయేసరికి 11 అయ్యింది. ఉదయమే 4:40 కి లేచి ఓ ఇరవై నిమిషాలు నెట్టు చూసి కాలకృత్యాలు కొన్ని తీర్చుకొని 5:30 నుండి ట్రెడ్మిల్లు మీద ఏ సినిమానో చూస్తూ జాగింగ్ చెయ్యాలనేది నా టైం టేబిలూ.   నా బొంద టైం టేబిల్. 11 కి పడుకుంటే నాలుగున్నరకి ఎలా లేచేదీ? గుణుస్తూ నాలుగున్నర అలారం తీసివేసి పడుకున్నాను.    

అలారం లేకున్నా కూడా ఎక్కువ సేపు నిద్ర పొకున్నా కూడా మెలకువ వచ్చింది. లేచి చూస్తే 4:40 అయ్యింది. నేనంటే ఎదవని కానీ నా సబ్ ఎదవ కాదని అర్ధమయ్యింది. ఎక్కువసేపు పడుకోలేదు కదా హాయిగా ఆరింటి దాకా బజ్జుంటా అని మొరాయించబోయాను కానీ నా సబ్ విన్నది కాదు. లే లే అని తరిమింది. లేచి కాస్సేపు నెట్టు, బ్లాగులూ చూసి, బ్రష్ చేసుకొని ఓ నలభై నిమిషాలు హిందీ సినిమా లక్కీ, ఓ లక్కీ నెట్‌ఫ్లిక్సులో పెట్టుకొని చూస్తూ ట్రెడ్‌మిల్లు మీద జాగింగ్ చేసాను. ఇలా ఓ మూడు రోజుల నుండి చేస్తున్నానేమో బెల్ట్ ఓ రంధ్రం తగ్గింది.

ఆ విధంగా నా సబ్ మైండ్ నేను ఎలా చెబితే అలా సలహాలు ఇస్తూ వస్తోంది. నేను దానికి ఇచ్చే ఆదేశాలు ఎప్పటికప్పుడూ ఫైన్ ట్యూనింగ్ చేస్తూ వస్తున్నాను. ఉదాహరణకు నిన్న ఒక ఆదేశం దానికి సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల నాకు తప్పుగా ప్రవర్తించింది. రైల్లో ఇంటికి వెళుతూ ఇంటికి వెళ్లగానే ఆవురావురుమని అన్నం తినను. ఆకలి ఆపుకోవడానికి టీ తాగుతాను అని చెప్పాను. అది గుర్తుచేసి టీ తాగించింది. కానీ టీ తాగి మనం ఊరుకుంటామా ఏంటీ? వెంఠనే మళ్ళీ నా పద్ధతిలో నేను అన్నమూ లాగించాను. కొంతలో కొంత నయమనుకోండి అంతగా అన్నం పట్టలేదు. ఇవాళ మరింత జాగ్రత్తగా సూచనలు ఇచ్చుకోవాలి. ఒరే ఎర్రి పప్పా, టీ తాగి మళ్లీ అన్నం మెక్కడం కాదురా, బ్రక్కోలీనో లేక మరో కూరగాయ ఏదయినా ఊరగాయలో కలుపుకొని తిని చావరా అని నాకు నేను చెప్పుకోవాలి.

ఇలా నా అంతరాత్మతో నా ఆటలు నాకు భలే వున్నాయండీ. చిత్రంగా నా ఆశలు, ఆశయాల వైపు నేను సూచించినట్లుగా భలే సహకరిస్తూ వస్తోంది. మరో సారి మరిన్ని అంతరాత్మ కబుర్లు చెప్పుకుందాం. నేను ఇదివరకు విశదీకరించినట్లుగా విజయానికి తాళం చెవి మన మనస్సులోనే వుంటుంది. దానిని పట్టుకొని తలుపులు తెరుస్తూ పోవాలంతే. అదే సాధన చేస్తున్నాను - బుడుబుడి అడుగులతో, తప్పటడుగులతో, బాలారిష్టాలతో. ఇదేరకంగా పెరిగి పెద్దవాడిని అయితే ఇహ నాకు తిరుగేవుండదు. చూద్దాం. పెరుగుతానో లేక నా అంతరాత్మ నుండి పారిపోతానో.
 
గమనిక: నా సబ్ కాన్షియస్ మైండును రిఎన్‌ఫోర్స్ చేసుకోవడం కోసం కూడా ఈ టపా వ్రాసుకున్నాను.     

12 comments:

  1. ఏంటో మీరు స్వయం ప్రార్థనలు అన్నాగానీ తటాల్న వేరేలా స్ఫురించిందండీ నాకు. :)
    సారీ :)
    మీ పద్ధతేదో బాగానే ఉన్నట్టుంది. మరికాస్త డీటెయిల్డుగా వివరిస్తారా

    ReplyDelete
  2. Very good post and narration...

    ReplyDelete
  3. Nenu kooda idi varaku intiki vellagane food meeda attack chesedanni. ippudu oka maargam kanipetta adi avoid cheyataniki.adi emitante....sarigga intiki inkoka 30 mins lo reach avutamu anaga oka 2 fruits tintanu. oka apple / pear and another orange/ konchem grapes. deenivalla intiki vellagane edo okati tinali anna craving taggipotundi. meeru try chesi chudandi.

    ReplyDelete
  4. మధ్యహ్నం లోగా చిన్న పొరపాటు చేసాను:
    ఉప లక్ష్యం: కనీసం ఓ మూడు కేజీల బరువు తగ్గించి బెల్లీ ఫ్యాట్ తగ్గించడం
    అంతరాత్మకి నా ఆదేశం: నా ఆకలి చల్లారడానికి గాను అవసరం అయినప్పుడల్లా తేనీరు గుర్తుకు చెయ్యాలి.
    సూచన: 11 గంటలకు నా అంతరాత్మ టీ తాగమని గొణిగింది. కానీ నా ఆత్మ అప్పుడు బ్లాగానందంలో వుండి ఆ సూచన పట్టించుకోలేదు. అప్పుడు ఈ టపా వ్రాస్తూవుంటిని.
    పరిణామాలు: అందువల్ల మధ్యాహ్న భోజనంలో ఆకలి ఎక్కువగా అయ్యింది. బ్రక్కోలీతో పాటు ఫ్రోజెన్ పీర్స్ లాగించాను. కడుపులో కొద్దిగా భారంగా అయిపోయింది. మితమయిన ఆహారం తినడం అంటే తిన్నాక కడుపు భారంగా అనిపించకూడదు, ఆయాసంగా అనిపించొద్దు, త్రేన్పులు రాకూడదు.
    నివారణ: రాత్రి నిద్ర సరిపోక మధ్యాహ్నం కొద్దిగా కునుకు తీసాను. అదయ్యాక మితాహారం విషయమై కొన్ని సూచనలు ఇచ్చుకున్నాను.

    ReplyDelete
  5. @ బాలు
    :)
    శరీరానికి వ్యాయామం వల్ల ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయో మనస్సుకు స్వయం హిప్నటిజం/ధ్యానం వల్ల చాలా ప్రయోజనాలు సమకూరుతాయని తెలిసిందే కదా. వాటిల్లో చిన్న చిన్న మార్పుల ద్వారా మన అంతః చేతనను మనకు అనుకూలంగా నిర్మించుకోవచ్చు. మరోసారి ఒక టపాలో విశదీకరిస్తాను.

    @ అజ్ఞాత
    :)

    @ అజ్ఞాత
    అవునండీ. ఆవురావురుమనుకుంటూ వెళితే అలాగే భుజిస్తాం. అందుకే మరీ ఎక్కువ ఆకలి కాకుండా ముందే కడుపులో ఏదో ఒకటి పడేస్తే ఆ సమస్య వుండదు. కొన్ని సార్లు ఆ కాలుక్యులేషన్ కుదరక, జగ్రత్త పడక ఇంటిమీద పడుతూవుంటాను.

    @ కొత్తపాళీ
    ఈ ఆనందం ఎన్ని రోజులో చూడాలండీ. క్రమం తప్పకుండా చేస్తే నేనూ ఇంప్రెస్ అవుతాను. సాయంత్రం ఏవేవో పనులతోనో, తినక నీరసంతోనో, తిన్న ఆయాసంతోనో వ్యాయామం గగనం అయిపోతోంది. 9 - 9:30 కు పడుకోగలిగితే 4:30 లేవడం అంతగా సమస్య కాదు. ఆ సమయానికి పడుకోగలగడమే అసలు సమస్య.

    ReplyDelete
  6. హ్మ్! ఇదేదో బాగుందండీ...మెడిటేషన్ తెలుసుకానీ...ఇలా సగెషన్స్ గట్రా ఎప్పుడూ అలోచించలెదు.ఐతే మనం మెల్లగా మన సబ్ కి ట్యున్ చేస్తే అది మనకి గుర్తుచేస్తుందన్నమాట :)

    నాకో డౌట్! మన సబ్ కూడ మన మైండ్ లాగే ఉంటుందా? లేక బుధ్ధిగా మాట వింటుందా? లేకపోతే అది మాట వినేవరకు మనం ఓర్పు వహించాలా?

    ReplyDelete
  7. @ ఇందు
    మన కాన్షియస్ మైండ్ శక్తి సామర్ధ్యలు 10% అయితే సబ్ కాన్షియస్ మైండుకి 90% శక్తి సామర్ధ్యాలు వుంటాయిట. అదో గొప్ప నిగూఢ శక్తి. దానిని ఎలా వెలికితీయడం? నేను చెప్పినట్లుగానే. దానికి ఆదేశాలు ఇస్తూ పనిచేయించుకోవాలి. మనం ట్రాన్స్ లోకి వెళ్ళి మాత్రమే అంతః చేతనతో మాట్లాడగలం. అయితే అది ఇచ్చే సూచనలు గొణుగుతూ వున్నట్లు వుంటాయి కానీ అరిచి గీపెట్టినట్లు వుండవు. అందుకే మనం లైట్ తీసుకుంటాము. మనలోని బర్నింగ్ డిజైర్ కు తోడుగా ఆ నిద్రాణమయిన పవర్ ని మేల్కొలుప గలిగితే మంచి విజయాలు సాధించవచ్చు. ఎన్నాళ్లనుండో ఈ విషయాలు తెలిసివున్నా నాకు కుదరలేదు. ఇప్పుడు సాధన చేస్తున్నా. దీనిగురించి కొన్ని వారాల క్రితం కొన్ని టపాలు వ్రాసాను.

    http://sarath-kaalam.blogspot.com/2010/12/blog-post_31.html

    ReplyDelete
  8. ఓహ్! సారీ అండీ నేను ఆ టపా చదవలేదు.బాగ వ్రాసారు.ఇప్పుడు మైండ్-సబ్ మీద ఒక అయిడియా వచ్చింది.హ్మ్! నేనూ ట్రై చేస్తా.చెప్పుకోడానికి 3 టైప్స్ మెడిటెషన్స్ వచ్చు కాని...వాటిని చేసిన పాపాన పోలేదు.ఇప్పుడు మెడిటేషన్లో సబ్ కి సజెషన్స్ ఇస్తే....ఇన్నళ్ళు నన్ను పట్టించుకోలేదుగా ఫో అంటుందేమొ! తిట్టినా పడాలిగా! నాకు ఒక పెద్ద లక్ష్యం ఉంది :) సో! నా సబ్ అల్లాటప్పాగా తీసుకోదేమోలే! Anywayz Thankyou sir.Nice post :)

    ReplyDelete
  9. బాగుంది ..

    ReplyDelete
  10. గురువు గారు, మీరు నిన్న ఒక టపా వేసినట్టు కలవచ్చింది.. ఎంత రియల్ గా ఉంది అంటే ఇది నిజమేనా అని.. మారు పేరుతో కామెంట్ కూడా వేశా..

    ReplyDelete
  11. @ కాయ
    :)
    తీసేసింది ఆ టపా మాత్రమే - నిర్ణయం కాదు.

    ReplyDelete