దయ్యాలతో నా సహవాసం!

ఎవరయినా ఒంటరిగా ఈ సమయంలో ఈ భవనంలో పై అంతస్తుకి వెళ్ళి రాగలరా?

భువనగిరిలో తొమ్మిదవ తరగతి చదువుకుంటున్న రోజులవి. ఒక దగ్గర రాత్రి ట్యూషన్లు చెబుతుండేవారు. అందులో పగలంతా ప్రైవేటు పాఠశాల నడుస్తుండేది. ఆ భవనం రెండు అంతస్తులు వుంటుంది. ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలు కావస్తోంది. సైన్స్ ట్యూషన్ అయిపోయింది. మాస్టారు ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతూండగా టాపిక్ దయ్యాల మీదికి మళ్ళింది. అప్పుడు పై విధంగా మా సైన్స్ మాస్టారు సవాలు చేసారు.  ఒక్క విద్యార్ధి కానీ, విద్యార్ధిని కానీ ఆ సవాలుని స్వీకరించలేదు. నేను దయ్యాలను నమ్మను గానీ అవంటే చచ్చేంత భయ్యం.

ఎందుకు సారు అలా ఛాలెంజ్ చేస్తున్నారు? వెళితే ఏమవుతుంది అని నా పక్కనున్న అబ్బాయిని అడిగాను. రాత్రి పూట ఈ భవనంలో పై అంతస్తులో దయ్యాలు తిరుగుతుంటాయి అని చెప్పాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయి. నిజ్జంగా అని అడిగాను నా కంగారు అణుచుకుంటూ. నిజమేనట, చాలా మందికి దయ్యాలు తిరుగున్నట్లుగా దాఖలాలు కనిపించాయిట. అందుకే ఈ భవనంలో రాత్రి ఎవ్వరూ ఒంటరిగా వుండరు అని చెప్పాడు.   కెవ్వ్ అనే కేకని బలవంతంగా అణుచుకున్నాను.    

ఇదంతా ఎన్ని ఏళ్ళనుండి జరుగుతుందేమిటి అని అడిగాను మనస్సు చిక్కబట్టుకుంటూ. దాదాపు ఏడెనిమిది ఏళ్ళనుండీ జరుగుతోందిట అన్నాడు వాడు. మరో సారి కెవ్వ్ ని ఆపేసాను. మరి అంతకుముందు ఏమయ్యిందట? అప్పుడు ఈ భవనం ప్రశస్తి దయ్యాలకి తెలియదటనా అని కంగారుగా అడిగాను. ఈ స్కూలు పెట్టకముందు ఈ భవనంలో కొత్త డాక్టర్లు ఎవరో వైద్యశాల పెట్టారనీ వాళ్ళు అనుభవం తెచ్చుకుంటున్న క్రమంలో కొంతమంది పేషెంట్లు టపా కట్టారనీ వాళ్ళే దయ్యాలయిపోయారనీ వివరించాడు.   మరోసారి కూడా నా కెవ్వుని బలవంతంగా అదిమివేసాను.    

ఇన్ని సార్లు నేను కెవ్వు కెవ్వు మనడానికి ఒక బలీయమయిన కారణం వుంది. అదేంటంటే ఆ భవనంలో ఒక రెండేళ్ళ క్రితం కొన్ని నెలలు గడిపాను! ఆ విషయం నా పక్కనున్న అబ్బాయికి తెలియదు. ఈ భవనంలో దయ్యాలున్నాయనే విషయం నాకు అప్పటివరకూ తెలియదు.  దయ్యాలున్నాయని తెలిస్తే ఆ భవనంలో చచ్చినా వుండేవాడిని కాదు. నన్ను మోసం చేసి, నిజాలు దాచి నన్ను ఆ భవనంలో ఒకరు వుంచారు. ఆ వ్యక్తికి నా భయాలు తెలిసీ నన్ను మభ్యపెట్టి ఆ భవనంలో ఎందుకు వుంచారో కనుక్కోవాలని స్ట్రాంగుగా డిసైడ్ అయ్యాను.

ఆ వ్యక్తి కూడా అక్కడే మరో సబ్జెక్టులో ట్యూషను చెబుతారు. క్లాసు నుండి బయటకి రాగానే వారు కలిసారు. ఇద్దరం కలిసి ఇంటి వైపు నడిచాము. అప్పుడు ప్రస్థావించాను ఈ విషయాన్ని. "నాన్నా, ఈ భవనంలో దయ్యాలు వున్నాయట కదా" అని అడిగాను
"అవును అలాంటి ప్రచారాలు వున్నాయి"
"మరి అప్పుడు మనం ఈ భవనంలో నివసించినప్పుడు ఎందుకు చెప్పలేదు?"
"చెబితే నువ్వు భయపడతావని చెప్పలేదు. అయినా దయ్యాలు అనేవి ఒక అభూత కల్పన. నీకు తెలుసుకదా"
నాకు తెలుసుగానీ దయ్యాలకు అవి లేవన్న విషయం తెలియదు కదా అని మనస్సులో అనుకున్నాను. "మరి ఈ భవనంలో దయ్యాలున్నాయని అందరూ ఎందుకనుకుంటున్నారు?"
"మనం వుండక ముందు చాలామంది ఇక్కడ కిరాయికి వుండేవారు. వారికి రాత్రి ఎవరో నడుస్తున్నట్లు, చెక్క మెట్ల మీద నడుస్తున్నట్లు కిర్రు కిర్రు శబ్దాలు అలా అలా ఏవేవో ధ్వనులు వినిపించేవిట. అందుకే అలా భయపడ్డారు" 
"మరి మనం వున్నప్పుడు ఆ శబ్దాలు వినిపించలేదా?"
"వినిపించాయి. కానీ నేను దయ్యాలని నమ్మను కాబట్టి భయపడే బదులు ఆ శబ్దాలు ఎక్కడినుండి వస్తున్నాయో పరిశీలించాను" అని మా నాన్నగారు అన్నారు
"మరి ఏం తేలింది?"
"ఈ భవనం పక్కనే బార్ వుందికదా. అందులో వాళ్ళు మెట్లు ఎక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఇతర పనులు చేస్తున్నప్పుడు వచ్చే రిసౌండే ఆ శబ్దాలు"
"మరి నాకెందుకు ఆ శబ్దాలు వినిపించలేదు"
"ఈ భవనంలో దయ్యాలు వున్నాయని నీకు తెలిసివుంటే నీకు కూడా ఆ శబ్దాలు వినిపించివుండేవి" అన్నారు మా నాన్నగారు నవ్వేస్తూ.   

మా నాన్నగారిని ఈ విషయం అడగడానికి రెండేళ్ళకు పూర్వం  నేను మా స్వగ్రామంలో చదువుకునేవాడిని. మా నాన్నగారు భువనగిరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూండేవారు. క్రింద ప్రైవేటు పాఠశాల నడుస్తుండేది. దయ్యాలకు భయపడి పైన ఖాళీగా వుంటుండటంతో, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మంచి మిత్రులు అవడంతో వారిని అడిగి మా నాన్నగారు అక్కడ నివసిస్తుండేవారు. అప్పుడు ఒక సారి మా నాన్నగారితో పాటు నేను కూడా భవనగిరికి వచ్చి కొన్ని నెలలు ఆ భవనంలో వున్నాను. ఆ తరువాత ఒక ఏడాదికి  మా అమ్మ , నేను కూడా భువనగిరి వచ్చి వేరే ఇల్లు తీసుకొని వుంటూ వచ్చాము. 

మరి ఇంత తెలిసాకనయినా ఆ భవనంలోని పై అంతస్తులోకి రాత్రి పూట ఒంటరిగా వెళ్ళాలనుకున్నానా? అంత దృశ్యం లేదు నాకు :(

12 comments:

  1. ఇలాంటి భవనం నాకొకసారి కలలోకి వచ్చింది . అందులో దయ్యం రాజేష్ .

    http://ongoluseenu.blogspot.com/2009/11/blog-post_10.html

    ReplyDelete
  2. అరే! ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు. దయ్యాలకోసం అర్ధరాత్రిపూటా స్మశానాల్లో తిగిరిగాను కదా అనవసరంగా! ఇంతా చేసి అక్కడ నాకు కనిపించింది వ్యభిచారులూ, వెంటపడింది కుక్కలూనూ :))

    ReplyDelete
  3. మరేం పర్లేదు...ఈ భవనం ఎక్కడుందో చెప్పండి...నేను వెళ్తాను...

    ReplyDelete
  4. @ శ్రీనివాస్
    మా భవానీ శంకరం కూడా ఎప్పుడయినా మీ రాజేష్‌లా నా కలలోకి వచ్చి భయపెడతాడేమో :(

    @ మలక్
    అప్పుడు మీకు కనిపించినవి కామినీ పిశాచాలు - వ్యభిచారులు కారు. నేను దయ్యాలను నమ్మను కానీ కామినీ పిశాచాలని నమ్ముతాను కానీ ఏం లాభం ఇంతవరకు ఒఖ్కటీ నా వెంటపడలేదు. ప్చ్!

    @ కిషన్
    అది భువనగిరి గంజ్ ఏరియాలో వుంటుంది. ఇప్పటికి చాలా ఏళ్ళయ్యింది కదా. ప్రస్తుత పరిస్థితి తెలియదు. దాదాపు ముప్పయ్యేళ్ళ క్రితం సంగతి ఇది.

    ReplyDelete
  5. నేను దయ్యాలను నమ్మను గానీ అవంటే చచ్చేంత భయ్యం.

    ;) adurss.....

    ReplyDelete
  6. > అర్ధరాత్రిపూటా స్మశానాల్లో తిగిరిగాను కదా
    > అక్కడ నాకు కనిపించింది వ్యభిచారులు
    :-O వాళ్ళు అక్కడ కూడా ఉంటారా?

    ReplyDelete
  7. @ పానీపూరి
    ఒహవేళ స్మశానాలల్లో వేశ్యలే వున్నా మరి విటులెక్కడ? కుక్కలు మాత్రం వున్నాయంటారు మలక్. మరి దానికి అర్ధం ఏమిటి...?

    నాకు మళ్ళీ అర్ధమయ్యిందేమిటంటే అవి కామినీలు. ఆ పిశాచాలుండే సంగతి నిజమేననని మా సైన్సు ఎప్పుడో శాస్త్రబద్ధకంగా ఎప్పుడో నిరూపించింది. తన యవ్వనంలో అలా కామినీలు ఆవహించబట్టే రౌడీగా మలక్కు తయాయ్యారు! అదీ సంగతీ.

    ReplyDelete
  8. @ రాజా
    నేను చెప్పాను కదండీ టపాలోనే. దయ్యాలు లేవన్న సంగతి మనకు తెలుసుకానీ ఆ దయ్యాలకు తెలియదు కదా. అందుకే నాకు భయం :)

    ReplyDelete
  9. నేను దయ్యాలను నమ్ముతాను కానీ,అవంటే నాకు అస్సల్ భయం లేదు.జోక్ కాదు, సీరియస్.

    దయ్యాల కంటే నీచమైన మనుషుల్ని చాల మందిని చూసి, దయ్యాలంటే భయం, భక్తీ పోయింది.దయ్యల్ని చూడాలంటె,ఆట ప్రోగ్రాం లో జడ్జేస్ ని, ఓంకార్ ని,పిల్లల తల్లి తండ్రుల్ని చూడండి. వారంటే భయం లేకపోతె, మీరు దయ్యలకి భయపడి వేస్ట్.లేక వైష్ణవి లాంటి పసి పిల్లల్ని హత్య చేసే కిరాతకుల్ని చూడండి.ఇంకా ఎన్నో. వీళ్ళ కన్నా గొప్పవా వెధవ దెయ్యాలు?

    ReplyDelete
  10. >>.నేను దయ్యాలను నమ్మను గానీ అవంటే చచ్చేంత భయ్యం.

    :))

    ReplyDelete
  11. @ అజ్ఞాత
    మీరు చెప్పింది నిజమే. దయ్యాలని విశ్వసించేవారు, భయపడేవారు అవి ఎలా వుంటాయో, ఎక్కడ వుంటాయో తెలుసు కాబట్టి వాటికి, అవి తిరుగాడుతాయి అనుకునే ప్రదేశాలకి దూరంగా వుంటారు. నరరూప రాక్షసులని అలా కనిపెట్టలేము, దూరంగా వుండలేము కదా!

    @ చైతన్య
    :)) మళ్ళీ బ్లాగు స్రవంతిలోకి వస్తున్నారన్నమాట.

    ReplyDelete
  12. avante bhayam lydhu kani chudalani vunnadhi

    ReplyDelete