స్వలింగ వివాహాలు ఈ క్రింది దేశాలు ఆమోదించాయి:
కెనడా, స్పెయిన్, నెదర్లాండ్స్, బెల్జియం, నార్వే, స్వీడన్, దక్షిణ ఆఫ్రికా మరియు కొన్ని ఇతర దేశాలు
ఈ దేశాలల్లో స్వలింగ సంపర్కాలకు మరణ శిక్ష:
ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్, మారిటానియా మరియు నైజీరియా , సూడాన్ లలోని కొన్ని ప్రాంతాలు.
ఈ క్రింది దేశాలలో స్వలింగ సంపర్కులపై నిబంధనలు సరళీకృతం అవుతున్నాయి:
చైనా, సింగపూర్, క్యూబా, నేపాల్
ఈ క్రింది దేశాలలో నిబంధనలు కఠినతరం అవుతున్నాయి.
బురుండీ, నైజీరియా, రష్యా, ఉగండా
యుఎస్ లో మసాచుసెట్స్, కెనెక్టికట్, ఐయోవా, వెర్మాంట్, న్యూ హాంప్షెయిర్ మరియు కొలంబియా జిల్లాలలో స్వలింగ వివాహాలకు ఆమోదం వుంది. అల్బేనియా దేశంలో గేల పట్ల వివక్ష చూపకుండా చట్టం వచ్చింది. ఇండియాలోని న్యూ ఢిల్లీలో స్వలింగ సంపర్కం మీద నిషేధాన్ని ఒక కోర్టు తిరస్కరించింది. నేపాలులో గే టూరిస్టులను ఆకర్షించేందుకు గాను ఈ ఏడాది స్వలింగ వివాహాలను చట్టబద్దం చేయనుంది. చైనాలో ప్రభుత్వపరంగా మొట్టమొదటి గే బార్ డిసెంబరులో మొదలయ్యింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 80 దేశాలలో స్వలింగ సంపర్కం చట్టవ్యతిరేకం. కనీసం ఏడు దేశాలు ముఖ్యంగా ముస్లిం దేశాలు ఇందుకు మరణ శిక్ష విధిస్తాయి.
`సోర్స్: హ్యూమన్ రైట్స్ వాచ్, ఇంటర్నేషనల్ గే అండ్ లెస్బియన్ రైట్స్ కమీషన్
:D
ReplyDeleteస్వలింగ సంపర్కాలకు మరణ శిక్ష ఎందుకు?అలాంటి మరణశిక్ష నరహత్యతో సమానం.హంతకుడికి మరణశిక్ష వేయొచ్చు గానీ స్వలింగ సంపర్కం ఏదో పెద్దపాపమైనట్టు దానికి శిక్ష ఏంటండి?
ReplyDeletenrahamtulla, don't worry too much.It's okay, man.They can flee to other country without letting anyone know about their 'relationship'. Now, don't you worry too much about it, like Saratthu.
ReplyDelete@ న్రహమతుల్లా
ReplyDeleteమీలాంటి మంచిమనసు ఆయా దేశాలకు వుండుంటే ఎంత బావుండేది.
@అజ్ఞాత
ReplyDeleteMuslims say HOMOSEXUALITY is immoral and spreads disease,same-sex relationships risked damaging the foundations of society .But One should separate the religion from the secular.It’s a cruel and vicious blow to strike against people who are born the way they are. The Arab countries should also consider this verse: "If they repent and mend, Leave them alone"
ప్రొద్దుటూరు నారాయణస్వామీజీ (హోమో బాబా) స్వలింగసంపర్క దృశ్యాలు చానెళ్ళలో ప్రసారమయ్యాయి.అతనికి అవమానం ,భక్తులు కొంత తగ్గుతారు.ఇప్పటివరకు భారత శిక్షాస్మృతి (ఐపిసీ 377 సెక్షన్) ప్రకారం స్వలింగ సంపర్కం' (Homosexual intercourse) నేరం. డిల్లీ హైకోర్టు 2.7.2009 న ఇచ్చిన తీర్పు ప్రకారం స్వలింగ సంపర్కం నేరం కాదు.దీనిని నేరంగా పరిగణించని దేశాలలో మనది 127 వ దేశం.377 సెక్షన్ ప్రకారం ‘ఎవరై నా ప్రకృతి ఆదేశాలకు విరుద్ధంగా స్వచ్ఛందంగా ఒక పురుషుడితో కాని, మహిళ లేదా జంతువులతో కానీ భౌతికంగా సంభోగిస్తే జీవిత కాల శిక్షార్హులు. ఈ శిక్షను మరో పదేళ్లపాటు పొడిగించే అవకాశం తో పాటు జరిమానా విధించవచ్చు.బలవంతపు హోమోసెక్సువాలిటిని క్రిమినల్ నేరంగా పరిగణించవచ్చు.
ReplyDeleteఢిల్లీ హైకోర్టు తీర్పులో ముఖ్యాంశాలుః
* స్వలింగ సంపర్కం మానసిక రుగ్మత కాదు. మనిషి లైంగిక ప్రక్రియలో అది మరో కోణం. పరస్పరం అంగీకారంతో వయోజనులు పాల్గొనే స్వలింగ సంపర్కం చట్టబద్ధమే.
* పరస్పరాంగీకారంతో వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం పీనల్ కోడ్ పరిధిలోకి రాదు. స్వలింగ సంపర్క చర్యల్ని నేరపూరితమైనవిగా పేర్కొనరాదు. స్వలింగ సంపర్కులైన పురుషులు వివక్షకు గురవుతున్నారు. వారిని కళంకితులుగా, నేరం చేసిన వారిగా చూస్తూ వివక్షకు గురి చేస్తున్నారు. ఇలా చూడడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవిని నివారించి, చికిత్స చేసేందుకు అవరోధం కలుగుతోంది
* పరస్పర అంగీకారంతో వయోజనుల మధ్య సాగే స్వలింగ సంపర్కాన్ని నేరమని భారతీయ శిక్షా స్మృతిలోని (ఐపిసి) 377వ సెక్షన్ పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది.
* మైనర్లతో వారి కిష్టం లేకుండా స్వలింగ సంపర్కానికి పాల్పడడంపై పీనల్ కోడ్ నిషేధం కొనసాగుతుంది.
* పరిపూర్ణ వ్యక్తిగా స్వలింగ సంపర్కునికి ఉన్న హక్కును సెక్షన్ 377 నిరాకరిస్తోంది.
* 18 ఏళ్లు, ఆపై వయస్కులెవరైనా వయోజనుల కిందికే వస్తారు.
* ఒకరికొకరు ఇష్టపడితే వారి మధ్య స్వలింగ సంపర్కం నేరం కాదు.
* లైంగికపరంగా వివక్ష చూపడం వ్యక్తిగత గౌరవానికి, మనుషులంతా సమానమే అన్న భావనకు వ్యతిరేకం.
* స్వలింగ సంపర్కం నైతిక విరుద్ధమని పేర్కొంటూ సమాజంలో ఒక వర్గాన్ని చట్టంలోని ఒక సెక్షన్ నేరస్థులుగా చిత్రీకరించడం రాజ్యాంగం కల్పించిన సమాన హక్కుకు విరుద్ధం.
* ఐపిసిలోని సెక్షన్ 377 రాజ్యాంగ విలువలకు, మనిషి గౌరవ మర్యాదలకు విరుద్ధంగా ఉంది.