అందరూ నన్ను తిట్టండి ప్లీజ్!

ప్రతి ఒక్కరూ తమ తమ మానసిక ఆరోగ్యం బావుండటం కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. యోగానో, పూజనో, హిప్నటిజమో లేక మెడిటేషనో లేకపోతే కత్తిలాంటి  కవిత్వమో లేక ఇంకేదన్నానో చేస్తుంటారు. నా మానసిక ఆరోగ్యం బావుండటం కోసం మెంటల్ ఫ్లాసింగ్ చేస్తుంటాను. అలా చేసేటప్పుడు బయటపడేవే నా టపాలు! 

సరే, మెంటల్ ఫ్లాస్ (Mental Floss) సంగతి పక్కకు వుంచేద్దాం. ఈ వారంలో నాకు డెంటల్ పరీక్ష వుంది - బెదురుగా వుంది. వా :((  అంటే నా పళ్ళు పీకుతారో లేదా డబ్బులు పీకుతారో అనే భయం కాదులెండి. తిట్లు పడతాయేమోనని. మనం కస్టమర్లము కాబట్టి గట్టిగా తిట్టాలని అనిపించినా డెంటల్ హైజినిస్టులు అంత గట్టిగా తిట్టలేరు కాబట్టి తిట్టీతిట్టనట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతారు! ఒరే డెంటల్ ఫ్లాస్ చేసుకోరా రోజుకి రెండు సార్లు అని నేను ఈ దేశాల్లో అడుగుపెట్టినప్పటి నుండీ నాకు చెబుతూనేవున్నారు. నామీద జాలిపడి ఒరేయ్ ఒక్కసారన్నా పడుకునేముందు ఫ్లాసింగు చేసి పడుకోరా అని బ్రతిమలాడుతూనేవున్నారు.  

ఈ మొండిఘటం వింటేనా? ఊహు. మనం పళ్ళని తోమడమే ఎక్కువ, సమాజ సేవ. ఇంకా ఓ దారం లాంటిది పట్టుకొని పళ్ళ సందున ఎక్కడెక్కడో ఏం కష్టపడతాము చెప్పండి? అసలే మనకు రాచ కార్యాలు ఎక్కువ కదా. దానికి తోడు ఈమధ్య పైత్యతరంగాన్ని సంస్కరించే పనిలో కూడా పడ్డాను కదా. ఇంకా మనకు తీరికెక్కడ ఏడుస్తుంది చెప్పండి?   దానికి తోడు ఓ పిల్లి ప్రిన్సుకూడా తెచ్చుకున్నాము కదా. 

మొత్తం మీద ఈ డెంటల్ వాళ్ల సణుగుడు భరించలేక మొహమాటం కొద్దీ అడపాదడపా ఫ్లాసింగ్ చేసినా దానిని కంటిన్యూ చేయడం మనవల్ల అయ్యింది కాదు. క్రితం సారి ఆరు నెలల క్రితం నా పళ్ళు తోమినప్పుడు మరింత శ్రద్ధగా ఫ్లాసింగు - దానివలన ఉపయోగములు అని మరింతగా లెక్చరు ఇచ్చారు. నేను బుద్ధిగా తలఊపి రాజకీయనాయకుడి లెవల్లో మీ కోరిక తప్పకుండా తీరుస్తానిన్నూ, తప్పకుండా ప్రతిరోజూ డెంటల్ ఫ్లాసింగు చేస్తాననిన్నూ హామీ ఇచ్చి వచ్చేసాను. మరి హైజినిస్టు కళ్ళళ్ళొ ఆనందం చూడాలి కదా. అందుకే. ఆ హైజినిస్టు కాస్త చూడటానికి బావుందనుకోండి - మనం ఎదురు చెప్పలేము కదా - తల గంగిరెద్దులా ఊపి - తిట్ల లాంటి ఉద్భోదలు ఆనందంగా అనుభవించీ వచ్చేస్తాము కదా.

గత ఆరునెలలనుండీ ప్రతిరోజూ డెంటల్ ఫ్లాసింగు గురించి ఆలోచిస్తూనేవున్నాను కానీ ఫ్లాసింగు అనుభవించడం నా వల్ల అయ్యింది కాదు. ఏంటో కత్తిగారిలా నాకూ ప్రతిదాన్నీ అనుభవించేయడం అలవాటయిపోయింది. మన్నించండి. ప్రతిరోజూ ఫ్లాసింగ్ చేసుకుంటున్నట్లు ఫాంటసీలే గానీ ఒక్కనాడన్న వాస్తవంగా దానిని అనుభవించినవాడిని కాకపోతిని.

ఇప్పుడేమో తొమ్మిదో తారెఖున డెంటల్ క్లీనింగ్. మన నోరు తెరిచి పళ్ళు ఇకిలించగానే మన పరిస్థితి  ఏంటో , పళ్ళ సందుల్లోని పాచి ఎంతుందో అవతలవాళ్ళకి అనగా హైజినిస్టుకి అర్ధమవుతుంది. ఎలాగా చెప్మా? ఈ దంత మూర్ఖుడికి బుద్ధి ఎలా రావాలి చెప్మా! అందుకే మీరందరూ నన్ను తిట్టండి. మంచి అవకాశం మించిన దొరకదు మీకు! అలా అయినా నాకు బుద్ధి వస్తుందేమో చూద్దామేం. అలా అని అవకాశమిచ్చానని మరీ బూతులు తిట్టేయకండి ప్లీజ్. అసలే సున్నితమయిన హృదయం నాది - భరించలేను. మీరు అంతగా తిడితే మళ్ళీ బ్లాగ్ముఖంగా మెంటల్ ఫ్లాసింగు చేసేస్కుంటాను ఏమనుకున్నారో!! 

ఎవరికి వాళ్ళే తిట్టుకొని వాళ్ల మూర్ఖత్వం వదిలించుకోవాలి లేకపోతే ఇంట్లోవాళ్లతో తిట్టించుకోవాలి కానీ ఇలా బయటివారిని బ్లాగుల్లో అడుక్కొని తిట్టించుకుంటే బుద్ధి వస్తుందా అని అంటారా? నేను ఆశావాదిని. మీలాక్కాదు. మార్పు ఎక్కడయినా మొదలవ్వొచ్చు. ఎవరినుండయినా సరే - ఒఖ్ఖ తిట్టు ఒక పన్నునే మార్చేయవచ్చు  - ఎవరు చెప్పగలరు? ఇంక సందేహించకుండా మీరూ తిట్లు లంకించుకోండి. ప్లీజ్.    

మీరు తిట్లు తిడుతూనేవుండండి - నేను అనుభవిస్తూ వుంటాను. వాహ్ తిట్లు! 

11 comments:

  1. అజ్ఞాతెవరో వెరయిటీగా తిట్టారు కానీ అందులో అంతర్లీనంగా డబుల్ మీనింగ్ వుందేమోనని ఎందుకయినా మంచిదని ఎడిట్ చేసి వేస్తున్నా:

    నీ ఎంకమ్మ పంటి ...
    నీ పాచి ...
    నీ కంపు నోట్లో ముద్దు పెట్టిన
    విదేశీ ...
    దంత డాక్టర్ పళ్ళు చూస్తుంటే
    నీ చేతులకి పని కల్పించిన
    వెర్రి ...

    ReplyDelete
  2. lol.. u r extremely hilarious.. :))

    ReplyDelete
  3. నీ ..కమ్మ, నిన్ను తిడితే నాకేటొస్తది?

    ఇలాటి యదవ కబుర్లు సొంత డబ్బా కొట్టుకోపోతే ఆ రాసే పుస్తకం ఏడవగూడదూ? రెణ్ణెల్లకో మాటు ఇదిగో ఇదిగో అంటూ డంఖా భజానా తప్ప రాత్తాను రాత్తానండవేగానీ ఏదీ? ఇలా ఇంకో రెండేళ్ళు గడిపేశావంటే ఇంక పుస్తకం శ్రీమద్రమారమణ గోవిందో హరి.

    రోజుకో పేజీ ఏసినా ఈ పాటికో ఛాప్టర్ అవ్వేది కదూ నాయాలా, నీకేం రోగం? కాలూ చెయ్యా బానే ఉన్నాయ్ కదా?

    ReplyDelete
  4. తిట్టేశా.. $%్%@!$ ;)

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    మీ తిట్టు కవిత్వాన్ని కవిత అంటారా లేక తవిక అంటారా నాకు అర్ధం కాలేదు కానీ మీరో నా పళ్ళ కోసం కొన్ని తిట్లు ఆహుతి ఇచ్చారే - అది నచ్చింది :)

    @ వేణు
    మీరు నన్ను మెచ్చుకున్నారుకానీ తిట్టలేదు. సో మీరు నాకు శ్రేయోభిలాషులు కారు :((

    @ అజ్ఞాత
    పుస్తకం కంటే పళ్ళు ముఖ్యం కదన్నయ్యా!

    విషయం ఏంటంటే బ్లాగులు వ్రాయడం అలవాటయ్యాక బ్లాగులు వ్రాయడం వీజీ అని పుస్తకాలు వ్రాయడం కష్టమనీ అర్ధమయిపోయింది. బ్లాగుల్లో ఏంటంటే మనకు ఇష్టం వచ్చింది, ఇష్టం వచ్చినట్లుగా బళుక్కున కక్కేయవచ్చు. పుస్తకం అలా కాదు - మనం అనుకున్న టాపిక్ మీదనే మనస్సు పెట్టి వ్రాయాలి. బ్లాగుల్లో లాగా పుస్తకాలు వ్రాస్తుంటే ఇన్స్టంట్ రెస్పాన్స్ రాక రాస్తుంటే మజా అనిపించడం లేదు. అందుకే అలాక్కాదని సంబంధిత టపాలన్నీ కూర్చి బ్లాగు సాహిత్యం ప్రచురించాలనుకుంటున్నాను. ఎవరన్నా కొని చదువుతారా లేదా అన్నది వేరు విషయం. ఇప్పటికే కొన్ని టపాలను సంకలినించాను - మరికొన్ని సంకలినించి పుస్తకం సాఫ్ట్ కాపీ తయారుచేసి ముద్రణకు ఇస్తాను.

    నా పుస్తకం అజాపజా మీరు కనుక్కుంటున్నందుకు సంతోషం.

    @ నెలబాలుడు
    మీరండీ శ్రేయోభిలాషులంటే :))

    ReplyDelete
  6. ఎంత ఓపిక అన్నయ్యా నీకు

    ReplyDelete
  7. పైన మీ ఫొటో బాగుంది గానీ పళ్ళు కనిపించట్లేదే? :)

    ReplyDelete
  8. Titta mante tittedi tittu kaadu...
    kotta mante kottedi kottudu kaadu...

    tomamante tomevi pallu kaadu...

    palluina volluina nee kosam tomaru...

    ReplyDelete
  9. @భా రా రా
    అయితే మీరూ నా బ్యాచేనన్నమాట!

    @ విశ్వామిత్ర
    పళ్ళు తెరిచి బుర్రకు ఫ్లాసింగ్ చేయడం కుదరదండీ :)

    @ అజ్ఞాత
    మెంటమంటే మెంటకుండా కామెంటేది కామెంటు కాదు :)

    @ సత్యసాయి
    :)

    ReplyDelete
  10. cool,I've been waiting too long for this. Please nannu aapoddu. ;-)

    nee yenkamma, nuvvu kattivaa, manishivaa ? hehehe

    inka chooddam basu, ee debbakaina nuvvu dantha dhaavanam cheyakundaa elaa untaavo ?

    ReplyDelete