సినిమా పైరసీ లేకుంటే మేము ఇక్కడ బ్రతికేదెలా?!

షికాగోలో వుంటున్న మేము వారానికి ఒకసారి భారతీయ గ్రోసరీ దుకాణాలకి వెళ్ళి వారానికి రెండో మూడూ పైరేటెడ్ డివిడిలు ఒక్కోదానికి డాలరో. రెండు డాలర్లో పెట్టి తెచ్చుకుంటాము. మరీ మంచి సినిమా అని తెలిస్తేనే సినిమా హాలుకి వెళ్ళి చూస్తాము.  కుటుంబం అంతా సినిమాకు వెళ్ళాలంటే టిక్కెట్టు ఖర్చే 50$ అవుతుంది. ఇక అక్కడ తినడానికి ఏమన్నా కొనకతప్పదు కదా. మనం ఊరుకున్నా పిల్లలు ఊరుకోరు కదా. తినే ప్రతిదానికీ ధరలు విపరీతంగా మండిపోతాయి. బయట డాలరు కి దొరికేది ఇక్కడ నాలుగయిదు డాలర్లకు అమ్ముతారు.

ఇక కొన్ని సినిమాలు మంచివి అని తెలిసినా మాకు అంతగా నచ్చక అర్రెర్రే ఈ సినిమాకి అనవసరంగా ఇంత పెట్టి వచ్చాము, పైరేటెడ్ డివిడి వచ్చేదాకా ఆగి చూసివుంటేపోయేది అనుకుంటాము. ఇలా విడుదలయిన సినిమాలన్నీ సినిమాహాళ్ళలో చూడాలనుకుంటే నెలకు ఎన్ని వందల డాలర్లు తగలెయ్యాల్సొస్తుందో కదా. ఇప్పుడు పైరసీకి వ్యతిరేకంగా ఉద్యమమ నడుస్తోందని దానికి మద్దతుగా మనం కూడా పైరేటెడ్ డివిడిలు తీసుకురావద్దని సినిమాల వీరాభిమాని అయిన మా ఆవిడతో అన్నానే అనుకోండి... అహ మాటవరుసకి అన్నానే అనుకోండి -  నా కేసి ఎలా చూస్తుందో మీరెవరయినా ఊహించగలరా?       

8 comments:

  1. మీకేమైనా పిచ్చా.. పని పాట లేనట్ట్లు అన్నిట్లో తల దూరుస్తారు... అయినా మనం చూసే ఒక్క పైరసీ సినిమా తో కొంపలేం అంటుకోవు... అవే పైసలు పెడితే మీకు లంచ్ నెల రోజుల పాటు వస్తుంది... మీ ఇష్టం.. మీకు లంచ్ కావాలా.. వద్దా..

    ReplyDelete
  2. ఊహించక్కరలేదు ఎవరో రాసేసారు :)

    ReplyDelete
  3. Janaki rocks! :)
    Lesson to Sarath - don't put your finger in every hole!!

    ReplyDelete
  4. I know the situation is
    Hahaaaaaaaa

    ReplyDelete
  5. Janaki గారూ - ఎంత సాఫ్ట్ గా చెప్పారండీ!!
    అన్నయ్యా! ఆరకంగా ముందుకెళ్దామా మరీ?

    ReplyDelete
  6. @భా రా రా
    తప్పుద్దా మరి. ముందు ఫుడ్డు ముఖ్యం కదా మనకు. పైరేటేడ్ సిడిలు ఇంటికి తీసుకురాకపోతే ఫుడ్డును పైరసీ చేసేస్తారు ఈ ఆడాళ్ళు.

    ReplyDelete
  7. piracy apandi apandi anii andharu aactors arichi geepette badhulu.. vall remuneration share tagginchukuni tickets charges tagginchacchu kadha.......!!! adhi avvadhu... so.. idhi kuda avvadhu....

    ReplyDelete