ఆఫీసులో పనిలేదు, పండగ కాబటి తెలుగు పేపర్లు అప్ద్‌డేట్ కావడం లేదు. బోర్ గా వుంది అందుకే కాలక్షేపానికి నా ఒక పెళ్ళి చూపుల ముచ్చట్లు వ్రాస్తున్నాను.
మా క్లోజ్ ఫ్రెండ్ చెప్పగా ఒకరి ఇంటికి పెళ్ళిచూపులకని వెళ్ళాను. మా ఫ్రెండుకి తెలిసిన ఒక సారు బంధువుల అమ్మాయి అట. ఒక పల్లెటూరు అది. నన్ను ఒక గదిలో కూర్చోబెట్టి మా ఫ్రెండ్ ఇంటివారితో మాట్లాడటానికని లోపలికి వెళ్ళాడు. మనకు పెళ్ళి చూపులు చూడటం పెద్దగా అలవాటు లేదు కదా కాస్త ఉద్విగ్నంగానే వుంది.
అప్పుడు టీ తీసుకొని నవ్వుతూ అమ్మాయి గదిలోకి వచ్చింది. ఆమె నవ్వు నచ్చింది, అందం నచ్చింది. ఆమె ఇచ్చిన టీ తీసుకుంటూ నేనూ నవ్వాను. ఆమే నవ్వింది - నేనూ నవ్వాను. ఇక కూర్చుంటుందేమో అనుకున్నాను కానీ తుర్రుమంది. హర్రె. అమ్మాయి నచ్చింది కానీ ఆమె భావాలు, అభిప్రాయాలూ గట్రా ఏమీ కనుక్కోలేకపోయనే, ఎలాగబ్బా. అలా వెకిలి నవ్వులు నవ్వకుండా గంభీరంగా అమెను కూర్చొమ్మని అడగాల్సివుండె అని చింతిస్తూ వుండగానే మా ఫ్రెండ్ వచ్చాడు.
నేను చిద్విలాసంతో అతని వైపు చూసాను. నేను ఎందుకు అలా చూస్తున్నానో అతనికి అర్ధం కాలేదు గానీ "పద అమ్మాయిని చూద్దువు గానీ" అన్నాడు
"అమ్మాయిని నేను అప్పుడే చూసేగా" అన్నాను మందహాసం చేస్తూ
"హ? ఎప్పుడు చూసావు?"
"టీ ఇచ్చింది కదా నాకు"
"నీ మొఖం. ఆమె ఆ అమ్మాయి కాదు. ఈ సారు బిడ్డ"
నేను గతుక్కుమన్నాను. "హర్రే అవునా. ఎవరో ఒకరు. నాకు ఆ అమ్మాయి నచ్చింది. సెటిల్ చేయ్యి"
"ఇప్పుడే ఆ అమ్మాయికి పెళ్ళంటే వాళ్ళ నాన్న తంతాడు. ఆ అమ్మాయి చదివేది తొమ్మిదవ తరగతే" అని అసలు అమ్మాయిని చూపించడానికి నన్ను లాక్కెళ్ళాడు నా ఫ్రెండు.
ఆ అసలు అమ్మాయి నాకు బొత్తిగా నచ్చలేదు. ఆ సారు బిడ్డే నచ్చిందనీ, ఎలాగయినా ఆ సారుని ఒప్పించమని, పెళ్ళీడు వచ్చాకనే పెళ్ళి చేసుకుంటానని మా ఫ్రెండుని బాగా బ్రతిమలాడాను.
"నీకు ఇంకా మంచి మంచి అమ్మాయిలని చూస్తా కానీ ఆ అమ్మాయి గురించి వదిలిపెట్టు" అని నన్ను ఊరడించాడు.
చేసేదేముంది. గొణుక్కుంటూ ఆ ఊరి నుండి బయటపడ్డాను.
హ హ హ ఇంకా నయం బాల్య వివాహ చట్టం కింద కేస్ పెట్టలేదు..
ReplyDeletemareee 9 th class pillani gurthu pattaleka powadam ento..?
ReplyDeletetommidava taragati anagaane sekanulo kattukunna kalala soudham antaa koolipoyintundi.
ReplyDeleteAdrustam, adi naa kalala soudham kadu. :-)
-- Vinay Chaganti
@ భావన
ReplyDeleteఇప్పటి పరిస్థితి తెలియదు కానీ అప్పట్లో పల్లెల్లో బాల్యవివాహాలు బాగానే జరిగేవి. అయినా అప్పుడు పెళ్ళికి ఒప్పించమని అడిగాను కానీ ఆ అమ్మాయికి పెళ్ళీడు వచ్చాకనే పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లెండి :)
@ అజ్ఞాత
ఏదయినా సరే దేశకాలమాన పరిస్థితులని బట్టి చూడాలి. ఆ అమ్మాయి పల్లెటూరిలో పెరిగింది, దుక్కలా వుంది, ఇటు మన స్థితి ఖంగారుగా వుంది, ఇంకా మన పరిస్థితి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా వుంది. ఇవన్నీ నేను వివరించాలా మహాశయా - ఇలా అన్నీ వివరిస్తూపోతే నవల అవుతుంది.
@relishingsenses
:)
వినయ్ చాగంటి ఎవరూ? ఎక్కడొ ఈ పేరు చూసినట్లే వుంది.
మీకూ మీ కుటుంబానికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు
ReplyDeleteఆ అమ్మాయి పల్లెటూరిలో పెరిగింది, దుక్కలా వుంది, ఇటు మన స్థితి ఖంగారుగా వుంది, ఇంకా మన పరిస్థితి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా వుంది.
ReplyDeleteహ..హ..హ..హ మీ స్నేహితుడికి మీ పొద్దెరగని తత్వం అర్థమయి ఉంటుంది లెండి.. అమ్మాయి అందాన్ని దుక్కలా పోల్చేశారే, ప్చ్! ఇంతకీ ఎన్నో పెళ్ళి చూపులకి మీరు సక్సెస్ అయ్యారు?
@చౌదరి
ReplyDeleteధన్యవాదాలండి
@ రమణి
దుక్కల మనోభావాలు దెబ్బతిన్నాయంటారా :(
మీరే చూస్తారుగా, ఎన్నవది విజయవంతం అయ్యిందో - సిరీస్ వ్రాస్తున్నానులెండి .