ఇప్పుడే జిం నుండి వచ్చాను. బయట సన్నగా వర్షం పడుతోంది. కొద్దిగా చలిగా కూడా వుంది.
జిం లో చేరిన కొత్తలో ఒక ఉచిత సలహా సెషన్ వుంటుందని చెప్పారు. ఆ సమయం రానే వచ్చింది ఒక రోజు. ఆ సలహా సెషన్ ఇచ్చే ఆమె పేరు సింథియా. పేరూ బావుంది - అమ్మాయీ బావుంది. కుశల ప్రశ్నలు అయ్యాక నా పల్స్ చూస్తానంది. చేయి పట్టుకొని చూస్తో వుంది. అందమయిన అమ్మాయి చేయిపట్టుకొని నాడి చూడటం న్యాయమేనా? ఆటోమేటిక్ గా నాడి పెరగదూ. ఇన్నాళ్ళ నుండి చేసిన వెధవపనుల వల్ల సాధించిన తపోశక్తితో ఆ సమయానికి పల్స్ పెరగకుండా చూసుకోగలిగాను కాబట్టి సరిపోయింది.
"ఎన్నాళ్ళనుండి జిం కి వస్తున్నావు?" అని అడిగింది
"మూడు వారాలు"
"క్రమం తప్పకుండా వస్తున్నావా?"
"ఆహా"
"భేష్. ఏం చేస్తుంటావు"
"స్టీం రూములో కూర్చుంటాను"
"అది సరే. ఇంకా ఏం చేస్తుంటావు?"
"ఏవీ చేయను - సమయం లేక"
కళ్ళు విశాలం చేసింది. ఆమె కళ్ళు అందంగా అనిపించాయి. "ఏం ఉద్యోగం చేస్తుంటావు?"
"సాఫ్ట్ వేర్"
"కూర్చొని చేసే వుద్యోగం కదా"
"అవును"
"సరే. ఇంటికెళ్ళి ఏం చేస్తుంటావు?"
"కూర్చుంటాను - సిస్టం ముందట"
"అంటే రోజూ మొత్తం కూర్చోవడం తప్ప ఏవీ చేయవన్నమాట!" కళ్ళు మరింత అందంగా విశాలం చేసి అడిగింది.
"అవును - కాదు. పనులు అన్నీ కూర్చొని చేస్తుంటాను"
"అలా కుదరదు. ఇహనుండి జిమ్ములో కూర్చోకు - ఏదయినా ఏక్టివిటీ చేయి. అంతగా ఆవిరి గదిలొ కూర్చొవాలనిపిస్తే మరోసారి జిం కి వచ్చి కూర్చో. ప్రతి రోజూ ఏ ఏక్టివిటీ లేకుండా వుంటూ జిమ్ములో కూడా ఏక్టివిటీ లేకపోతే నీ ఆరోగ్యం బావుండదు. అర్ధమయ్యింది కదా"
బుద్ధిగా బుర్ర ఊపాను.
భలే ఉందండీ శరత్ గారు. నేను కూడా మీలాగే జిం కి వెళ్ళి స్టీం రూం లో కూర్చునేవాడిని. ఈ మద్య అది కూడా చెయ్యడం లేదు.
ReplyDeleteమొన్న డంబెల్స్ కొనుక్కొని నిన్న కొంచెం సేపు చేశాను.
ReplyDeleteఈరోజు ఒకటే చేతులు నొప్పి. అయినా చెయ్యాలి. తప్పదు.
ఆరునెలల్లో ముప్పై పౌండ్ల బరువు పెరిగాను. ఆల్రెడీ
అనారోగ్యంగా ఫీల్ అవుతున్నాను. నా మీద నాకే చిరాకేసి
స్టార్ట్ చేశాను.
@ శ్రీ
ReplyDeleteఅయితే మీరూ నాలాంటి కేసేనన్నమాట :)
@ భవాని
ఇంట్లోనే డంబెల్సుతో కుస్తీ పడుతున్నారన్నమాట. మీ ప్రోగ్రెస్ తెలియజేస్తూవుండండి. నేను బరువు తగినట్టుగానేవుంటాను కానీ బొజ్జని కరిగించాలని ప్రయత్నం.
కొత్తగా యోగా (సూర్యనమస్కారాలు) మొదలుపెట్టాను... ;)
ReplyDelete@ నాగన్న
ReplyDeleteసూర్యనమస్కారాలు అంత చలిలో ఎలా చేస్తున్నారండీ బాబూ. ఆరుబయట కాకుండా ఇంట్లోనే లాగించేస్తున్నారా ఏంటి?
suyanamaskaralu
ReplyDeleteekkada chesamannadi kadannayya, chesama leda annadi mukyam.