ఇదివరకు - ఇప్పుడు - ఇకముందు

ఇదివరకు:కాస్త ఆహార నియంత్రణ చేయాలనే ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజనం తరువాత పెద్దగా ఏమీ తినకుండా ఇంటికి నకనకలాడుకుంటూ వచ్చి తలుపు తెరుస్తూనే 'అన్నమో రామచంద్రా' అని అరిచేవాడిని. త్వరత్వరగా ఫుల్లుగా లాగించిన తరువాత భుక్తాయాసంతో విశ్రాంతి తీసుకునేవాడిని. మితంగానే తినాలని వుంటుంది కానీ బాగా ఆకలి మీద వుంది సాధ్యం అయేది కాదు. మనకు తింటే ఆయాసం తినకపోతే నీరసం కదా - ఆయాసంతో వేరే పనులేమీ చేయాలనిపించేది కాదు - మన్ను తిన్నపాములా మత్తుగా, నీరసంగా అనిపించేది. కొన్నిసార్లు అలా పెందలకడనే పడుకునేవాడిని.

ఇప్పుడు:డైటింగ్ అంటే ఆకలితో నకనకలాడుతుండటం కాదు అని హెల్త్ మీటప్ లకి వెళ్ళి, జాలం లో చూసి నేర్చుకున్నాను. ప్రతి రెండు మూడు గంటలకు కడుపులో మితంగా కొంత పడేస్తూ వుంటే మెటబాలిజం బావుంటుందని, శక్తివంతంగా, ఉత్సాహంగా వుంటామని అర్ధమయ్యింది. అందుకే సాయంత్రం ఆఫీసునుండి ఇంటికివెళ్ళే ముందు ఒక చిన్న రవుండ్ (మందు కాదు - అల్పాహారం) వేస్తున్నాను. ఇదివరకటిలా ఇంటికి ఆకలితో వెళ్లడం లేదు. వస్త్తూనే అన్నమో రాంచంద్రా అనే బదులుగా 'వీలయితే కప్పు కాఫీ ఇంకా వీలయితే నాలుగు కబుర్లు' అని మా ఆవిడని అడుగుతున్నాను. కొద్దిసేపు అయాక మితంగా పెరుగు అన్నం తిని వుండగలుగుతున్నాను. మన్ను తిన్న పాములా కాక ఉత్సాహంగా వుంటున్నాను. రాత్రి 9 గంటల వరకు కుటుంబంతో గడిపి ఆ తరువాత ఓ గంట ప్రజా సేవ (?!) చేసి పదిన్నరకి పడుకోవడం నా దిన చర్యలో కొంత భాగం. నేను చేసే ప్రజా సేవ ఏంటంటే నా వెబ్ సైట్లు కొన్ని వున్నాయి కదా వాటిని నిర్వహించడం!

ఇకముందు:హెల్త్ మీటప్ లలో నేను తెలుసుకున్న ఇంకో విషయం ఏమిటంటే - ఉదయం అల్పాహారం ప్రాధాన్యత. బొజ్జ తగ్గించడం కోసం -ఆహారం తగ్గించడం కోసం ఉదయం ఓ కప్పు పాలు తాగి - ఆఫీసుకు వచ్చాక మరో కప్పు టీ తాగి మధ్యాహ్నం వరకు అలాగే వుంటూ వస్తున్నాను. కానీ అది పొరపాటు విధానమట. ఉదయమే మెటబాలిజానికి పని కల్పించాలి - బ్రేకఫాస్ట్ తినాలిట. ఉదయం వేళలో మెటబాలిజం బాగా అవుతుందట. ఇలా ఉదయమే కొంత పొట్టలో పడేయడం వల్ల మిగతా రోజంగా మరీ ఎక్కువ ఆకలి కాదట. ప్రస్తుతం ఆఫీసుకి వచ్చాక ఏ పది గంటల తరువాతనో అల్పాహారం తీసుకుంటున్నాను కానీ ఆ మార్పు సరిపోదు. ఉదయమే పాలతో పాటు అల్పాహారం తీసుకోవాల్సివుంది. ఆ మార్పు త్వరలోనే చేస్తాను.

10 comments:

  1. రాత్రి పెందలకడనే సుష్టుగా భోంచేసి భుక్తాయాసం తో మన్ను తిన్న పాము లా పడుకుంటే ఇంకేం మెటబాలిజం? కాస్త నాగలికి పని గల్పించి పొలం దున్నితే కాడెద్దులు ఎకరం భూమి పదిలంగ వుండడమే కాకుండా చక్కటి ఆరోగ్యం. లేక పొతే ఆవిరి గదుల్లో నిక్కరేసుకుని మగాళ్ళని కూడా చూసి సిగ్గు పడాల్సిందే కాడెద్దులు చతికిల బడితే .

    ReplyDelete
  2. @ఎనానిమస్ మహాప్రభో
    నాకూ అదే ఇష్టం కానీ నా కుటుంబానికి ఇండియా అన్నా, పల్లెలన్నా ఇష్టం వుండదు. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాలేమో పల్లెల్లో వుండవు. అందుకే ఇక్కడ ఇరుక్కుపోయాను.

    ఇక వానప్రస్థాశ్రమం అయినా పల్లెలో వ్యవసాయం చేసుకుంటూ గడపాలనేది నా అభిమతం. ఈ జిమ్ము గిమ్మిక్కులు నాకు మాత్రం ఇష్టమా!

    @పద్మార్పిత
    ధన్యవాదములు.

    ReplyDelete
  3. హా... నాకు కూడా ఈ మధ్యే కళ్ళు తెరుచుకున్నాయి... డైట్ ఎలా చేయాలో తెలిసివచ్చింది...
    ఇంకా డైట్ చేయటమంటే తిండి మానేయటం కాదు... తిన్న తిండికి సరిపడా శారీరక శ్రమ ఉండాలనే పచ్చి నిజం కూడా తెలిసింది :D

    ReplyDelete
  4. melantitaallu india ki rakunda untene india ki kshemam

    ReplyDelete
  5. baagundandi mee appudu , ippudu . naalanti vaaru follow kaavalsinde ,nenu yeppudu breakfast skip chestaanu tine time leka .monna meru cherina jim lo experienc chadivi navvukunnanu.

    ReplyDelete
  6. @ చైతన్య
    అవును శారీరక శ్రమ చాలా అవసరం. డైటింగ్ కోసమే కాదు - మామూలు ఆరోగ్యానికి కూడా. డైటింగ్ కోసమయితే తిండికి సరిపడా శ్రమ చేస్తే లాభం లేదు సారూ - తిండికి మించిన శ్రమ చేస్తేనే శరీరంలో క్యాలరీలు తగ్గుతాయి!
    @ అజ్ఞాత
    బొమ్మాళీ నిన్నొదల - భారత్ నిన్నొదల!
    @చిన్ని
    ఉదయం అల్పాహారం ప్రాధాన్యత గురించి మీటప్స్ లో ఎప్పుడూ చెబుతుంటారు. మీలాగే సమయం లేక ఇంకా మొదలెట్టడంలేదు. ప్రస్తుతం ఆఫీసుకి వచ్చాక ఓ పండు తింటున్నా.

    ReplyDelete
  7. సారూ కాదండి... madam అనాలి నన్ను :(

    ReplyDelete
  8. @చైతన్య
    అలాగే మేడం :) మీ ప్రొఫయిల్ ఇప్పుడే చూసా. చక్కటి పేరు మీది.

    ReplyDelete
  9. చక్కని పేరా...!
    థాంక్స్ శరత్ గారు :)

    ReplyDelete