మళ్లీ నాకు ఓవర్ ట్రైనింగ్ సిండ్రోం మొదలవుతుందా?

నాకు యుక్తవయస్సు నుండీ ఫిట్ గా వుండాలని వుంటుంది కానీ అందుకు నా మనస్సు కానీ శరీరం కానీ సహకరించేవి కావు. వ్యాయామం చేస్తుంటే మానసికంగా ఏంగ్జయిటీ వచ్చేది - శారీరకంగా ఓవర్ ట్రైనింగ్ సిండ్రోం (OTS) వచ్చేది. ఈమధ్య కాస్త నా హార్మోన్సూ, న్యూరోట్రాన్స్మిటర్సూ సరిదుద్దుకున్నా కాబట్టి నెమ్మదిగా మళ్ళీ జిం మొదలెట్టాను. అలాగే వేసవి వచ్చేస్తోంది కాబట్టి వాతావరణం మెరుగవుతోంది కాబట్టి మా మిత్రులతో కలిసి మళ్ళీ వాలీబాల్ మొదలెట్టాను. 

ఇవన్నీ కలిసి మళ్ళీ OTS మొదలవుతుందా అన్న సందేహం వస్తోంది. అందుకని నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తున్నా. ఏమాత్రం ఆ లక్షణాలు కనిపించినా వెయిట్ ట్రైనింగ్ తగ్గించడమో, మానివెయ్యడమో చేస్తాను. ఇది ముఖ్యంగా వెయిట్ ట్రైనింగ్ వల్ల నాకు వస్తుంటుంది. మిగతావి చేస్తే ఫర్వాలేదు కానీ నాకు వెయిట్ ట్రైనింగ్ అంటేనే బాగా ఇష్టం. ఇదివరలో ఇలాగే ఈ సిండ్రోం బారిన పడి ఇంఫెక్షన్లు మొదలయ్యి 'అక్కడ' కూడా అది వచ్చి సుంతీ చేయించుకునేదాకా వదల్లేదు :( అన్నట్లు జిం ను అలా వ్రాయకుండా చివరలో మ్మ్ వచ్చేట్లు లేఖినిలో వ్రాయడం ఎలా? అలాగే రాం, సిండ్రోం లాంటి పదాలు వ్రాసినప్పుడూ ఇదే సమస్య వస్తుంటుంది.

14 comments:

 1. @ అజ్ఞాత
  ధన్యవాదాలు. జిమ్ లాంటి పదాలు లేఖినిలో ఎలా వ్రాయాలో అర్ధమయ్యింది.

  ReplyDelete
 2. You are welcome Bhayya! compared to the information that you give through your blog, this is nothing. I should thank you as a follower of your blog for the past 5-6 yrs (??).
  may be you can remember me from my old inactive blog http://yakshaprasnalu.blogspot.com/

  ReplyDelete
 3. మిస్టర్ యక్ష,

  ఓ మీరా! గుర్తున్నారు. అప్పట్లో అందరం కలిసి బ్లాగుల్లో తెగ హడావిడి చేసేవాళ్ళం కదూ.

  కనీసం మీరు అయినా నా బ్లాగు ప్రయోజనాన్ని గుర్తించినందుకు సంతోషంగా వుంది - ఎలాగూ నా బ్లాగు ఉత్తమ బ్లాగు వగైరా గుర్తింపులకి ఎలాగూ నోచుకోదు కాబట్టి :)

  మీ బ్లాగు తిరిగి ప్రారంభించే ఉద్దేశ్యం ఏమయినా వుందా?

  ReplyDelete
 4. ఉత్తమ బ్లాగు చెత్తమ బ్లాగుల్లాంటి అవార్డులు మనకెందుకులే భయ్యా.. నేను, కాయ లాంటి అఙ్నాత వీక్షకులు ఉంటూనే ఉన్నామ్ కాబట్టి, శరత్ కాలమ్ ఎప్పటికీ ఒక మంచి కాలమ్. నా మటుకు నేను ఈ బ్లాగ్ ఫాల్లో అవుతూనే ఉన్నా, చాల సార్లు అఙ్నాతగానో యక్ష పేరుతోనో కామెంటానుకూడా.
  కానీ అడిగారు కాబట్టి చెప్తున్నా అనుకోకపొతే తెలుగులో నాకు తెలిసినంత వరరకు ఆల్ రౌండర్ బ్లాగు మటుకు మీదే. ఇందులో ఉన్నన్ని రకాల విషయాలు, విశేషాలు, వ్యవహారాలు, వింతలు, విడ్డూరాలతో పాటు చాల చాల వ్యాపారాలు(సూచనలు) ఇంకెక్కడా కనిపించలేదు నాకు.

  త్వరలోనే మీ ఇన్స్పిరేషన్ తో నా బ్లాగును రీఓపెన్ చేసి 'రిబ్బన్ కట్టింగుకు' పిలుస్తాలే భయ్యా ;)

  -మిస్టర్ యక్ష

  ReplyDelete
 5. జిమ్
  రామ్
  సిండ్రోమ్

  https://translate.google.com/

  ReplyDelete
 6. mee blog super ...
  మీ బ్లాగ్ లో ఉన్నంత స్వేచ్చ ఎక్కడా ఉండదు .
  మీరు గుండుసూది నుండి గునపం వరకు రాస్తారు .
  BTW, what happened to your cinema story.

  ReplyDelete
 7. Hello Sharath Ji

  I have been following your blog since 5 Years. In fact whenever i open koodali my eyes always search for sharat Kaalam. You have the unique skill of writing informative subject in an entertaining manner. Keep the good work.

  ReplyDelete
 8. See, I told you, you have a lot of followers. So keep blogging.

  -మిస్టర్ యక్ష

  ReplyDelete
 9. ఏంది భయ్యా నువ్వు రాయడం ఆపేయడమేంటి? నేనైతే రోజుకు కనీసం రెండు, మూడు సార్లు మీ బ్లాగు డైరెక్ట్ గా ఓపెన్ చేసి చుస్తా ఏమన్న కొత్త పోస్ట్ లు వున్నాయా, కొత్త కామెంట్లు వున్నాయా అని.
  హాస్యమైనా, మరేదైనా మీకొక ప్రత్యేక శైలి వుంది, Please continue blogging.

  ReplyDelete
 10. @మిస్టర్ యక్ష
  ధన్యవాదాలు. చాలా బ్లాగులకి కొన్ని ప్రత్యేకతలు వున్నట్లే నా బ్లాగుకీ కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. అవి గుర్తింపబడ్డప్పుడు సహజంగానే సంతోషంగా అనిపిస్తుంటుంది :)

  రిబ్బన్ కటింగ్ అంటే ఇంకేమిటో గుర్తుకు వచ్చింది సుమండీ ;) "ఒరే... రిబ్బన్ కటింగుకి నన్ను పిలువురా!" అని క్లొజ్ ఫ్రెండ్స్ కొందరిని సరదాగా ఏడిపించేవాడిని :)) వాళ్ళెమో తెగ ఉడుక్కునేవాళ్ళూ.

  @ అజ్ఞాత17 మార్చి, 2015 12:30 [AM]
  అబ్బే లాభం లేదండీ. లేఖిని మరియు గూగుల్ ట్రాన్సులేటర్ స్పెల్లింగులు వేరేగా వున్నాయి. లేఖినిలో అవి వ్రాయడం ఎలాగో తెలిసిపోయింది లెండి. థేంక్స్.

  @ అజ్ఞాత17 మార్చి, 2015 11:08 [AM]
  నాది అజ్ఞాత బ్లాగు అయితే ఇంకా ఎన్నో ఎన్నెన్నో వ్రాసివుండేవాడిని ;) పొరపాటున బహిరంగ బ్లాగు మొదలెట్టాను! అయితే బహిరంగంగా ఇంత స్వేఛ్ఛగా వ్రాయడం వల్ల కొందరు బ్లాగర్ల కయినా నేను ఆదర్శవంతంగా వుంటాను. అజ్ఞాతంగా వుండి ఎంత స్వేఛ్ఛగా వ్రాసినా కూడా అది అంత గొప్ప అనిపించుకోదు కదా. చూస్తున్నాం కదా ఇతర బ్లాగర్లను. అందరూ పురాణం సీతలూ, పురాణం రాముడులూనూ. మామూలు మనషిగా వ్రాస్తున్నది నేను ఒక్కడినే అనిపిస్తుంటుంది. కొన్నేళ్ళ క్రితం నా బ్లాగుని ఆదర్శంగా తీసుకుంటున్నా అని చెప్పి ఒక మహిళ 'సీతా కాలమ్' అని బ్లాగు మొదలెట్టి రెండు మూడు పోస్టులు సగటు స్త్రీలా వ్రాసి మానేసింది. అది కూడా నా బ్లాగేనేమో అని కొందరు అనుమానపడ్డారు కూడానూ!

  ఈమధ్య సంపాదన మీద పుస్తకాలు చదివి బ్లాగింగుతో సమయం వృధా చేస్తున్నా అని నాకు పనికివచ్చే పోస్టులే ఎక్కువవేస్తున్నా. అందుకే సినిమా స్టొరీ మీద దృష్టి పెట్టడం లేదు కానీ అది ముగించేస్తే ఓ పని అయిపోతుంది.

  ReplyDelete
 11. @ ఆలి
  ధన్యవాదాలు. అప్పుడప్పుడు నిదానించినా మళ్ళీ కొనసాగిస్తున్నా ఈ బ్లాగుని. మీలాంటివారి గుర్తింపూ, ప్రోత్సాహం ఇంకా ఇంకా వ్రాసేలా చేస్తాయి.

  @ మిస్టర్ యక్ష
  :)

  @ తుళ్ళూరు పాండు
  అబ్బేబ్బే ఇప్పుడు నేను బ్లాగు ఆపేస్తా అని నేనేమీ అనలేదండీ. ఎప్పుడన్నా ఆపేసినా కూడా అది తాత్కాలికమే. కాకపోతే బ్లాగింగు వల్ల నా సమయం వృధా కాకుండా నాకూ, ఇతరులకూ ఏదో ఒక రకంగా పనికివచ్చే పోస్టులు మాత్రమే ఎక్కువ వ్రాయాలని నిర్ణయించాను. అందువల్ల నానుండి కాలక్షేపం బఠాణీలు తక్కువ రావచ్చు. ఉదాహరణకు ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ మీద వ్రాస్తుంటే ఆ సూత్రాలు నాలో బాగా సింక్ అవుతాయి, ఇతరులకూ పనికివస్తాయి. విన్ - విన్ సిచువేషన్ అన్నమాట. అలా అని మీ అందరికీ నాలో నచ్చే హాస్యమూ, శైలీ వదలను. ఆయా పోస్టుల్లోనే అవీ వుంటయ్.

  ReplyDelete
 12. I'm not sure where did you mention about stopping writing posts on your blog, but this is one of very few blogs that I keep looking at least once in a day for new posts. Your blog is unique in terms of the subjects you choose and the posts are informative and fun to read (like Yaramana blog). Keep writing and I hope there are many others who saved your blogs into favorites like me although don't write comments for each post.

  $iddharth

  ReplyDelete
 13. @ సిద్ధార్ధ్
  నేనేం బ్లాగు మూస్తా అనలేదండీ :) ఈ టాపిక్ జస్ట్ అలా మొదలయ్యింది.

  ఇలా మీకు అందరికీ నా వ్రాతలు నచ్చడం సంతోషంగా వుంది. నేను చదివే, నచ్చే కొన్ని ఇతర బ్లాగుల్లో యరమణ బ్లాగు కూడా ఒకటి. అవును - ఆబ్లాగులో ఇంఫోటైన్మెంట్ వుంటుంది. ఏంటో అగ్రిగేటర్లలో మంచి, అవసరమయిన బ్లాగులు వెతుక్కొని వెతుక్కొని చూడాల్సి వస్తోంది.

  ReplyDelete