ఎల్లారెడ్డి - మల్లారెడ్డి : రిచ్ డాడ్ - పూర్ డాడ్

మా ఊర్లో ఎల్లారెడ్డి, మల్లారెడ్డి అని ఇద్దరు గాఢమిత్రులు వుండేవారు. ఇద్దరూ ఉపాధ్యాయులే. ఎల్లారెడ్డి ఉద్యోగంతో పాటు ఆ ఊర్లో RMP గా కూడా పనిచేస్తుండేవాడు. అతనికి కొన్ని వ్యాపారాలు కూడా వున్నయ్. ఊర్లో పిండి గిర్నీ ఒకటి కూడా పెట్టించాడు. మల్లారెడ్డిది బ్యుజినెస్ మైండ్ కాదు. అతనో మానవతావాది. ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తుండేవాడు. ఎల్లారెడ్డి పిల్లలకూ తన తండ్రి వ్యాపార మనస్థత్వం వచ్చింది. హైదరాబాదులో పలు వ్యాపారాలు చేసి కోటీశ్వరులు అయిపోయారు.  మల్లారెడ్డి పిల్లలు మామూలు ఉద్యోగాలు చేసుకుంటూ మధ్యతరగతిలో మిగిలిపోయారు. ధనాత్మకంగా చూస్తే మల్లారెడ్డి చేసిన ఒక మంచి ఏమిటంటే తన చిన్న కూతురిని ఎల్లారెడ్డి పెద్ద కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేసాడు. అందువల్ల ఆమె కూడా ఇప్పుడు శ్రీమంతురాలు అయ్యింది. సేవాత్మకంగా చూస్తే మల్లారెడ్డి చేసిన మంచి పని ఏమిటంటే తనతో పాటు వివిధ సేవా కార్యక్రమాలకు తన చిన్నకొడుకుని తిప్పడంతో చిన్నకొడుక్కి తన తండ్రి సేవా మనస్థత్వమే వచ్చి (వీలయినంతమేరకు) ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యసాగాడు.

ఇప్పుడు చెప్పండి మల్లారెడ్డి చిన్న కూతురు బెటరా లేక చిన్న కొడుకు బెటరా? 

రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తకం అప్పుడెప్పుడో కొని మూలకు పడేసాను. ఇప్పుడు దాని దుమ్ము దులిపి మళ్ళీ చదువుతుంటే మా ఊరు సంగతులు గుర్తుకువచ్చాయి. పైన వ్రాసిన దాంట్లో నేను ఎవరో మీకు అర్ధమయ్యే వుంటుంది.  

6 comments:

  1. china koduku naa meeru?*

    ReplyDelete
  2. ప్రజలకు ఉపయోగపడేలా మీరు చేసిన కొన్ని పనులు ఉటంకించగలరు

    ReplyDelete
  3. చిక్కు ప్రశ్నే!!ఖరా కండిగా చెప్పాలంటే....డబ్బు లేనిదే ఏదీ లేదు...కాబట్టి శ్రీ మంతురాలయిన అమ్మాయే బెటర్...

    ReplyDelete
  4. @kvsv
    నిష్టూరంగా ... అలా నిజం చెప్పేశారేంటండీ.. :-)

    ReplyDelete
  5. శరత్ గారు,

    రిచ్ డ్యాడ్ పూర్ డ్యాడ్ అనగానే నాకు ఈ మధ్య నెట్వర్కింగ్ మార్కెట్ లేదా చైన్ మార్కెట్ రాజములు Amway, Indianshoppe లాంటివే గుర్తుకొస్తున్నాను. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నా బుర్ర తినేశారు !!

    ReplyDelete
  6. @ అజ్ఞాత14 మార్చి, 2015 3:00 [AM]
    అవునండీ*

    @ అజ్ఞాత14 మార్చి, 2015 6:52 [AM]
    మన గురించి మనం చెప్పుకోవడం బావుంటుందటండీ? ఎప్పుడయినా వివరంగా వ్రాస్తాలెండి.

    @ kvsv
    :)

    @ శ్రీకాంత్
    నాకు Amway తెలుగు మిత్రులు 17 ఏళ్ళ క్రితమే కెనడాలో తగిలారు :) అప్పటినుండీ అలెర్టుగా వుంటున్నా.

    ReplyDelete