బ్లాగిల్లు బావుంది


బ్లాగిల్లు సంకలిని http://www.blogillu.com/  బావుంది. హారం మూతపడ్డ తరువాత కూడలి మాత్రమే చూస్తూ వస్తున్నాను.  అది పెద్దగా నచ్చకపోయినా అలాగే నెట్టుకుంటూవచ్చేస్తున్నా కానీ ఈమధ్య బ్లాగిల్లు, బ్లాగు వేదిక ఎలా వుంటాయో చూసాను. అందులో బ్లాగిల్లు నచ్చింది. నచ్చడానికి మరో కారణం వ్యాఖ్యల సైటు వుండటం కూడానూ. అయితే కొంతమంది ఈమధ్య విమర్శిస్తున్నట్లుగా రెండు మూడు బ్లాగుల నుండే ఎక్కువ వ్యాఖ్యలు కనపడుతూ చిరాకు అనిపిస్తోంది. కొంతమంది సూచించినట్లుగా వీలయితే ఆ బ్లాగులకు/సైట్లకు ఒకవైపు జాగా కెటాయించడం ద్వారా ఆ సమస్య పరిష్కరించవచ్చనుకుంటా.

వార్తలూ, సినిమా వార్తలూ, కాపీ అండ్ పేస్ట్ బ్లాగులను నిరోధిస్తే బ్లాగిల్లు ఇంకా బావుంటుంది.

4 comments:

 1. మీకు "బ్లాగిల్లు" నచ్చినందుకు కృతజ్ఞతలు . ఎందఱో బ్లాగర్ల సలహాలు , సూచనలతో ఎప్పటికప్పుడు క్రొత్త మెరుగులు దిద్దుకుంటూనే ఉంది బ్లాగిల్లు ... మీ సూచనలు తప్పక పాటించడానికి ప్రయత్నిస్తాను . ఇప్పటికే మీరన్న బ్లాగులనుండి , ఎక్కువగా టపాలు రాకుండా నిరోధించడం జరిగింది . అన్ని విభాగాలూ చూసి తగు సలహాలు అందిస్తారని ఆశిస్తున్నాను

  ReplyDelete
 2. మీ పాజిటివ్ స్పందనకు సంతోషంగా వుంది.

  ReplyDelete
 3. కూడలి మాత్రమే చూస్తున్నారా ?
  మాలిక ఎందుకు చూడటం లేదు , అది మీ స్నేహితుడుదె కదా . మీరు చూడకపోవడమే కాకుండా మిగతావాళ్ళని కుడా చూడొద్దని చెప్తున్నారేమో అని అనుమానం

  ReplyDelete
 4. @ అజ్ఞాత
  దాందేముంది, ఎవరికి ఇష్టమయినవి వాళ్ళు చూస్తారు. ఇంకా నేను ప్రస్థుతం పెద్దగా చూడని వాటిల్లో జల్లెడ, పూదండా వగైరా వున్నాయి.

  ReplyDelete